ఏపీఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరగడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది
హైదరాబాద్: ఏపీఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరగడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది. ఇటువంటి దాడులు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచడానికి తప్ప..సమస్యల పరిష్కారానికి కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే గుర్నానాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులపై దాడిని ఖండిచిన ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యాయాన్ని..రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదులే ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచుతాయని ఆయన విమర్శించారు.