చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా విమర్శించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా విమర్శించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకి కూడా చోటు కల్పించలేదని, బ్లాక్ డే గా పరిగణిస్తామని చెప్పారు.
చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకుండా కమిటీ నియమించడం రైతులను మోసగించడమేనని చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు కపట నాటకాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని చాంద్ బాషా చెప్పారు.