‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో నిండా మునిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎవ్వరూ కాపాడలేరని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు.
డీ.హీరేహాళ్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో నిండా మునిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎవ్వరూ కాపాడలేరని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హిర్దెహాళ్ వద్ద ఆయన వ్యవసాయ క్షేత్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ చార్జ్‌షీట్‌లో పేర్కొందన్నారు.
ఈ కేసు భయంతోనే ఆయన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని, జీవనదులైన కష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కడుతున్నా మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో కడుతున్నది సింగపూర్ కాదని.. దొంగపూర్ అంటూ అభివర్ణించారు. సింగపూర్ కంపెనీ కోసం రాజధాని కడుతున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదన్నారు. స్విస్ చాలెంజ్ విధానం దుర్మార్గమైనదని అన్నారు. రైతులకు న్యాయం చేసే విధానం కావాలి తప్ప సింగపూర్‌కు దోచిపెట్టే ప్రభుత్వం అక్కరలేదన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ బోయ మల్లికార్జున, ఎస్సీ సెల్ కార్యదర్శి బీటీపీ గోవిందు, మండల కన్వీనర్ వన్నూరుస్వామి, సీనియర్ నాయకులు జగదీష్, రహమతుల్లా, ఎన్.టి.సిద్దప్ప, బేలోడు రామాంజినేయులు, సోమలాపురం సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మురళిమోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్‌రెడ్డి, హనుమంతు, రాజు, కరిడిమల్లి, కాదలూరు హనుమంతరెడ్డి, సింగాడి మంజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.