నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
రాష్ట్రంలో నాలుగేళ్లలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆపై ఓట్లు వేసేందుకు ఎన్నికల్లో అడుగులు వేయాలి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్! మారిందల్లా సీఎం మాత్రమే. కానీ అప్పుల రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ. మీ బిడ్డ వచ్చాక అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు జమ చేశాడు.
చంద్రబాబు హయాంలో ఇది ఎందుకు జరగలేదు? నాడు జన్మభూమి కమిటీల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి దాకా దోచుకోవడం, పంచుకోవడమే! మన పాలనలో ప్రతి అడుగు మంచి కోసమే. విద్య, వైద్యంతోపాటు మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేశాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరు. మీకు మంచి జరిగి ఉంటే సైనికుల్లా మీ బిడ్డకు తోడుగా నిలబడి ప్రోత్సహించండి. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా.
– సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వినాయక చవితి సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలువైన వరాలను అందించారు. 2 జిల్లాల్లో 77 చెరువులకు హంద్రీ–నీవా నీటితోపాటు తాగునీటిని కూడా అందించే ప్రాజెక్టును సీఎం మంగళవారం ప్రారంభించారు. పత్తి కొండ నియోజకవర్గం లక్కసాగరం సమీపంలోని ఆలంకొండ పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.
పక్కనే శ్రీశైలం ఉన్నా..
ఇది నీటి విలువ తెలిసిన మనందరి ప్రభుత్వం. రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా శాశ్వత మార్పులు తెచ్చేందుకు నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులను నింపుతు న్నాం. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజు ల్లో 1.24 టీఎంసీల హంద్రీ–నీవా జలాలతో చెరు వులను నింపుతాం.
ఆశ్చర్యమేంటంటే పక్కనే శ్రీ శైలం ఉన్నా మెట్ట ప్రాంతాలైన పత్తికొండ, డోన్‌కు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. డోన్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నికరజలాలు లేని పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులున్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. 2019 ఎన్ని కలకు కేవలం 4–5 నెలల ముందు చంద్రబాబు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టారు. కనీసం పైపులు వేసేందుకు భూసేకరణ కూడా జరగలేదు. హడా వుడిగా టెంకాయలు కొట్టేందుకు మాత్రం 8 ఎకరా లు కొనుగోలు చేశారు. అలాంటి దారుణమైన మోసాలకు పాల్పడ్డారు.
చంద్రబాబు మాదిరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పనులు చేపట్టే ప్రభుత్వం మాది కాదు. మనందరి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీటి విలువ తెలిసిన రాయలసీమ బిడ్డగా రూ.253 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. ఈ ప్రాంతంలో 8 మండలాలు కరువుతో ఉన్నాయి. మొత్తం 10,130 ఎకరాలకు సాగునీటితోపాటు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీరు అందించే పనులు పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవ ర్గాలకు మంచి జరుగుతుంది.
ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి ఇప్పటికే పైపులైన్ కనెక్టివిటీ పూర్తయింది. ట్రైల్ రన్ చేస్తున్నాం. కృష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపులైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రైల్ రన్ జరుగుతోంది. ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైపులైన్ పూర్తయింది. జొన్నగిరి, డోన్, తుగ్గలి మండలాల్లోని మరో 7 చెరువులకు ట్రైల్‌రన్ పూర్తయి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. డోన్ నియో జకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకూ నీరిస్తున్నాం. మొత్తంగా 77 చెరువులకు సంబంధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం.
గాజులదిన్నె సామర్థ్యం పెంపుతో సాగుకు భరోసా..
ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న సంజీవయ్యసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీంఎంసీలు. 24,372 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వర్షాధారంతో నిండాల్సిందే. కృష్ణా జలాల కేటాయింపు లేదు. పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలో 55 ఆవాసాలకు, గోనెగండ్ల మండలంలోని 10 ఆవాసాలకు, డోన్ మునిసిపాలిటీకి ఇది తా గునీరు అందిస్తోంది. కర్నూలు కార్పొరేషన్‌కు కూడా తాగునీటిని అందిస్తోంది. ఇన్ని రకాలుగా ఉప యోగపడే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 టీఎంసీలకు పెంచాం.
హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి రూ.57 కోట్లతో నీళ్లు ఇస్తున్నాం. ఆ పనులు కూడా పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రాంతానికి ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై గతంలో ఎప్పు డూ ఎవరూ ఆలోచన చేయలేదు. ఇక్కడ వర్షాలు పడితేనే వ్యవసాయం. చెరువులున్నా నింపాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎన్నికల సమయంలోనే కొందరికి టెంకాయలు, జీవోలు గుర్తొస్తాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాదు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇక్కడకు వచ్చి నప్పుడు మీ కష్టాలు చూశా. మీకు నేనున్నానని చెప్పా. మాట ప్రకారం నాలుగేళ్లలో పూర్తి చేసి ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడుతున్నా.
ఆ రోజు వైఎస్సార్.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం
రాయలసీమలో ఎంత దుర్భిక్ష పరిస్థితులున్నాయో నాకు తెలుసు. ఈ రోజు హంద్రీ–నీవా నుంచి తూ ము పెట్టి 77 గ్రామాలకు జలాలు ఎత్తిపోస్తున్నాం. ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని అడుగుతున్నా. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఖర్చు చేసింది కేవ లం రూ.13 కోట్లు. దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.6 వేల కోట్లతో హంద్రీ–నీవా కాలువ నిర్మించారు. అందువల్లే ఈ రోజు కాలువ లపై తూములు ఏర్పాటు చేసి లిఫ్ట్‌లు పె ట్టుకుంటున్నాం. రాయలసీమ సాగునీటి కష్టాల ను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు.
ప్రజల గురించి ఎవరైనా ఆలోచించారంటే అప్పుడు వైఎస్సార్ హయాంలో.. ఆ తర్వాత దేవుడి దయ, మీ అందరి దీవెన లతో ఏర్పడ్డ మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పోతిరెడ్డి పాడును 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లేలా అడు గులు పడుతున్నాయి. గత పాలకుల నిర్వాకా లను మనమంతా చూశాం. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలా లంటే శ్రీశైలం నిండాలి. 881 అడుగులకు చేరితే త ప్ప నీళ్లు రాని పరిస్థితి. శ్రీశైలం నిండేదెప్పుడు? నిండినా ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి? తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్నా రు. 790 అడుగులకే పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆ లోచించాం. 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునేలా రా యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి.
ప్రకాశం కరువూ తీరుస్తాం
కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కరువు కూడా తీరుస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్లు వస్తాయి. ఇక్కడ రెండు టన్నెళ్లు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే టన్నెల్–1లో 12 కిలోమీటర్లు, టన్నె ల్–2లో 8 కిలోమీటర్లు మేర పనులు జరిగా యి. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కరు వుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ బిడ్డ మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. రెండో టన్నెల్‌ను అక్టోబర్‌లో జాతికి అంకితం చేస్తున్నాం.
నాడు వెలవెల.. నేడు కళకళ
బాబు హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. గండికోటకు 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 10–12 టీంఎసీలు కూడా నిల్వ చేయలేదు. చిత్రావతి సామ ర్థ్యం 10 టీఎంసీలు కాగా 2–3 టీఎంసీలను కూడా నిల్వ చేయని దుస్థితి. బ్రహ్మంసాగర్‌కు 17 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాడు నీళ్లు అందని పరిస్థితి. మీ బిడ్డ సీఎం అయ్యాక కాలువల సామర్థ్యాన్ని పెంచాం. ప్రతి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కోసం డబ్బులిచ్చాం. దీంతో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయగలుగుతున్నాం. గాలేరు –నగరి సుజల స్రవంతిలో అవుకు రెండో టన్నెల్ పనులను పూర్తి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇవన్నీ మంచి మనసు పెట్టి చేసిన పనులు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.2.35 లక్షల కోట్ల ను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మరి నాడు బాబు ఎందుకు చేయలేకపోయారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) లక్ష్యంగా వ్యవహరించారు.
కళ్లెదుటే మార్పులు..
గ్రామ స్థాయిలో మీ స్కూళ్లలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించండి. స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చింది. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌బీ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతిలో ట్యాబ్‌లు ఇస్తు న్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అభివృద్ధి చేసిన పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎప్పడూ చూడని విధంగా కనిపి స్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తు న్నాం. 53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తు న్నాం. వ్యవసాయంలో ఆర్బీకేలు రైతన్నలను చేయి పట్టుకుని నడిపి స్తున్నాయి. ఈ– క్రాపింగ్ నుంచి పంట కొనుగోలు వరకు మంచి జరుగుతోంది. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్న మన ప్రభు త్వానికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నా.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు గుమ్మనూరు, అంబటి, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్, ఎమ్మెల్యేలు ఆర్థర్, శిల్పా రవి, కంగాటి శ్రీదేవి,రాంభూపాల్‌రెడ్డి, చక్రపాణి రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్‌ఖాన్, చెన్నకేశవరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్, మధుసూదన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సుగుణాల మారాజు
– బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి
‘కరువు సీమకు పండుగ పూట బహుమానం ఇచ్చేందుకు సీఎంజగన్ వచ్చారు. కర్నూలు జిల్లా శతాబ్దాలుగా ఎన్నో కరువులు చూసింది. ఒక్క ఎకరాకూ నీటి పారుదల లేని ప్రాంతం డోన్. రెయిన్‌గన్ ద్వారా నీళ్లిస్తామని గత పాలకులు బూటకపు మా టలు చెబితే ఈ రోజు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం మాది. చెరువులకు నీళ్లు ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరిగి భూములు సస్యశ్యామలం కానున్నాయి. సుగుణాలన్నీ ఉన్న మారాజు మన జగన్. అ వినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకు వెళితే నిరసన దీక్షలు ఏమిటి? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి దీనికి మద్దతు ప్రకటించడం ఎంత దారుణం? ప్రజలకు చైతన్యం లేదని, పిరికి వాళ్లు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణాలు, కుట్రలను చట్ట సభల సాక్షిగా ప్రజలకు తెలియచేస్తాం’
Comments
Please login to add a commentAdd a comment