పెనుకొండ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా..తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని..
అనంతపురం : పెనుకొండ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా..తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మండిపడ్డారు. రైలు ప్రమాదంలో కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే మరణించడం చాలా బాధాకరమన్నారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. కాగా అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే సహా అయిదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.