సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది.
ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. వరద నీటి కారంగా విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద ఇంట్లోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇక, వాయుగుండం బలపడటంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment