
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఖరారు
అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారయింది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సోమవారం ఖరారు అయింది. ఈ నెల 6 నుంచి నాలుగో విడత రైతు భరోసాయాత్ర ప్రారంభం కానున్నట్టు వైఎస్ఆర్‌సీపీ నేతలు శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని వారు వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత, కార్మిక కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు.