ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల ‘ది బెవర్లీ హిల్టన్’ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు లభించింది. ఈ పాటకు గాను సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు అవార్డు దక్కింది. అవార్డుల ప్రదానోత్సవం రోజున కీరవాణి ఆ అవార్డును వేదికపైనే అందుకున్నారు.
కాగా, ప్రస్తుతం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్న రచయిత చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించారు. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి ఆయనకు చెందిన అవార్డును (నాటు నాటు పాటకు..) స్వీకరించారు. ఆయనకు మరోసారి శుభాకాంక్షలు’’ అని గోల్డెన్ గ్లోబ్ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఈ విషయంపై చంద్రబోస్ స్పందిస్తూ ‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా.. (లవ్‌యూ)’’ అని ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ పాట 95వ ఆస్కార్ అవార్డ్స్‌లోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కా ర్ వేడుక మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది.
మనస్ఫూర్తిగా అందరికీ ధన్వవాదాలు-బంగారు భూగోళమా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ https://t.co/xzV6WIhexI
— chandrabose (@boselyricist) February 15, 2023
Comments
Please login to add a commentAdd a comment