నగరానికి గోదావరి నీళ్లు తేవాలి: బద్దం
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి కృష్ణా నది నీరు సరిపోనందున గోదావరి నుంచి నీటి తీసుకురావాలని బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.300-500 కోట్లు ఖర్చు చేస్తున్నా నగరానికి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నల్లా ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెబుతున్న సీఎం కేసీఆర్, 2019 కల్లా ఎన్ని ఇళ్లకు రోజూ నీళ్లు సరఫరా చేస్తారో చెప్పాలన్నారు.
శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వాటర్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారని, వారికే ప్రమోషన్లు ఇచ్చి అందలాలు ఎక్కిస్తున్నారని ఆరోపించారు.