ఫైల్ ఫోటో
సాక్షి, చిత్తూరు: కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మల్లయ్య కొండలో ఉంటున్న పురాతన ఆలయం మల్లికార్జున స్వామి గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. కుప్పంకు కూడా తాగు, సాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే శివరాత్రికి మల్లయ్య కొండ ఆలయ నిర్మాణాలు పూర్తి అవుతాయని అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, నీరు అందింస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం గురించి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒకసారి తంబళ్లపల్లె కొచ్చి చూడాలని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నామని మండిపడ్డారు. రూ.3కోట్లతో ఈ గుడిని ఆధునీకరణ చేయనున్నారు. అలాగే ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు వసతిని కల్పించనున్నారు. మల్లయ్య కొండలో మల్లికార్జున స్వామి గుడికి భూమి పూజ జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాబ్ భాష, శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment