
ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి
సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయనీ, పిల్లకాలువలు పూర్తిచేస్తే పొలాలకు నీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కరవును తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేదాకా పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతు సమస్యలపై చేస్తున్న పోరాటాలు, పాదయాత్ర అభినందనీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల దిశగా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావాన్ని తెలిపారు.