అనంతపురం:ఎల్లో మీడియా విషం తమ దైన శైలిలో విషం కక్కుతూ వైఎస్సార్ సీపీపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారని అసత్య ప్రచారానికి దిగుతోందని గుర్నాథ్ రెడ్డి, కాపు రామ చంద్రారెడ్డిలు మండిపడ్డారు. ఎల్లో మీడియా విష ప్రచారంపై శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు టూలెట్ బోర్డు ఖాయమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నల్లధనాన్ని ఎల్లో మీడియాలో దాచి పెట్టి తెర వెనుక డ్రామాను ఆసక్తికరంగా నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..?విభజన వాదో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.