రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాటపై నిలబడటం లేదని, రెండు కళ్ల సిద్ధాంతంతో అసెంబ్లీని గందరగోళంలోకి నెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాటపై నిలబడటం లేదని, రెండు కళ్ల సిద్ధాంతంతో అసెంబ్లీని గందరగోళంలోకి నెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. తాను కేవలం తమ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే గంటా శ్రీనివాస్‌ను కలిశానని, దీనిపై మీడియా దుష్ప్రచారం విచారకరమని గుర్నాథ్‌రెడ్డి అన్నారు.
రాజకీయ హత్యలకు పాల్పడిన వ్యక్తి చంద్రబాబేనని, వంగవీటి మోహన రంగాను హత్య చేయించింది టీడీపీ, చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. అనంతపురంలో ఊచకోతలు కోయించిన పార్టీ టీడీపీ కాదా, కాలేజీ రోజుల నుంచి హత్యా రాజకీయాలకు దిగిన వ్యక్తి చంద్రబాబని గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయనను హతమార్చి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజల గుండెను చీల్చిన వ్యక్తి చంద్రబాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు.