అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం వ్యవహరించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం వ్యవహరించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, చంద్బాషా, నారాయణస్వామి, ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద వారు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి... సభను ఏకపక్షంగా నడిపారని విమర్శించారు.
రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, నూతన రాజధాని, ఉద్యోగుల తొలగింపు, నిరుద్యోగులు, ఐకేసీ, అంగన్వాడీ వంటి ప్రజా సమస్యలపై సభలో తాము లేవనెత్తిన ఏ అంశానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. మైనారిటీ సమస్యలు లేవనెత్తడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశృ఼రు. సభను నడిపిన తీరుకు అధికారపక్షం సిగ్గుపడాలని అన్నారు.