galeru nagari sujala sravanthi
-
సుజల సీమ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్ (పెలుసుమట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్లో కాలువ (లూప్)తో సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలుగైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. రెండో సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొరంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామికొండసాగర్(1.6టీఎంసీలు), సర్వారాయసాగర్ (3.06 టీఎంసీలు)లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ► దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరిని అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. హక్కుల పరిరక్షణ ► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చేపట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజామద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు. -
నీటి బొట్టు.. విలువ తెలుసు: సీఎం జగన్
రాష్ట్రంలో నాలుగేళ్లలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆపై ఓట్లు వేసేందుకు ఎన్నికల్లో అడుగులు వేయాలి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్! మారిందల్లా సీఎం మాత్రమే. కానీ అప్పుల రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ. మీ బిడ్డ వచ్చాక అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు హయాంలో ఇది ఎందుకు జరగలేదు? నాడు జన్మభూమి కమిటీల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి దాకా దోచుకోవడం, పంచుకోవడమే! మన పాలనలో ప్రతి అడుగు మంచి కోసమే. విద్య, వైద్యంతోపాటు మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేశాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరు. మీకు మంచి జరిగి ఉంటే సైనికుల్లా మీ బిడ్డకు తోడుగా నిలబడి ప్రోత్సహించండి. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వినాయక చవితి సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువైన వరాలను అందించారు. 2 జిల్లాల్లో 77 చెరువులకు హంద్రీ–నీవా నీటితోపాటు తాగునీటిని కూడా అందించే ప్రాజెక్టును సీఎం మంగళవారం ప్రారంభించారు. పత్తి కొండ నియోజకవర్గం లక్కసాగరం సమీపంలోని ఆలంకొండ పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్కనే శ్రీశైలం ఉన్నా.. ఇది నీటి విలువ తెలిసిన మనందరి ప్రభుత్వం. రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా శాశ్వత మార్పులు తెచ్చేందుకు నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులను నింపుతు న్నాం. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజు ల్లో 1.24 టీఎంసీల హంద్రీ–నీవా జలాలతో చెరు వులను నింపుతాం. ఆశ్చర్యమేంటంటే పక్కనే శ్రీ శైలం ఉన్నా మెట్ట ప్రాంతాలైన పత్తికొండ, డోన్‌కు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. డోన్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నికరజలాలు లేని పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులున్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. 2019 ఎన్ని కలకు కేవలం 4–5 నెలల ముందు చంద్రబాబు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టారు. కనీసం పైపులు వేసేందుకు భూసేకరణ కూడా జరగలేదు. హడా వుడిగా టెంకాయలు కొట్టేందుకు మాత్రం 8 ఎకరా లు కొనుగోలు చేశారు. అలాంటి దారుణమైన మోసాలకు పాల్పడ్డారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పనులు చేపట్టే ప్రభుత్వం మాది కాదు. మనందరి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీటి విలువ తెలిసిన రాయలసీమ బిడ్డగా రూ.253 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. ఈ ప్రాంతంలో 8 మండలాలు కరువుతో ఉన్నాయి. మొత్తం 10,130 ఎకరాలకు సాగునీటితోపాటు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీరు అందించే పనులు పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవ ర్గాలకు మంచి జరుగుతుంది. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి ఇప్పటికే పైపులైన్ కనెక్టివిటీ పూర్తయింది. ట్రైల్ రన్ చేస్తున్నాం. కృష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపులైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రైల్ రన్ జరుగుతోంది. ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైపులైన్ పూర్తయింది. జొన్నగిరి, డోన్, తుగ్గలి మండలాల్లోని మరో 7 చెరువులకు ట్రైల్‌రన్ పూర్తయి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. డోన్ నియో జకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకూ నీరిస్తున్నాం. మొత్తంగా 77 చెరువులకు సంబంధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం. గాజులదిన్నె సామర్థ్యం పెంపుతో సాగుకు భరోసా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న సంజీవయ్యసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీంఎంసీలు. 24,372 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వర్షాధారంతో నిండాల్సిందే. కృష్ణా జలాల కేటాయింపు లేదు. పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలో 55 ఆవాసాలకు, గోనెగండ్ల మండలంలోని 10 ఆవాసాలకు, డోన్ మునిసిపాలిటీకి ఇది తా గునీరు అందిస్తోంది. కర్నూలు కార్పొరేషన్‌కు కూడా తాగునీటిని అందిస్తోంది. ఇన్ని రకాలుగా ఉప యోగపడే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 టీఎంసీలకు పెంచాం. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి రూ.57 కోట్లతో నీళ్లు ఇస్తున్నాం. ఆ పనులు కూడా పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రాంతానికి ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై గతంలో ఎప్పు డూ ఎవరూ ఆలోచన చేయలేదు. ఇక్కడ వర్షాలు పడితేనే వ్యవసాయం. చెరువులున్నా నింపాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎన్నికల సమయంలోనే కొందరికి టెంకాయలు, జీవోలు గుర్తొస్తాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాదు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇక్కడకు వచ్చి నప్పుడు మీ కష్టాలు చూశా. మీకు నేనున్నానని చెప్పా. మాట ప్రకారం నాలుగేళ్లలో పూర్తి చేసి ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడుతున్నా. ఆ రోజు వైఎస్సార్.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం రాయలసీమలో ఎంత దుర్భిక్ష పరిస్థితులున్నాయో నాకు తెలుసు. ఈ రోజు హంద్రీ–నీవా నుంచి తూ ము పెట్టి 77 గ్రామాలకు జలాలు ఎత్తిపోస్తున్నాం. ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని అడుగుతున్నా. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఖర్చు చేసింది కేవ లం రూ.13 కోట్లు. దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.6 వేల కోట్లతో హంద్రీ–నీవా కాలువ నిర్మించారు. అందువల్లే ఈ రోజు కాలువ లపై తూములు ఏర్పాటు చేసి లిఫ్ట్‌లు పె ట్టుకుంటున్నాం. రాయలసీమ సాగునీటి కష్టాల ను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రజల గురించి ఎవరైనా ఆలోచించారంటే అప్పుడు వైఎస్సార్ హయాంలో.. ఆ తర్వాత దేవుడి దయ, మీ అందరి దీవెన లతో ఏర్పడ్డ మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పోతిరెడ్డి పాడును 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లేలా అడు గులు పడుతున్నాయి. గత పాలకుల నిర్వాకా లను మనమంతా చూశాం. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలా లంటే శ్రీశైలం నిండాలి. 881 అడుగులకు చేరితే త ప్ప నీళ్లు రాని పరిస్థితి. శ్రీశైలం నిండేదెప్పుడు? నిండినా ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి? తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్నా రు. 790 అడుగులకే పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆ లోచించాం. 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునేలా రా యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రకాశం కరువూ తీరుస్తాం కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కరువు కూడా తీరుస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్లు వస్తాయి. ఇక్కడ రెండు టన్నెళ్లు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే టన్నెల్–1లో 12 కిలోమీటర్లు, టన్నె ల్–2లో 8 కిలోమీటర్లు మేర పనులు జరిగా యి. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కరు వుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ బిడ్డ మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. రెండో టన్నెల్‌ను అక్టోబర్‌లో జాతికి అంకితం చేస్తున్నాం. నాడు వెలవెల.. నేడు కళకళ బాబు హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. గండికోటకు 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 10–12 టీంఎసీలు కూడా నిల్వ చేయలేదు. చిత్రావతి సామ ర్థ్యం 10 టీఎంసీలు కాగా 2–3 టీఎంసీలను కూడా నిల్వ చేయని దుస్థితి. బ్రహ్మంసాగర్‌కు 17 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాడు నీళ్లు అందని పరిస్థితి. మీ బిడ్డ సీఎం అయ్యాక కాలువల సామర్థ్యాన్ని పెంచాం. ప్రతి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కోసం డబ్బులిచ్చాం. దీంతో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయగలుగుతున్నాం. గాలేరు –నగరి సుజల స్రవంతిలో అవుకు రెండో టన్నెల్ పనులను పూర్తి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇవన్నీ మంచి మనసు పెట్టి చేసిన పనులు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.2.35 లక్షల కోట్ల ను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మరి నాడు బాబు ఎందుకు చేయలేకపోయారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) లక్ష్యంగా వ్యవహరించారు. కళ్లెదుటే మార్పులు.. గ్రామ స్థాయిలో మీ స్కూళ్లలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించండి. స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చింది. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతిలో ట్యాబ్‌లు ఇస్తు న్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అభివృద్ధి చేసిన పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎప్పడూ చూడని విధంగా కనిపి స్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తు న్నాం. 53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తు న్నాం. వ్యవసాయంలో ఆర్బీకేలు రైతన్నలను చేయి పట్టుకుని నడిపి స్తున్నాయి. ఈ– క్రాపింగ్ నుంచి పంట కొనుగోలు వరకు మంచి జరుగుతోంది. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్న మన ప్రభు త్వానికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నా. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు గుమ్మనూరు, అంబటి, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్, ఎమ్మెల్యేలు ఆర్థర్, శిల్పా రవి, కంగాటి శ్రీదేవి,రాంభూపాల్‌రెడ్డి, చక్రపాణి రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్‌ఖాన్, చెన్నకేశవరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్, మధుసూదన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సుగుణాల మారాజు – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ‘కరువు సీమకు పండుగ పూట బహుమానం ఇచ్చేందుకు సీఎంజగన్ వచ్చారు. కర్నూలు జిల్లా శతాబ్దాలుగా ఎన్నో కరువులు చూసింది. ఒక్క ఎకరాకూ నీటి పారుదల లేని ప్రాంతం డోన్. రెయిన్‌గన్ ద్వారా నీళ్లిస్తామని గత పాలకులు బూటకపు మా టలు చెబితే ఈ రోజు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం మాది. చెరువులకు నీళ్లు ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరిగి భూములు సస్యశ్యామలం కానున్నాయి. సుగుణాలన్నీ ఉన్న మారాజు మన జగన్. అ వినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకు వెళితే నిరసన దీక్షలు ఏమిటి? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి దీనికి మద్దతు ప్రకటించడం ఎంత దారుణం? ప్రజలకు చైతన్యం లేదని, పిరికి వాళ్లు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణాలు, కుట్రలను చట్ట సభల సాక్షిగా ప్రజలకు తెలియచేస్తాం’ -
ఏపీ ప్రభుత్వంపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాలేరు–నగరి సుజల స్రవంతి నష్టపరిహారం విషయంలో సింగిల్, డివిజన్ బెంచ్‌ల తీర్పుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితుల నుంచి భూసేకరణ 1991లోనే పూర్తయిందని, 2007లో నష్టపరిహారం ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది మెహ్ఫూజ్కీ తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటూ ఏప్రిల్ 19, 2018న హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. అనంతరం రిట్ పిటిషన్లు ఆలస్యంగా దాఖలు చేశామంటూ తమ పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇదే అంశానికి సంబంధించి వేరే కేసులో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో స్టే ఇచ్చిన విషయాన్ని మెహ్పూజ్కీ గుర్తు చేశారు. 4 వారాల్లో నిర్వాసితులు కౌంటర్ దాఖలు చేయాలని, 3 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
నొక్కేసింది.. కక్కించాల్సిందే
సాక్షి, అమరావతి: భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, వంశధార ప్రాజెక్టు రెండో దశ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువల్లో నీటి ప్రవాహం మాటేమోగానీ అక్రమాలు పోటెత్తాయని నిపుణుల కమిటీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల వ్యయాన్ని భారీగా పెంచేసి.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులప్పగించి, ప్రజాధనం దోచుకున్నారని స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరగడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరిగిందని.. పనులు మాత్రం పూర్తి కాలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి.. కాంట్రాక్టర్లు దోచేసిన సొమ్మును వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా తన నివేదికను సమర్పించింది. భూసేకరణ లేకుండానే పనులా? అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా తొలి దశలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టులోకి(బీటీపీ) నీటిని ఎత్తిపోసి, ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే పనులకు అక్టోబర్ 24, 2018న రూ.968.99 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హంద్రీ–నీవాలో నీటి లభ్యతపై అధ్యయనం చేయకుండానే.. 3.7 టీఎంసీల సామర్థ్యంతో బీటీపీ ఎత్తిపోతలకు అనుమతిచ్చారని నిపుణుల కమిటీ పేర్కొంది. కాలువ పనులను రూ.358.20 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు.. 14 పంప్‌హౌస్‌ల మెకానికల్ పనులను రూ.175 కోట్లకు మరో కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టారు. తక్కువ సామర్థ్యం కలిగిన పంప్‌లు వాడేందుకు స్కెచ్ వేశారు. కాలువల తవ్వకానికి 1,407 ఎకరాలు అవసరం కాగా, ఒక్క ఎకరా కూడా సేకరించకుండానే రూ.33.02 కోట్ల విలువైన(8.94 శాతం) పనులు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి లభ్యతను పున:సమీక్షించి, ఈ పథకం పనులు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వంశధారకు అవినీతి మకిలి వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ.933 కోట్ల నుంచి రూ.1,616.23 కోట్లకు పెంచేస్తూ ఫిబ్రవరి 26, 2016న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - 87వ ప్యాకేజీ పనులను 2005లో ‘హార్విన్’కు రూ.72.64 కోట్లకు అప్పగించారు. రూ.11.48 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసి, కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. మిగిలిన రూ.61.16 కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58 కోట్లకు పెంచేసి.. 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంచనా వ్యయాన్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయిందని వివరించింది. పనులు పూర్తి చేయని రిత్విక్ సంస్థకు అదనంగా రూ.11.35 కోట్ల విలువైన పని అప్పగించడాన్ని తప్పుబట్టింది. ఇప్పటివరకూ ఆ సంస్థ రూ.98 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని.. చేసిన పనులను సక్రమంగా లెక్కించకుండానే బిల్లులు చెల్లించారని తెలిపింది. - 88వ ప్యాకేజీ పనులను 2005లో రూ.66.68 కోట్లకు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 2016 నాటికి రూ.20.76 కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసింది. మిగిలిన రూ.45.92 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.1,79.51 కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంస్థ అప్పగించింది. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. కానీ, ఇప్పటికి రూ.69.34 కోట్ల విలువైన పనులను మాత్రమే చేసింది. 38.63 శాతం పనులు చేయని ఆ సంస్థకే అదనంగా రూ.18.91 కోట్ల పనులను అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. - చేయని పనులకు 87వ ప్యాకేజీలో రూ.14.68 కోట్లు.. 88వ ప్యాకేజీలో రూ.3.18 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల ఆయకట్టుకు నీళ్లందకపోవంతోపాటు ఖజానాపై భారీ ఎత్తున భారం పడిందని తేల్చింది. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. గాలేరు–నగరిలో.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశ పనులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ, అంచనా వ్యయాన్ని రూ.2,155.45 కోట్ల నుంచి రూ.2,800.82 కోట్లకు పెంచుతూ 2015లో సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అయిన వారికి అప్పగించి భారీ ఎత్తున దోచేశారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. - గాలేరు–నగరిలో 29వ ప్యాకేజీ పనులను రూ.171.63 కోట్లకు 2005లో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 2014 నాటికే రూ.166.69 కోట్ల పనులు పూర్తి చేసింది. కేవలం రూ.4.94 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనుల వ్యయాన్ని రూ.110.91 కోట్లకు పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌కు అప్పగించి.. బిల్లులు చెల్లించేశారని.. ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కాంట్రాక్టర్ దోచేసిన సొమ్మును రికవరీ చేయాలని సర్కార్‌కు నిపుణుల కమిటీ సూచించింది. - గాలేరు–నగరి 30వ ప్యాకజీ పనుల్లో భాగమైన అవుకు సొరంగం పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల సొరంగం బదులుగా లూప్ వేయాల్సి వచ్చింది.. ఈ పనులకు రూ.50.69 కోట్లు చెల్లించారని.. ధరల సర్దుబాటు కింద రూ.14.07 కోట్లను అదనంగా దోచిపెట్టారని పేర్కొంది. -
టెండర్లలో గోల్మాల్..
-
గాలేరు–నగరిలో రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ పనుల ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి వారం రోజుల ముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులను సీఎం రమేష్ సంస్థకు అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకునేలా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు జలవనరుల శాఖపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్యాకేజీల పనులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించింది. దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బెదిరించి ప్రీ క్లోజర్! గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశలో మొదటి ప్యాకేజీ(ప్రధాన కాలువ 32.64 కి.మీ. నుంచి 66.150 కి.మీ. వరకు తవ్వకం, పది వేల ఎకరాలకు నీళ్లందించి మిగతా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు) పనుల్లో 2014 నాటికి రూ.69.89 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ 66.15 కి.మీ. నుంచి 96.50 కి.మీ. వరకు తవ్వకం, 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు)లో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి ఒప్పందం రద్దు (ప్రీ–క్లోజర్) కోసం గత సర్కారు దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరులశాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించారు. టెండర్లలో గోల్మాల్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండో దశ మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్రిబవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్ట్స్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ ధరకు షెడ్యూలు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉండగానే అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు గత ఫిబ్రవరి 26న ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేశారు. సీఎం రమేష్ సంస్థ 3.99 శాతం ఎక్సెస్ (406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్ (రూ.409.50 కోట్లు)కు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని ఫిబ్రవరి 28న సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా అదే రోజు టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేశారు. అప్పుడు ఖజానాకు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించి 4.76 శాతం అధిక ధరలకు సీఎం రమేష్ సంస్థకే కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.50.70 కోట్ల భారం పడింది. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశ పనులను ఇటీవల సమీక్షించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
వైఎస్ హయాంలో రైతే రాజు
రైతును రాజుగా చూడాలనుకున్నారు రాజన్న. జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించి అన్నదాత కళ్లల్లో ఆనందం నింపాలనుకున్నారు. అందుకే సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్రగతి పరవళ్లు తొక్కింది. రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. హంద్రీ–నీవా వైఎస్ చలువే.. సాక్షి, బి.కొత్తకోట: హంద్రీ–నీవా సాగు, తాగునీటి ప్రాజెక్టుల ఘనత పూర్తిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లుతుంది. ఈ ప్రాజెక్టును 2013 డిసెంబర్‌నాటికే పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయన నిర్ణయించారు. ఆయన చిత్తశుద్ధితోనే ఈఏడాది జనవరి 22న జిల్లాలోకి కృష్ణాజలాలు ప్రవేశించాయి. కాలువ పనులు పూర్తి చేసి, ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టి, రైతులకు పరిహారం అందించారు. ఏటా బడ్జెట్లో కేటాయించిన దానికంటే మించిన పనులు చేయించిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. వైఎస్‌ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టుపనుల కోసం అవసరమైన నిధులిచ్చారు. పథకం ప్రారంభ ఏడాది 2005–06 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూ.46.50కోట్లు కేటాయిస్తే..రూ.183.15కోట్ల పనులు జరిగాయి. 2006–07లో రూ.253కోట్ల కేటాయిస్తే రూ.415.45కోట్ల పనులు జరిగాయి. 2007–08లో అత్యధికంగా రూ.1,165కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లు యుద్ధప్రాతిపదికన రూ.1,148.04కోట్ల పనులు పూర్తిచేయగలిగారు. 2009–10లో రూ.999కోట్ల కేటాయిస్తే రూ.1,364.73కోట్ల పనులు జరగడం ప్రాజెక్టు చరిత్రలో రికార్డు. వైఎస్ హయాంలో మొత్తం రూ.3,388.5కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే రూ.4,295.1కోట్ల పనులు జరిగాయి. పనులు చేసే కాంట్రాక్టర్లకు అప్పట్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉండేది. బిల్లులతో పనిలేకుండా పనులు చేశారు. ప్రధానంగా రైతులు..ప్రాజెక్టు కాలువల తవ్వకం కోసం ప్రభుత్వం పైసా పరిహారం చెల్లించకపోయినా అడ్డు చెప్పలేదు. స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. (చదవండి : జనం గుండె చప్పుళ్లలో రాజన్న జ్ఞాపకం) తమకు పరిహారం మాటేలా ఉన్నా కాలువలు సత్వరమే పూర్తి కావాలన్న కాంక్ష రైతుల్లో కనిపించింది. గత జనవరి 22న జిల్లాలోకి కృష్ణా జలాలు తరలివచ్చాయి. ఈ జలాలు ప్రవహించింది వైఎస్ తవ్వించిన కాలువలోనే. అది తమ ఘనత అని టీడీపీ సంబరాలు చేసుకుంది. కాలువకు నీరు రప్పించామని అర్భాటంగా ప్రచారం చేసుకున్నారే కాని కాలువలు తవ్వించింది తామేనని చెప్పుకోలేకపోయారు. గాలేరు– నగరికి శ్రీకారం పుత్తూరు రూరల్ : కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సాగునీరు, ప్రజల దాహార్తి తీర్చడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంలో భాగంగా 2006 జూన్4న నగరి పట్టణంలో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. కడపజిల్లాలో 1,55,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలు అంటే మొత్తం 2,60,000 ఎకరాలకు సాగునీరు అందేలా మహానేత ఈ పథకానికి రూపకల్పన చేసారు. ఈ పథకం పూర్తయితే 20 లక్షల మందికి తాగునీరు అందడమే కాక 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతాయని అంచనా వేసారు. ప్రారంభంలో ఈ పథకం విలువ రూ. 4,620 కోట్లుగా అంచనా వేశారు. 38 శతకోటి ఘనపుటడుగుల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు జలాశయానికి తరలించి గాలేరు నగరి ప్రత్యేక వరద కాలువ ద్వారా క్షామపీడిత ప్రాంతాలకు తరలిస్తారు. 254వ కి.మీ. వద్ద చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. తదుపరి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాల సాగర్ అక్కడి నుంచి పుత్తూరు మండలం వేపగుంట రిజర్వాయరుకు, అక్కడి నుంచి నగరి రూరల్ మండలంలోని అడవికొత్తూరులో నిర్మించే రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. రైతు సంక్షేమం కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేట్టిన జలయజ్ఞం పనులు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దం పూర్తయినా కృష్ణాజలాలు నగరికి చేరలేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టును అటకెక్కించాయి. అటకెక్కిన మహానేత ఆశయం అడవికొత్తూరు శివారుల్లో గాలేరు–నగరి సుజల స్రవంతిలో భాగంగా 0.8 టీఎంసీల నీరు నిల్వచేయడానికి వీలుగా రిజర్వాయరు నిర్మాణం ప్రారంభించారు. పుత్తూరు నుంచి నగరికి వచ్చే గాలేరు నగరి కాలువ, రిజర్వాయరు నిర్మాణాలకు సుమారు రూ.120 కోట్ల మేర పనులు జరిగాయి. ప్రాజెక్టు పనుల్లో 60 శాతం మేర పూర్తి కాగా కరకట్ట పనులు, కాలువల తవ్వకాలు, కాలువల లైనింగ్ పనులు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గాలేరు నగరి ప్రాజెక్టు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. నీటిని నిల్వచేయడానికి దిట్టంగా మార్చిన నేలలు బీటలు వాలిపోతున్నాయి. మహానేత కలలు సాకారమై ప్రాజెక్టుకు నీరు చేరివుంటే నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లోని పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందేది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తారని రైతులు, ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. సాగునీటికి కొరత లేకుండా.... సదుం:వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పాపిరెడ్డిగారిపల్లె మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. గార్గేయనదిపై పాపిరెడ్డిగారిపల్లె ప్రాజెక్టు నిర్మాణ పనులు 2004లో ప్రారంభమయ్యాయి. రూ. 8.5 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తయింది. 138. 15 ఎంసీఎఫ్‌టీల వరద నీటిని ఇందులో నిల్వ చేయవచ్చు. ఈ నీటిని పీలేరుకు తరలించేలా చేపట్టిన పంపింగ్‌హౌస్‌పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న రెడ్డివారిపల్లె, తాటిగుంటపాళెం, కంభంవారిపల్లె పంచాయతీల పరిధిలోని ç నీటి మట్టం పెరగడంతో పంటలసాగుకు నీటి కొరత లేకుండా పోయింది. ’వైఎస్ హయాంలో పనుల వివరాలు ఆర్థిక కేటాయింపు కోట్లలో జరిగిన పని కోట్లలో 2005–06 రూ.46.50 రూ.183.15 2006–07 రూ.253 రూ.415.45 2007–08 రూ.925 రూ.1,148.04 2008–09 రూ.1,165 రూ.1,364.73 2009–10 రూ.999 రూ.1,183.47 -
బాబు బినామీకి రూ.460 కోట్లు!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడే అందినంత దోచుకోవాలన్న కొత్త నీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించారు. తన బినామీ, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ సంస్థకు ఇప్పటికే ఎన్నోసార్లు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ పనులు సైతం అదే సంస్థకు అధిక ధరలకు దక్కేలా తన అధికార బలం ఉపయోగించారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు ఉత్తినే రూ.460 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో మెజారిటీ వాటా కమీషన్ల రూపంలో ముఖ్యమంత్రి జేబులోకి వెళ్లనుంది. చంద్రబాబు అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి ఇదొక నిదర్శనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. గాలేరుృనగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో మొదటి ప్యాకేజీలో రూ.69.89 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీలో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి, ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా(ప్రీృక్లోజర్) ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జల వనరుల శాఖ అధికారులు ఆమోదించారు. తర్వాత 2018ృ19 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. బినామీపై అంతులేని ప్రేమ తన బినామీ సీఎం రమేశ్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దాంతో మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్ఎస్(లంప్సమ్)ృఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్టŠస్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలకు అర్హతలు ఉన్నా.. ఆ సంస్థలు దాఖలు చేసిన షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ ధరకు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసేలా చక్రం తిప్పారు. అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయడంపై ఇతర సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణలో ఉండగానే సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బుధవారం ఫైనాన్స్ బిడ్ తెరిచారు. సీఎం రమేశ్ సంస్థ 3.99 శాతం ఎక్సెస్(రూ.406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్(రూ.409.50 కోట్లు) కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని గురువారం కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) పరిశీలనకు పంపారు. అదేరోజు సమావేశమైన సీవోటీ.. సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. అప్పుడు సర్కార్‌కు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. అంచనా వ్యయాన్ని రూ.321.42 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు కనీసం రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని అధికారవర్గాలే చెబుతున్నాయి. తస్మదీయ కంపెనీలపై అనర్హత వేటు రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 27న ఎల్ఎస్ృఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లో శుక్రవారం టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. ఇందులోనూ యథావిధిగా తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయించారు. శనివారం ప్రైస్ బిడ్ తెరిచి.. దాదాపు 4.76 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసిన సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఈ పనులను సైతం అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.50.70 కోట్ల మేర భారం పడుతుంది. అంచనా వ్యయాన్ని రూ.233.52 కోట్ల మేర పెంచడం ద్వారా సీఎం రమేశ్ సంస్థకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు రూ.210 కోట్ల మేర ప్రయోజనం చేకూరనున్నట్లు జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు చెప్పారు. అంటే రెండు ప్యాకేజీల్లో కలిపి చంద్రబాబు బినామీకి ఏకంగా రూ.460 కోట్ల లాభ అన్నమాట! -
అవినీతి సొరంగం!
⇒ అవుకులో రూ.50 కోట్ల నుంచి ⇒ రూ.60 కోట్లు కొట్టేసే వ్యూహం ⇒ కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దలు కుమ్మక్కు! సాక్షి, హైదరాబాద్: గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్యాకేజ్-30లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగ మార్గంలో అవినీతి ప్రవాహానికి మార్గం సుగమమైంది!. సొరంగంలోని లోపాలను సరిచేయడానికిగాను వెచ్చించే సొమ్ములో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంలోని పెద్దలే.. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయినట్టు తెలిసింది. సదరు పనుల కోసం రాకరాక అనుమతులు రావడంతో.. అడిగిన మొత్తాన్ని సమర్పిం చుకునేందుకు కాంట్రాక్టర్ సిద్ధమైనట్టు సమాచారం. వివరాలు.. 2007 నాటి ఒప్పందం మేరకు రూ.401.12 కోట్ల విలువైన సొరంగం పనులను అప్పటి ప్రభుత్వం ఎన్సీసీ మైటాస్-జెడ్‌వీఎస్(జేవీ) సంస్థకి అప్పగించింది. అయితే, జేవీ సంస్థ ఈ పనులను జీవీఆర్‌కు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. పనులు జరుగుతున్న క్రమంలో సొరంగంలో రాళ్లు ఊడిపడుతున్నందున 50 వేల అడుగుల మేర.. సిమెంట్ పూత స్థానంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాలని, దీనికి అనుమతించాలని కాంట్రాక్టర్ గత మూడేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికిగాను అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఒప్పందం ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. సదరు కాంట్రాక్టరే సొరంగాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. మధ్యలో చెప్పే కారణాలతోకానీ, అదనపు నిధులు మంజూరు చేయడ ంగానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీంతో గత ప్రభుత్వం కాంట్రాక్టర్ వినతిని పట్టించుకోలేదు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు సర్కారు మాత్రం కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. దీంతో.. కాంట్రాక్టర్ తొలుత పూత వేయాల్సిన ప్రాంతం 50 వేల అడుగులని చెప్పి.. తాజాగా దానిని 1.5 లక్షల అడుగులకు పెంచేశారు. అంతేకాదు, దీనికిగాను రూ.100 కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మొత్తాన్ని ఇచ్చేలా ఉన్నతాధికారులు సిఫార్సు చేసేశారు. ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు ప్రభుత్వ రూ.100 కోట్లు మంజూరు చేసినా.. 1.5 లక్షల అడుగుల వైశాల్యానికి స్టీల్ ఫైబర్ పూత వేసేందుకు అయ్యే వ్యయం రూ.40 కోట్లుగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, మిగిలిన రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల సొమ్ము పక్కదారి పట్టడం ఖాయమని తెలుస్తోంది. అంకెల్లో.. 2007: ఒప్పందం కుదిరిన ఏడాది. 401.12: రూ.కోట్లు సొరంగం పనుల అంచనా వ్యయం. 50: వేల అడుగులు.. సొరంగంలో పూతవేయాలంటూ కాంట్రాక్టర్ మొదట చెప్పింది. 1.5: లక్షల అడుగులు.. సొరంగంలో పూతవేయాలంటూ కాంట్రాక్టర్ ఇప్పుడు చెబుతున్న కథ. 100: రూ.కోట్లు అదనంగా ఇవ్వాలని కాంట్రాక్టర్ అడిగింది. 40: రూ.కోట్లు ఆయా పనులకు నిజంగా అయ్యే వ్యయం! 50-60: రూ.కోట్లు కాంట్రాక్టరు, పెద్దలు కుమ్మక్కై పంచుకునే సొమ్ము! విషయం: అవుకు సొరంగంలో రాళ్లు ఊడిపడకుండా స్టీల్ ఫైబర్ పూతకు అనుమతించాలంటూ సర్కారుకి కాంట్రాక్టర్ వినతి. ఒప్పందంలో ఉందా?: లేదు. 2007 నాటి ఒప్పందం మేరకు ఎలాంటి పూత వేయాలన్నా కాంట్రాక్టర్‌దే బాధ్యత. సర్కారు ఏమంది?: గత ప్రభుత్వం ఒప్పుకోలేదు. చంద్రబాబు సర్కారు ‘సై’ అంటోంది. ఎవరికి లాభం?: కాంట్రాక్టర్‌కు.. ఆయనకు సహకరిస్తున్న సర్కారు పెద్దలకు. భారం: ప్రజాధనం రూ.100 కోట్లు. అవినీతి: రూ.50 కోట్లు-రూ.60 కోట్లు? మూరెడు.. బారెడైంది.. ఎందుకు? సొరంగంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాల్సిన వైశాల్యం 50 వేల అడుగులని ఆరేడు నెలల క్రితం కాంట్రాక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంగీకారం కోరుతూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇటీవల సమర్పించిన ప్రతిపాదనల్లో.. ఈ విస్తీర్ణాన్ని ఏకంగా 1.5 లక్షల అడుగులకు పెంచారు. ఇంత భారీస్థాయిలో విస్తీర్ణం ఏవిధంగా పెరిగిందో కనీసం వివరించే పనికూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారు కోరారు.. వీరు తలూపేశారు!! కాంట్రాక్టర్ చెబుతున్న విధంగా సొరంగంలో రాళ్లు ఊడిపడే వైశాల్యం వాస్తవంగా ఎంత ఉందనే విషయాన్ని అధికారులు కనీస పరిశీలన కూడా చేయలేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన ప్రతిపాదనను యథావిధిగా సబంధిత సీఈ ప్రభుత్వానికి సమర్పించారు. దీనికి ఉన్నతాధికారులూ తలూపేశారు. కాంట్రాక్టర్ అడిగినంత ఇవ్వాలని, ప్రతిపాదనలకు యథావిధిగా ఆమోదం తెలపాలని రాష్ట్రస్థాయి స్టాం డింగ్ కమిటీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సూచించడం గమనార్హం. కొసమెరుపు!: ప్రతిపాదనను యథావిధిగా ఆమోదించాలని అధికారులు రాసేస్తే, రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ ఉండడం ఎందుకని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.