మంత్రి కాలువకు ఎదురుదెబ్బ | Backlash To Minister Kaluva Srinivasulu | Sakshi
Sakshi News home page

మంత్రి కాలువకు ఎదురుదెబ్బ

Published Sun, May 20 2018 7:46 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Backlash To Minister Kaluva Srinivasulu - Sakshi

మంత్రి కాలువ శ్రీనివాసులు

అనంతపురం: ఏపీ మంత్రి కాలువ శ్రీనివాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నియోజకవర్గం రాయదుర్గంలోని బొమ్మనహల్‌ మండల టీడీపీ నేత ముల్లంగి నారాయణ స్వామి చౌదరి టీడీపీకి గుడ్‌బై  చెప్పారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎ‍స్సార్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో నారాయణస్వామి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు వందలాది మంది అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి కాపు రామచంద్రారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..ఏపీని విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్ధతివ్వడం దుర్మార్గమన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement