
సాక్షి,అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు నదులలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌లో ఇన్‌ఫ్లో 5,14,386 ఉండగా, ఔట్‌ఫ్లో లక్షన్నర క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా , ప్రస్తుతం 585 అడుగుల నిల్వ ఉంది.
పులిచింతల ప్రాజెక్ట్ 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో లక్షన్నర క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.