వైరల్‌ అవుతున్న 'తంగలాన్‌' వార్‌ సాంగ్‌ | Thangalaan War Song Out Now | Sakshi

వైరల్‌ అవుతున్న 'తంగలాన్‌' వార్‌ సాంగ్‌

Aug 3 2024 8:21 AM | Updated on Aug 3 2024 8:48 AM

Thangalaan War Song Out Now

చియాన్‌ విక్రమ్‌ ఫ్యాన్స్‌ తంగలాన్‌ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమా విజయంపై నమ్మకాన్ని కలిగించాయి. తాజాగా తంగలాన్‌ వార్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. జి. వి. ప్రకాష్ అందించిన మ్యూజిక్‌ ఈ పాటకు హైలెట్‌ కానుంది. చంద్రబోస్‌ రచించిన  ఈ సాంగ్‌ను శరత్‌ సంతోష్‌ ఆలపించారు.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్‌ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  మాళవికా మోహనన్‌ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement