పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
కుప్పంరూరల్, కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డు కమతమూరుకు చెందిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్ ఆధ్వర్యంలో కమతమూరుతో పాటు కత్తిమానుపల్లి, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే కుప్పం మునిసిపాలిటీకి చెందిన టీడీపీ సీనియర్ నేత అడవి కొట్టాలు సుబ్రమణ్యం కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి పార్టీలో చేరినట్టు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment