handri - neeva project
-
సుజల సీమ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్ (పెలుసుమట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్లో కాలువ (లూప్)తో సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలుగైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. రెండో సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొరంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామికొండసాగర్(1.6టీఎంసీలు), సర్వారాయసాగర్ (3.06 టీఎంసీలు)లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ► దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరిని అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. హక్కుల పరిరక్షణ ► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చేపట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజామద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు. -
కుప్పం కాలువ పనులు షురూ
బి.కొత్తకోట: అనంత వెంకటరెడ్డి (ఏవీఆర్) హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ పనుల్లో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత మూడున్నరేళ్లుగా పనులు నిలిపేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ పనులను పాత ఒప్పందానికే ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.25 కోట్లు ఆదా అవుతాయి. పనులు కూడా ఆరు నుంచి 9 నెలల్లో పూర్తికానున్నాయి. క్షేత్ర స్థాయిలో పుంజుకుంటున్న పనులు అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నుంచి పుంగనూరు ఉపకాలువ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో కుప్పం ఉపకాలువ మొదలవుతుంది. ఈ ఉపకాలువ గుడిపల్లె మండలంలోని పరమ సముద్రం చెరువు వద్ద ముగుస్తుంది. పనులపై గత ప్రభుత్వం శీతకన్ను వేయగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించనున్నారు. అదనపు పనుల పేరుతో నిధులను కొల్లగొట్టి.. కుప్పం ఉపకాలువ పనులకు 2015లో రూ.413.27 కోట్లకు టెండర్లు పిలిచింది. దీంతో రూ.430.27 కోట్లకు హెచ్‌ఈఎస్–ఆర్కే–కోయా జాయింట్ వెంచర్ సంస్థ పనులు దక్కించుకుంది. మధ్యలో ఈ పనుల్లో నాటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్కు నాటి టీడీపీ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. 2016 అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ పూర్తి చేయలేదు. టీడీపీ ప్రభుత్వం.. కాంట్రాక్టు సంస్థకు అదనపు పనుల పేరుతో రూ.122.75 కోట్లు మంజూరు చేస్తూ 2018 సెప్టెంబర్ 7న జీవో నంబర్ 626 జారీ చేసింది. మళ్లీ కాలువ గట్ల మీద మట్టిపనులు చేశారని 2019 జనవరి 28న జీవో 68 జారీ చేసి రూ.21.95 కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ నిధులను తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులను నిలిపివేసింది. పనులు చేపట్టాలని ఎన్ని నోటీసులు ఇచ్చినా కదలిక లేకపోవడంతో పనుల నుంచి ఆ సంస్థను ప్రభుత్వం తప్పించింది. వేగంగా పనులు పూర్తి చేసేందుకు.. హెచ్‌ఈఎస్–ఆర్కే–కోయా జాయింట్ వెంచర్ సంస్థ పనులు చేయకపోవడంతో ఆ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ గత ఒప్పంద విలువకే పనులు చేసేందుకు ముందుకు రావడంతో రూ.117.17 కోట్ల విలువైన పనులను అప్పగించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.25 కోట్ల మేర ఆదా అయ్యింది. కాలువకు సంబంధించి 4.800 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 101 స్ట్రక్చర్స్ నిర్మాణ పనులు, 8,32,141 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 40,360 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు, మూడు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులు, రోడ్ కటింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం ఒప్పంద విలువ రూ.430.27 కోట్లు అయినా గత ప్రభుత్వం అదనంగా రూ.144.7 కోట్లు పెంచుకోవడంతో పనుల అంచనా విలువ రూ.574.97 కోట్లకు చేరింది. 2019 వరకు 79.62 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.117.17 కోట్ల పనులను ప్రస్తుతం పూర్తి చేయనున్నారు. దీనిపై ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్ ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయించి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించాలన్న ఆశయంతో ఉందని చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై సీఈ హరినారాయణరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
రివర్స్ టెండరింగ్‌తో రూ.44.15 కోట్లు ఆదా
బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్‌తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ రివర్స్ టెండరింగ్‌లో లెస్‌కు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అంచనాకంటే 3.42 శాతం అదనంతో రూ.1,261,65,18,283.53కు టెండర్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్ఈ రాజగోపాల్ రివర్స్ టెండరింగ్ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు. ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్ దాఖలుచేసి ఎల్–1గా నిలిచింది. ఈ రివర్స్ టెండర్ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. -
దుర్భిక్ష ప్రాంతంలోని చెరువులకు జలకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో చెరువులను హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ద్వారా నింపడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు బైపాస్ కెనాల్ తవ్వకానికి రూ.214.85 కోట్లు మంజూరు చేసింది. సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా మంత్రివర్గం రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించింది. అనంతరం వివిధ అంశాలపై గంటన్నరపాటు చర్చించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.. ► రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం ► రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటు ఉర్దూను సెకెండ్ లాంగ్వేజ్‌గా చదువుకునేలా చట్ట సవరణకు అంగీకారం ► కర్నూలుకు చెందిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్, 2017 డెఫ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం ► ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)లో గోదాముల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ► తూనికలు, కొలతల శాఖలో నిబంధనల అమలుకు మెరుగైన చర్యలు. డిప్యూటీ కంట్రోలర్ పోస్టు జాయింట్ కంట్రోలర్ (అడ్మిన్) పోస్టుకు పెంపు ► రూ.1,234 కోట్లతో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు ► రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8,741 కోట్ల రుణ సమీకరణకు అంగీకారం. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం ► బెంగళూరు–కడప, విశాఖపట్నం–కడప మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం. ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మార్చి 27 నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం. ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్ ఒప్పందానికి ఆమోదం. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్దతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్ – బ్రిడ్జి నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులకు ఆమోదం ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్ – బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అంగీకారం ► ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంను డిప్యూటీ కలెక్టర్‌గా నియామకానికి ఆమోదం ► తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం ► ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్‌లో కొత్తగా 17 ఆఫీసర్ లెవల్ (7 ఏఏస్పీ, 10 డీఎస్పీ) పోస్టులకు ఆమోదం ► ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసన సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం ► 165 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్ అండ్ మెయింటటైనెన్స్ (ఓఅండ్ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు ఆమోదం ► నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు అంగీకారం. -
ప్రాజెక్టులకు ప్రాధాన్యం
గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రూ.803.96 కోట్ల వ్యయంతో అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పనులు చేపట్టే విధంగా గత ప్రభుత్వ హయాంలో 2018 జనవరి 24వ తేదీన జీఓ జారీ చేసినా పనులు మాత్రం జరగలేదు. మన ప్రభుత్వం అదే సొమ్ముతోనే అదనంగా రెండు రిజర్వాయర్లను నిర్మించి, అదనంగా మరో 3.3 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏరకంగా లంచాలు కట్టడి చేస్తున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. హంద్రీ–నీవాలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టిఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన ప్రధాన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మిస్తాం. తద్వారా 75 వేల ఎకరాలకు సాగునీటితో పాటు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. సాక్షి, అమరావతి: సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగు పడి, పేదరిక నిర్మూలనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతులు, రైతు కూలీల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే కాకుండా.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్ విధానంలో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హంద్రీ–నీవాలో అంతర్భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు నామ్ కే వాస్తేగా చేపట్టామంటే.. చేపట్టామన్నట్లు చేసి, ఆ తర్వాత వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ పథకం పనులు మొదలు పెట్టడమే కాకుండా.. వాటి సామర్థ్యం పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్ల పనులు కూడా చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలప్పుడు ఇదే రాప్తాడు నియోజకవర్గం మీదుగా నేను పోతున్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ, అభిమానం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అడుగు ముందుకు వేస్తున్నాను. వర్చువల్ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి అనిల్ 75 వేల ఎకరాలు సస్యశ్యామలం ► అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 90 రోజుల్లో 7.216 టీఎంసీలను తరలించి.. అప్పర్ పెన్నార్‌తోపాటు కొత్తగా నిర్మించే సోమరవాండ్లపల్లి, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాలను నింపుతాం. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించి, సస్యశ్యామలం చేస్తాం. ► ఈ ప్రాజెక్ట్ కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ. ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలను నిర్మిస్తాం. ► కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దలచెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. ప్రస్తుతం 1.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న అప్పర్ పెన్నార్ జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.024 టీఎంసీలు, తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీలు, దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు, సోమరవాండ్లపల్లి జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ► అప్పర్ పెన్నార్ జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18 వేల ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమరవాండ్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా పేరు పెడుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. అనంతపురం పరిస్థితుల్లో మార్పు దేవుడి దయతో కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. జలాశయాలన్నీ నీటితో నిండాయి. మీ అందరి చల్లని దీవెనలతో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలూ అమలు చేస్తున్నాం. ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, విలేజ్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి మంత్రి అనిల్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వెంకటంపల్లి పైలాన్ వద్ద కార్యక్రమంలో మంత్రులు బొత్స, అప్పలరాజు, శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని అనంతపురం జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సత్వరం పనులు చేపట్టాలన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స మాట్లాడుతూ ఈ ప్రణాళికను 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జూలై మొదటివారంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంతో గతంలో గణనీయంగా నీరు వృథా అయ్యిందన్నారు. ఈ వృథాను అరికట్టడంతోపాటు పైనుంచి వస్తున్న నీటిని వాడుకొని జిల్లాలో అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలెన్నో..?
సాక్షి, కడప : ఐటీ దాడుల నేపథ్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో ఆర్కే ఇన్ఫ్రా అధినేత మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వీరి సంబంధాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ విచారణలోనూ ఈ విషయాలు బయటపడినట్లు సమాచారం. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీల్లో మూడు ఇన్ఫ్రా కంపెనీల భాగస్వామ్యం ఉండగా ఆర్కే ఇన్ఫ్రా సైతం కీలకపాత్ర పోషించినట్లు ఐటీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఆర్కే ఇన్ఫ్రా అధినేత ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరినట్లు సొంత పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేతకు ఇతర రాష్ట్రాల నుంచే గాక ఇతర దేశాల నుంచి సైతం మూడు ఇన్ఫ్రా కంపెనీల ద్వారా నిధులు సమకూరినట్లు ఐటీ సోదాల్లో వెల్లడైంది. ఇందులో కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 2000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే ఐటీ ప్రాథమికంగా ప్రకటించింది. లోతైన విచారణ పూర్తి చేస్తే మరిన్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కాంట్రాక్టర్, ఆర్థికంగా బలోపేతుడైన శ్రీనివాసులురెడ్డిని చంద్రబాబు, లోకేష్‌బాబులు దగ్గరకు చేర్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న అతన్ని 2014 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేయించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. కోట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ అధినేత ఆర్కే ఇన్ఫ్రాను నిధులు సమకూర్చే సాధనంగా వాడుకున్నారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ. 200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సింగిల్ టెండర్ దాఖలు చేసి ఆర్కే ఇన్ఫ్రాకు రూ. 450.85 కోట్లకు కట్టబెట్టారు. అంతేకాకుండా డిజైన్లు మారడం వల్ల పనుల పరిణామం పెరిగిందని అదనంగా రూ. 129 కోట్లను దోచిపెట్టారు. హంద్రీ–నీవా రెండోదశ పనులను ఆర్కే ఇన్ఫ్రాకు అప్పగించారు. చేయని సొరంగం పనులకు రూ. 35 కోట్లు దోచిపెట్టారు. ఇది కాకుండా ప్రకాశం జిల్లాలో పాత కాంట్రాక్టర్లను నిబంధనలను విరుద్ధంగా పక్కన పెట్టి వెలిగొండ పనులను ఆర్కే ఇన్ఫ్రాకు అప్పగించారు. ఇందులో భాగంగా రూ. 91.15 కోట్ల కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను కట్టబెట్టారు.హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండానే రూ. 17 కోట్లు దోచిపెట్టారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కే ఇన్ఫ్రాకు టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు అప్పగించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచుకుని పోటీ లేకుండా ఏకపక్షంగా టెండర్లు నిర్వహించి బాబు అండ్ కో ఆర్కే ఇన్ఫ్రాకు పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ కాలంలోనే చంద్రబాబుకు దగ్గరకైన ఆర్కే ఇన్ఫ్రా అధినేతకు ఊహించని రీతిలో కాంట్రాక్టు పనులు అప్పగించడంపై అప్పట్లో టీడీపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులు ఇన్ఫ్రా కంపెనీల ద్వారానే పార్టీ అధినేత చంద్రబాబుకు చేరినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఆర్కే ఇన్ఫ్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.ఐటీ విచారణ పూర్తయితే ఏ కంపెనీలకు ఎన్ని వందల కోట్ల నిధులు అక్రమంగా తరలివచ్చాయో బహిర్గతమవుతుంది. ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలు టీవీలు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు, టీడీపీ వర్గాల వారు విమర్శలు గుప్పిస్తున్నారు. -
జలయజ్ఞం.. సస్యశ్యామలం
సాక్షి, కర్నూలు: కరువుకు చిరునామా రాయలసీమ. ఏటా దుర్భిక్షం. 19వ శతాబ్దం వరకు సీమ రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఇందుకు శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు వాడుకున్న నీటి గణాంకాలే సాక్ష్యం. 19వ శతాబ్దంలో కేవలం 119 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారు. ఇందులో కూడా సగం వరకు చెన్నైకి తరలించారు. 20 శతాబ్దంలోకి అడుగు పెట్టిన తరువాత మహానేత వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలాలు వరుణుడు రాసిన కరువు శాసనాన్ని తుడిచి వేస్తున్నాయి. జిల్లాలో రెండు దశబ్దాల కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువల విస్తరణతో సుమారుగా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించిన నీటితో రెండు దశాబ్దాల్లో తెలుగుగంగా కింద 95 వేలు, ఎస్ఆర్బీసీ కింద 56 వేలు, హంద్రీనీవాతో 80 వేల ఎకరాలు, జీఆర్పీ కింద 45 వేల ఎకరాలు, లిఫ్ట్‌ల వల్ల 95 వేల ఎకరాలు, సిద్ధాపురం కింద 20 వేలు, పులికనుమ కింద 26 వేలు, పులకుర్తి కింద 9 వేల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగినట్లు ఇంజినీర్లు అంచనాలు వేస్తున్నారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ చొరవతోనే జలయజ్ఞం పనులు శరవేగంగా సాగాయి. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ విస్తరణ, గాలేరు–నగరి, అవుకు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా సుజల స్రవంతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లిఫ్ట్‌లు, పులికనుమ, పులకుర్తి స్కీమ్‌లు, తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో 20వ శతాబ్దంలో కరువును తరుముతున్నాయి. కొత్త ప్రాజెక్టులతో జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు ద్వారా విస్తరణ తరువాత నుంచి ఇప్పటి వరకు 1,245 టీఎంసీలు, హంద్రీనీవా నుంచి 170 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి 10 టీఎంసీలు, లిఫ్ట్‌ల నుంచి 50 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకోని జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందింది. అవుకు టన్నెల్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను వినియోగించుకునేందుకు 2006లో పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తర్ణను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని ద్వారా 30 రోజుల్లో 102 టీఎంసీల నీరు తీసుకోవాలని లక్ష్యంగా పనులు మొద లు పెట్టారు. ఇందులో ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ)ని బానకచర్ల కాంప్లెక్స్ వరకు విస్తరించడంతో సీమలోని ప్రాజెక్టులకు నీటి తరలింపునకు మార్గం సుగమమైంది. అవుకు రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కృష్ణానీటిని కేసీ కాలువకు ప్రత్యామ్నాయంగా అందించేందుకు 2008లో ముచ్చుమర్రి ఎత్తిపోతలకు శ్రీకారం చూట్టారు. గతేడాది నుంచి ఆయకట్టు రైతులకు అందుబాటులోకి వచ్చింది. హంద్రీ –నీవాతో పెరిగిన భూగర్భ జలాలు రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతిని 2005లో ప్రారంభించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు, 40 లక్షల మందికి తాగు నీటి అవసరాలు తీర్చాలి. జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందిచాల్సి ఉంది. ఆ కాల్వతో జిల్లాలో చాలా చోట్ల భూగర్భ జలాలు పెరిగి ఎండిన బోర్లలోకి నీరొచ్చింది. పంట కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు చేపట్టిన పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక జిల్లాలో తుంగభద్ర జలాలను వినియోగించి పశ్చిమ పల్లెను సస్యశ్యామం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తుంగభద్రనదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్ట్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఆయకట్టుకు జీవం తెలుగుగంగ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలను, లైనింగ్ పనులు చేసేందుకు 2006లో 4460.64 కోట్లు అంచనా వ్యయాన్ని 2007లో ఖరారు చేస్తూ వైఎస్ఆర్ అనుమతులు ఇచ్చారు. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేసేందుకు అంచనాలను 6671.62 కోట్లకు పెంచేసి 2018 మార్చి9న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాల్వ కింద ఆయకట్టు స్థీరికరించడంతో జిల్లాలో లక్ష ఎకరాలు అదనంగా ఆయకట్టు పెరిగింది. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎత్తిపోతలకు 2006 ఏప్రిల్ 20న మహానేత శంకుస్థాపన చేయగా, గత ఏడాది పూర్తయింది. కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు 2004లో వైఎస్ఆర్ గురురాఘవేంద్ర లిఫ్ట్‌తో పాటు, మరో ఆరు ఎత్తిపోతల పథకాలను, సుగూరు చెరువును పూర్తి చేశారు. 261.19 కోట్లతో పులికనుమ రిజర్వాయర్‌కు శ్రీకారం చూట్టారు. ఇది పూర్తయితే గూడూరు, కోడుమూరు, సి. బెళగల్, కల్లూరు, మండలాల్లో 9823 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. -
హంద్రీనీవా ప్రాజెక్టుపై టీడీపీ నేతల రాజకీయాలు
-
సీఎం రమేష్‌కు న్యాయం.. అధికారులకు అన్యాయం
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ సంస్థ పనులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేసిన సొమ్మును వసూలు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కానీ అక్రమ చెల్లింపులకు బాధ్యులైన చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ, ఈఈలపై మాత్రం చర్యలు తీసుకుంది. వివరాల్లోకెళ్తే.. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశకు 2004లో టెండర్లు పిలిచారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ చిన్న సంస్థ కావడంతో టెండర్లలో పాల్గొనే అవకాశం కూడా ఆ సంస్థకు లేకపోయింది. దీంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.42 కి.మీ. నుంచి 20 కి.మీ. వరకూ తవ్వకం) పనులను బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్ సంస్థను ముందు పెట్టి రూ.47 కోట్లకు సీఎం రమేష్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ పనులను సీఎం రమేష్ సంస్థ సబ్ కాంట్రాక్టు కింద చేపట్టింది. హంద్రీ–నీవా తొలి దశలో అన్ని ప్యాకేజీల పనులు 2009 నాటికే పూర్తయినా 23వ ప్యాకేజీ పనులు చేయడంలో మాత్రం రిత్విక్ ప్రాజెక్ట్స్ మొండికేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2012లో తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మిగిలిపోయిన పనులు పూర్తి చేసే క్రమంలో పనులు చేయకపోయినా చేసినట్లు చూపి రూ.5.91 కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పటి ప్రభుత్వం ఈఎన్సీ రెహమాన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసిన ఈ కమిటీ సీఎం రమేశ్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. అక్రమ చెల్లింపులకు బాధ్యులైన సీఈ, ఎస్ఈ, ఈఈలపై సస్పెండ్ వేటు వేసింది. చేయని పనులకు తీసుకున్న రూ.5.91 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ ప్రధాన కాంట్రాక్టర్ బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్‌కు సర్కార్ నోటీసులు ఇచ్చింది. వాటిని తాము చేయలేదని సబ్ కాంట్రాక్టర్ చేశారని ప్రధాన కాంట్రాక్టర్ వివరించారు. సబ్ కాంట్రాక్టర్ సీఎం రమేశ్ సంస్థ మింగిన నిధులను వెనక్కి ఇవ్వకపోవడంతో ప్రధాన కాంట్రాక్టు సంస్థ బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్‌ను సర్కార్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈలోగా ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో అధికారులు సీఎం రమేష్ సంస్థ దిగమింగిన సొమ్మును వసూలు చేయలేకపోతున్నారు. కానీ.. అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం శాఖాపరమైన చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే జలవనరుల శాఖ ఇటీవల అందరికీ పదోన్నతులు ఇచ్చి.. ఆ ముగ్గురు అధికారులకు పదోన్నతి కల్పించలేదు. సీఎం రమేష్ సంస్థ చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆ ముగ్గురు అధికారులు వాపోతున్నారు. -
ప్రభుత్వం కక్ష సాధిస్తోంది : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయనీ, పిల్లకాలువలు పూర్తిచేస్తే పొలాలకు నీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కరవును తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేదాకా పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతు సమస్యలపై చేస్తున్న పోరాటాలు, పాదయాత్ర అభినందనీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల దిశగా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావాన్ని తెలిపారు. -
హంద్రీ–నీవా పనుల్లో హైకోర్టు తీర్పుపై స్టే
సాక్షి, న్యూఢిలీ: అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కమ్మవారిపల్లి గ్రామంలో జరుగుతున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి పనుల్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం తమ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కింద నోటిఫికేషన్ జారీచేసిందని, ఇది 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమని ముమ్మనేని వెంకటరాముడు హైకోర్టులో పిటిషన్ వేశారు. భూసేకరణ సబబేనని, పిటిషనర్‌కు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ జరపవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీన్ని సోమవారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ, కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. -
కాసుకో.. దోచుకో!
పచ్చ నేతల కోసం కొత్తగా టెండర్లు హంద్రీ - నీవా పనుల విలువ పెంపు పాత కాంట్రాక్టరే పనులు చేస్తామన్నా అంగీకరించని వైనం ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి సాక్షి, ప్రతినిధి, తిరుపతి : తమకు అనుకూలంగా ఉన్న వారికి అడ్డంగా దోచిపెట్టేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఇసుక నుంచి రోడ్ల కాంట్రాక్ట్ వరకు అన్ని పనులూ తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు హంద్రీ-నీవా పనుల్లోనూ చక్రం తప్పింది. గతంలో పిలిచిన రూ.34 కోట్లకు రీ టెండరు పిలిచి అదే పని విలువను రూ.153 కోట్లకు పెంచేసింది. పాత కాంట్రాక్టర్ పనులు చేస్తామన్నా ఒప్పుకోక కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు తెరలేపింది. రిత్విక్, సోమా కంపెనీలు రెండే టెండర్లు దాఖలు చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. గతంలోనే రూ.60 కోట్ల పనులు పూర్తి: హెచ్ఎన్ఎస్ఎస్ పనుల్లో అంతర్భాగమైన 59వ ప్యాకేజీకి సంబంధించి 2007లోనే రూ.96 కోట్లతో టెండర్లు పిలిచారు. 2011 నాటికే రూ.60 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. భూసేకరణ సమస్య అడ్డంకి కావడంతో మిగిలిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. తరువాత ఈ పనుల గురించి పట్టించుకోలేదు. తాజా ప్రతిపాదనలు ఇలా ప్రస్తుతం అసంపూర్తిగా 2.5 కి.మీ మేర టన్నెల్, 4 కి.మీ మేర కాలువ, గుట్టవారిపల్లె, చిప్పిలి రిజర్వాయర్ పనులు మిగిలి ఉన్నాయి. తాజాగా పిలిచిన టెండర్లలో టన్నెల్‌కు రూ.50 కోట్లు, కాలువ పనులకు రూ.50 కోట్లు, రిజర్వాయర్లకు రూ.50 కోట్లకు పైగా కేటాయించి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం ఈ టెండర్లు పిలిచి మంగళవారం అధికారుల సమక్షంలో తెరిచారు. రిత్విక్, సోమా రెండు కంపెనీలు మాత్రమే టెండర్ బిడ్ దాఖలు చేశాయి. ఈ టెండర్లను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. పరిశీలిస్తున్నాం పనుల కోసం దాఖలైన టెండర్లను పరిశీలిస్తున్నాం. పనుల కోసం టెండర్లు దాఖలు చేసిన కంపెనీలకు అర్హత ఉందా లేదా తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. టెండర్ల ఖరారుకు సంబంధించి ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
'రూపాయికి కిలో బియ్యం కాదు... జలాలు కావాలి'
అనంతపురం : అనంతపురం జిల్లా వాసులకు కావాల్సింది ఒక్క రూపాయికి కిలో బియ్యం కాదు... నికర జలాలు కావాలని స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలోని మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... అనంతపురంలో అన్నంలేక ఎవరూ చనిపోవడం లేదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, హంద్రీ - నీవా ప్రాజెక్టులను విమర్శించాను.. కానీ నేడు ఆ ప్రాజెక్టు కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని జేసీ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయ్యేదాకా ప్రతిపక్షాలు ఓపిక పట్టాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.