చెవిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను నెట్టేసిన మంత్రి పల్లె, టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించే అవకాశం లేకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న పాలకపక్షం మీడియా పాయింట్‌లోను అదే తీరు కొనసాగిస్తోంది. వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి మాట్లాడనీయకుండా మీడియా పాయింట్‌లో మంగళవారం మంత్రి పీతల సుజాత, టీడీపీ అనితా మీడియా లోగోలు లాగేసుకుని దురుసుగా వ్యవహరించిన సంగతి తెల్సిందే.
బుధవారం కూడా అదే తీరును కొనసాగించిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణనిధిలు మాట్లాడుతుండగానే పక్కకు నెట్టేశారు.
‘దౌర్జన్యం’పాయింట్
Published Thu, Mar 23 2017 3:11 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement
Advertisement