'త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది'
అనంతపురం: ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఖాయమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు శంకర్‌నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, తొపదుర్తి ప్రకాశ్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది అని అన్నారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉచిత హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. అవాస్తవాలకు, అబద్ధాలకు చిరునామా చంద్రబాబు గుర్నాథ్‌రెడ్డి విమర్శించారు.