సుజల సీమ | CM YS Jagan Focus On Galeru Nagari Sujala Sravanthi Project | Sakshi
Sakshi News home page

సుజల సీమ

Published Thu, Jan 11 2024 5:26 AM | Last Updated on Thu, Jan 11 2024 7:56 AM

CM YS Jagan Focus On Galeru Nagari Sujala Sravanthi Project - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో అడుగులు వేస్తు­న్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధ­ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోత­లను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు.

హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడా­నికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డి­పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.  

► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలో­చన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలు­వకు లైనింగ్‌ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది.

వైఎస్సార్‌ సీపీ అధి­కారంలోకి వచ్చాక బీసీఆర్‌ (బనకచర్ల క్రాస్‌ రె­గ్యు­లేటర్‌) నుంచి వెలిగోడు రిజర్వాయర్‌ వరకూ లింక్‌ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్ర­హ్మంసాగర్‌ వరకూ తెలుగుగంగ ప్రధాన కా­లు­వకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్‌ పను­లను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరు­సగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్‌ మట్టి­కట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్‌ వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. 

► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్‌ జోన్‌ (పెలుసు­మట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్‌లో కాలువ (లూప్‌)తో సరి­పుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావా­సా­న్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలు­గైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసా­గర్‌­లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలె­న్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితు­లకు పునరావా­సం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగా­న్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసె­క్కు­లను తరలించేలా సిద్ధం చేశారు.

రెండో సొరంగం ఫాల్ట్‌ జోన్‌లో మిగిలిపోయిన పనుల­ను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గా­లేరు–నగరి ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్‌ క్లియర్‌ చే­శారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనుల­ను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొ­రంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూ­ర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామి­కొండసాగర్‌(1.6టీఎంసీ­లు), సర్వారాయ­సా­గర్‌ (3.06 టీఎంసీలు)­లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలె­న్సింగ్‌ రిజ­ర్వా­యర్‌ నిర్వాసితు­లకు రూ.600 కోట్లతో పున­రా­వాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. 

► దివంగత వైఎస్సార్‌ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేక­పోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశా­రు. సీఎం జగన్‌ అధికా­రంలోకి వచ్చాక 60 రోజు­ల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సా­మ­ర్థ్యం పెంపు ప­నులను చేపట్టారు.

హంద్రీ–­నీవా, గాలేరు–న­గరి­ని అను­సంధానం చేయడం ద్వారా సాగు, తా­గునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకా­రం చు­ట్టారు. ఏటా డిజైన్‌ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశా­రు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు.

హక్కుల పరిరక్షణ
► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్‌ నో­టిఫికేషన్‌ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్‌ పరిరక్షించారని న్యా­య నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్‌ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవ­డం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. 

► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్న­ప్పు­డే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతి­రెడ్డి­పాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువన కా­లువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగు­గంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సా­ర్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో­పాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రా­యలసీమ ఎత్తిపోతలను సీఎం చేప­ట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజా­మద్దతు పెరిగి రాజ­కీ­యంగా తన­కు నష్టం చేకూ­ర్చు­తుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసు­లు వేయించి సైంధవు­డిలా అడ్డుప­డ్డా­రు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులె­త్తిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement