
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపక్ష, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై అధికార పార్టీ వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు మైక్ కట్ చేశారు. సభలో ఆయనను మాట్లాడనీయకుండా చేశారు. అంతేకాకుండా తనకు స్థలం రాలేదని నిరసన వ్యక్తం చేసిన ఓ బాధితుడిని పోలీసులు పక్కకు లాగిపడేశారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్న భూమిలో పట్టాలు పంపిణీ చేశారు తప్ప పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. పది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పట్టాలు పంపిణీ చేశారని పేర్కొన్నారు.