Pulichinthala Project
-
సాగర్ నుంచి 3.54 లక్షల క్యూసెక్కులు దిగువకు..
నాగార్జునసాగర్/దోమలపెంట/సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి భారీగా వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సాగర్ నీటిమట్టం 585.40 అడుగుల వద్ద నిల్వ సామర్థ్యం 298.5890కు చేరడంతో ఆరు గేట్లను ఐదు అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,70,920 క్యూసెక్కుల నీరు వదిలారు.మధ్యాహ్నం 2 గంటలకు వరద మరింత పెరగడంతో 22 గేట్లను పది అడుగుల పైకెత్తి 3,09276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,14,594 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,54,663కు పెంచారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 585.10 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 297.7235 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు..సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చెరువులు నింపేందుకు వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడటంతో మంగళవారం ఉదయం వరద కాల్వకు నీటిని నిలిపేశారు. మరోవైపు ఏఎమ్మారీ్పతో పరిధితోపాటు ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు వాగులు ఎండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.పులిచింతల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదలపులిచింతల ప్రాజెక్టు సగం నిండిపోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి దిగువకు 1,08,895 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో.. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. -
చంద్రబాబుపై మంత్రి అంబటి ఫైర్
-
పులిచింతలకు 7,635 క్యూసెక్కుల నీరు విడుదల
సత్రశాల (రెంటచింతల): గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద ఉన్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 7,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మూసివేయడంతోపాటు 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారని పేర్కొన్నారు. సత్రశాల నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 20 క్రస్ట్‌గేట్లు మూసి రెండు యూనిట్ల ద్వారా 43.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అనంతరం 7,635 క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.17 మీటర్ల నీరుందని తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 7.080 టీఎంసీలుకాగా 6.841 టీఎంసీల నీరుందని తెలిపారు. గత 24 గంటల్లో 1.0522 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం 25.796 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన చేసినట్లు తెలిపారు. -
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ వద్ద పనులు కొనసాగుతున్నాయని, సాయంత్రానికి స్డాప్ లాక్ గేట్ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాలుగు ఎలిమెంట్స్ ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేశాం. ఇంకా ఏడు ఎలిమెంట్స్‌ని సాయంత్రానికి పెట్టి స్టాప్ లాగ్ గేట్‌ని పూర్తి చేస్తాం. ఇదే సమయంలో గత మూడు రోజులుగా ఎత్తిన 17 గేట్లని ఒక్కొక్కటిగా మూసివేస్తున్నాం. ఇప్పటివరకు ఏడు గేట్లు మూసేశాం. ఆ తర్వాత మిగిలిన పది గేట్లని మూసివేసి అవుట్ ఫ్లో నిలిపివేస్తాం. ప్రస్తుతం సాగర్ నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. రోజుకి మూడు టీఎంసీలు వచ్చినా పది రోజులలో ప్రాజెక్ట్ వద్ద నీటి నిల్వ సామర్ద్యం యధావిధిగా 45 టీఎంసీలకు చేరుకుంటుంది. కొత్త గేట్ ఏర్పాటుకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతా’’మని అన్నారు. -
కొట్టుకుపోయిన పులిచింతల గేటు లభ్యం
-
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత
సాక్షి,అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు నదులలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌లో ఇన్‌ఫ్లో 5,14,386 ఉండగా, ఔట్‌ఫ్లో లక్షన్నర క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా , ప్రస్తుతం 585 అడుగుల నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో లక్షన్నర క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక టీఎంసీ నీరు కడలిలోకి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల శనివారం ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక టీఎంసీకిపైగా జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. ఓవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోగా మరోవైపు తెలంగాణ సర్కార్ చర్యల వల్ల భారీ ఎత్తున జలాలు వృథాగా కడలిలో కలుస్తుండటంపై ఇరు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ 6,357 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 810.33 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 34.45 టీఎంసీలకు పడిపోయింది. నాగార్జునసాగర్‌లోనూ తెలంగాణ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటంతో నీటిమట్టం 530.81 అడుగులకు తగ్గింది. నీటి నిల్వ 166.59 టీఎంసీలకు పడిపోయింది. సాగర్ నుంచి విడుదల చేస్తున్న ప్రవాహానికి, స్థానికంగా వర్షాల వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో పులిచింతలలో నీటి నిల్వ 39.93 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల్లో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 14,024 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 11,952 క్యూసెక్కులను 20 గేట్ల అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ సర్కార్ చర్యలు పంటల సాగుకు ఇబ్బందిగా మారుతుందని ఇరు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
812 అడుగులకు తగ్గిపోయిన శ్రీశైలం నీటిమట్టం
సాక్షి, అమరావతి/సత్రశాల (రెంటచింతల)/విజయపురి సౌత్: కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని బుట్టదాఖలు చేస్తూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని పెంచడంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక టీఎంసీ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి దాపురించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. శ్రీశైలంలో వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ఆపడం లేదు. గురువారం విద్యుదుత్పత్తి చేస్తూ 8,663 క్యూసెక్కులను వదిలేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 812.14 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 35.51 టీఎంసీలకు తగ్గిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు శ్రీశైలంలోకి 26.44 టీఎంసీల ప్రవాహం వస్తే.. తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25.89 టీఎంసీలను అక్రమంగా తోడేయడం గమనార్హం. నాగార్జునసాగర్‌లోకి 12,955 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ 30,622 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీంతో సాగర్‌లో నీటిమట్టం 528.97 అడుగులకు తగ్గింది. నీటి నిల్వ 169.32 టీఎంసీలకు పడిపోయింది. పులిచింతల ప్రాజెక్టులోకి 30,361 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 38.74 టీఎంసీలకు చేరుకుంది. దీంతో తెలంగాణ విద్యుదుత్పత్తిని పెంచేసి 10,500 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఈ జలాలు శుక్రవారం ప్రకాశం బ్యారేజీకి చేరతాయి. దీంతో శుక్రవారం నుంచి రోజూ ఒక టీఎంసీ మేర ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,841 క్యూసెక్కులు వస్తుండగా.. 18 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి 7,470 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేశామని ఈఈ స్వరూప్ తెలిపారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 4.44 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలవడం గమనార్హం. టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి కాగా, గుంటూరు జిల్లాలోని సత్రశాల వద్ద నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 30,998 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈ బి.కాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌లో గరిష్టస్థాయిలో 7.080 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. -
‘కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే పోటీ చేస్తున్న’
సాక్షి, సూర్యాపేట: భూమాఫియా దురాగతాల నుంచి తమను కాపాడలంటూ లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసమ్మ సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానిలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆ వివరాలు.. 85 ఏళ్ల వయసులో గెలుస్తాననో.. గెలవాలనో ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ప్రచారం చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులను, తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వానికి, ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎంతో విలువైన భూమి ఉందని.. కానీ తాను, తన పిల్లలు పేదరికంలోనే మగ్గుతున్నామని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. మొత్తం 179 ఎకరాల భూమి.. తమది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామం అని తెలిపారు. 1940-50 మధ్య కాలంలో తన భర్త అచ్యుత రామశ్యాస్త్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని.. జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. ఆ కాలంలో గ్రామంలో తమకు సర్వే నంబర్ 488లో 179 ఎకరాల భూమి ఉండేదన్నారు. అంతేకాక సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భర్త స్వయంగా 79 ఏకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. తమకు 13 మంది సంతానం అని.. ఉన్న వంద ఎకరాల భూమిని కుమారులకు సమంగా పంచి.. 30 ఏళ్ల క్రితం తన భర్త మరణించాడని పేర్కొన్నారు. ఈ భూమికి పట్టాలు ఉన్నాయని తెలిపారు. తమ భూమి పరిసర ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్ట్ రావడంతో భూమికి డిమాండ్ పెరిగిందని దాంతో భూమాఫియా కన్ను తమ భూమి మీద పడిందన్నారు లక్ష్మీ నర్సమ్మ. భూమాఫియా బెదిరింపులు.. భూమాఫియాకు జడిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులు, గిరిజనులకు భూమి పథకంలో భాగంగా తమ భూమిని విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు అప్పటి జిల్లా కలెక్టర్ కూడా అంగీకరించారన్నారు. కానీ భూమాఫియా దళితులకు భూమి అమ్మడానికి వీలు లేదని.. తమకే అమ్మాలని.. అది కూడా అతి తక్కువ ధరకే అమ్మాలని తమను బెదిరిస్తున్నారని లక్ష్మీ నర్సమ్మ వాపోయారు. ఈ క్రమంలో తమ కుమారులపై దాడి కూడా చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు కూడా దాడి చేయండి అని సలహా ఇచ్చారన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కలెక్టర్, డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశామని.. ఫలితం లేదని వాపోయారు. తనకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేశారని లక్ష్మీనర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే.. దాంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు లక్ష్మీనర్సమ్మ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పైగా తమ కుటుంబంలోని 10 మంది ప్రభుత్వం ప్రవేశ పట్టిన రైతుబంధు పథకం లబ్ధిదారులే అన్నారు. ఇందుకు కేసీఆర్‌కు సర్వదా రుణపడి ఉంటామని తెలిపారు. ఇప్పుడు తాను చేసే ఈ చిరు ప్రయత్నం ద్వారా సమస్య పరిష్కారం అయ్యి.. తన కుమారులైన బాగా బతకాలని ఓ తల్లిగా ఆరాట పడుతున్నానని.. ఇందులో స్వార్థం లేదని అర్థం చేసుకోవాలని లక్ష్మీ నర్సమ్మ విజ్ఞప్తి చేశారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద.. హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. దీంతో దిగువన గల ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద చేరుతోంది. బ్యారేజ్‌లో ఇప్పటికే పది అడుగుల మేర నీరు చేరింది. 12 అడుగులకు నీటిమట్టం చేరిన తరువాత తూర్పు పడమర కాలువల నీటి విడుదల చేస్తామని ద్వారా అధికారులు తెలిపారు. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు పులిచింతలకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జిల్లాలోని మూడు ముండలాల్లో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నది పరీవాహకంలో నీటి ఉధృతి ఎక్కడి వరకు వస్తుందోనని రెవెన్యూ, పోలీసు అధికారులు అంచనా వేసి ముంపు గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న ప్రజలను దూర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ముంపు ప్రాం తాల్లో ఎవరైనా ఉంటే తరలివెళ్లాలని ఎస్పీ రావి రాల వెంటకటేశ్వర్లు ప్రకటన విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 2లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు పులిచింతల ప్రాజెక్టులో 1.01 టీఎంసీల నీరుంటే సామవారం అర్ధరాత్రి వరకు 17 టీఎం సీల వరకు ప్రాజెక్టులోకి నీరొచ్చింది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు. వరదతో ఒక్కరోజులోనే ఈప్రాజెక్టు నిండనుంది. దీంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డెల్టా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లు అందనున్నాయి. -
766 రోజుల జాప్యం ఖరీదు రూ.199.67 కోట్లు
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్యతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై.. వ్యూహాత్మకంగా చేసిన జాప్యానికి రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించకుండా పాలకులు 766 రోజలు జాప్యం చేశారు. మచిలీపట్నం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలంటే.. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతాన్ని డిపాజిట్ చేయాలని 2018 నవంబర్ 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టులో డిపాజిట్ చేయడానికి రూ.199.67 కోట్లను మంజూరు చేస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల మేరకు పూచీకత్తు(గ్యారంటీలు) సమర్పిస్తే హైకోర్టు నుంచి రూ.199.67 కోట్లను తీసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్‌కు ఉంటుంది. కాంట్రాక్టర్ లేవనెత్తిన అంశాలను కనీసం ఇప్పుడైనా తిప్పికొట్టేలా ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పిస్తే ఈ కేసు నుంచి గట్టెక్కవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే పులిచింతల కాంట్రాక్టర్‌కు ఒప్పంద విలువ రూ.268.89 కోట్ల కంటే రూ.399.36 కోట్ల మేర అదనంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, హైకోర్టును ఆశ్రయించి ఉంటే, ఖజానాపై భారీగా భారం పడేది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈనాటి ఈ బంధం ఆనాటిదే.. 2004 ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.268.89 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను తనకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన ఎస్సీఎల్–సీఆర్18జీ (జేవీ)కి అప్పటి సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లుల విషయంలో ఏదైనా వివాదం ఉత్పన్నమైతే డీఏబీ (వివాద పరిష్కార మండలి)ని ఆశ్రయించవచ్చనే నిబంధనను కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడటంతో 2009 నాటికే ప్రాజెక్టు పూర్తయింది. ప్రాజెక్టు పనుల్లో 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో 2011 మే 13న డీఏబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంట్రాక్టర్‌కు రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ డీఏబీ 2013 అక్టోబర్ 3న ప్రతిపాదించింది. కానీ, కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. డీఏబీ ప్రతిపాదనను సవాల్ చేస్తూ 2013 డిసెంబర్ 27న పులిచింతల ప్రాజెక్టు అధికారులు మచిలీపట్నం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంతలో 2014 ఎన్నికలు రానే వచ్చాయి. తన ప్రభుత్వాన్ని రక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు.. పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా 2014 ఫిబ్రవరి 18న జవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహాత్మక జాప్యానికి ఇదే తార్కాణం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం కోర్టులో కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా.. సాధికారికంగా వాదనలు విన్పించడంలో విఫలమైంది. పర్యవసానంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్ 2న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రూ.199.96 కోట్లను 2013 అక్టోబర్ 3 నుంచి 15 శాతం వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పలుమార్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చారని అధికారవర్గాలు చెబుతున్నాయి. 766 రోజుల జాప్యం ఫలితం.. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని.. తనకు చెల్లించాల్సిన సొమ్మును జలవనరుల శాఖ ఆస్తులు విక్రయించి, చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2017లో పులిచింతల కాంట్రాక్టర్ మచిలీపట్నం కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ (ఈపీ) ఫైల్ చేశారు. విజయవాడలోని స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్ముతో పులిచింతల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని మచిలీపట్నం కోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేస్తే.. అసలు రూ.199.96 కోట్లు, 2018 నవంబర్ 23 నాటికి వడ్డీతో కలిపి రూ.399.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కేబినెట్ తీర్మానం ప్రకారం కాంట్రాక్టర్‌కు అదనపు పరిహారం ఇచ్చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. కానీ జలవనరులు, ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు న్యాయపోరాటానికి అనుమతి ఇచ్చింది. దాంతో మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని కోరుతూ అక్టోబర్ 30న పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ అడ్వకేట్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు. మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చిన 766 రోజుల తర్వాత దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యాన్ని దాఖలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలన్నా.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలన్నా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతాన్ని డిపాజిట్ చేస్తేనే వ్యాజ్యాన్ని విచారిస్తామని తేల్చిచెప్పింది. -
అందుకే రాజకీయాలకు దూరం: దగ్గుబాటి
సాక్షి, విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యుత్‌పై సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో తాను ఎప్పుడూ డబ్బు పంచలేదన్నారు. పదవీకాలం ముగిసే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చానని దగ్గుబాటి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవని నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి కనీసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు తీసుకున్నా ఓటర్లు తమ మనోభావాలకు అనుగుణంగానే ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 1983కు ముందు ఇటువంటి రాజకీయ వాతావరణం లేదని, క్రమంగా పెరిగిందన్నారు. అందుకే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాలను ఎవరూ శాశ్వతంగా శాసించలేరని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న మోసాలను, తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతోందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై.. తెలంగాణలో ఓట్ల కోసం ఆనాటి ఏపీ నేతలు పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై మాట్లడలేదని దగ్గుబాటి ఎద్దేవ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్‌ల పనుల్లో పురోగతి సాధించారన్నారు. దేవగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఓట్లు పోతాయనే భయంతో తిరస్కరించాని ఆనాటి నేతలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కేంద్రం పరిధిలోనిదని.. అందుకే ఆ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానికే అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. మోదీ పాలనపై.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత, కుటుంబపరమైన ప్రలోభాలకు అతీతుడని అభివర్ణించారు. గూడ్స్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) సాహసోపేత సంస్కరణగా పేర్కొన్నారు. రాజకీయ కారణాలు, ఇతర అంశాల వల్ల జీఎస్టీ విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ కూడా గొప్ప నిర్ణయమే కానీ ఇన్‌కంటాక్స్ అధికారులు సరైన విధంగా నడిపించకపోవడంతో ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని వివరించారు. -
అందుకే చెల్లింపులు జరపడం లేదు: పార్థసారధి
విజయవాడ: ఏపీ ప్రభుత్వం కేవలం రూ. 170 కోట్లు తెలంగాణకు చెల్లిస్తే, కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తప్పించే పులిచింతల ఉపయోగంలోకి వచ్చేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి తెలిపారు. పక్క రాష్ట్రానికి చెల్లింపులు జరిపితే, అందులో తమకు ముడుపులు రావనే ఉద్దేశంతోనే చెల్లింపులు జరపడం లేదని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముడుపుల కోసమే పట్టిసీమ చేపట్టారని, పట్టిసీమతో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయిన తరువాతే కృష్ణా డెల్టా రైతులకు నీళ్లు వచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలున్న పులిచింతలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్లుగా దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని వివమర్శించారు.