krishna river water
-
అవసరాలకే కేటాయించాలి.. అత్యాశకు కాదు!
సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీర్చడానికి నీళ్లు కేటాయించాలి కానీ అత్యాశ తీర్చడానికి కాదని తెలంగాణ పేర్కొంది. ఏపీలో కృష్ణా పరీవాహకం పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తెలంగాణ పరీవాహకం పరిధిలోని ప్రాంతాలు కనీసం ఒక ఆరుతడి పంటకు సైతం సాగునీటికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. రైతులు నీళ్లు లభించక గోస పడుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలు కృష్ణా నీళ్లు వాడుకోవడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట.. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ బుధవారం వాదనలు వినించారు. శాస్త్రీయ విధానంలో విశ్లేషించాలి కృష్ణా నదీ పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు ఏపీ 323 టీఎంసీల కృష్ణా నికర జలాలను తరలించుకుంటోందని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, చింతలపుడి ఎత్తిపోతల ద్వారా 27 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుని అవసరాలు తీర్చుకోవడానికి అవకాశముందని తెలిపారు. ఏపీ కృష్ణా జలాలను తరలిస్తున్న ఇతర నదుల పరీవాహక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నీటి లభ్యతను వివరించారు. పెన్నా పరీవాహకంలో 75 శాతం లభ్యత ఆధారంగా 98 టీఎంసీలు, సగటు లభ్యత ఆధారంగా 195 టీఎంసీల లభ్యత ఉందని తెలిపారు. గుండ్లకమ్మ వంటి నదుల కింద సైతం నీటి లభ్యత ఉందన్నారు. సమర్థ నీటి వినియోగాన్ని శాస్త్రీయ విధానంలో విశ్లేషిస్తే నీటి అవసరాలు తగ్గుతాయని, దీంతో మిగిలే జలాలను పరీవాహక ప్రాంతం లోపలి ప్రాజెక్టులకు కేటాయించాలని సూచించారు. గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే అవకాశం పోయింది.. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కింద రాష్ట్రంలో సాగునీరు సరఫరా చేస్తున్న, సరఫరా చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతాలకు.. వాస్తవానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్, కృష్ణా ప్రాజెక్టు కాల్వలు, భీమా ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. 1956లో తెలంగాణ, ఆంధ్రను కలిపి ఉమ్మడి ఏపీగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర సరిహద్దులు మారిపోవడంతో గ్రావిటీ ద్వారా నీళ్లను పొందే అవకాశాన్ని తాము కోల్పోయామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల కింద నీటి వినియోగం చాలా తక్కువ అని, నిర్మాణంలోని ప్రాజెక్టులకు జరిపే నికర జలాల కేటాయింపులతో కృష్ణా పరీవాహకంలోని 25 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మందికి జీవోనోపాధి లభించనుందని వైద్య నాథన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1956 తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజధాని ప్రాంత అభివృద్ధితో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కింద తగ్గిన నీటి వినియోగాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఏపీలోని వాగుల ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌కు సరఫరా అవుతున్న 75 టీఎంసీల జలాలను లెక్కించలేదని, వాటిని సైతం లెక్కించాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాలను న్యాయోచితంగా వాడుకోవాలని పేర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలను వైద్యనాథన్ వివరించారు. గురువారం ఏపీ వాదనలు వినిపించనుండగా, శుక్రవారం రెండు రాష్ట్రాలు ప్రతివాదనలు వినిపించనున్నాయి. -
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
Andhra Pradesh: కృష్ణా జలాల 'హక్కులు హుళక్కే'!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.బాబు సర్కారు నిర్వాకంతో...కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది. రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్ఆర్డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.నాటి తరహాలోనే నేడూ..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు. ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. చంద్రబాబు ఇంటికి వరద ముప్పు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది.ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. వరద నీటి కారంగా విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద ఇంట్లోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇక, వాయుగుండం బలపడటంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!
సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది. నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ! కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్‌కు చెందిన ఆర్కే హెచ్‌ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్‌లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్‌లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్ఎల్ఆర్బీ, డీఎల్ఆర్బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్‌లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్‌లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ చెబితే చేస్తారంతే.. సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజ లాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్‌కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూ మ్ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్ వాల్యూమ్లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్‌లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడువున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్‌పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్‌లు, డెకరేషన్లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. ► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు. ► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు ► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్‌లు ► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు ► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు ► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు -
కుప్పానికి జల కళ..పచ్చ బ్యాచ్ విల విల
-
కృష్ణమ్మ రాకతో చెరువుల్లో జలకళ
శాంతిపురం: కుప్పం కాలువలోకి వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువుకు నీరు వదలటంతో అది నిండుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారుల ట్రయల్ రన్‌తో కాలువ కింది భాగంలోనూ నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి వద్ద పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద నీరు ముందుకు సాగటంతో స్థానిక రైతులు రాత్రి పూట సైతం గంగ పూజలు చేశారు. అదే క్రమంలో వెంకటేష్ పురం వద్ద ఉన్న చెరువుకు ఉన్న ఓటీ పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నంలోగా ఈ చెరువు పూర్తిగా నిండిపోయింది. మిట్టపల్లి వద్ద గల మద్దికుంట చెరువుకు మంగళవారం అధికారులు నీరు విడుదల చేయటంతో చెరువు క్రమంగా నిండుతోంది. జలకళతో కనువిందు చేస్తున్న ఈ రెండు చెరువులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు. కృష్ణా జలాలపై తప్పుడు రాజకీయం తగదు హంద్రీనీవా కుప్పం కెనాల్లో నీటి ప్రవాహంపై తప్పుడు రాజకీయం చేయడం తగదని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద బ్రాంచి కెనాల్ నుంచి కుప్పం నియోజకవర్గానికి నీటిని విడుదల చేసినట్టు తెలిపింది. క్రాస్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను వదిలి 70.10 కిలోమీటర్ వద్ద తూము గుండా మద్దికుంట చెరువుకు నీటిని తరలించినట్టు వెల్లడించింది. శాంతిపురం మండలంలో 75.75 కిలోమీటర్ల వద్ద గల వెంకటేష్‌పురం శెట్టివానికుంట చెరువును పూర్తిగా నీటితో నింపినట్టు తెలిపింది. గుండిశెట్టిపల్లి వద్ద గంగ పూజలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో కాలువలోని 84వ కిలోమీటరు వరకూ నీటిని విడుదల చేసినట్టు వెల్లడించింది. పూజల అనంతరం నీటిని పూర్తిగా మద్దికుంట చెరువుకు మళ్లించి, అది నిండిన తర్వాత నాగసముద్రం, మణీంద్రం చెరువుకు నీటిని పంపే ఏర్పాట్లలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారని తెలిపింది. కానీ.. కొందరు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జలాలు ఆగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువై శ్రీశైలంలో కనీస నీటి నిల్వ ఉన్నప్పటికీ అక్కడి నుంచి 27 చోట్ల ఎత్తిపోతల ద్వారా 733 మీటర్ల ఎత్తులో.. 676 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ప్రాంతానికి ప్రభుత్వం నీటిని ఇస్తోందన్నారు. భగీరథ ప్రయత్నంతో అధికారులను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదని జల వనరుల శాఖ పేర్కొంది. మాట ప్రకారం నీళ్లిచ్చారు ఏడాది క్రితం కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నది నీటిని కాలువలోకి విడుదల చేశారు. దీంతో మా ఊరి చెరువు కూడా పూర్తిగా నిండింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. ఆయన తలచుకుంటే ఎప్పుడో మాకు నీటి కష్టాలు లేకుండా చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఓట్లేసే బానిసలుగానే చూశాడు. – మంజునాథ్, రైతు, వెంకటేష్ పురం నీళ్లు రాలేదంటే కళ్లుపోతాయి మా ఊరి దగ్గర హంద్రీనీవా కాలువలో సోమవారం నుంచి నీళ్లు పారుతున్నాయి. నీళ్లు వస్తున్నా రాలేదని గంగమ్మ తల్లితో రాజకీయాలు చేస్తే కళ్లుపోతాయి. ఈ ప్రభుత్వం కుప్పానికి నీరు రావటానికి కాలువను సిద్ధం చేసింది. రేపు కృష్ణా నదిలో నీళ్లు వస్తే మా ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వస్తాయి. – జయరామిరెడ్డి, రైతు, దండికుప్పం -
కుప్పంలో కృష్ణమ్మ.. కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్
కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. పధ్నాలుగేళ్లు సీఎంగా, ఏడు సార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం ప్రజలకే మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎప్పడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది మీ జగనే. ‘‘చంద్రబాబుకు నామీద కోపం వచ్చినప్పుడల్లా పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. మీ జగన్ ఏనాడూ ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్నిగానీ ఒక్క మాట కూడా అనలేదు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం.. ఏ ప్రాంతమైనా సరే పేదలను పేదలుగానే చూశాం. కుప్పం నియోజకవర్గంలో 82,039 కుటుంబాలకు (93.29 శాతం) నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. – సీఎం జగన్ సాక్షి, తిరుపతి: కనీసం సొంత నియోజకవర్గానికైనా మేలు చేయని రాజకీయ నాయకుడు ఇక రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సైతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పానికే ప్రయోజనం లేని ఆ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ బాగా ఆలోచన చేయాలని సూచించారు. కరువు తాండవమాడిన కుప్పం నేలకు కృష్ణా జలాలను తరలిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గానికి సోమవారం కృష్ణా జలాలను విడుదల చేశారు. కుప్పం పరిధిలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం జగన్ వాయువేగంతో పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మాట నిలబెట్టుకుంటున్నా.. కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు పైకెక్కి కృష్ణమ్మ మన కుప్పంలోకి బిరబిరా వచ్చింది. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో బహిరంగ సభ సందర్భంగా నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. మరో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ మరో రెండు ప్రాజెక్టుల పనులకు కూడా శ్రీకారం చుట్టేలా పరిపాలన అనుమతులిచ్చాం. కుప్పంలో రెండుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు గుర్తించాం. గుడుపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్‌ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్‌ను రూ.535 కోట్లతో నిర్మించడం ద్వారా అదనంగా మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేశాం. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్‌ను రూ.215 కోట్లతో నిర్మించేందుకు కూడా పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. వచ్చే టర్మ్‌లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీబిడ్డ మీకు అందిస్తాడు. ముడుపులపై రీసెర్చ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే చంద్రబాబు అంచనాలను అమాంతం రూ.561 కోట్లకు పెంచేసి తన పార్టీ వారికి, బినామీలకు అప్పజెప్పాడు. నీళ్లు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారించే కాలువగా మార్చుకున్నారు. ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలనే దోచుకుని కనీసం దాహార్తి తీర్చని నాయకుడిని ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి, మంచితనానికి జోహార్లు చెబుతున్నా. మీకు మేలు చేసిందెవరు..? 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? లేక మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 57 నెలల వ్యవధిలో కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు హెరిటేజ్ కోసం మూసివేసిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్‌ను తెచ్చి కుప్పం, పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించింది ఎవరంటే మీ జగన్. ప్రతిష్టాత్మక వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం, పలమనేరు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. ఆ కాలేజీని చిత్తూరులో పునఃప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యుత్తు సబ్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు చేయిస్తోంది ఎవరంటే మీ జగన్. బాబుకు ఓటేసిన పేదలూ నావాళ్లే కుప్పంలో చంద్రబాబుకు ఓటేసిన పేదలందరికీ ఓ మాట చెబుతున్నా. మీరందరూ నావాళ్లే అని భావిస్తూ మీకు మంచి చేశా. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే నవరత్నాల పథకాలను ఏకంగా 82,039 కుటుంబాలు (93.29 శాతం) అందుకున్నాయి. మనసున్న పాలన అంటే ఇది కాదా? 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేస్తే ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు అందచేశాం. భరత్‌ను ఎన్నుకోండి.. గుండెల్లో పెట్టుకుంటా బలహీన వర్గాలకు చెందిన భరత్‌ను ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఐదేళ్లలో మంచి చేశాం. భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్లో మంత్రిగా స్థానం ఇస్తా. గుండెల్లో పెట్టుకుంటా. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన మంచిని వివరిస్తూ ఇంకో వంద మందితో మనకు ఓటు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విన్నవిస్తున్నా. ‘కుప్పానికి మాటిచ్చా .. నిలబెట్టుకున్నా’ సీఎం వైఎస్ జగన్ ‘కుప్పం నియోజకవర్గానికి నీరందించే గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకొచ్చాం. 2022 సెపె్టంబర్ 23న కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాట నిలబెట్టుకున్నాను’ అని సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సోమవారం ట్వీట్ చేశారు. బ్యాంకు స్టేట్మెంట్లే సాక్ష్యం కుప్పంలో ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు వెళ్లి గత పదేళ్ల అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ వచ్చాక ఐదేళ్లు కలిపి మొత్తం పదేళ్ల స్టేట్మెంట్ను పరిశీలించండి. చంద్రబాబు పాలనలో మీ బ్యాంకు ఖాతాల్లోకి కనీసం ఒక్క రూపాయైనా వచ్చిందేమో చూడాలని కోరుతున్నా. మీ బిడ్డ గత 57 నెలలుగా నవరత్నాలతో అందించిన సాయాన్ని చూడండి. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో తనవారు, కానివారు అని ఎలా విభజించారో ఇవాళ ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అర్థం అవుతుంది. ► చంద్రబాబు హయాంలో అరకొరగా రూ.1,000 ఫించన్ కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఏకంగా 45,374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. నాడు రూ.200 కోట్లూ సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు రూ.507 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తోంది. ► ఒక్క కుప్పంలోనే 44,640 మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు పెట్టుబడి సాయంగా అందచేశాం. ఇవాళ కుప్పంలో 83 ఆర్బీకేలు, 93 గ్రామ, వార్డు సచివాలయాలు, 76 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి. ► చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను దగా చేస్తే మనందరి ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంది. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వగా ఒక్క కుప్పంలోనే 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు అందించాం. బాబు సున్నావడ్డీని ఎగ్గొడితే మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా కుప్పంలో 35,951 మంది తల్లులకు రూ.155 కోట్లు అందచేశాం. ► కుప్పంలో చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. మీ బిడ్డ ప్రభుత్వం కుప్పంలో ఇప్పటికే 15,721 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరో 15 వేలకుపైగా ఇళ్ల పట్టాలు కూడా నెల తిరగకుండానే ఇవ్వబోతున్నాం. మొత్తం 30 వేలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్రబాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు 3,547 కాగా కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వం 7,898 ఇళ్లు మంజూరు చేసి ఇప్పటికే 4,871 ఇళ్లను పూర్తి చేసింది. ► వైఎస్సార్ చేయూత ద్వారా కుప్పంలో 19,921 మంది కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ.85 కోట్లు జమ చేశాం. ► నాడు కుప్పంలో 7,002 మందికి ఆరోగ్యశ్రీతో రూ.28 కోట్లు విదిలిస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు విస్తరించి ఆరోగ్య ఆసరా కూడా అందిస్తూ 17,552 మందికి రూ.64 కోట్ల మేర మేలు చేసింది. ► బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కింద 8,459 మందికి రూ.27 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం వంద శాతం రీయింబర్స్‌మెంట్‌తో 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము రూ.61 కోట్లు. బీసీల సీటు బాబు కబ్జా చంద్రగిరిలో చంద్రబాబును 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. తర్వాత ఇక్కడ (కుప్పం) ధనబలం చూపిస్తూ వలస వచ్చారు. బీసీల సీటును కబ్జా చేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 ఏళ్లుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి ఆయన ఏమిచ్చారో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఆ మనిషి 75 ఏళ్ల వయసు వచ్చాక మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లి ఫలానా మంచి చేశానని చెప్పలేడు. పొత్తులు, దత్తపుత్రుడితో ప్యాకేజీ గురించి తలుపులు బిగించుకొని మాట్లాడతారు. కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి బాబూ? వంగవీటి రంగా హత్యకు పురిగొల్పింది మీరే కదా? కుప్పంలో జన జాతర సాక్షి, తిరుపతి: కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. దశాబ్దాల కల నెరవేర్చడం పట్ల జనం నీరాజనం పలికారు. కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సోమవారం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు వస్తున్నారని తెలుసుకుని పరిసర ప్రాంతాల రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలువ పొడవునా జగన్‌కు జేజేలు పలికారు. పలమనేరు, కుప్పం నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనంతో శాంతిపురం మండలం గుండశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రాంతం నిండిపోయింది. సీఎం వైఎస్ జగన్ హెలిపాడ్ నుంచి బస్సులో కూర్చొని దారిపొడవునా జనానాకి అభివాదం చేస్తూ బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చారు. జగన్‌కు దారిపొడవునా పూలు చల్లుతూ జనం ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ.. ఈలలేస్తూ, చప్పట్లు కొడుతూ.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చేత పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ప్రజల ఓట్లతో గెలుస్తూ.. కుప్పం ప్రజలకు చేస్తున్న అన్యాయం, మోసం గురించి సీఎం జగన్ వివరిస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ.. నిజమే.. నిజమే.. అని అరస్తూ కనిపించారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంకు వచ్చిన సమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను తీసుకొచ్చానని చెప్పటంతో ‘మళ్లీ సీఎం మీరే’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు రిజర్వాయర్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించటం పట్ల, చంద్రబాబు 35 ఏళ్లుగా చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ, డీఎస్పీ డివిజన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన సమయంలో జనం మరింత బిగ్గరగా కృతజ్ఞతలు తెలిపారు. నమ్మలేక పోతున్నాం మా గ్రామాల మీదుగా కృష్ణా జలాలు ప్రవహిస్తాయని ఇప్పటి వరకు ఊహించలేదు. నీటి ప్రవాహన్ని చూస్తుంటే నమ్మలేక పోతున్నాం. హంద్రీ–నీవా కాలువలో నీళ్లు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. కరువు కాటకాలతో ‡బతుకుతున్న మా జీవితాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారు. జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తిన్నా తీర్చుకోలేనిది. తాగడానికి నీళ్లతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బతుకు కల్పించారు. – చంద్రశేఖర్, పెద్దబళ్దార్, రామకుప్పం మండలం వైఎస్సార్సీపీని గెలిపిస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్న జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. ప్రతిపక్ష నేత నియోజకవర్గమైనా రూ.250 కోట్లతో కాలువ పనులు పూర్తిచేసి కుప్పం ప్రజలకు నీళ్లు ఇచ్చిన దేవుడు జగన్. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదలకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి నాయకుడిని మళ్లీ సీఎం చేసుకోవడం అందరి బాధ్యత. భరత్‌ను గెలిపించుకుంటాం. – సుబ్రమణ్యం, రామకుప్పం మండలం రుణం తీర్చుకుంటాం 40 ఏళ్ల మా కలను నెరవేర్చిన మ్యుమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. మంచి చేసిన వారిని ఆదరించడమే కుప్పం ప్రజలకు తెలుసు. తాగు, సాగునీటి సమస్య తీర్చిన సీఎం జగన్‌ను మరవలేం. – గురుస్వామి, వెదురుగుట్టపల్లి, శాంతిపురం మండలం -
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?
-
చంద్రబాబుకు నా పై కోపం వస్తే చేసేది అదే కానీ నేను మాత్రం..!
-
కొండలు ధాటి కోనలు దాటి... ఈ రోజు కుప్పం చరిత్రలో నిలిచిపోతుంది
-
సీఎం జగన్ పై ఎమ్మెల్సీ భరత్ అదిరిపోయే పాట దద్దరిల్లిన సభ
-
కుప్పంలో కృష్ణ జలాలను విడుదల చేసిన సీఎం జగన్
-
కుప్పానికి ‘కృష్ణా’ జలాలు
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. అంచనాల్లోనే బాబు వంచన.. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123.641 కిమీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు నీళ్లందించే పథకంలోనూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కిమీల పొడవున తవ్వేందుకు మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.293.11 కోట్లు. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015, మేలో అంచనాలు రూపొందించారు. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే.. టెండర్ల దశలోనే రూ.120 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. బినామీతో కలిసి యథేచ్ఛగా దోపీడీ.. ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అప్పటి కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి ఆ రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌వేసి 2015, ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు రూపొందించారు. దాంతో టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక (ఎక్సెస్) ధరకు కోట్‌చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే ఆ టెండర్‌ను రద్దుచేయాలి. కానీ.. చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ టెండర్‌ను ఆమోదించి రూ.430.26 కోట్ల పనులను ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఆర్కే ఇన్ఫ్రాకు రూ.43 కోట్లు ఇచ్చేలా చక్రం తిప్పిన చంద్రబాబు.. వాటిని ఎవరి జేబులో వేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈ పనులను శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై చంద్రబాబు బినామీ సీఎం రమేష్ అలకబూనారు. దీంతో50 శాతం పనులను సీఎం రమే‹Ùకు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్‌కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. కానీ.. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని వెళ్లగొట్టి మొత్తం పనులను సీఎం రమే‹Ùకు చంద్రబాబు కట్టబెట్టారు. కానీ, రమేష్ మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీగా లబ్ధిపొందారు. దోచేసిన సొమ్ములో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు పంపారని అప్పట్లో టీడీపీ వర్గాలే కోడై కూశాయి. చెప్పారంటే చేస్తాడంతే.. వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిపారు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో.. 2022, సెపె్టంబరు 23న కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్ 18న ప్రారంభించారు. పాలార్ రిజర్వాయర్‌కు శ్రీకారం.. కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రూ.214.81 కోట్లతో పాలార్ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. ఇందులో రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే, డీపీఆర్ తయారీకి రూ.0.432 కోట్లు.. ముంపునకు గురయ్యే 90 ఎకరాల భూసేకరణకు, 258 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచడానికి, 357.06 ఎకరాల అటవీ భూమికి పరిహారం చెల్లించడానికి రూ.47.878 కోట్లు కేటాయించారు. దీంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీఓ–100ను ఆదివారం రాత్రి జారీచేశారు. వాస్తవానికి.. పాలార్ రిజర్వాయర్‌కూ చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇది పూర్తయితే కుప్పంలో తనకు రాజకీయంగా ఉనికిలేకుండా పోతుందని ఆందోళనతో ఆయన తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులూ వేయించారు. కుప్పం నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం : పెద్దిరెడ్డి శాంతిపురం (చిత్తూరు జిల్లా) : కుప్పం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కుప్పం కాలువ పనులను పూర్తిచేసి, సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. వీటితో కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం ఉద్దేశమన్నారు. ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్సీ భరత్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలతో కలిసి మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూ.30 కోట్లు అధికంగా చెల్లింపు.. ఇక ఈ పనుల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019, ఏప్రిల్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే.. కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. పనుల్లో నాసిరకమైన పైపులు వేయడంవల్ల వర్షపు నీటికి ఆ పైపులు పగిలిపోయాయి. -
కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు ‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది. కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం ‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్‌లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్‌సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు ‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది. దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. ‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే. గవర్నమెంట్‌ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది ‘మంత్రి ఉత్తమ్‌కుమార్ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది. ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోతదా?’ అని కేసీఆర్ నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. ‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. అవి గట్టిగా ఉంటాయ్. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి. చలో నల్లగొండ పెడితే కేసీఆర్‌ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్‌ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్‌కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? ‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా? మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి. అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట ‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్‌ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం!
కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. దానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 203 తెచ్చినా కేసీఆర్ సర్కార్ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ సైతం.. 2016 సెపె్టంబర్ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా కేసీఆర్ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు. -
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ విజయం
-
సుజల సీమ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్ (పెలుసుమట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్లో కాలువ (లూప్)తో సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలుగైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. రెండో సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొరంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామికొండసాగర్(1.6టీఎంసీలు), సర్వారాయసాగర్ (3.06 టీఎంసీలు)లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ► దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరిని అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. హక్కుల పరిరక్షణ ► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చేపట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజామద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు. -
Fact Check: ‘కట్టలు’ తెగిన అక్కసు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని ఈనాడు రామోజీరావు సహించలేకపోతున్నారు. ప్రజలు అభివృద్ధి చెందితే చంద్రబాబు మొహం కూడా చూడరన్నది ఆయన భయం. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై ఆయన అక్కసు కట్టలు తెంచుకుంది. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు నీరందించి పచ్చటి పైర్లతో కళకళలాడేలా చేస్తుంటే అసత్య కథనాలతో ప్రజలను.. ముఖ్యంగా రైతులను మభ్య పెట్టేలా అసత్య కథనాలు అచ్చేస్తున్నారు. గత 55 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్సార్బీసీల ద్వారా మళ్లిస్తూ దుర్భిక్ష రాయలసీమను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సస్యశ్యామలం చేస్తున్నారు. దీంతో రాయలసీమ రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు. ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పిదాలు, మోసాలు, దోపిడీని కప్పిపుచ్చుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ పచ్చి అబద్ధాలతో ‘ఈనాడు’లో టన్నులకొద్దీ కథనాలను అచ్చేసి, వికృతానందం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఎన్నాళ్లీ.. ఆయకట్టుకథలు’ శీర్షికన మంగళవారం ఓ కట్టుకథ వండి వార్చారు. ఆ కథనంలో ప్రతి అక్షరంలో సీఎం వైఎస్ జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. కళ్లుండీ చూడలేకపోతే ఎలా? ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని దక్కించుకున్న బాబు.. ఓట్ల కోసం 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద, 1999 ఎన్నికలకు ముందు గండికోట వద్ద మరోసారి గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. కానీ.. ఆ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టికూడా ఎత్తలేదు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1,55,00 ఎకరాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 5 లక్షల మందికి తాగు నీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో చాలావరకు పనులు పూర్తి చేశారు. ► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని ఇష్టానుసారం భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నాలుగైదు టీఎంసీలు తరలించి, ఆయనే పూర్తి చేసినట్లు బీరాలు పలికారు. ► వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2020–21 నుంచి ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేస్తూ.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అవుకు వద్ద రెండో సొరంగాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసి, ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలిస్తున్నారు. సర్వారాయ సాగర్, పైడిపాలెం, వామికొండ సాగర్‌లలో మిగిలిన పనులు, 35 వేల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.130 కోట్లతో చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద వచ్చిన రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవేవీ రామోజీకి కన్పించలేదు. హంద్రీ–నీవాతో సీమ సస్యశ్యామలం ► గాలేరు– నగరి ప్రాజెక్టు మాదిరిగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉరవకొండ వద్ద ఓసారి, 1999 ఎన్నికలకు ముందు ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఆ తొమ్మిదేళ్లలో ఒక్క అడుగు పని కూడా చేయకుండా రైతులను మోసం చేశారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఆయన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్ హౌస్ నిర్మించిన వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా హంద్రీ–నీవాకు నీటిని తరలించేలా 2007 ఆగస్టు 31న ముచ్చుమర్రి ఎత్తిపోతల చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. ► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపైనా 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22 (ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. చివరకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేలా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేదు. ► వైఎస్ జగన్ సీఎం అయ్యాక శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. ► హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ► హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించేలా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ► 2019–20లో 41.93 టీఎంసీలు, 2020–21లో 40.98, 2021–22లో 41.23, 2022–23లో 33.85 టీఎంసీలు (కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురవడంతో నీటిని తరలించాల్సిన అవసరం లేకుండా పోయింది), వర్షాభావ పరిస్థితుల్లోనూ 2023–24లో 15 టీఎంసీలు తరలించడం ద్వారా సాగు, తాగునీరు అందించారు. ► సీమను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకూ రెండేసి మార్లు శంకుస్థాపన చేసి, చేతులు దులుపుకొన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టాక, అప్పటివరకు పనులు చేసిన కాంట్రాక్టర్లను అక్రమంగా తొలగించి, వ్యయాన్ని భారీగా పెంచేసి, నచ్చిన కాంట్రాక్టర్లతో పనులు చేయించి, కమీషన్లు దండుకొన్న విషయం రామోజీకి తెలియంది కాదు. అయినా చంద్రబాబు అక్రమాలపై ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడు సీఎం జగన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, సీమ రైతులకు సాగునీటిని, ప్రజలకు తాగునీటిని అందిస్తుంటే మాత్రం కడుపు మంట రాతలు రాస్తున్నారు. -
‘కృష్ణా’ పంపకాల బాధ్యత.. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టం–1956లోని సెక్షన్ 5 (1) కింద ఇప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే.. వివాదాల పరిష్కార బాధ్యతలను కూడా కట్టబెడుతున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుసరించాల్సిన విధివిధానాలను (టెరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్/టీఓఆర్) ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిశీలించింది. దీనిపై న్యాయశాఖ సలహా మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, వినియోగం, నియంత్రణపై ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాలు.. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని, ఇరు రాష్ట్రాల ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపింది. ఈ నిర్ణయం పటిష్ట భారతదేశ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. కృష్ణా జల వివాదాలు, పరిణామాలు ఇలా.. ♦ 1969 ఏప్రిల్ 10న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఏర్పాటైంది. ♦ 1976 మే 27న: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తుది నివేదిక (ఫైనల్ అవార్డు) ఇచ్చింది. ♦1976 మే 31: బచావత్ అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 25 ఏళ్ల వరకూ అవార్డును పునః సమీక్షించాలంటూ కోరవద్దని షరతు పెట్టింది. ♦ 2004 ఏప్రిల్ 2: బచావత్ అవార్డు కాల పరిధి ముగియడంతో కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలని మూడు రాష్ట్రాలు కోరడంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–2ను ఏర్పాటు చేసిన కేంద్రం ♦ 2010 డిసెంబర్ 30: మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ♦ 2013 నవంబర్ 29: మూడు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ సెక్షన్–5(3) కింద బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. (ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో దాన్ని కేంద్రం అమల్లోకి తేలేదు) ♦ 2014 మార్చి 1: ఉమ్మడి ఏపీని విభజిస్తూ చట్టాన్ని ఆమోదించిన కేంద్రం. ఆ చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయం. ♦ 2014 మే 15: బ్రిజేశ్ ట్రిబ్యుల్ తుది నివేదికలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను.. తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు అప్పగించిన కేంద్రం. ♦ 2016 అక్టోబర్ 19: మొత్తం కృష్ణా పరీవాహక ప్రాంతం పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనిపై వాదనలు విన్న ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకే పరిమితం అవుతామంటూ ఉత్తర్వులిచ్చింది. ♦ 2020 అక్టోబర్ 6: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. దీనితో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని ఉపసంహరించుకుని ప్రతిపాదన పంపాలని.. న్యాయ సలహా తీసుకుని, తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ♦ 2021, అక్టోబర్ 6: కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. ♦ 2023, అక్టోబర్ 4: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. -
విచారించే పరిధి మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జీవో 246ను సవాలు చేస్తూ ఏపీ వేసిన కేసు (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్)ను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 కొట్టేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట జల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్–2 తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ జీవో అమలును నిలిపివేసి తమ రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఏపీ వేసిన కేసును విచారించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టానికి లోబడి ఉపశమనం కోసం మరో వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఏపీకి కల్పించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ తలపాత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డితో కూడిన కృష్ణా ట్రిబ్యునల్–2 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టారని తెలంగాణ చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 8న ఏపీ ఈ కేసును దాఖలు చేయగా, రెండు రాష్ట్రాలు దాదాపు 4 నెలల పాటు ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ జీవోతో ఏపీ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ చేసిన వాదనలతో తెలంగాణ విభేదించింది. పాలమూరు కొత్త ప్రాజెక్టే.. వేటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి అన్న అంశంపై రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా పాలమూరుపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక–ఆర్థిక సాధికారతపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మదింపు జరగని ప్రాజెక్టులు, టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ఇంటేక్ పాయింట్, ప్రాజెక్టు ప్రాంతం, కాల్వలు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆయకట్టు ప్రాంతం, నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నా కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 టీఎంసీల వరద జలాలను జూరాల ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రతిపాదనలను సమూలంగా మార్చివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 70 శాతం లభ్యత ఆధారంగా 90 టీఎంసీల నికర జలాలను తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్టు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో కేటాయింపులు జరపని ప్రాజెక్టులు మా పరిధిలోకి రావు.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 అమలు బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్–2 చేపట్టిన నేపథ్యంలో.. తెలంగాణ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్–1, కృష్ణా ట్రిబ్యునల్–2 లు గంపగుత్తగా కేటాయింపులు జరిపిన ప్రాజెక్టులకు మళ్లీ నిర్దిష్ట కేటాయింపులు జరిపే అధికారాన్ని మాత్రమే రాష్ట్ర పునర్వీభజన చట్టంలోని సెక్షన్ 89 కింద తమకు కేటాయించారని తెలిపింది. గతంలో ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు జరపని ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది. పునఃకేటాయింపులూ మా పరిధిలోనిది కాదు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరిపే అంశం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపడమే తమ బాధ్యత అని పునరుద్ఘాటించింది. కాగా సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని, ఏపీకి మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని తెలంగాణ వాదించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 11 ప్రకారం జల వివాదాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉన్న న్యాయ అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు ఉంటాయని 1993లో కావేరి ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ గుర్తు చేసింది. ఈ మేరకు అధికారాలను వినియోగించి మధ్యంతర ఉపశమనం కల్పించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. అయితే తమకు అప్పగించిన బాధ్యతలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్వీభజన చట్టం 2014 వచ్చిన తర్వాత చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులు సెక్షన్ 89 కింద తమ పరిధిలోకి రావని కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చి చెప్పింది. ఇలావుండగా గతంలో గంపగుత్తగా కేటాయింపులు పొందిన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు సెక్షన్ 89 కింద నిర్దిష్ట కేటాయింపులు జరిపే అంశం ఇంకా ట్రిబ్యునల్‌లో విచారణ దశలోనే ఉంది. నిర్ణయం వచ్చే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
కరువు నేలకు.. ‘కృష్ణా’భిషేకం
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఏ.రామగోపాలరెడ్డి: రాష్ట్రంలో అత్యంత కరువు పరిస్థితులకు, వలసలకు మరుపేరైన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాలు కృష్ణమ్మ స్పర్శతో పరవశించిపోతున్నాయి. ఇన్నాళ్లూ కరువుతో తల్లడిల్లిన నేలతల్లిని ఇప్పుడు కృష్ణా జలాలు అభిషేకిస్తుండటంతో పులకరించిపోతోంది. ట్రయల్ రన్ (ప్రయోగాత్మకంగా నడిపించడం) ద్వారా కృష్ణా జలాలను నింపిన చెరువుల కింద రైతులు పంటలు సాగు చేయడంతో నిన్నటి దాకా నోళ్లు తెరిచిన బీడు భూములు ఇప్పుడు కోనసీమను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతాల ప్రజల దశ మార్చే మహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఆ ప్రాంతంలో 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకం ఫలాలను సీఎం వైఎస్ జగన్ రైతులకు అందిస్తుండటం కర్నూలు, నంద్యాల జిల్లాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఈ మహత్తర ఆశయంతో రూ.224.31 కోట్ల వ్యయంతో చేపట్టిన 77 చెరువులను నింపే పథకాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఈ పథకం వల్ల డోన్, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో నేరుగా 10,394 ఎకరాలకు నీళ్లందించనున్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది. దాంతో బోరు బావుల్లోనూ నీటి లభ్యత పెరుగుతుంది. దీని వల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి ఇబ్బందులు తీరతాయి. దుర్భిక్షానికి, వలసలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో జీవనోపాధులు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో వలసలకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. మరో హామీ అమలు డోన్, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసిన బోడి కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. కొండలు, గుట్టల మీద కురిసిన వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించడం వల్ల భూమిలోకి ఇంకని పరిస్థితి. ఫీడర్ ఛానల్స్ (వంకలు, వాగులు) సక్రమంగా లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో చెరువులు నిండని దుస్థితి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీళ్లకూ కరువే. దాంతో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం బిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను ఇంట్లో వదిలి.. భార్యాభర్తలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆ ప్రాంతంలో నిత్యకృత్యం. పాదయాత్రలో ఆ ప్రాంతాల ప్రజల కష్టాలు కళ్లార చూసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే కృష్ణా జలాలతో చెరువులను నింపి, సుభిక్షం చేయటం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో అప్పటి టీడీపీ సర్కార్ ఎన్నికలకు ముందు హడావుడిగా చెరువులను నింపే పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జీవో ఇచ్చి కొబ్బరి కాయ కొట్టి చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.224.31 కోట్లు వ్యయం చేసి.. 77 చెరువులను నింపే పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. రూపు మారుతున్న కరువు ప్రాంతం హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసి 77 చెరువులను నింపే పథకం ట్రయల్ రన్‌ను 15 రోజుల క్రితం చేపట్టారు. ఇలా డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 35 చెరువులను ఇప్పటికే నింపారు. ఈ చెరువుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేసుకుంటున్నారు. డోన్ మండలం వెంకటాపురం చెరువు కింద రెండెకరాల్లో చాలా ఏళ్ల తర్వాత వరి పంట సాగు చేశానని మద్దిలేటి అనే రైతు ‘సాక్షి’కి చెప్పారు. క్రిష్ణగిరి మండలం కటారుకొండ చెరువు కింద దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకటిన్నర ఎకరాలో మొక్క జొన్న పంట సాగు చేశానని జయరాముడు అనే రైతు సంతోషం వ్యక్తం చేశాడు. వర్షం పడకపోవడం వల్ల కొండల్లో మేత దొరకక.. చెరువుల్లో నీళ్లు లేక గొర్రెలు, మేకలను కర్ణాటకకు తోలుకెళ్లేవాళ్లమని.. ఇప్పుడు చెరువులు నింపుతుండటంతో పుష్కలంగా నీళ్లు దొరుకుతున్నాయని.. మేత కూడా దొరుకుతుండటం వల్ల ఎక్కడికీ వెళ్లాల్సిన పరిస్థితి లేదని కురుబ ఓబన్న అనే గొర్రల కాపరి ఆనందం వ్యక్తం చేశాడు. పంటలు సాగు చేస్తుండటంతో రైతులకు చేతి నిండా పనితో ఆదాయం వస్తోంది. దాంతో ఎక్కడికైనా వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పథకం స్వరూపం ► కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ 90 కి.మీ సమీపంలో (ఆలంకొండ) రోజుకు 159 క్యూసెక్కులను ఎత్తిపోసేలా పంప్‌హౌస్ నిర్మించారు. ఇందులో 3,800 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన మూడు పంప్‌లు, మోటార్లను అమర్చారు. ఒక్కో పంప్, మోటార్ ద్వారా 53 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చు. ► హంద్రీ–నీవా ప్రధాన కాలువ 90 కి.మీ వద్ద సముద్ర మట్టానికి 429 మీటర్ల ఎత్తున ఉంటుంది. అక్కడి పంప్‌హౌస్, 5.625 కి.మీల పొడవున నిర్మించిన ప్రెజర్ మెయిన్ ద్వారా సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తున ఉన్న కటారుకొండ వద్ద నిర్మించిన డెలివరీ చాంబర్లోకి 159 క్యూసెక్కులను ఎత్తిపోస్తారు. ► కటారుకొండ వద్ద నిర్మించిన డెలివరీ చాంబర్ నుంచి 43.40 కి.మీల పొడవున వేసిన గ్రావిటీ మెయిన్–1(పైపు లైన్ ద్వారా గురుత్వాకర్షణపై) ద్వారా 22 చెరువులను నింపి.. నేరుగా 4,217 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 29.40 కి.మీ పొడవున నిర్మించిన గ్రావిటీ మెయిన్–2 ద్వారా 16 చెరువులను నింపి.. నేరుగా 3,018 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 47.90 కి.మీ పొడవున నిర్మించిన గ్రావిటీ మెయిన్–3 ద్వారా 30 చెరువులు నింపి.. 2,895 ఎకరాలకు నేరుగా నీళ్లందిస్తారు. పైపుల ద్వారా నీటిని తరలిస్తుండటం వల్ల ప్రవాహ నష్టాలు లేనే లేవు. ఆవిరి నష్టాలు కూడా స్వల్పమే. ► డోన్, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లోని 77 చెరువులను నింపడం ద్వారా నేరుగా 10,394 ఎకరాలకు సాగు నీరు, 57 గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తారు. ► ఈ పథకం కింద తొలుత ప్రతిపాదించిన 68 చెరువులతోపాటు అదనంగా 9 చెరువులు (డోన్ నియోజకవర్గంలో 8, పత్తికొండ నియోజకవర్గంలో 1) కలిపి ప్రస్తుతం 77 చెరువులను నింపుతున్నారు. ఈ పథకం కింద చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులూ చేపట్టారు. చకచకా పూర్తవుతున్న ప్రాజెక్టులు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.31 లక్షల కోట్లను జమ చేసిన సీఎం వైఎస్ జగన్.. సాగునీటి ప్రాజెక్టులనూ అంతే ప్రాధాన్యతతో పూర్తి చేస్తూ జలయజ్ఞ ఫలాలను రైతులకు అందిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన సీఎం వైఎస్ జగన్.. గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేసి.. నెల్లూరు డెల్టాను సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు వరదాయిని వంటి 77 చెరువులను నింపే పథకాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ దాదాపుగా పూర్తికావొచ్చాయి. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్ రచించిన ప్రణాళికను అమలు చేస్తున్న అధికారులు పనులను చకచకా చేస్తున్నారు. సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు తీవ్రమైన దుర్భిక్షానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలు పెట్టింది పేరు. ఇక్కడ వలసలు నిత్యకృత్యం. కృష్ణా జలాలతో ఈ ప్రాంతాన్ని అభిషేకించి, సుభిక్షం చేయడం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చెప్పిన 68 చెరువుల కంటే 9 అదనంగా 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణక్షాలతో లిఖిందగ్గది. ఈ పథకంతో కరవు ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. - బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అమలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అతి తక్కువ ఖర్చుతో తీవ్ర కరవు ప్రాంతంలో 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేశాం. చెరువుల కింద ఆయకట్టులో సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల (డ్రిప్, స్పింక్లర్లు)లో పంటలు సాగుచేస్తే నీటి వృథాకు అడ్డుకట్ట వేయొచ్చు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలతో సమన్వయం చేసుకుని ఆ దిశగా రైతులను చైతన్య పరుస్తాం. - శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ యాజమాన్య పద్ధతులకు పెద్దపీట 77 చెరువులను నింపే పథకం ఇంజనీరింగ్‌లో ఓ అద్భుతం. కొండ, గుట్టలతో నిండిన ప్రాంతంలో చెరువులను నింపడం శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. కానీ.. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి 116 మీటర్ల ఎత్తున ఉన్న కటారుకొండపైకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ మెయిన్ల ద్వారా 68కి బదులుగా 77 చెరువులు నింపుతున్నాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అతి తక్కువ ఖర్చుతో ఈ పథకం పూర్తి చేశాం. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గ్రావిటీ మెయిన్లతో చేపట్టిన మొదటి పథకం ఇది. యాజమాన్య పద్ధతుల్లో ఇది ప్రధానమైనది. దీని వల్ల ప్రవాహ నష్టాలు ఉండవు. - సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జల వనరుల శాఖ ఆరుతడి పంటలే లాభం సీఎం వైఎస్ జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన ఆదేశాల మేరకు.. అతి తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేశాం. ఒక క్యూసెక్ నీటితో 50 ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 120 నుంచి 150 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయొచ్చు. చెరువుల కింద ఆరుతడి పంటలు, ఉద్యాన వన పంటలు సాగుచేస్తే అధిక ఆయకట్టులో పంటలు సాగు చేసుకోవచ్చు. ఆ దిశగా రైతులను చైతన్యవంతం చేసి.. ఈ పథకం ఫలాలను పూర్తి స్థాయిలో అందేలా చేస్తాం. - రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎస్ఈ, కర్నూలు జిల్లా సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు తీవ్రమైన దుర్భిక్షానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలు పెట్టింది పేరు. ఇక్కడ వలసలు నిత్యకృత్యం. కృష్ణా జలాలతో ఈ ప్రాంతాన్ని అభిషేకించి, సుభిక్షం చేయడం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చెప్పిన 68 చెరువుల కంటే 9 అదనంగా 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ పథకంతో కరవు ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. - బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి -
ఆగమైతే గోసపడతాం!
‘స్కూల్’ ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువు రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువుకునే పరిస్థితి ఉంది. తమిళనాడులో స్కూల్ విద్యార్థులకు టిఫిన్ ఇస్తుండటం బాగుందంట. రాష్ట్ర బృందాన్ని అక్కడికి పంపాం. తెలంగాణలో టెన్త్ వరకు విద్యార్థులందరికీ ఉదయం టిఫిన్, కోడిగుడ్డు అందిస్తాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారని.. అలా వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే గోసపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వారి చేతిలో ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాములా మింగేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే ప్రాణగండంలా మారారని మండిపడ్డారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో కృష్ణా తీరంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే వలస కూలీలుగా పేరుపడితే.. నేడు బెంగాల్, యూపీ రాష్ట్రాలతోపాటు పక్కనున్న రాయచూర్, కర్నూల్ జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని పొలాల్లో పని చేయించుకుంటున్న రైతు బిడ్డగా మారాడు. పాలమూరు–రంగారెడ్డిలో ఒక్క పంపును నడిపితేనే వాగు పారేంత నీళ్లు తరలుతున్నాయి. త్వరలో మొత్తం పంపులు, కాలువలన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రాంతాలకూ నీళ్లు అందుతాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 లక్షల ఎకరాల్లో నీటి పారకాన్ని నా కళ్లతో చూసేదాకా ప్రజల దీవెనలు ఉండాలి. ఇప్పుడు ఇంటి దొంగలతోనే గండం ఉద్యమ సమయంలో జోగుళాంబ ఆలయం నుంచే మొదటి పాదయాత్రను ప్రారంభించా. పాలమూరును దత్తత తీసుకున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు, ఆయన తాబేదార్లు మాట్లాడారు. ఆర్డీఎస్ను మూసేయకపోతే బద్దలు కొడతామన్నారు. అదే నేను సుంకేశుల ప్రాజెక్టును వంద బాంబులు పెట్టి పేల్చుతానని చెప్పిన. మాకు కూడా బాంబులేసే మొనగాడు పుట్టిండని పాలమూరు ప్రజలు అప్పుడు సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే, ఈ జిల్లాలో పుట్టిన సన్నాసులే ప్రాణగండంలా మారారు. ప్రాజెక్టు పనులకు అడ్డం పడ్డారు. లేకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్ల కిందే పూర్తయ్యేది. ఆగమైతే గోస పడతాం.. ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారు. నాడు రాష్ట్రం నుంచి బొంబాయి, దుబాయి వలసపోతే ఒక్కడూ సాయం చేయలే. కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకుని బాగుచేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే.. గోసపడతాం. ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాము లెక్క మింగేస్తారు. నేను హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుంటే బీజేపీ వాళ్లు జెండాలు పట్టుకుని అడ్డం పడుతున్నారు. ఏం పాపం చేశాం, ఎవరిని మోసం చేశామని అడ్డుపడుతున్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి వాటా కేటాయింపునకు పదేళ్లు పడుతుందా? సిగ్గు, చీము, నెత్తురు, పౌరుషం ఉంటే జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులం అని చెప్పుకునేవారు ఢిల్లీలో కూర్చుని లేఖలు రాయాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రాకు చెప్పేది ఒక్కటే. మాకు ఎవరి నీళ్లూ అవసరం లేదు. మా వాటా మాకు చెబితే బాజాప్తాగా నీళ్లు తీసుకుంటాం. మేం మంది సొమ్ము అడుగుతలేం. మూడూ పూర్తయితే.. తెలంగాణ వజ్రపు తునకే! తెలంగాణలో అంచనాలు వేసుకొని, హక్కులు చూసుకొని, రావాల్సిన వాటాలు చూసుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం. గోదావరి మీద కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఒక వజ్రపు తునకలా తయారై దేశానికే అన్నం పెట్టే స్థాయికి పోతుంది. మన రైతులు తలఎత్తుకొని బతుకుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ట్రిబ్యునలే పట్టించుకుని ప్రాజెక్టు ఇచ్చింది మహబూబ్‌నగర్ చరిత్ర చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీరి్పచ్చినప్పుడు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా మా మహబూబ్‌నగర్‌కు నీళ్లేవని అడగలే. చివరికి ట్రిబ్యునల్ జడ్జి బచావత్ అనే ఆయనే.. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలవకుండా ఉండుంటే చాలా బాగుపడి ఉండేదన్నారు. కనీసం ఈ ప్రాంతానికి నీళ్లడగటం లేదని, తమకు చూడబుద్ధి కావడం లేదని చెప్పి.. తామే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు జూరాల ప్రాజెక్టును ఏదో కారణం చెప్పి మరోచోటికి తరలించకుండా తాము సూచించిన చోటే కట్టాలన్నారు. ట్రిబ్యునల్ రికార్డుల్లో ఈ రోజుకూ ఈ విషయాలు ఉన్నాయి. అంత జరిగినా 1981 దాకా జూరాల ప్రాజెక్టును మొదలుపెట్టలే.. శంకుస్థాపన చేసినా పనులు చేయలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టి నిలదీశాకే పూర్తిచేసి, నీళ్లు నిల్వ చేశారు. కేసీఆర్ పుణ్యంతో పాలమూరు పచ్చబడింది: నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్ పుణ్యమా అని పాలమూరు గడ్డ పచ్చబడిందని, వలస వెళ్లినవారంతా తిరిగి వస్తున్నారని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ కోసం 45వేల మంది 12 ఏళ్లపాటు పనిచేశారని.. సుమారు పదివేల మంది పాలమూరు బిడ్డలు ప్రమాదాల్లో మరణించినా ఈ గడ్డకు మాత్రం ఫలితం దక్కలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమని అభివర్ణించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, ఇప్పుడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాగా.. వలసల ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు జిల్లాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి అన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల సర్జిపూల్ ఆసియా ఖండంలోనే పెద్దదని, ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. పండుగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలసి ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకున్నారు. తొలుత పంపుహౌస్ వద్ద ఏర్పాటుచేసిన పాలమూరు ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత కేసీఆర్ 145 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి మోటారును ఆన్ చేసి, నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. సర్జ్‌పూల్, పంపుహౌస్‌లను పరిశీలించారు. నార్లాపూర్ పంపుహౌజ్ వద్ద డెలివరీ సిస్టర్న్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌కు తరలుతున్న నీటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలకు పూలు, సారె సమర్పించి, జలహారతి పట్టారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు..16న జాతికి అంకితం
ప్రపంచంలోనే భారీ పంపులతో.. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ పంపులతో నిర్మించిన ‘పాలమూరు’ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చరిత్రాత్మకం. దశాబ్దాల కల సాకారమవుతున్న ఈ సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు. ప్రాజెక్టును ప్రారంభించిన మరునాడు (సెపె్టంబర్ 17 న) ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పల్లెపల్లెనా ఊరేగింపులతో సంబురంగా జరుపుకోవాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 16న మధ్యాహ్నం ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తొలుత బటన్ నొక్కి నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్దనున్న బాహుబలి పంపులను కేసీఆర్ ఆన్ చేస్తారు. పంపుల నుంచి కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుతాయి. సీఎం కేసీఆర్ వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుధవా రం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీలో సీఎం చెప్పి న అంశాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో తాగు, సాగునీటికి నోచుకోక ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలను అనుభవించాయి. పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి పాలకులది. ఎటుచూసినా వలసలే కనిపించేవి. జిల్లా ప్రజల బాధలను చూసిన గోరటి వెంకన్న వంటి పాలమూరు కవులు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే.. పాలమూరులోనా’ అంటూ పాటలు కూడా రాశారు. బంగారు తెలంగాణ సంపూర్ణమవుతుంది పాలమూరులో నాటి పాలకులు మొదలుపెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశాం. పాలమూరు జిల్లా పచ్చబడింది. వలసలు ఆగిపోయాయి. ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్ప అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయ రంగాభివృద్ధిని సాధిస్తుంది. రైతుల లోగిళ్లు బంగారు పంటలతో తులతూగుతాయి. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రాజెక్టుపై స్వయానా పాలమూరు జిల్లా నేతలే వందల కేసులు పెట్టడం దురదృష్టకరం. వారు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ దిశగా కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డిల కృషిని అభినందిస్తున్నాం. కృష్ణా జలాలతో మొక్కులు తీర్చుకోవాలి మనందరి కృషికి దైవ కృప తోడు కావడంతోనే ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చాయి. ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో నాణేలు వేసి నీటి కోసం మొక్కాం. కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుళ్ల పాదాలు కడుగుతామన్నాం. మనందరం ఆ మొక్కులను తీర్చుకోవాల్సి ఉంది. రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తమతో తెచ్చుకున్న కలశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి దేవుళ్ల పాదాలకు అభిõÙకం చేయాలి. కొబ్బరికాయలు కొట్టి, పూలుచల్లాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారీగా బహిరంగ సభ ‘పాలమూరు’ ప్రాజెక్టును ప్రారంభించుకునే చరిత్రాత్మక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బహిరంగసభ నిర్వహణ, ప్రజలకు రవాణా, భోజన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఒక్కోటీ 12 కిలోల బోల్టులు ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వాటికి బిగించే ఒక్కో బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నామని.. ఇంకా ఎన్నో నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని వివరించారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ‘పాలమూరు’ పనులను పూర్తి చేయాలని, కాల్వల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అవలంబించాలని సూచించారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో కాల్వల పనులను మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కలసి పర్యవేక్షించాలని కోరారు. తర్వాత ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుతో, తాగునీటి తరలింపు చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డితోనూ సీఎం సమీక్షించారు. -
10న కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. 2022–23 వాటర్ ఇయర్లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా.. చివరలో బోర్డు చైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశంలో గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ప్రధాన అంశం కానుంది. జల విద్యుత్... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అవసరం లేకున్నా తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫారసుల అమలుపై కూడా చర్చించనున్నారు. జలవిద్యుత్ ఉత్పాదన, రూల్‌కర్వ్ మిగులు జలాల నిర్ధారణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌తోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది. ► నాగార్జునసాగర్‌లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధారలో పెరిగిన వరద ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్‌లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
మరో 233.68 టీఎంసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 233.68 టీఎంసీలు అవసరం. గతంలో ఎన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే కృష్ణా ప్రధాన పాయపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌తోపాటు ప్రధాన ఉపనది తుంగభద్రపై ఎగువన ఉన్న తుంగ, భద్ర, తుంగభద్ర జలాశయాలు నిండాయి. ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సాధారణంగా కృష్ణా నదికి ఆగస్టులో భారీ వరదలు వస్తాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండటం, ఆగస్టులో కురవనున్న వర్షాలతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, తుంగభద్రలపై ఎగువన ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేశారు. గతేడాది కంటే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 13న శ్రీశైలానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. ప్రధాన పాయపై.. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గతేడాది కంటే ఐదు రోజుల ముందే ఈనెల 23న శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తర్వాత వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ఎడమ, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. నాగార్జునసాగర్‌లో 204 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 108 టీఎంసీలు అవసరం. మూసీ వరద ఉద్ధృతితో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయిలో 40 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండటానికి మరో ఐదు టీఎంసీలు అవసరం. విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల ద్వారా శ్రీశైలంలో ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు మరో 24 టీఎంసీలు అవసరం. శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే.. ► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ► తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ఇప్పటికే ప్రాజెక్టులో 8.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే 8.53 టీఎంసీలు అవసరం. బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగానూ 12.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 5.69 టీఎంసీలు కావాలి. సోమశిలలో 78 టీఎంసీలకుగానూ 56.46 టీఎంసీలు, కండలేరులో 68.03కిగానూ 28.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే 60.99 టీఎంసీలు అవసరం. మొత్తమ్మీద తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన జలాశయాలు నిండాలంటే ఇంకా 75.21 టీఎంసీలు కావాలి. ► ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్‌లో 12.44కిగానూ 3.7, అవుకు రిజర్వాయర్‌లో 4.15కిగానూ 2.18 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 10.71 టీఎంసీలు అవసరం. ► గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోటలో 26.85కిగానూ 22.04, సర్వారాయసాగర్‌లో 3.06కిగానూ 0.54, పైడిపాలెంలో 6కిగానూ 4.69, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10కిగానూ 7.88 వెరసి ఈ ప్రాజెక్టులన్నీ నిండటానికి 10.76 టీఎంసీలు అవసరం. ► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ఈ జలాశయాలన్నీ నిండాలంటే ఇంకా 96.68 టీఎంసీలు అవసరం. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 40 టీఎంసీలను తరలించాల్సి ఉంటుంది. కృష్ణాలో వరద ప్రవాహం అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలు ఉండటంతో నీటి లభ్యత ఆ మేరకు పెరగనుంది. ఖరీఫ్ పంటలకు ముందుగానే నీరు ఏటా అక్టోబర్ చివరిలో, నవంబర్‌లో వచ్చే తుపాన్ల బారి నుంచి ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ఈ ఏడాది ప్రభుత్వం ముందుగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది. తుపాన్లు వచ్చేలోగా పంట నూర్పిళ్లు పూర్తై దిగుబడులను భద్రంగా ఇంటికి చేర్చడం ద్వారా అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నీటి లభ్యత ఆధారంగా రబీ, మూడో పంట సాగుకు కూడా అవకాశం కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పాలకుడి సమున్నత లక్ష్యానికి తగ్గట్టుగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం.. నీటి లభ్యత పుష్కలంగా ఉండే అవకాశం ఉండటం.. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగానే నీటిని విడుదల చేయడం పట్ల రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అనంతపురం: నెరవేరిన నాలుగున్నర దశాబ్దాల కల
శింగనమల రంగరాయల చెరువు ఆయకట్టుదారుల కల నాలుగున్నర దశాబ్దాలకు సాకారమైంది. చెరువుకు ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల కలతో పాటు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంకల్పమూ నెరవేరినట్లయ్యింది. ఆరువేల ఎకరాల్లో సాగుకు సానుకూలమైంది. రైతులు, వ్యవసాయ కూలీలే కాదు.. మత్స్యకారుల మోముల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. సాక్షి,శింగనమల(అనంతపురం): శింగనమలలోని రంగరాయల చెరువు జిల్లాలోనే అతిపెద్దది. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం, పెద్దమట్ల గొంది, చీలేపల్లి, శివపురం, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, చక్రాయిపేట, పెరవలి గ్రామాల వరకు అధికారిక, అనధికారికంగా దాదాపు ఆరువేల ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువులో నీరుంటే ఈ గ్రామాలతో పాటు నాయనవారిపల్లి, చిన్నమట్ల గొంది, ఆనందరావుపేట, చిన్నజలాలపురం, గురుగుంట్ల, మదిరేపల్లి, నీలాంపల్లి, పాత చెదుల్ల, కొత్త చెదల్ల, కొర్రపాడు గ్రామాల వరకు భూగర్భజలం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెరువును లోకలైజేషన్ చేయాలన్నది ఈ ప్రాంత రైతుల డిమాండ్. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు లోకలైజేషన్ అంశాన్ని 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశాయి. ఒకానొక దశలో టీడీపీ హయాంలో ‘లోకలైజేషన్’ జీఓ తెచ్చామని ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ప్రజలు వారి మాటలను నమ్మలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాలుగేళ్లపాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో ‘లోకలైజేషన్’ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదు. కనీసం చెరువుకు నీరు విడిపించే దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చొరవ తీసుకుని పలు దఫాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చెరువుకు నీరు విడుదల చేయించారు. నేటికీ నీటితో చెరువు కళకళలాడుతోంది. వైఎస్సార్ హయాంలో ఇచ్చిన హామీని.. తనయుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా నెరవేర్చడంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సఫలీకృతులయ్యారు. ఏటా పంటలు శింగనమల రంగరాయల చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. హంద్రీ–నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి నుంచి మిడ్ పెన్నార్ (ఎంపీఆర్), అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగనమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు ఉపాధి చెరువులో నీరు ఉంటే చేపల వేటకు ఢోకా ఉండదు. 300 మత్స్యకార కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. మత్స్యకారులకు ఎప్పుడూ చేపల వేట ఉంటుంది. తద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది. ఆనందంగా ఉంది శింగనమల చెరువుకు నీటి కేటాయింపు అనేది ఎన్నో ఏళ్లపాటు హామీగానే నిలిచిపోయింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. కానీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా చెరువుకు నీటిని కేటాయించడానికి ఎంతో కృషి చేశారు. చెరువు కింది ఆయకట్టు రైతులు, వ్యవసాయ కూలీలు చాలా సంతోషంగా ఉన్నారు. – గోవిందరెడ్డి, చెరువు ఆయకట్టు రైతు సంఘం నాయకులు, శింగనమల జలప్రదాత పద్మావతి శింగనమల చెరువుకు నీటి కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటారు. చెరువులో నీరు లేక ఎన్నో సంవత్సరాలు చేపల పెంపకం చేపట్టలేకపోయాం. కానీ ఎమ్మెల్యే పద్మావతి చెరువుకు నీటి కేటాయింపులు చేయించి మాకు జలప్రదాతగా మారింది. – వెంకటనారాయణ, మత్స్యకారుడు, శింగనమల మాట ఇచ్చారు.. నెరవేర్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నార్పల బహిరంగసభలో చెరువు లోకలైజేషన్ చేస్తామని మాట ఇచ్చారు. ఆయన మృతి చెందిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత చెరువు సమస్యను వివరించా. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించారు. శింగనమల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. చాలా సంతోషంగా ఉంది. – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల -
Kurnool: జల ప్రళయానికి 12 ఏళ్లు
తుంగభద్ర నది ఉగ్ర రూపం.. కృష్ణానది విలయ తాండవం.. వెరసి జిల్లాకు జల ప్రళయం. కర్నూలు చరిత్రలో ఎన్నడూ చూడని వరద. పుష్కర కాలం గడిచినా ఆ కన్నీటి జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. వాటిని తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది. 2009 సెప్టెంబర్ చివరిలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర తీరంలో ఉన్న మంత్రాలయం మొదలు నదీ పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల పైనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సుంకేసుల ప్రాజెక్ట్ కట్టలు తెంచుకోవడం, కృష్ణానది జలాలు వెనక్కు ముంచెత్తడంతో కర్నూలు నగరం అతలాకుతలమైంది. కొండారెడ్డి బురుజు సగానికి మునిగిపోయింది. అంతటా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఆ రోజు రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లారేసరికి వేల మంది కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోకి బురద చేరి.. వ్యవసాయ భూములు కోతకు గురై.. ఎంతో మంది రోడ్డున బడ్డారు. దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. నాటి వదర బీభత్సానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. – కర్నూలు -
హైదరాబాద్‌కు నీటి కొరత.. పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి తరలించేందుకు అందుబాటులో ఉన్న పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు పొంచి ఉంది. రాజధానికి సుమారు 110 కి.మీ దూరంలో.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా జలాలు, గ్రేటర్‌కు సుమారు 185 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను గ్రేటర్ నగరానికి తరలిస్తున్నారు. ఈ జలాలను తరలించేందుకు మార్గమధ్యలో పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలు సుమారు 20 వరకు ఉన్నాయి. వీటి వద్ద తరచూ సాంకేతిక సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతుండడం గమనార్హం. తాజాగా గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్న మల్లారం పంప్‌హౌస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో 9 పంపులు నీట మునిగాయి. రెండు రోజులపాటు నగర తాగునీటి సరఫరాకు ఇక్కట్లు తప్పలేదు. ఈ నేపథ్యంలో పలు పంపుహౌస్‌లకు ముంపు కష్టాలు వెంటాడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ముందు జాగ్రత్త చర్యలే కీలకం.. ► గ్రేటర్ సిటీకి మంజీరా, సింగూరు జలాలను పరిమితంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో జంట జలాశయాలు, కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం జలమండలి 430 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సేకరించి శుద్ధి చేసి నగరవ్యాప్తంగా సుమారు పది లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. ► ఈ నీటిని సిటీకి తరలించేందుకు జలమండలి భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లున్నాయి. పంప్‌హౌస్‌లలో తరచూ మోటార్లు మొరాయించడం, ప్రత్యేక ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా ఆకస్మికంగా నిలిచిపోతోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. చదవండి: అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు ► తరచూ సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పక్షంలో.. సిటీలో సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫీడర్లు, మోటార్లు, పంప్‌హౌస్‌ల నిర్వహణను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ► తాజాగా మల్లారం పంప్‌హౌస్ నీట మునిగేందుకు సమీపంలో ఉన్న పల్లె చెరువు వరద నీరే కారణమవడంతో పంప్‌హౌస్ చుట్టూ పెద్ద పరిమాణంలో ప్రహరీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇదే తరహాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు జలాశయాలు, ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాల చుట్టూ ఎత్తైన, పటిష్టమైన ప్రహరీలు నిర్మించాల్సి ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు. కొనసాగుతున్న మరమ్మతులు.. గ్రేటక్కు గోదావరి జలాలను తరలించే మల్లారం పంప్ హౌస్ నీట మునగడంతో జలమండలి అధికారులు మరమ్మతులు ముమ్మరం చేశారు. నీట మునిగిన 9 పంపుల్లో బుధవారం నాలుగింటికి మరమ్మతులు చేపట్టి నీటిని పంపింగ్ చేశామని..మరో 5 పంపులకు మరమ్మతులను గురువారం నాటికి పూర్తి చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి జలాల లభ్యత తగ్గిన కారణంగా సింగూరు, మంజీరా, జంట జలాశయాల నుంచి నగర అవసరాలకు అదనంగా తాగునీటిని సేకరిస్తున్నామని.. కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత
సాక్షి,అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు నదులలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌లో ఇన్‌ఫ్లో 5,14,386 ఉండగా, ఔట్‌ఫ్లో లక్షన్నర క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా , ప్రస్తుతం 585 అడుగుల నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో లక్షన్నర క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
రేపు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణానది వరద ప్రవాహానికి.. సుంకేశుల నుంచి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని నిర్వహిస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద జలాలను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రాల నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జున సాగర్‌లోకి 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 573.5 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 264 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 48 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికి సాగర్‌లో నీటి నిల్వ 300 టీఎంసీలకుపైగా చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాగర్ గేట్లను ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాల్లో పులిచింతల ప్రాజెక్టులోకి 38,701 క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్ 38,701 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఇందులో ప్రకాశం బ్యారేజీలోకి 35,346 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 26,712 క్యూసెక్కులను.. 36 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
'కృష్ణా జలాల పునఃపంపిణీ' అసాధ్యం!
(రామగోపాలరెడ్డి ఆలమూరు–సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన కృష్ణా నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ)–1956 సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పునఃపంపణీ చేయడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలకు కానే కాదని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్–4(2), సెక్షన్–6(2) ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పే అంతిమం అని, అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ముట్టుకోక పోవడానికి అదే కారణమని ఎత్తిచూపుతున్నారు. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 వెరసి 448 టీఎంసీలను మాత్రమే అదనంగా మూడు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనపై న్యాయ శాఖ వెల్లడించే అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ అవస్థి శుక్రవారం స్పష్టం చేయడమే అందుకు తార్కాణమని చెబుతున్నారు. పునఃపంపిణీ చేయాలంటున్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాదనలు విన్పించలేదని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయాలని 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ 2015 మే 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని నాటి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి తేల్చి చెబుతూ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 20న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్–5(2) కింద ముసాయిదా, 5(3) కింద కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని.. ప్రతిపాదన పంపితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జూన్ 9న తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని కోరుతూ జూన్ 14న కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ.. న్యాయ శాఖ అభిప్రాయం కోరింది. ఇప్పటికే తేల్చి చెప్పిన కేంద్రం విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కాకుండా.. నాలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాలను పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏపీ, తెలంగాణ సర్కార్లు కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కోరింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికే ట్రిబ్యునల్ గడువును పొడిగించామే తప్ప.. నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాదని స్పష్టం చేస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని 2016 అక్టోబర్ 19న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ మేరకు గత ఐదేళ్లుగా విచారణ చేస్తోంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కష్టమే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను సెక్షన్–3 రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే.. బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న ఇచ్చిన తుది నివేదికను సెక్షన్–6(2) ప్రకారం నోటిఫై చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదు. ఇక రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించే ప్రశ్నే లేదు. కాదూ కూడదని కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మిగతా మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాలకూ 2,578 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2020 డిసెంబర్ 30న సెక్షన్–5(2) కింద ముసాయిదా, 2013 నవంబర్ 29న సెక్షన్–5(3) కింద తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ నివేదికలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా వాటికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటిదాకా కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఆ ట్రిబ్యునల్ గడువును పొడిగించింది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేనాటి కంటే ముందు అంటే 2014 జూన్ 2కు ముందు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తూ తీర్పు ఇస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని విభజన చట్టంలో సెక్షన్–89 స్పష్టం చేసింది. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7)(ఈ)/4 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు అలానే కొనసాగించాలి. ఈ దృష్ట్యా 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని రాసిన లేఖను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ కేంద్రం చేసిన సర్దుబాటు ఒప్పందాన్ని అంగీకరిస్తూ తెలంగాణ సర్కార్ సంతకం చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని విస్మరించి.. సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ పాత పల్లవిని కొత్తగా అందుకుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది బహిరంగ రహస్యమేనని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష చట్టవిరుద్ధం కృష్ణా నదీ జలాలను బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969 ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో 2,060.. పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసింది. వాటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976 మే 31న తుది తీర్పు ఇచ్చింది. ఇందులో 749.16 టీఎంసీలతో 1971 మే 7న కుదిరిన అంతర్రాష్ట ఒప్పందం మేరకు చేపట్టిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించింది. వీటికి అదనంగా 50.84 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84, శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జలాల్లో రాయలసీమకు 144.70, కోస్తాకు 387.34, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించడంతో కోస్తాకు నీటి వాటా 367.34 టీఎంసీలకు తగ్గి.. తెలంగాణ వాటా 298.96 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టానికి 2002 ఆగస్టు 6న కేంద్రం చేసిన సవరణ ప్రకారం.. ఈ సవరణకు ముందు జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఈ సవరణ కంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ముందు వెలువడింది కాబట్టి.. అదే అంతిమమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్–3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం సాధ్యం కానే కాదని స్పష్టం చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మల్లయ్య కొండలో ఉంటున్న పురాతన ఆలయం మల్లికార్జున స్వామి గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. కుప్పంకు కూడా తాగు, సాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే శివరాత్రికి మల్లయ్య కొండ ఆలయ నిర్మాణాలు పూర్తి అవుతాయని అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, నీరు అందింస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం గురించి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒకసారి తంబళ్లపల్లె కొచ్చి చూడాలని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నామని మండిపడ్డారు. రూ.3కోట్లతో ఈ గుడిని ఆధునీకరణ చేయనున్నారు. అలాగే ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు వసతిని కల్పించనున్నారు. మల్లయ్య కొండలో మల్లికార్జున స్వామి గుడికి భూమి పూజ జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాబ్ భాష, శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. నాడు ప్రేక్షకపాత్ర, నేడు విద్వేషాలకు కుట్ర!
► 1996లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి నీటి నిల్వను 66 నుంచి 129 టీఎంసీలకు పెంచేస్తుంటే చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహించారు. నాడు సీఎంగా ఉన్న ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పటి ప్రధాని దేవెగౌడకు, కర్ణాటక సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు. ► తెలంగాణ సర్కార్ 2015లో అక్రమంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ఎనిమిది ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీలను తరలిస్తుంటే నాటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టేశారు. వైఎస్సార్ ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండా అంచనాలు పెంచేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీళ్లందించేందుకు ఇప్పుడు సీఎం జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు పనులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో ఓ లేఖ రాయించారు. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోసేందుకు కుట్రకు దిగారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో దిగువకు వచ్చే వరద రోజులు తగ్గడం, ఒకేసారి గరిష్టంగా పోటెత్తడం, ఒడిసి పట్టేలా కాలువలు లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఈ జలాలతో దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2005లో వైఎస్సార్ చేపట్టారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం రాజకీయ ఉనికి కోసం ఆ పనులకు అడ్డుపడ్డారు. కోస్తాలో ప్రకాశం బ్యారేజీ వద్ద దేవినేని ఉమా, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్ధనరెడ్డితో ధర్నాలు చేయించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్నారు. సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు... ప్రతి జిల్లాకూ మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న భగీరథ యత్నం ఫలిస్తే తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళనతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు మరోసారి కుట్ర పన్నుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి, సాంబశివరావులతో లేఖ రాయించి మరోసారి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారు. దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన వాటిని ఐదేళ్లలో పూర్తిచేయకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడకు తెరతీసినట్లు సాగునీటి నిపుణులు చెబుతున్నారు. వెలిగొండలో ఇప్పటికే మొదటి సొరంగాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం రెండో సొరంగాన్ని కూడా పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే జలాలను సోమశిల నుంచి నార్త్ ఫీడర్ చానల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా దుర్భిక్ష ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపే పనులను రూ.650 కోట్లతో సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. వాటి నుంచి ప్రజల దష్టి మరల్చడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఉనికి చాటుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారనేది నిపుణుల మాట. చిత్తూరు జిల్లాలో 1500 అడుగుల లోతుకు వెళితే గానీ బోర్లుకూడా పడని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా మారిస్తే... వాటిని రిజర్వాయర్లుగా చిత్రీకరిస్తూ, నిలిపివేయాలని ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని వారు గుర్తు చేస్తున్నారు. సొంత జిల్లా ప్రజలకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తాజాగా వెలిగొండ ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నారనేది పరిశీలకుల మాట. వెలిగొండతో ప్రకాశం సస్యశ్యామలం... శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షలు, నెల్లూరు జిల్లాలో 84 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో 27,200 వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 నాటికే అధిక శాతం పనులను కొలిక్కి తెచ్చారు. మొదటి సొరంగంలో 3.8 కి.మీ, రెండో సొరంగంలో 8.037 కి.మీ. పనులు మాత్రమే మిగిలాయి. అయితే, 2015లో వాటిని సత్వరమే పూర్తిచేసే ముసుగులో రూ.66.44 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేసిన చంద్రబాబు కమీషన్ల రూపంలో వాటిని వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సొరంగాల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి అంచనాలు పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొదటి సొరంగంలో 600 మీటర్లు అంటే.. ఐదేళ్లలో రోజుకు అడుగు చొప్పున, రెండో సొరంగంలో కేవలం 416 మీటర్ల పనులతో సరిపుచ్చి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.61.76 కోట్లను ఆదా చేసి బాబు సర్కారు అక్రమాలను బహిర్గతం చేశారు. మొదటి సొరంగం పనులను రోజుకు 9.23 మీటర్ల చొప్పున యుద్ధప్రాతిపదికన చేసి జనవరి 13 నాటికి పూర్తిచేశారు. రికార్డు సృష్టించారు. రెండో సొరంగం పనులనూ వేగవంతం చేశారు. నల్లమల రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,511 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఏకంగా రూ.1,411.56 కోట్లను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు చేపట్టారు. హక్కులను పరిరక్షిస్తున్న సీఎం జగన్ విభజన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ... నాగార్జునసాగర్‌ను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలని కేంద్రం పేర్కొంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుతో తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ సర్కార్ తన స్వాధీనంలోనే ఉంచుకుంది. సాగర్ కుడి కాలువకు కష్ణా బోర్డు కేటాయించిన నీటిని తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 12, 2015న అర్థాంతరంగా ఆపేయడంతో మరుసటి రోజు.. నాడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్ పోలీసు బలగాలతో సాగర్ వద్దకు వెళ్లారు. అయితే, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి సాగర్ కుడి కాలువపై ఆధారపడిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల హక్కులను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోకుండానే అధికారులను వెనక్కి రప్పించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక 2019–20, 2020–21లో కేటాయించిన దానికంటే అధికంగా నీటిని విడుదల చేయించడం ద్వారా రాష్ట్ర హక్కులను పరిరక్షించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీడు భూములు పచ్చబడుతుండంతో.. గత రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, వరద నీటిని ఒడిసి పట్టి మళ్లించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బీడు భూములు పచ్చబడుతున్నాయి. పంటలు బాగా పండటం, గిట్టుబాటు ధరలు దక్కవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కరువన్నదే ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్ జగన్ భారీఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను రూ.5వేల కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ కుడి కాలువలోకి పోసి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆయకట్టును స్థిరీకరించడానికి, దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయడానికి చర్యలు చేపట్టారు. దీనికోసం రూ.1,200 కోట్లకు రాష్ట్ర ఖజానా నుంచి ఇప్పటికే ఖర్చు చేశారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వరికపుడిశెల ఎత్తిపోతల పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. సముద్రంలో వృథాగా కలిసే వరదను ఒడిసి పట్టడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచే పనులను చేపట్టారు. ఇవన్నీ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయని, ఈ సమతుల అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2005 తరహాలో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే దుస్సాహసానికి ఒడిగట్టారని, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపువల్ల ప్రకాశం జిల్లా ప్రయోజనాలను దెబ్బతింటాయని దుష్ప్రచారం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
కృష్ణాలో ఏపీకి మిగిలింది 11.52 టీఎంసీలే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ ప్రభుత్వం వినియోగించుకున్న జలాలు పోను మిగిలిన నీళ్లు 11.52 టీఎంసీలేనని.. అంతకుమించి వాడు కోకుండా ఆ రాష్ట్రాన్ని నియంత్రించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విన్నవించింది. ఈ మేరకు బోర్డుకు లేఖ రాసింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో లభ్యతగా ఉన్న 914.5 టీఎంసీల్లో 66:34 నిష్పత్తిలో ఏపీ వాటా 603.27, తెలంగాణ వాటా 310.77 టీఎంసీలని.. ఇందులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 553.28, తెలంగాణ 187.09 టీఎంసీలు వినియోగించుకున్నాయని వివరించింది. కృష్ణా బేసిన్లో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏపీలో 38.46 టీఎంసీలు, తెలంగాణలో 10.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొంది. ఇప్పటిదాకా వినియోగించుకున్న జలాలు, ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని కలిపితే ఏపీ 591.75 టీఎంసీలు, తెలంగాణ 198 టీఎంసీలను వాడుకుందని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటా 11.52 టీఎంసీలు.. తెలంగాణ కోటా 112.77 టీఎంసీలని లేఖలో పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 11.52 టీఎంసీలకు మించి వాడుకోకుండా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డును కోరింది. -
శ్రీశైలంలోకి భారీగా వరద నీరు
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి హంద్రీ వరద తోడవడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 1,03,150 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 845.70 అడుగుల్లో 71.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో 38,140 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 173.66 టీఎంసీలకు చేరింది. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 87,938 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 75,621 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. హంద్రీ నది పరవళ్లు తొక్కుతుండడంతో గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ 4.30 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర నదికి ప్రవాహం పెరిగినందున సుంకేశుల, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ 4.50 టీఎంసీలకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల శారద నది నుంచి రైవాడ రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఇక తాండవ ప్రాజెక్టు 80 శాతం నిండింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు భూపతిపాళెం, ముసురుమిల్లి, జుర్రేరు వంటి చిన్న తరహా ప్రాజెక్టులు నిండాయి. -
వడివడిగా శ్రీశైలంలోకి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలోకి కృష్ణా వరద ప్రవాహం మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం జలాశయంలోకి 1,03,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 52.06 టీఎంసీలకు చేరుకుంది. గురువారం పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదిలో వరద పెరిగి శ్రీశైలం జలాశయంలోకి ఉధృతి కొనసాగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ► ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 45 వేల క్యూసెక్కులు చొప్పున దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి వచ్చే జలాలకు తుంగభద్ర, హంద్రీ నుంచి వచ్చే వరద ప్రవాహం తోడవుతోంది. ► సాగర్‌కు దిగువన వరదతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,066 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,014 క్యూసెక్కులు వదిలి.. 13,395 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 68,115 క్యూసెక్కులు చేరుతుండగా.. 67,615 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణా జలాలు పోటెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు కృష్ణా నది నుంచి 29 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1740 క్యూసెక్కులు కలిపి 30,740 క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. దాంతో ఇక్కడి జలాశయంలో నీటి నిల్వ 38.29 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. ప్రాజెక్ట్ వద్ద 9 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. స్పిల్ వే ద్వారా 42,244, విద్యుత్ కేంద్రం ద్వారా 28,779 క్యూసెక్కులు కలిపి 71,023 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు హంద్రీ, తుంగభద్ర నుంచి వరద చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి వచ్చే ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాల వల్ల మున్నేరు, మూసీ నదుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 12,137 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. ► ఎగువ నుంచి గతేడాది జూలై 30న శ్రీశైలానికి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది రెండు వారాల ముందే రావడం గమనార్హం. ► తుంగభద్ర జలాశయంలోకి 8,029 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 48,679 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 45,679 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► వంశధార నది నుంచి 7,985 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ గేట్లు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా రావడంతో 30 గేట్లు ఎత్తి 21,750 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. -
శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ఈ సీజన్లో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా జలాలు తాకాయి. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిరంతరం కొనసాగుతుండటం, జూరాల నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం చేరుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీశైలంలోకి 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తుండగా బుధవారం నుంచి ఆ ప్రవాహాలు మరింత పెరగనున్నాయి. ఎగువ నుంచి భారీగానే.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీగానే నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి మంగళవారం ఉదయం 41,812 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఏకంగా 46,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలకు గానూ 96.50 టీఎంసీల నిల్వ ఉంది. అయినప్పటికీ సాయంత్రానికి 45 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి 46,731 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 35.06 టీఎంసీలుగా ఉండటంతో దిగువకు 45,031 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు రాగా అవి సాయంత్రానికి 22 వేలు, రాత్రికి 32 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకు గానూ 8.85 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతలు, జూరాల కాల్వలకు 3,973 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, పవర్‌హౌస్‌ల ద్వారా 23,501 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం చేరుతోంది. శ్రీశైలానికి ప్రస్తుతం స్థానిక పరీవాహకం తోడు ఎగువ ప్రవాహాలు కలిపి నుంచి 15,394 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 215 టీఎంసీలకు గానూ 37.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండాలంటే మరో 178 టీఎంసీలు అవసరం. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో కేవలం 31.53 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలకు గానూ 167.95 టీఎంసీల నీరుండగా, ఇక్కడ 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. -
నేడు జూరాలకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ కదలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 56,905 క్యూసెక్కులు చేరుతుండటంతో.. విద్యుత్ కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను సోమవారం దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి 43,616 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ 34.87 టీఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 27,574 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన జలాలు మంగళవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరనున్నాయి. 15 రోజుల ముందే శ్రీశైలానికి.. ► వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టులోకి 6,032 క్యూసెక్కులు చేరుతుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, భీమా ఎత్తిపోతల ద్వారా 650, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 151 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. ► ప్రస్తుతం జూరాలలో 8.38 క్యూసెక్కులు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో 1.27 టీఎంసీలు అవసరం. ► జూరాల నుంచి జలాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ జలాలు బుధవారం శ్రీశైలం జలాశయానికి చేరనున్నాయి. ► గతేడాది జూలై 30న శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎగువ నుంచి వరద నీరు చేరనుండటం గమనార్హం. తుంగభద్ర, గోదావరిలో తగ్గిన ప్రవాహం ► తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. టీబీ డ్యామ్‌లోకి 17,550 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.8 టీఎంసీలకు చేరింది. టీబీ డ్యామ్ నిండాలంటే 79 టీఎంసీలు అవసరం. ► పులిచింతలకు దిగువన కృష్ణా బేసిన్లో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 13,485 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 6,416 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 7,069 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ► గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 96,842 క్యూసెక్కులు వస్తుండగా.. 2,100 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి.. మిగిలిన 94,762 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 71.601 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార నది నుంచి 3,499 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,205 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 8.073 టీఎంసీల వంశధార జలాలు కడలి పాలయ్యాయి. -
కృష్ణా జలాల వినియోగంలో రికార్డు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే.. తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ వాటా వినియోగం పూర్తి కాగా.. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, మధ్యతరహా ప్రాజెక్ట్‌లలో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలను కృష్ణా బోర్డు పక్కాగా తేల్చుతోంది. అంతకుముందు అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. ఇదీ లెక్క ► నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై.. మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ► నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. ► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. ► శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది. ► సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ► సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది. ► తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ► ఆర్డీఎస్ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. ► జూరాల ప్రాజెక్ట్ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్‌ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది. ► ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. 8 ప్రాజెక్టుల డీపీఆర్లుతక్షణమే ఇవ్వండి తెలంగాణ సర్కార్‌కు కృష్ణా బోర్డు ఆదేశం కృష్ణా జలాలను తరలించడానికి కొత్తగా చేపట్టిన ఐదు ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన మూడు ప్రాజెక్టులతో కలిపి మొత్తం 8 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు తక్షణమే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఇదే అంశంపై అక్టోబర్ 16న రాసిన లేఖకు స్పందించలేదని గుర్తు చేస్తూ ఇప్పటికైనా వాటి డీపీఆర్‌లు సమర్పించాలని స్పష్టం చేస్తూ బోర్డు సభ్యుడు హెచ్‌కే మీనా మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. మా వాటా నీటిని తరలించేందుకే ఎత్తిపోతల... శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరినప్పుడు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాల మేరకు నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన ఎస్సార్బీసీలో 4 కి.మీ. వద్దకు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపుల ప్రకారమే తమ వాటా నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ సర్కారు విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస ఎత్తిపోతల పథకాలు, వాటర్ గ్రిడ్‌లో భాగంగా మిషన్ భగీరథ ప్రాజెక్టులు చేపట్టిందని, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడు ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని పెంచుతోందని.. దీని ప్రభావం దుర్బిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్రంగా ఉంటుందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే ఆ ఎనిమిది ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించింది. -
ఇందులో తప్పేంటి
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.. తెలంగాణ రాష్ట్ర వాటా 299 టీఎంసీలు.. మా రాష్ట్రానికి హక్కుగా ఉన్న జలాలను వాడుకుంటే తప్పేంటని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తేల్చిచెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడం కోసం ఏపీ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కార్‌ను శుక్రవారం కృష్ణా బోర్డు కోరింది. తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అనుమానాలనునివృత్తి చేసేలా కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నివేదికలో పొందుపర్చే అవకాశమున్న అంశాలు ఏమిటంటే.. ► కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడంవల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. దీనివల్ల కృష్ణా వరద ప్రవాహం జూరాలకు ఆలస్యంగా చేరుతుంది. వరద ప్రవాహం శ్రీశైలానికి చేరక ముందే జూరాల ప్రాజెక్టు కాలువ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంది. రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం ఏకరీతిగా కురవకపోవడం వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గాయి. వరద వచ్చిన రోజుల్లో గరిష్ఠంగా ఉంటోంది. ► శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. జలాశయంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్‌పీ (పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్) ప్రస్తుత పూర్తిసామర్థ్యం మేరకు 44వేల క్యూసెక్కులను శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), టీజీపీ (తెలుగుగంగ ప్రాజెక్టు), గాలే రు–నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్ఎస్ ఎస్)కు తరలించవచ్చు. కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలంలో 881 అడుగుల స్థాయి లో నీటి మట్టం ఏడాదికి పది రోజులకు మించి ఉండదు. ► అలాగే, శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే చేరతాయి. నీటి మట్టం 841 అడుగులకు చేరితే పీహెచ్‌పీ ద్వారా చుక్క నీరు కూడా కాలువకు చేరదు. కానీ, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల నుంచే ఎడమగట్టు కేంద్రం నుంచి తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేపడుతోంది. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 800 అడుగుల నుంచి.. ఎస్సెల్బీసీ ద్వారా 824 అడుగుల నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. పర్యవసానంగా జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. తెలంగాణ 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్న నేపథ్యంలో.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడానికే శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల (సంగమేశ్వరం) నుంచి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీలోకి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని తాము చేపడితే తప్పేంటని బోర్డుకు వివరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే ఈ ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని.. అంతకంటే చుక్క నీటిని కూడా తరలించబోమని స్పష్టం చేయాలని నిర్ణయించింది. ► మరోవైపు.. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ల నుంచి అనుమతి తీసుకోకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కల్వకుర్తి సామర్థ్యం పెంపు, నెట్టంపాడు సామర్థ్యం పెంపు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ద్వారా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడంపై అనేకమార్లు ఫిర్యాదులు చేశామని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని బోర్డును ప్రశ్నించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలిసే వరదను మళ్లిస్తే తప్పేంటి? ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండగా.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీ ద్వారా 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నదికి నాలుగేళ్లలో ఒకసారి ఈ స్థాయిలో వరద వస్తుంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులే రాయల సీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది రోజులు కూడా ఉండే అవకా శంలేదు. జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి మట్టం ఉన్న ప్పుడు.. సముద్రంలో కలిసే ఆ వరద జలాలను ఒడిసి పట్టి.. దుర్భిక్ష రాయలసీమలో బంజరు భూములకు మళ్లించడానికే పీహెచ్‌పీ దిగువన కాలువల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టాలని నిర్ణయించామని కృష్ణా బోర్డుకు వివరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో తప్పేంటని బోర్డును ప్రశ్నించాలని భావిస్తోంది. బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టులు.. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఉద్దేశించిన కృష్ణా బోర్డు పరిధిని, వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమా వళి)ని తక్షణమే ఖరారుచేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు కోరాలని కూడా నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు తన అధీనంలోకి తీసుకోవాలని.. కేటాయించిన నీటి మేరకు బోర్డే నీటిని విడుదల చేయాలని మరోసారి ప్రతిపాదించనుంది. నీటి కేటాయింపులను.. విడుదలను బోర్డే చేయడంవల్ల అదనంగా ఒక్క నీటి చుక్కనూ వినియోగించుకునే అవకాశం ఉండదని తేల్చిచెప్పాలని భావిస్తోంది. -
పెరిగిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా, గోదావరి, వంశధార నదుల వరద శుక్రవారం మళ్లీ పెరిగింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి నుంచి 1.67 లక్షల క్యూసెక్కులను వదులుతుండగా, నారాయణపూర్ నుంచి 1.60 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 2.60 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర జలాశయంలోకి 35 వేల క్యూసెక్కులు వస్తుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శుక్రవారం 3.01 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుండగా 3.80 లక్షల క్యూసెక్కులను వదులు తున్నారు. పది గేట్లను తెరిచారు. శనివారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 3.46 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.29 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 4.11 లక్షలు చేరుతుండగా 4.25 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి భారీ వరద ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రికి 3.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే పరిమాణంలో దిగువకు వరదను విడుదల చేయనుండటంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. 6.23 లక్షల క్యూసెక్కులు: గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6.23 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీ నుంచి 19,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కడలిలోకి 3,066 టీఎంసీలు.. ప్రస్తుత నీటి సంవత్సరంలో(జూన్ 1 నుంచి మే 31) కృష్ణా, గోదావరి, వంశధార నదుల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 3,066.36 టీఎంసీల వరద జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇందులో ప్రకాశం బ్యారేజీ నుంచి 358.46 టీఎంసీల కృష్ణా జలాలుకాగా.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,647.6 టీఎంసీల గోదావరి వరద నీరు, గొట్టా బ్యారేజీ నుంచి 60.3 టీఎంసీల వంశధార వరద జలాలు కావడం గమనార్హం. -
శ్రీశైలానికి జలకళ
-
ఒక్క రోజు 12 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కొనసాగుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. గురువారం ఉదయానికి 37వేల క్యూసెక్కులు (3.36 టీఎంసీలు)గా నమోదైన ప్రవాహం సాయంత్రానికి 1.93లక్షల క్యూసెక్కులకు (17.54 టీఎంసీలు) పెరిగింది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్లులోకి ఏకంగా 12 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. వచ్చి చేరుతున్న వరదతో ప్రాజెక్టులో నిల్వ 215 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలానికి జలకళ పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఏకంగా 1.60లక్షల క్యూసెక్కుల (14.54 టీఎంసీలు) ప్రవాహం వస్తుండటంతో అక్కడి నుంచి 2.13లక్షల క్యూసెక్కుల (19.36 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా నారాయణపూర్‌కు చేరుతుండగా, అక్కడి నుంచి 1.94లక్షల క్యూసెక్కుల (17.63 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు 1.85లక్షల క్యూసెక్కుల (16.81టీఎంసీలు) మేర ప్రవాహం వస్తోంది. దీంతో జూరాల నుంచి 24 గేట్ల ద్వారా 1,57,185 క్యూసెక్కులు (14.28 టీఎంసీలు), విద్యుదుత్పత్తి ద్వారా 26,238 క్యూసెక్కులు (2.38 టీఎంసీలు) నదిలో వదులుతున్నారు. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ 315 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు 1,900 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి దిగువసు వస్తున్న నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. గురువారం సాయంత్రం శ్రీశైలానికి 1.93లక్షల క్యూసెక్కుల (17.54టీఎంసీలు) ప్రవాహం వస్తోంది. బుధవారం ఉదయం కేవలం 804 అడుగుల మట్టంలో 31టీఎంసీల మేర నీటి నిల్వలుండగా, అది ఒక్క రోజులోనే 822 అడుగులకు పెరిగి నిల్వ 43 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులో 12 టీఎంసీల కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 158 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 115 టీఎంసీల మేర తక్కువగా నిల్వ ఉంది. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటం, ఈ వరద మరో పది రోజుల పాటు కొనసాగినా ప్రాజెక్టులో నీటినిల్వలు భారీగా పెరగనున్నాయి. -
రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్/గద్వాల టౌన్: ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా కృష్ణా నదీ జలాలు దిగువకు వస్తుండటంతో జూరాల నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఏకంగా ఎగువ నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతుండటంతో సాయంత్రం ఏడు గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగాను 5.5 టీఎంసీలకు చేరింది. ఎగువ ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసె క్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని దిగువ నా రాయణపూర్కు వదులుతున్నారు. నారాయణపూర్ సైతం ఇప్పటికే నిండటంతో 20 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరి నిల్వ పెరగడంతో జూరాల నుంచి నీటి విడుదల మొదలైంది. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ద్వారా 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా కుడి, ఎడమ కాల్వలకు 900 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. దీంతోపాటు జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం దిశగా పరుగులు తీస్తోంది. జూరాల నుంచి విడుదలైన జలాలు గురువారం ఉదయానికి శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 31 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇక్కడ నీటి నిల్వ 854 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణ, ఏపీ నీటి వినియోగం మొదలు పెట్టనున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి ద్వారా నీటి ఎత్తిపోతలకు పంపులు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి 10 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. -
కృష్ణా జలాలతో వైఎస్ఆర్ విగ్రహానికి జలాభిషేకం
-
వచ్చిన నీటిని వచ్చినట్టే తోడేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : ఎగువన ఉన్నామన్న ఆధిపత్యమో.. దిగువన తెలియదన్న ధీమానో కానీ కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ, ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, కాలువలు చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్ పరిధిలోని 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటి నీరందడం గగనంగానే కనిపిస్తోంది. నీళ్లను తరలిస్తోంది ఇలా.. జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్ ఇయర్లో జూన్ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. తుంగభద్ర ఎగువనే కర్ణాటక గరిష్టంగా నీటిని వినియోగిస్తోంది. తుంగ, భద్ర సబ్ బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి విచ్చిలవిడిగా వినియోగిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువనే భద్ర, అప్పర్ తుంగ, భద్ర రిజర్వాయర్, మైనర్ ఇరిగేషన్లో ఇప్పటికే వినియోగం మొదలుపెట్టింది. వేదవతి సబ్ బేసిన్లోనూ మైనర్ ఇరిగేషన్ ద్వారా 40 టీఎంసీలు, వాణివిలాస్ ప్రాజెక్టు ద్వారా 18 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా ఇప్పటికే చెరువులు నింపే పని మొదలు పెట్టినట్లుగా నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇలా నెలన్నర వ్యవధిలోనూ తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది. రెండు మూడ్రోజులుగా తుంగభద్ర నుంచి కాల్వలకు నీటిని విడుదల చేస్తోంది. బుధవారం కాల్వల ద్వారా 448 క్యూసెక్కుల నీటిని వదిలినట్లుగా రికార్డులు చెబుతున్నా.. ఇది అంతకుమించి ఉంటుందన్నది తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర ఎగువనే ఇలా నీటిని వాడేస్తుండటంతో దిగువ శ్రీశైలానికి ప్రవాహాలు కరువయ్యాయి. ఆల్మట్టి నుంచి ఎత్తిపోతలకు.. ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండటం కష్టమే అవుతుంది. నారాయణపూర్ పరిధిలో గడిచిన రెండు మూడు రోజులుగా అధికారికంగానే 200 నుంచి 400 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 4 టీఎంసీల మేర వినియోగం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువ తెలంగాణ పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాలకు అక్టోబర్ వరకు నీటి రాక గగనమే కానుంది. ఖాళీగా శ్రీశైలం, సాగర్ ఎగువ నుంచి ప్రవాహాలు కరువవడంతో దిగువన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి రాక కరువైంది. ఇప్పటికి జూరాలకు కేవలం 2.77 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు వచ్చింది. 9.66 టీఎంసీల నీటి నిల్వలకుగానూ జూరాలలో ప్రస్తుతం 5.73 టీఎంసీల నీరే ఉంది. ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జూరాల కింది లక్ష ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. దీంతో ప్రాజెక్టు బోసిపోయి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది. నాగార్జునసాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇందులో వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకు మించదు. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది. అంటే.. రెండు ప్రాజెక్టుల పరిధిలోనే 365 టీఎంసీల లోటు ఉండంతో సాగర్ కింది 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్ వరకు నీరందడం ప్రశ్నార్థంగా మారింది. అదే జరిగితే ఖరీఫ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లినట్టే!! తుంగభద్రలో ఇలా.. జూన్‌లోనే వానలు మొదలయ్యాయి.. తుంగభద్రకు భారీగా వరద వస్తోంది.. సగటున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.. ఈ లెక్కన 100 టీఎంసీల ఆ డ్యామ్‌లో ఇప్పటికి 75 టీఎంసీల నీరుండాలి.. కానీ 50టీఎంసీలే ఉంది.. ఎందుకంటే తుంగభద్రకు ఎగువనే వచ్చిన నీటిని వచ్చినట్టు పక్కకు మళ్లిస్తోంది.. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి చుక్క నీరు రావడం లేదు! ఆల్మట్టిలో అలా.. ఈ జలాశయానికీ భారీగానే వరదొస్తోంది.. ఈ సీజన్లో ఇప్పటికే 38 టీఎంసీల నీరొచ్చింది.. ఇప్పటికే నిల్వ ఉన్న నీటితో కలిపితే 58 టీఎంసీలు ఉండాలి.. కానీ గత 15 రోజుల్లో దాదాపు 8–10 టీఎంసీల నీటిని అక్రమంగా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు తరలించారు.. దిగువకు చుక్క రావడం లేదు.. ఇక నారాయణపూర్ ఎప్పుడు నిండాలి? అది నిండి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఎప్పుడు నీళ్లు రావాలి..? వాటి పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరందాలి?? -
‘కృష్ణా’లో రాష్ట్రానికి మళ్లీ అన్యాయమే?
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది! కృష్ణా జలాలపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు తెలంగాణలోని పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు పెంచాలన్న వినతిని కేంద్రం తిరస్కరించడం, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల పాత వాటాయే ఈ ఏడాదీ కొనసాగుతుందని పేర్కొనడం రాష్ట్రానికి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టనుంది. బచావత్ అవార్డుల ప్రకారమైనా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో ఎగువ తెలంగాణకు దక్కే నీటి వాటాలు తేల్చాలని కోరుతున్నా కుదరదన్న ధోరణి ప్రదర్శించడం రాష్ట్రానికి మింగుడు పడని అంశమే. జూన్ వర్షాలకు మరో రెండు నెలల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో కేంద్రంపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది. పరీవాహకం ఎక్కువ ఉన్నా తక్కువ నీటి కేటాయింపు... రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5 శాతం, ఆయకట్టు 62.5 శాతం ఉంది. అయినప్పటికీ మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీనికితోడు 1978లో గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరుతోంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని అడుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు. -
తాత్కాలిక సర్దుబాటే!
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాల్లో వాటాలను ఖరారు చేయలేమని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తేల్చిచెప్పింది. 2015లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటే అప్పటివరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున దక్కు తాయి. కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాలకు పునఃపంపిణీ చేస్తూ రెండేళ్ల క్రితం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారిస్తూనే ఉమ్మడి రాష్ట్రానికి కేటా యించిన జలాలను తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేయడానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులు విచారణలో ఉండటంతో 2015లో జూన్ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ ‘తాత్కాలిక ఏర్పాటు’ చేశారు. అప్పట్లో దీనికి అంగీకరించిన రెండు రాష్ట్రాలు 2016లో వ్యతిరేకించడంతో తాత్కా లిక సర్దుబాటునే అమలు చేశారు. 2017లో మళ్లీ రెండు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించడంతో కృష్ణా జలాల్లో వాటాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతానికి తాత్కాలిక సర్దుబాటు ప్రకారం కృష్ణా జలాలను వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు ఇటీవల కేంద్రం తేల్చిచెప్పిందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
‘కృష్ణా’ పంచాయితీపై మంత్రుల చర్చ?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలు, లభ్యత నీటి పంపకాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రులు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు వివాదాలపై చర్చించాలని మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. భేటీ తేదీలపై స్పష్టత రాకున్నా, ఒకట్రెండు రోజుల్లోనే సమావేశం అవుతారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ భేటీకి సన్నాహకంగా అధికారులు, కృష్ణా బేసిన్ పరిధిలో నెలకొన్న వివాదాలు, ప్రస్తుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై హడావుడిగా నివేదికలు సైతం సిద్ధం చేశారు. వీటిపై సోమవారంరాత్రి ఖమ్మం పర్యటన ముగించుకొని వచ్చిన హరీశ్‌రావు సమీక్ష జరపాల్సి ఉండగా, అది మంగళవారానికి వాయిదా పడింది. శ్రీశైలంలోకి భారీ ప్రవాహాలు వస్తున్నా, దిగువన నాగార్జునసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీనిపై కృష్ణాబోర్డు భేటీల్లో చర్చిస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు. ఈ నేపథ్యంలో మంత్రుల స్థాయి భేటీ నిర్వహించాలని అధికార వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా శ్రీశైలంలో 834 కనీస నీటిమట్టాలకు ఎగువన 118 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగుల ఎగువన 13 టీఎంసీలతోపాటు జూరాల, పులిచింతలలో కలిపి మొత్తంగా 163 టీఎంసీల మేర లభ్యత జలాలున్నాయి. ఈ లభ్యత నీటికి పట్టిసీమ, మైనర్ వినియోగ లెక్కలను కలిపి నీటి వాటాలు కోరాలా.. లేక గత ఏడాది మాదిరి పట్టిసీమ, మైనర్ లెక్కలను తొలగించి, మిగిలిన లభ్యత జలాలు పంచుకోవాలా.. అన్న దానిపై స్పష్టత కోసం ఈ భేటీ ముఖ్యమని అధికార వర్గాలు సూచించినట్లు తెలిసింది. ఎలా చూసినా, వాటాకు మించి ఏపీ నీటి వినియోగం చేసిందని, తెలంగాణకు మరిన్నిఅదనపు జలాలు దక్కాల్సి ఉందని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు మంత్రుల భేటీ మంగళవారం ఉంటుందని ప్రచారం జరగ్గా, అదే రోజున కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో భేటీ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత భేటీ ఉండే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
రాయల సీమకు తీరని అన్యాయం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుతున్నా చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు సాఫీగా సాగుతున్నాయని, ఏపీ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగా రాయలసీమ రైతాంగం తీవ్ర దుర్భిక్షంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 20 నాటికే ఆల్మట్టి నిండిపోయినా ఇప్పటికీ నీరు కిందకు వదల్లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. అదృష్టవశాత్తు వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 104 టీఎంసీల స్టోరేజ్‌కి చేరుకుందన్నారు. వర్షాలు బాగా వస్తే తప్ప ఇంకా 40 టీఎంసీలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కృష్ణాబోర్డు అనుమతులు తీసుకొని నీళ్లు తీసుకుంటున్నారా అని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అని నిలదీశారు. తెలంగాణ రైతాంగాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకించడం లేదని, రెండు రాష్ట్రాల పెద్ద మనుషులు ముఖ్యమంత్రులని గుర్తుంచుకొని సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రివర్ బోర్డును అడగడం.. తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు పెట్టడం మళ్లీ పోతిరెడ్డిపాడుకు నీటి సరఫరా నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు చట్టబద్ధంగా బోర్డును కోరలేదని తెలిసిపోతుందన్నారు. ఓటుకు కోట్ల కేసు తిరగతోడుతారోనని భయపడుతున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. దయచేసి దుర్భిక్షంలో ఉన్న రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని, కృష్ణా రివర్‌బోర్డు అనుమతులు తీసుకొని నీటి సరఫరా చేయాలని కోరారు. -
‘తెలంగాణలో గలగల, ఏపీలో వెలవెల’
-
‘అనంత’కు చేరిన కృష్ణాజలాలు
వజ్రకరూరు/గుంతకల్లు: కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువకు నీటిని వదిలారు. మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 144వ కీమీ వద్ద కసాపురం గ్రామం వద్దకు ప్రవేశించాయి. దీంతో గుంతకల్లు పట్టణ వాసుల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మరోవైపు మంగళవారం ఉదయానికి కృష్ణా జలాలు రాగులపాడు లిఫ్ట్ వద్దకు చేరుకోగానే అధికారులు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేస్తున్నారు. ఉదయం ఒక పంపు ద్వారా పంపింగ్ ప్రారంభించారు. కృష్ణా జలాలు హంద్రీనీవా ప్రధాన కాలువలోకి వస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడుకు వచ్చే నీటిని బట్టి పంపుల సంఖ్య పెంచుతామని లిఫ్ట్ ఇన్చార్జ్ వెంకటరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
‘కృష్ణా’పై సమన్వయ భేటీ లేనట్లే!
పాత వాటా ప్రకారమే నీటిని వాడుకోవాలని కేంద్రం సూచన ► ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి లేఖ ► ఇరురాష్ట్రాలూ అంగీకరించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విని యోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య ఏటా నిర్వహించే సమన్వయ సమావే శాలకు ఈ ఏడాది కేంద్ర జల వనరుల శాఖ స్వస్తి చెప్పినట్లు కనిపిస్తోంది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–1 కేటాయించిన వాటా ల మేరకే ఈ ఏడాది కూడా నీటిని వాడుకో వాలన్న దిశానిర్దేశంతోనే సరిపెట్టే అవకాశాలు న్నాయి. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందు.. గతంలో మాదిరే 512ః299 నిష్పత్తిన నీటిని పంచుకునే అంశమై తమ అభిప్రాయాలు తెలిపాలని కోరారు. దీనికి ఇరు రాష్ట్రాలు ఓకే చెబితే సమన్వయ సమావేశం ఏదీ ఉండనట్లే. నిజానికి కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నా ఒక్కదానికీ పరిష్కారం దొరకడం లేదు. ఏటా జూన్‌లో ఇరురాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. చాలా అంశాలపై ఇరురాష్ట్రాల మధ్య తాత్కాలిక సయోధ్య కుదురుస్తూ వస్తోంది.అయితే ఈ ఏడాది ఇంతవరకు సమావేశాల ఊసే ఎత్తలేదు. మరోవైపు పట్టిసీమ సహా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ అంశాల మధ్య ఇరురాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని సంద ర్భాల్లో బోర్డులు సైతం తేల్చలేక కేంద్రానికి ఫిర్యాదు చేసి ఊరుకుంటున్నాయి. అంటీము ట్టనట్టుగానే వ్యవహరిస్తున్న కేంద్రం.. ఇటీవల ఇరు రాష్ట్రాలకు ఓ లేఖ రాసింది. గతంలో మాదిరే నీటిని వాడుకునే అంశంపై అభిప్రా యాలు కోరింది. దీనికి తెలంగాణ కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వాటా 299 టీఎంసీల నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకునే అవకాశం ఇస్తే అందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అయితే పట్టిసీమ నుంచి ఏపీ ఈ ఏడాది సైతం గరిష్ట నీటిని తీసుకునే యత్నాలకు దిగిన నేపథ్యం లో అందులో వాటా కోరుతుందా, అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏపీ తన వాటా 512 టీఎంసీల మేర ఉన్నందున కేంద్ర ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. రెండు రాష్ట్రాలు ఓకే చెప్పిన పక్షంలో కేంద్రం దానికి అనుగుణంగా ఓ ఆర్డర్ వెలువరించి ఊరుకునే అవకాశం ఉంది. కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు.. కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 129 టీఎంసీల నిల్వకుగానూ 44 టీఎంసీల లభ్యత ఉంది. ఇక తుంగభద్రకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 8,200 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ 100 టీఎంసీలకు గానూ 13.46 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జున సాగర్‌లో ఏకంగా 501 అడుగుల కనిష్ట మట్టానికి నీటి నిల్వలు పడిపోయాయి. -
కృష్ణా ఆశలన్నీ సుప్రీంపైనే..
♦ తెలంగాణ ఎస్ఎల్పీపై రేపు విచారణ ♦ కృష్ణా జలాల్లో అన్యాయాన్ని మరోమారు వినిపించనున్న రాష్ట్రం ♦ ఇటీవలి బ్రిజేశ్ తీర్పుపైనా కీలక వాదనలు ♦ నేడు ఢిల్లీకి అధికారుల పయనం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాన్ని సవరించేందుకు కొత్త ట్రిబ్యునల్‌ను నియమించి పునర్విచారణ జరిపేలా ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)పై గురువారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనుంది. ఇటీవల కృష్ణా జలాలపై తదుపరి విచారణ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో సుప్రీంలో ఈ విచారణ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముందుకు కొనసాగిస్తుందా? లేక ఇటీవలి బ్రిజేశ్ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ మరేదైనా తీర్పు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీం విచారణ నేపథ్యంలో గురువారం నీటి పారుదల శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎస్ఎల్పీలో రాష్ట్రం ఏమంది? కృష్ణా జలాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు వినాలని కోరుతూ రాష్ట్రం 2014లో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీతో, కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం ఉండడంతో రాష్ట్రం నష్టపోతుందని అందులో వివరించింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉండగా.. ఏపీలో 31.5 శాతం మాత్రమే ఉందని, అయినా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ జరిపారని పేర్కొంది. ‘‘కృష్ణాలోని భీమా సబ్ బేసిన్లో 75 శాతం డిపెండబులిటీ లెక్కన నీటి లభ్యత 342 టీఎంసీలు ఉంటుంది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటకకే కేటాయించగా.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 60 శాతం డిపెండబులిటీ లెక్కన మరో 28 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు కేటాయించింది. దీంతో భీమా నుంచి కృష్ణాకు ఎలాంటి నీటి లభ్యత ఉండదు. ఇక తుంగభద్ర, వేదవతి సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యత 533 టీఎంసీలు ఉండగా అందులో తెలంగాణ వాటా కేవలం 18 టీఎంసీలే. అందులోనూ పూర్తి స్థాయి జలాలు ఎన్నడూ రాలేదు. తెలంగాణకు నీటి లభ్యత అంతా ప్రధాన కృష్ణాకు నాలుగు సబ్ బేసిన్ల నుంచి 794 టీఎంసీలుగా ఉంది. అయితే మహారాష్ట్రకు ఉన్న 260 టీఎంసీ కేటాయింపులకు అదనంగా ట్రిబ్యునల్ 50 టీఎంసీలు, కర్ణాటకకు ఉన్న 325 టీఎంసీలకు అదనంగా మరో 130 టీఎంసీలు కేటాయించింది. ఇలా ఎగువ రాష్ట్రాలకే 766 టీఎంసీలు కేటాయించడంతో తెలంగాణ సరిహద్దుకు వచ్చే నీరు కేవలం 28 టీఎంసీలే. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయింపులు పెరిగితే దిగువకు నీరు వచ్చే అవకాశాలు దెబ్బతింటాయి’’ అని పిటిషన్లో తెలంగాణ వివరించింది. ఇవే అంశాలను మరోమారు సుప్రీం దృష్టికి తీసుకెళ్లి నాలుగు రాష్ట్రాలకు తిరిగి జలాల కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కృష్ణా జలాల విచారణ రెండు రాష్ట్రాలకే పరిమితం అంటూ ఇచ్చిన తీర్పుపై అఫిడవిట్ సమర్పించాలన్న గడువు ముగుస్తుండటంతో రాష్ట్రం మరో నాలుగు వారాల సమయం కోరుతూ ట్రిబ్యునల్‌కు లేఖ రాసింది. -
నగరానికి గోదావరి నీళ్లు తేవాలి: బద్దం
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి కృష్ణా నది నీరు సరిపోనందున గోదావరి నుంచి నీటి తీసుకురావాలని బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.300-500 కోట్లు ఖర్చు చేస్తున్నా నగరానికి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నల్లా ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెబుతున్న సీఎం కేసీఆర్, 2019 కల్లా ఎన్ని ఇళ్లకు రోజూ నీళ్లు సరఫరా చేస్తారో చెప్పాలన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వాటర్‌వర్క్స్ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారని, వారికే ప్రమోషన్లు ఇచ్చి అందలాలు ఎక్కిస్తున్నారని ఆరోపించారు. -
కృష్ణా జలాల పంపకాలపై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరింది. ఢిల్లీలో జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాల సమ్మతితో మార్గదర్శకాలు ఖరారు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని కలసి కృష్ణా యాజమాన్య బోర్డు దీన్ని సమర్పించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిశీలనకు పంపి ఆ తర్వాత కేంద్రం నోటిఫై చేయనుంది. ఈ సమావేశంలో ఖరారైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. కృష్ణా నుంచి ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు ఇవ్వాలనే అంశంపై ఏకాభిప్రాయం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు వరదల సమయంలో వచ్చే అదనపు నీటిని ఇదే నిష్పత్తిలో వాడుకోవాలి. ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా ఇప్పటి నిర్ణయాలు అమలు 2015-16 సంవత్సరానికి మాత్రమే ప్రస్తుత మార్గదర్శకాలు ప్రాజెక్టుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేలా వ్యవహరించరాదు చెన్నై తెలుగు గంగకు 5, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు ఇవ్వాలి కేటాయింపుల నుంచి మినహాయించి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి బచావత్ కేటాయింపుల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కేటాయింపు ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు న్యాయమైన వాటా వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి రోజువారి వ్యవహారాలకు రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ చీఫ్‌లు బోర్డు ప్రతినిధితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు -
కృష్ణా జలాల పంపకాలపై ఏకాభిప్రాయం
-
కృష్ణా జలాల కేసు 4 వారాలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పునఃకేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. తమ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున కృష్ణా జలాల కేటాయింపులను తిరిగి జరపాలంటూ ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 1న ఈ కేసు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా.. పిటిషన్‌కు గల విచారణార్హతలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం నోటీసులు జారీచేసింది. కృష్ణానది పరిధిలోని అన్ని రాష్ట్రాలు నాలుగు వారాల్లోపు దీనిపై ప్రతిస్పందనలు తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు మరోసారి విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై మిగతా రాష్ట్రాల నుంచి ఇంకా సమాధానాలు రాకపోవడంతో కేసును 4 వారాలపాటు వాయిదావేస్తూ.. ఈలోపు ఆయా రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
ఏపీ సర్కార్‌ది మొండి, తొండి వాదన: హరీశ్
హైదరాబాద్ : కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొండి, తొండి వాదన అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అవసరం మేరకు వాడుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో హరీశ్ రావు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల వైఖరి ఏంటో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు ఎంతకాలం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు ద్వారా భద్రాద్రి రాముడిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రాజధాని శివార్లలో భూ వివాదంలో తన బంధువులంటూ వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేసే టీడీపీ నేతలు వాటిని రుజువు చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
సహజ న్యాయం.. సమ పంపిణీ
* కృష్ణా ట్రిబ్యునల్ విచారణాంశాలకు ఇదే మూలంగా ఉండాలి * 5న ట్రిబ్యునల్‌కు అఫిడవిట్లు సమర్పించనున్న తెలంగాణ, ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో సమ న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్ విచారణ పరిధిలో నాలుగు రాష్ట్రాలూ ఉండాల్సిందేనంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్‌కు ఈ నెల 5న అఫిడవిట్లు సమర్పించాలని నిర్ణయించాయి. సహజ న్యాయం, సమ పంపిణీ ప్రామాణికంగా ట్రిబ్యునల్ విచారణ సాగాలంటే.. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక కూడా ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉండాలని స్పష్టం చేయనున్నాయి. ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీ(ఎన్‌బ్లాక్) కేటాయింపులు చేసి, దిగువ రాష్ట్రాలు(తెలంగాణ, ఏపీ)కి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని, అలా చేస్తే సమ పంపిణీ జరగదని వాదించనున్నాయి. ట్రిబ్యునల్ ముందుకు తేవాల్సిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజర్ కమిటీ) శనివారం మళ్లీ సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ జనవరి 5లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్.. కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు సూచించిన విషయం విదితమే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు ప్రాజెక్టు నీటి విడుదల ప్రొటోకాల్స్‌ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొడిగించిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. అయితే ఈ లేఖలను అంగీకరించని ట్రిబ్యునల్.. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం ఇప్పటిదాకా అఫిడవిట్ సమర్పించలేదు. తెలంగాణ కసరత్తు దాదాపు పూర్తి.. కృష్ణా ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై తెలంగాణ దాదాపు తన కసరత్తు పూర్తి చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణాలో నీటి లోటు ఉన్న సమయాల్లో తెలంగాణ, ఏపీలకు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నిస్తోంది. అలాగే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి, ఎగువనున్న రాష్ట్రాలకు బేసిన్ల వారీగా కేటాయింపులు ఎలా జరుపుతారని అడుగుతోంది. తెలంగాణ, ఏపీలు కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎగువ రాష్ట్రాల అంగీకారం ఉంటుందా అనే వాదనను బలంగా వినిపించనుంది. -
‘కృష్ణా’ జలాలపై తేలని లెక్క!
* వాటాను మించి ఏపీ వాడుకున్నదని తెలంగాణ అభ్యంతరం * నాగార్జున సాగర్‌లో 50 టీఎంసీలైనా ఇవ్వాలని ఏపీ పట్టు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సంబంధించిన లెక్కలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో వాస్తవ లెక్కలు తేలడం లేదు. నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుత రబీ అవసరాలకు నీటి విడుదలపై సోమవారం మూడున్నర గంటలపాటు సుదీర్ఘ సమావేశం జరిగినా ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకొని మరింత వాటాను ఏపీ కోరుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. కృష్ణా డెల్టాకు ఇంకా ఏమైనా ఖరీఫ్ అవసరాలు ఉంటే నీటిని అప్పుగా ఇస్తామని, వచ్చే ఏడాది ఆ మేరకు సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పని ఏపీ.. ప్రస్తుతం లభ్యమవుతున్న నీటిలోంచే తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని వాదనకు దిగింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ప్రస్తుత రబీ అవసరాలకు నీటిని వాడుకునే విషయమై ఇరు రాష్ట్రాలు తేల్చుకుని తమ వద్దకు రావాలని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు తాజాగా సమావేశమై నీటి అవసరాలు, వాటాలపై చర్చించారు. రాజధానిలోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. ఎవరి వాదన వారిదే.. బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు, వాస్తవ వినియోగం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి లెక్కలను ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తరఫున విద్యాసాగర్‌రావు వివరించారు. ‘బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నాం. జూరాల కింద ఉన్న భీమా ప్రాజెక్టు, ఇతర చిన్న నీటి వనరులకు 70 టీఎంసీల కేటాయింపులున్నా వాటిని వాడుకోలేదు. ఇలా వాడుకోని జలాలు సాగర్‌ను చేరాయి. ఆ నీటినే ప్రస్తుత రబీ అవసరాలకు వాడుకుంటాం. ప్రస్తుతం సాగర్‌లో లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీరు తెలంగాణ తాగునీటి, రబీ అవసరాలకు సరిపోతుంది. లభ్యత నీటిలో ఏపీ వాటా కేవలం 1.72 టీఎంసీలు మాత్రమే. ఆ మేరకే ఏపీకి ఇస్తాం. అవసరమైతే ఖరీఫ్ అవసరాలకు కొన్ని షరతులతో నీటిని అప్పుగా ఇచ్చేందుకు సిద్ధం. తర్వాతి ఏడాదిలో తెలంగాణకు ఆ నీటిని ఏపీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది’ అని ఏపీ అధికారులకు విద్యాసాగర్‌రావు తెలిపారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా వాస్తవ కేటాయింపు 24 టీఎంసీలను దాటి వరద జలాల పేరిట 70 టీఎంసీలను తరలించుకొనిపోయిందని గుర్తు చేశారు. అవి వరద జలాలు కావని, అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి బయటకు వెళ్లే నీటినే వరద జలాలుగా పరిగణిస్తారని స్పష్టంచేశారు. జూరాల నుంచి సాగర్ వరకు ఈ ఏడాది లభ్యమైన మొత్తం 481 టీఎంసీల నీటిలో ఏపీ తన వాటా 281 టీఎంసీల నీటిని ఇప్పటికే వినియోగించుకొని ఇప్పుడు మరింత వాటా కోరడం తగదని వ్యాఖ్యానించారు. అయితే ఈ లెక్కలపై ఏపీ పూర్తి భిన్నంగా స్పందించింది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీటిలో తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని గట్టిగా కోరింది. నిజానికి సాగర్ కింద రబీ అవసరాలకు నీరివ్వడం ట్రిబ్యునల్ అవార్డులో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. లభ్యతగా ఉన్న నీటిని రబీ అవసరాలకు వాడుకోరాదని, కేవలం ప్రస్తుతం మిగిలిన ఖరీఫ్, తాగునీటి అవసరాలకే వాడాలని సూచించింది. చివరకు అన్ని అంశాలను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చెబుతామని ఏపీ వర్గాలు తెలిపాయి. తర్వాతి సమావేశం ఎప్పుడన్నది కూడా తేల్చలేదు. -
హే.. కృష్ణా!
వాడుకున్న నీటి కంటే వృధా అయిన నీరే ఎక్కువ గత 52 ఏళ్లలో 42 వేల టీఎంసీలు సముద్రం పాలు గడచిన పదేళ్ల కాలంలోనే 5,077 టీఎంసీలు వృథా సగటున ఏడాదికి 800 టీఎంసీలపైనే సాగరంలోకి... బ్యారేజీ దిగువన నీటి నిల్వలకు ప్రతిపాదనలు కరువు మిగులు జలాలకోసం నాడు పులిచింతల మొదలుపెట్టిన వైఎస్ సాక్షి, విజయవాడ బ్యూరో: సాగునీటి వాడకంపై సమర్థవంతమైన ప్రణాళికలు లేకపోవడంతోపాటు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోన్న నిధుల కొరత రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. భారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి భారీస్థాయిలో వస్తోన్న వరద నీటిని ఎక్కడికక్కడ రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడం, అవసరాన్ని బట్టి వాడుకోవడంలో ఏటా అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. గడచిన 52 ఏళ్ల కాలంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 42,087 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేయడం ఇందుకు నిదర్శనం. గడచిన పదేళ్ల సాగునీటి వాడకపు గణాంకాలను పరిశీలించినా ఇదే నిజమని స్పష్టమవుతోంది. 2004-05 నుంచి ఇప్పటివరకూ 1,933 టీఎంసీల నీటిని వాడుకోగా, సముద్రంలోకి వదిలింది మాత్రం 5,077 టీఎంసీలు. ఈ గణాంకాలను చూసి కృష్ణా రివర్‌బోర్డు అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తప్ప మిగతా నాయకులెవ్వరూ సర్ప్లస్ వాటర్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి కేటాయింపు 811 టీఎంసీలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నపుడు కృష్ణా జలాల కేటాయింపులు 811 టీఎంసీలు. తుంగభద్ర, రాజోలిబండ డైవర్షన్ స్కీం, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆయకట్టు భూములతో తాగునీటి అవసరాలకూ ఈ నీటినే వాడాలి. రాష్ట్ర విభజన జరిగాక ప్రాజెక్టుల్లోని నీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాగునీటి కోసం అవసరమని ఆంధ్రప్రదేశ్, విద్యుదుత్పత్తికి కావాలంటూ తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగంపై వాదులాడుకుంటున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్ని చూసి మళ్లీ కరువు తప్పదంటూ ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు అందివచ్చిన వరద నీటిని సమర్థంగా వినియోగించుకోవడంలో వెనుకబడ్డాయి. ఫలితంగా అన్నదాతలకు ఏటా సాగునీటి తిప్పలు తప్పడం లేదు. వాడుకున్న నీటి కంటే వృధానే ఎక్కువ... కృష్ణాబేసిన్‌కు చివరనున్న కృష్ణా డెల్టా ప్రాంతంలో నదీజలాల వాడకపు గణాంకాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. 2004-05 నుంచి 2014-15 ఖరీఫ్ సీజను వరకూ 7,010 టీఎంసీల నీరు బ్యారేజీకి చేరగా అందులో 1,933 టీఎంసీలనే తాగు, సాగు అవసరాలకు వినియోగించారు. మిగతా 5,077 టీఎంసీల నీరూ సముద్రంలో కలిసింది. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం ఒక టీఎంసీ (థౌజెండ్ మిలియన్ క్యూసెక్స్) నీటితో ఆరున్నర నుంచి ఏడు వేల ఎకరాల మాగాణి, 14 వేల మెట్ట భూములను సాగులోకి తీసుకురావచ్చు. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల మధ్య నీటి నిల్వలకు ఏడాది కిందట వరకూ ఎటువంటి ప్రాజెక్టులు, రిజర్వార్లు లేనందున వరదనీటిని పెద్ద మొత్తంలో సముద్రంలోకి వదిలారు. దీన్ని గుర్తించిన వైఎస్ పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏడాది కిందట దీన్ని ప్రారంభించినా పూర్తి సామర్థ్యంలో (45 టీఎంసీలు) నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ 54 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా రివర్‌బోర్డు అధికారులు బేసిన్ పరిధిలో నీటి వాడకం, సర్ప్లస్ వాటర్ వివరాలను పరిశీలిస్తున్నారు. బ్యారేజీ దిగువన నీటి నిల్వకు చెరువులు... వృధాగా సముంద్రంలోకి వెళ్లే జలాలను నిల్వ చేసుకుని అటు తాగు, ఇటు సాగునీటిగా వాడుకునేందుకు వైఎస్ కాలంలోనే ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టారు. అయితే 2009లో వచ్చిన భారీ వరదల తరువాత ప్రభుత్వం వీటి సంగతినే మర్చిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి హంసలదీవి వరకూ సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బ్యారేజీ నుంచి దిగువకు విడుదలయ్యే నీటిని అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లో 20 టీఎంసీల వరకూ నిల్వ చేయాలన్న ఆలోచన అటకెక్కింది. ఇక్కడి ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు బాగా పెరిగే వీలుంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో మూడు టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయడం సాధ్యం కాదు. ప్రకాశం బ్యారేజీ 10 కిలోమీటర్ల ఎగువన మరో బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మిస్తేగానీ కొంత మేర సమస్య పరిష్కారం కాదు. -
2 రాష్ట్రాలా? 4 రాష్ట్రాలా?
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిపై అయోమయం నేడు రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న ట్రిబ్యునల్ వ్యతిరేకత వ్యక్తం చేయనున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధి విషయంలో అయోమయం నెలకొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ట్రిబ్యునల్ గడువును రెండేళ్లపాటు పొడిగించిన విషయం విదితమే. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం.. రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడంతో పాటు కరువు నెలకొన్న సంవత్సరాల్లో అనుసరించడానికి ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ ప్రొటోకాల్స్ రూపొందించడం ట్రిబ్యునల్ బాధ్యతగా చట్టంలో పేర్కొన్నారు. అయితే ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయింపులు చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అఫిడవిట్లు సమర్పించిన విషయం విదితమే. కానీ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకే పరిమితమని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తన తాజా లేఖలో స్పష్టం చేసింది. కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంపై బుధవారం జరగనున్న సమావేశంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను ట్రిబ్యునల్ తీసుకోనుంది. ఈ మేరకు అభిప్రాయం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ట్రిబ్యునల్ పరిధి రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు స్టే సంగతేమిటి? కృష్ణా జలాల కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. రాష్ట్ర విభజన తర్వాత.. ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేసి తాజాగా నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అరుుతే సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో.. ఆమల్లోలే ని తీర్పు మేరకు ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడం సాధ్యమేనా? అనే కోణంలో ట్రిబ్యునల్ ముందు వాదించేందుకు ఏపీ సమాయత్తమవుతోంది. 65 శాతం నీటి లభ్యత గురించి తేల్చండి దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా నీటి కేటాయింపులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అప్పట్లో అఖిలపక్షం విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరంపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ రాలేదు. దీని ఆధారంగా.. ట్రిబ్యునల్ తీర్పులో కీలకాంశమైన 65 శాతం డిపెండబిలిటీ పై కేంద్రం వైఖరి చెప్పకుండా, ట్రిబ్యునల్ పరిధి విషయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సొంత వ్యాఖ్యానం చెబుతూ రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి రాష్ట్రం వచ్చింది. మెుత్తం మీద రెండు రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ట్రిబ్యునల్‌కు లేదని, అందరి వాదనల విన్న తర్వాత నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు
-
మళ్లీ పంచాలి!
-
మళ్లీ పంచాలి!
* కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్రం డిమాండ్ * బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించేందుకు సిద్ధం * ఉమ్మడి రాష్ట్రంలో నీటికేటాయింపుల్లో అన్యాయం.. ఎగువ రాష్ట్రాలతోనూ సమస్య * తెలంగాణలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉండగా.. నీటి కోటా 36.4 శాతమే ట్రిబ్యునల్ ఎదుట ఉమ్మడి * ఆంధ్రప్రదేశ్ వాదనలు సమ్మతం కాదు * మహారాష్ట్ర, కర్ణాటకతో సహా మళ్లీ విడిగా వాదనలు వినాలి.. * మొత్తం జలాలను నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలి * మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని కోరనున్న టీ-సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని.. మళ్లీ వాదనలు వినాల్సిందేనని కోరనుంది. అంతేగాకుండా కృష్ణా నీటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మాత్రమేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను కూడా కలుపుకొని మొత్తం నదీజలాలను తిరిగి పంచాలని విజ్ఞప్తి చేయనుంది. నదిలో నీటి లభ్యత శాతం, నీటి ప్రవాహం అంచనా కోసం పరిగణనలోకి తీసుకున్న 47 ఏళ్ల సమయం విషయంలో పలు అభ్యంతరాలను వెల్లడించనుంది. మొత్తంగా ప్రస్తుతమున్న దానికంటే ఎక్కువ నీటి కేటాయింపులు పొందాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సమావేశాల్లో తన వాదన వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఎటూ తేలని పంపిణీ.. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. అయితే జలాలను పంపిణీ చేస్తూ ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగకపోవడంతో.. పదేళ్ల కింద బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కృష్ణా ట్రిబ్యునల్-2ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించింది. కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉండడంతో.. ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే ఈ లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. దాంతో రెండు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యను పరిష్కరించడానికి వీలుగా అదే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగించారు. ఈ ట్రిబ్యునల్ తొలి సమావేశం వచ్చే నెల 24వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ ట్రిబ్యునల్ సమావేశంలో తమ వాదనలను వినిపించడానికి ఆయా రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. మొదటి నుంచీ పంచాలి.. వాస్తవానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు ఉద్దేశం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి మాత్రమే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే వచ్చే నెలలో జరగనున్న ఈ ట్రిబ్యునల్ సమావేశాలకు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్ణాటకను కూడా ఆహ్వానించారు. దీంతో కృష్ణా జల వివాదం రెండు రాష్ట్రాల మధ్యనే కాకుండా నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనల్ని వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సర్కారు వెల్లడించనుంది. ముఖ్యంగా నీటి పంపిణీని మళ్లీ మొదటి నుంచీ చేయాలని కోరనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని... వాటి ఆధారంగా చేసిన కేటాయింపులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున వాటిని వ్యతిరేకించనుంది. నాలుగు రాష్ట్రాల సమస్య కృష్ణా నది జల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశంగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరనుంది. తద్వారా ఎక్కువ నీటిని పొందవచ్చని అంచనా వేస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదంగా చూస్తే... ఆలమట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉండదు. కేవలం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దాంతో నీటి కోటా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయా న్ని దృష్టిలో ఉంచుకుని.. కృష్ణా జలాల సమస్యను నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాలని తెలంగాణ సర్కా రు కోరనుంది. ప్రత్యేకించి నీటి కేటాయింపుల్లో నది పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ నీటి కేటాయింపు మాత్రం 36.4 శాతమే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ.. కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని వాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో అన్యాయం తెలంగాణ వాదనల సందర్భంగా కేవలం ఆంధ్రప్రదేశ్తోనే పంచాయితీ ఉందని మాత్రమేగాకుండా... ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వల్ల కూడా అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ట్రిబ్యునల్ మందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం పద్ధతి, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని కోల్పోవడం, నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47 ఏళ్ల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం.. తదితర అంశాల్లో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. అలాగే నది నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడాన్ని కూడా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కృష్ణా నీటిని ఇతర నదుల పరీవాహక ప్రాంతాలకు వినియోగించడానికి అనుమతించ వద్దని కోరనుంది. మిగులు జలాల పంపిణీని కూడా రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేయనుంది. -
వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు
రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. కృష్ణ మిగులు జలాలను సంపూర్ణంగా విని యోగించుకునే స్వేచ్ఛను హరించి, కరవు పీడిత ప్రాంత ప్రజల ఆశలను ఆవిరి చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగుజాతి పాలిట అశనిపాతమే. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నదిపై 1852-56 మధ్య విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా, గుంటూరు కాలువల లోను, కృష్ణ ఉపనది తుంగభద్రపై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టతో కర్నూ లు- కడప కాలువలోను నీరు పారించాడు. నాగా ర్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవదశకు 1956లోను ప్రాణం పోశారు. ఇదే జరగకుంటే నేడు తెలుగుజాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించలేం! భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని 1960లో జరిగిన అంతర్రాష్ట్ర మహా సభ చర్చించింది. 1951కి ముందు నిర్మితమై నీటిని వినియోగించుకొంటున్న, 1950 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి రక్షణ కల్పించాలని ఆ సభ ఆమోదించింది. ఆ నిర్ణ యమే రక్షాకవచమై కృష్ణా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా లభి స్తున్న 2060 టీఎంసీలలో మన రాష్ట్ర వాటా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టీఎంసీలు సురక్షితంగా ఉన్నాయి. బ్రిజేశ్ తీర్పు అలా పరిణమించడానికి మూల కారణం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఈ అవకాశాన్ని ఉప యోగించుకొని కృష్ణా జలాల పునః పంపకం తాము కోరుకొన్న రీతిలో ఉం డేటట్టు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో సాధ్యం చేసుకున్నాయి. అర్థ దశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకునే తీరిక మన ప్రభుత్వానికి మాత్రం లేదు. అసలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్ణాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమలో, మహబూబ్‌నగర్, నల్లగొండ (తెలంగాణ), ప్రకాశం (కోస్తా) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లపై అభ్యంతరాలు లేవదీస్తూనే ఉన్నాయి. 2000 మే 31న ట్రిబ్యునల్ గడువు ముగియగానే అవి ఈ సమస్యపై వివాదాన్ని రేపి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయో గించి విజయం సాధించాయి. మనకి మాత్రం జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలు వ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇరుగు-పొరుగుకు అనుకూలంగా... నీటి లభ్యతను నిర్థారించడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎంచుకొన్న ప్రమాణం అసంబద్ధమైనది. కర్ణాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటా యించడానికే కొలమానాలను ఎంచుకున్నట్టు భావించేటట్టుగా ఉంది. మూడు రాష్ట్రాల జలాశయాలలో స్థూలంగా 1919 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న దని, 1518 టీఎంసీల (మహారాష్ట్ర+కర్ణాటక+ఆంధ్రప్రదేశ్ః 483.24+479.35+ 555.84= 1618.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, గరిష్టంగా 2313 టీఎంసీ (మహారాష్ట్రలో 551.65 టీఎంసీలు, కర్ణాటకలో 695.97 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 1065.44 టీఎంసీల) నీటిని వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసింది. తదనుగుణంగా 65 శాతం విశ్వసనీయత ఆధారంగా 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి, పం దారం చేసింది. 1518.43 టీఎంసీలలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా లలో ‘క్వారీ ఓవర్’ నిల్వకు అనుమతించిన 150 టీఎంసీలను మినహాయిస్తే 1368.43 టీఎంసీ సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ - వినియోగ నిష్పత్తి 1:1.40గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. నిర్మాణం పూర్తి కాని పులిచిం తల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడిక వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశం ఆనకట్ట వద్ద నుంచి అనివార్యంగా సముద్రం పాలవుతున్న నీటిని లెక్కలోకి తీసుకోలేదు. హేతుబద్ధం కాని కొలమానాలు బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుంచి 1971-72 వరకు అందుబాటులో ఉన్న 78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని 75 శాతం ప్రామాణికంగా 2060 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీల పునరుత్పత్తి నీళ్లు లభిస్తాయని నిర్ధారించింది. ఆ మేరకు మహారాష్ర్టకు 585 (560 నికర జలాలు+ 25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734 (700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టీఎంసీలు కేటాయించింది. కానీ 112 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలు ఉన్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలను మాత్రమే బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొని 65 శాతం విశ్వసనీయత ఆధారంగా నికర జలాలు 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించింది. అలాగే 75 శాతం విశ్వసనీ యతపై 2173 టీఎంసీలు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికర జలాలు 2060+70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టీఎంసీలకు ఇవి సరిస మానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే, బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపును యథాతథంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293- 2130) టీఎంసీలను మూ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. గంగలో కలిసిన జాతీయ విధానం నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యు దుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా ముంబై, దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టీఎంసీలతో పాటు మరో 25 టీఎంసీలను, సాగునీటి ప్రాజెక్టులకు 18 టీఎంసీలు, మొత్తం 43 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది. కర్ణాటకకు 65 టీఎంసీలను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది. అక్కడితో ఆగకుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టీఎంసీలుగా నిర్ధారించి, 65 శాతం విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టీఎంసీలు పోను 285 టీఎంసీలు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టీఎంసీ, కర్ణాటకకు 105 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించడం ద్వారా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మిం చుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పెపైచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది. ఇది చాలా ప్రమా దకరమైనది. మొత్తంగా మహా రాష్ట్రకు 666 (585+4+35+3) టీఎంసీలు, కర్ణాటకకు 911 (734+65+105+7) టీఎంసీల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ మన రాష్ట్రానికి నీళ్లు వచ్చే అవకాశాలు మృగ్యం. వాదనలు పట్టని ట్రిబ్యునల్ మన రాష్ట్రం పట్ల ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. 65 శాతం విశ్వసనీ యత పద్దు కింద 43 టీఎంసీలను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టీఎంసీ లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచిన రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువకు 4 టీఎంసీలను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశం ఏమిటంటే 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టీఎంసీలను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పథకాలకు కేటాయిం చకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు కింద జమ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ 150 టీఎంసీల మిగులు జలాలను క్యారీ ఓవర్ నిమిత్తం నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టీఎంసీలను మంజూరు చేసి, అందులో 120 టీఎంసీలను, వాటికి తోడు 65 విశ్వసనీయత ఉన్న 30 టీఎంసీలను వెరసి 150 టీఎంసీలను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో, రావో తెలియని మిగులు జలాల నుంచి 25 టీఎంసీలను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది రాయలసీమను దగా చేయడమే. గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ర్టకు 99 శాతం, కర్ణాటకకు 97 శాతం సఫలీ కృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 68 శాతం ఉన్నదని మొరపెట్టుకున్నా ట్రిబ్యునల్ చెవికెక్కలేదు. కరవు ప్రాంతాలపై వివక్ష ఏల? కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీ టర్లు, కర్ణాటకలో 52,375 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 45,493 చదరపు కిలోమీటర్ల మేరకు కరువు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డీపీఏపీ గణాం కాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65 శాతం విశ్వనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 టీఎంసీలు, మొత్తం 448 టీఎంసీల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. మరొక వైపున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదిం చిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జలమండలిని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నేతృ త్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరి ష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. -
ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, మండల బుద్ధప్రసాద్, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ తరపున నారాయణ, గుండా మల్లేష్ పాల్గొన్నారు. సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బీజేపీ నుండి నాగం జనార్థన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్‌సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ హాజరు అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
బ్రిజేశ్ తీర్పు సవాల్ చేయండి: రైతుసంఘాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనున్నందున, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుపై రైతుల్లో నెలకొన్న భ యాందోళనలపై సోమవారమిక్కడ సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, అరవిందరెడ్డి, అంతరాష్ర్ట జల విభాగం ఇంజనీర్లు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తీర్పు అమల్లోకి రాకుండా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. న్యాయపోరాటంలో ఇప్పటి వరకు ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే... వాటిని సవరించుకోవాలని కోరారు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
సోనియా వల్లే కృష్ణా కష్టాలు
-
సోనియా వల్లే కృష్ణా కష్టాలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి
* మిగులు జలాలపై మన రాష్ట్రానికి హక్కు ఉండదని తీర్పు వచ్చిందే బాబు హయాంలోనే.. * దీన్ని కౌంటర్ చేయాల్సిన చంద్రబాబు.. సీఎంగా ఉండి కూడా పట్టించుకోలేదు * తర్వాత వైఎస్ సీఎం అయ్యాక వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కట్టడానికి యత్నించారు * ఈ సమయంలో కర్ణాటక ఇంజక్షన్ ఆర్డర్ కోరితే.. దాన్నుంచి తప్పించుకోవడానికి నాడు వైఎస్ లేఖ రాశారు * రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మా పర్యటనతో దేశమంతా తెలుస్తోంది.. * అందుకే ఇప్పుడు రాయల తెలంగాణను తెరపైకి తెచ్చారు? సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా గట్టిగా ప్రభావితం చేశారని, అందువల్లే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తుది తీర్పు వెలువడిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలనే ఆరాటంతోనే ఆమె మిగులు జలాల అంశమే లేకుండా చేశారని విమర్శించారు. ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకూ, ట్రిబ్యునల్ తీర్పునకూ లింకు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చెప్పి సోనియాగాంధీ పుట్టిన రోజైన 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటన చేశారు. 2010లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. అంటే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత 2010లో ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఇపుడు మళ్లీ డిసెంబర్ 9న రాష్ట్ర విభజన చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ మిగులు జలాలు వివాదాస్పదం కాకుండా చేయాలని చెప్పి.. ఎటువంటి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 9లోపు ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడేలా చేశారు. ఇంత స్పష్టంగా తేదీలతో సహా జరుగుతూ ఉంటే ఇంత కన్నా సంకేతాలు ఏం కావాలి.. ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేశారనడానికి? తాజా తీర్పుతో ఇక మిగులు జలాలే మీకు లేవు, మీ చావు మీరు చావండి అని చెపుతున్నారు’’ అని జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టూ ఎందుకు కట్టలేదు చంద్రబాబూ.. ‘‘1973లో కృష్ణా నదీ జలాలపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై.. 1976లో కర్ణాటక కొన్ని వివరణలు అడిగింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ వివరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగులు జలాలపై పూర్తి హక్కులు ఉన్నట్లే! అప్పటి నుంచి 2004 సంవత్సరం వరకూ అంటే 1976 నుంచి 28 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఈ తీర్పును అనుసరించి ప్రాజెక్టులు కట్టుకుందామన్న ఆలోచన ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు’’ అని జగన్ విమర్శించారు. ‘‘ఆ తరువాత 1997వ సంవత్సరంలో కర్ణాటక వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికి దే వేగౌడను ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఈ సమయంలోనే కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతునిచ్చింది. దేవెగౌడ ప్రధానిగా ఉండగా, చంద్రబాబు సీఎంగా ఉండగా ఇది జరిగింది. ఆ తరువాత 2000లో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తీర్పు వచ్చింది. అంటే చంద్రబాబు.. మంచి న్యాయవాదులను పెట్టలేదా? లేదా నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారా? మరొకటా...మరొకటా...అనేది నేను వేరే చెప్పనవసరం లేదు’’ అని జగన్మోహన్రెడ్డి అన్నారు. అది దారుణమైన తీర్పు.. ‘‘ఆ తీర్పు ఎంత దారుణమైనదీ అంటే.. దిగువ రాష్ట్రాలకు.. కేటాయించిన జలాలకన్నా ఎక్కువ హక్కు ఉండదు. మరో మాటలో చెప్పాలంటే , బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు ఎలాంటి హక్కూ ఉండదు. (బాబు హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ఈ సందర్భంగా చదివి వినిపించారు) అంటే మనకున్న మిగులు జలాలను, మనకున్న హక్కును సుప్రీంకోర్టు తీసేసింది. దీనిని కౌంటర్ చేయాల్సింది పోయి, దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాల్సింది పోయి, 2000 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు, ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 1973 నుంచి 2003 వరకూ ఈ ట్రిబ్యునల్ తీర్పు అమల్లో ఉంటుంది, 2004లో కొత్త ట్రిబ్యునల్ వస్తుంది, ఈలోపు ఎన్ని పెద్ద ప్రాజెక్టులను మనం కట్టగలితే అన్ని కట్టి వాటన్నింటికీ కూడా మనం నికర జలాల హక్కును తెచ్చుకోవచ్చునని దివంగత రాజశేఖరరెడ్డి చెప్పినా.. చంద్రబాబు తాను చేయాల్సిన పని చేయలేకపోయారు’’ అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే వైఎస్ ఆ నోట్ ఇచ్చారు.. ‘‘2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరక్కుండా ఉండటం కోసమని చెప్పి కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందే, ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగితే అన్ని కట్టి వీలైన మేరకు నికర జలాలను కేటాయింపజేసుకోవడం కోసం వైఎస్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇలా వైఎస్ ప్రాజెక్టులు కడుతున్నారని తెలిసి.. కర్ణాటక రాష్ట్రం కొత్త ట్రిబ్యునల్‌ను కలిసి ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని అడిగింది. అలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒక నోట్ ఇచ్చారు. ఈ నోట్‌ను ప్రభుత్వం అంతర్గతంగా సర్క్యులేట్ చేసింది. సచివాలయంలో ఎవరినడిగినా ఈ నోట్ ఇస్తారు. రహస్యమేమీ కాదు. ఇందులో స్పష్టంగా ఇచ్చారు. ఆ లేఖలో తప్పేమీ అనలేదు. అవన్నీ నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు అని అంటూ తన మనసులో ఉన్న మాట, ఏదైతే తాను చేయాలనుకున్నారో అదే వైఎస్ చెప్పారు. అది తప్పు కూడా కాదు. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా, దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడే రాష్ట్రానికి అన్యాయం జరిగే తీర్పు వచ్చింది. ఇందుకు సంబంధించి వాదనలు జరిగినపుడు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ .. బాబు హయాంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ ‘మీ ప్రాజెక్టులను నిర్మించకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వకూడదు’ అని ప్రశ్నించింది. అపుడు ఆ ఇంజెక్షన్ ఆర్డర్‌ను తప్పించుకోవడానికి, మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించడానికి వైఎస్ రాసిన లేఖ ఇది. అందులో కూడా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే ఆయన ఉటంకించారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా బాబు దానిని పట్టుకుని యాగీ చేస్తున్నారు.’’ అని జగన్మోహన్రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. (1976లో బచావత్ ఇచ్చిన వివరణలను ఈ సందర్భంగా జగన్ విలేకరులకు ఇచ్చారు) కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారో వారికి తెలుసా...? ‘‘అసలు కాంగ్రెస్ వాళ్లు విభజన విషయంలో ఏం చేస్తున్నారో వారికి తెలుసా..? ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా పడితే అలా విభజిస్తున్నారు. ఈ క్రమంలో వారేమీ పట్టించుకోవడం లేదు. ఇపుడు తాజాగా రాయల తెలంగాణను తెరమీదకు తెచ్చారు. జాతీయ స్థాయిలో నేను రాజకీయ పార్టీల వద్దకు వెళ్లి ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను. ఇపుడు ఈ విషయం అందరికీ తెలుస్తోంది. అందుకే ఇపుడు రాయల తెలంగాణ అంటున్నారు. అసలు రాయలసీమను విభజించే హక్కు వారికి ఎవరిచ్చారు? రెండు జిల్లాలనే ఎందుకు.. అసలు అన్ని జిల్లాలను కలిపేసి దానికి తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే సరిపోతుంది కదా... ఇలా చేస్తే అందరమూ సంతోషంగా ఉంటాం. ఈ ప్రతిపాదనకు తొలుత మద్దతు తెలిపేది నేనే.. ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా చేస్తున్నారు. ఏం నాన్సెన్స్ ఇది! (ఎంత తెలివి తక్కువ తనం ఇది!) అందుకే అన్ని రాజకీయ పక్షాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అన్యాయాన్ని ఆపమని. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాలని కోరుతున్నా... కేంద్రంలో 272 సీట్లతో ఎవరు అధికారంలో ఉంటే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా ఇష్టమొచ్చినట్లు చీల్చేసే పరిస్థితి ఉండకూడదని అంటున్నా.. ఈ రాష్ట్రాలన్నీ కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడినవే. అసెంబ్లీలో ఏక గ్రీవ తీర్మానం కాకపోయినా మూడింట రెండువంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్రాలు విభజించేలా ఉండాలి. అలాగే పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటేనే విభజనకు పూనుకోవాలి. ఈ సవరణ ప్రజాస్వామ్యం బతికి బట్టడం కోసం చేయాలని కోరుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే అదొక చెడు సంప్రదాయంగా మిగిలి పోతుంది. ఇవాళ ఇక్కడ చేస్తే రేపు ఇతర రాష్ట్రాలను కూడా ఇలాగే ఓట్లకోసం, సీట్ల కోసం విభజించే ప్రమాదముంది. పార్లమెంటులో మా పార్టీకి ఉన్న బలం మూడే.. అందుకే ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలని అన్ని పార్టీల నేతలను కోరుతున్నాం. దేవుడు కూడా మాకు తోడుగా ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాం’’ అని జగన్ అన్నారు. సమైక్యం కోసం అందర్నీ కలుస్తాం మంగళవారం ఏవో ఇతర పనుల కారణంగా యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో ఉన్న అపాయింట్మెంట్ రద్దయిందని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మళ్లీ ఆరో తేదీన కలవమని సమాచారమిచ్చారని, ఆ రోజు కలుసుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తామని అన్నారు. ‘‘వారిని మళ్లీ కలవడానికి మాకు ఎలాంటి నామోషీ లేదు, తగ్గుతాం.. ప్రాధేయపడతాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తగ్గి వ్యవహరిస్తాం’’ అని జగన్ అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలుఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్ల కిందట మరణించిన వ్యక్తిపై నిందలా? ‘‘రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని తిట్టాల్సింది పోయి చంద్రబాబు.. నాలుగేళ్ల క్రితం చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట చనిపోయిన ఆ వ్యక్తి ఏదో ఒక లెటర్ ఇచ్చారు అని చంద్రబాబు చెబుతారు. ఆ లెటర్ ఎందుకు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఆ లెటర్ మంచి చేయడానికే ఇచ్చారని అందరికీ తెలుసు. వైఎస్ చనిపోయాక రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతూ వస్తున్నాయి. రోశయ్యనుగాని, కిరణ్నుగాని ట్రిబ్యునల్‌కు వేరే లేఖ ఎవరైనా ఇవ్వొద్దన్నారా? వేరే వాదనలు వినిపించవద్దని ఎవరైనా మెడపై కత్తి పెట్టారా? అవన్నీ చేయరు కానీ, అన్యాయంగా మాట్లాడతారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు.. సోనియాను తిట్టకుండా, రోశయ్యను తిట్టకుండా, కిరణ్‌ను తిట్టకుండా నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేస్తారు. ధర్నా చేస్తానని అంటారు.. అసలు ముందు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసి ఆయనే తప్పు చేశారు. రెండోది ఇపుడు సోనియాగాంధీ తప్పిదం చేస్తున్నారు. ఇవీ రాజకీయాలు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందీ అంటే నీళ్లు కూడా లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. విభజనతో కింది రాష్ట్రానికి నీళ్లు దొరకవు అన్న సంగతి తెలిసినా, పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకవు అని తెలిసినా చంద్రబాబు వ్యతిరేకించరు...పైగా మద్దతిస్తారు. ఈ వ్యవస్థలో నిజాయితీ పూర్తిగా కరువైన ఇంతటి దారుణమైన రాజకీయాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదు’’ అని జగన్ అన్నారు. -
'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఏమీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ట్రిబ్యునల్ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జనవరిలో ఏర్పడుతుందని పాల్వాయి గోవర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని వెల్లడించారు.