
సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు రోడ్లు ఎక్కి పోరాటం చేస్తుంటే, చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని కడతామంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. నాలుగేళ్లైనా కనీసం అమరావతి డిజైన్లు కూడా ఖరారు చేయలేదని, ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలలో నిండిపోయిందని, వాటిని కప్పి పుచ్చుకునేందుకే అమరావతి ఆనంద నగరం కార్యక్రమం చేపట్టిందంటూ విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వ్యతిరేకి అంటూ వ్యాఖ్యానించారు.16న రాష్ట్ర బంద్‌తో హోదా పోరాటాన్ని ఉధృతం చేస్తామని విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment