
కార్పొరేట్ శక్తుల చేతిలో సీఎం బందీ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కారని, చర్చ లేకుండానే 8 బిల్లులను ఆమోదించడం దుర్మార్గమని విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండం వల్లే అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చామన్నారు. అసెంబ్లీలో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్ను విడుదల చేయకుండా ఎడిట్ చేసిన ఫుటేజ్ను మాత్రమే బయటపెట్టడం దారుణమని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.