
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు.

Comments
Please login to add a commentAdd a comment