కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు | tdp activist threatens kadiri ysrcp mla | Sakshi
Sakshi News home page

కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు

Published Tue, Aug 19 2014 7:42 AM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

tdp activist threatens kadiri ysrcp mla

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు వస్తున్నాయి. నెల రోజుల్లోగా పార్టీకి రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకోవాలని, లేకపోతే చంపేస్తామని ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే చాంద్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని తలపుల మండలం ఇందుకూరుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సూర్యగా గుర్తించారు. నిందితునిపై ఐపీసీ 341, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు.

దీనిపై ఎమ్మెల్యే చాంద్ బాషా ఇలా చెప్పారు.. ''నేను తలపుల మండలం వెళ్తుంటే .. ఈనెల 11వ తేదీన మిస్డ్ కాల్ వచ్చింది. మూడు నిమిషాల తర్వాత మరో కాల్ వచ్చింది. రాజీనామా చేయాలని అన్నారు. ఎవరు నువ్వు అని అడిగాను. నేనెవరో అనవసరం, రాజీనామా చేస్తావా చెయ్యవా అని అడిగారు. నేనెవరో తెలుస్తుంది.. నెల రోజుల్లోగా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం అన్నారు. దీనిపై నేను విచారణ చేసిన తర్వాత తలపుల మండలానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అని తెలిసింది. అతడు ఇంతకుముందు శివారెడ్డి అనే వ్యక్తి మీద జరిగిన హత్య కేసులో కూడా నిందితుడని తెలిసింది. పోలీసులు తర్వాత అతడిని పట్టుకున్నారు.''
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement