prakasham barriage
-
కృష్ణమ్మ ఉగ్రరూపం.. చంద్రబాబు ఇంటికి వరద ముప్పు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది.ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. వరద నీటి కారంగా విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద ఇంట్లోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇక, వాయుగుండం బలపడటంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
‘శ్రీశైలం’లోకి బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు 89,731 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 838.8 అడుగులకు, నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ►పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ►ఆల్మట్టి డ్యాంలోకి 36,186 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుత్కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ►నారాయణపూర్ డ్యాంలోకి 43, 570 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్కేం ద్రం ద్వారా 45 వేల క్యూ.లను దిగువకు వదులుతున్నారు. ►జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్ వే ఏడు గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ►జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జతకలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. ►పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు, సముద్రంలోకి 12,907 క్యూసెక్కులను వదులుతున్నారు. -
వరద పోటెత్తడంతో తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు
సాక్షి, విజయవాడ: కృష్ణవేణి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదీమతల్లి.. నీటి చెమ్మ దొరకగా అల్లాడిన మాగాణులను సస్యశ్యామలం చేస్తూ బిరబిరా సముద్రుడి చెంతకు పరుగులు పెడుతోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిదడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే తోట్లవల్లూరు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరోవైపు సాగర సంగమం వద్ద సముద్రపు పోటు ఉండటంతో హంసలదీవిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నీట మునిగిన కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం పుష్కరఘాట్ శివాలయం కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం ఉదయం 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా రాత్రి అయ్యే సరికి 5 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. బ్యారేజ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం.. ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచారు. ఆపై పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు 5.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే.. బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి 5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. రాత్రంగా ఇదే ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. 46.5 టీఎంసీలు సముద్రంలోకి... ఈ సీజన్లో ఇప్పటి వరకు 46.5 టీఎంసీ వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ గుండా సముద్రంలోకి చేరాయి. గురువారం కూడా వరద నీటి ఉధృతి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరకట్ట దిగువన కృష్ణానది వైపు ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా తోట్లవల్లూరు మండలం పరిధిలోని పలు అరటి, బొప్పాయి తోటలు నీటిలో నానుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు.. ముంపునకు గురైన పాములలంకకు పడవలో వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్ విజయవాడ కృష్ణలంక రణదీవె నగర్, భూపేష్‌నగర్ గుప్తా, తారాకరామానగర్, బాలాజీనగర్, రామలింగేశ్వరనగర్‌లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక్కడి నివాసులను అధికారులు రాణిగారితోట, కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్, భ్రమరాంబపురంలో ఎస్వీ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలంటూ మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు. పేదలు సురక్షిత ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి ఇళ్లలోని వస్తువులు దొంగల పాలు కాకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న తోట్లవల్లూరు ప్రాంతంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దశాబ్దకాలం తర్వాత.. దశాబ్దకాలంగా కృష్ణానదికి వరద నీరు సరిగా రావడం లేదు. 2009లో 10.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలారు. ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వదలడం ఇదే తొలిసారి. ఏళ్లుగా సముద్రంలోకి వరద నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో సముద్రం గర్భంలో నుంచి ఉప్పునీరు తోసుకువస్తోంది. దీంతో బందరుతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి చేరుతుండటంతో ఉప్పునీటి విస్తరణ తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పరిస్థితి -
ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతమైన వరద నీరు
-
ప్రకాశం బ్యారేజ్ వద్ద కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య
-
ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి
-
నీరు పారేనా... ఇక డెల్టా పండేనా
సాక్షి, విజయవాడ : రబీలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుతుంటే.. పదివేల క్యూసెక్కుల నీరు కావాలని నాగార్జునసాగర్ డ్యాం అధికారులను కోరితే ఇవ్వడానికే మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నీరు అందక పంటలు ఎండుతున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆందోళన మొదలైన తర్వాత నీటి విడుదలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంతో సాగునీరు వస్తుందా.. అన్న అనుమానం అధికారులు, రైతులను వెంటాడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితేగానీ మన రాష్ట్రానికి నీరు విడుదల కాదు. కృష్ణాడెల్టాకు రైపేరియన్ రైట్స్ (మొదట ఏర్పడిన ఆయకట్టుకు ముందుగా నీరు ఇవ్వాలి) చట్టప్రకారం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆంధ్ర ఎడారిగా మారుతుందా.. జూన్‌లో ఖరీఫ్‌కు నీరు ఇస్తే గానీ పంట చేతికి అందని పరిస్థితి ఉంది. సముద్రతీర ప్రాంతం కావడంతో ఏటా నవంబర్, డిసెంబర్‌ల్లో తుపాన్లు ఈ ప్రాంతాన్ని తాకుతాయి. ఈలోగా పంట చేతికి రానిపక్షంలో నీటిపాలు కాకతప్పదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే.. తెలంగాణవాదుల ఒత్తిళ్లకు భయపడి నీటి విడుదల జాప్యం చేయడంతో ఇప్పటికీ డెల్టాలో పూర్తిగా పంటలు వేయని పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీరు విడుదల చేయరాదన్న జీవోను అడ్డం పెట్టుకుని గత ఏడాది సాగర్, కృష్ణాడెల్టా ఆయకట్టులకు చుక్కనీరు వదల్లేదు. అయితే వర్షాలు బాగా ఉండటంతో ఖరీఫ్ పంట చేతికి వచ్చింది. నీరు లేదనే సాకుతో రబీకి క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకతో జల వివాదం నడుస్తోంది. నీటి వనరుల పంపిణీ తేల్చకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆంధ్ర ఎడారిగా మారుతుందన్న భయం రైతులను వెంటాడుతోంది. నాలుగు జిల్లాలకు కరువే.. కృష్ణానది జలాలు ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించినా, మహారాష్ట్ర, కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తుండటం వల్ల 409 మాత్రమే శ్రీశైలం వద్దకు చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు మాత్రమే సాగయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తమకు కేటాయించిన నీటి కంటే అధికంగా 283 టీఎంసీలు వినియోగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం, అలాగే తుంగభధ్ర దిగువన, కృష్ణా-భీమా నదులకు దిగువన అనేక అనుమతులు లేని చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల నీరు దిగువకు రావడం తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కోస్తా ప్రాంతంలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతభాగం బీడువారే అవకాశం ఉంది. గడ్డుకాలమే... మరోవైపు గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కడితే కృష్ణాడెల్టాకు 80 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశ ం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే చెప్పాలి. దీంతో వరి తప్ప మరో పంట పండని కృష్ణాజిల్లా నల్లరేగడి భూములు నీరు లేక బీడులుగా మారుతాయి. అంతేకాదు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి సాంద్రత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే నిపుణుల అంచనాల ప్రకారం విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంకిపాడు వరకూ ఉప్పు నీటి సాంద్రత పెరిగిందని చెబుతున్నారు. నదీ జలాల వివాదాలను పరిష్కరించకుండా సీట్లు, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విడదీస్తే 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న కృష్ణాడెల్టా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. -
అంతులేని వ్యధలు మిస్టరీ మరణాలు
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: కృష్ణానదిలో అంతుచిక్కని మరణాలు... మృగాళ్ల బారిన పడి తనువు చాలించిన అబలలు కొందరైతే, బతుకు భారమై ఆత్మహత్య లకు పాల్పడేవారు మరి కొందరు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో హత్యకు గురైన వారు కొందరైతే, ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించినవారు ఇంకొందరు. ఇలా ఏడాది పొడవునా ఎందరో అభాగ్యులు, అనాథలు కృష్ణానదిలో తనువు చాలించి, చివరకు ప్రకాశం బ్యారేజి వద్ద మృతదేహాలుగా తేలుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు గుర్తించిన మృతదేహాల సంఖ్య 78, వీటిలో 36 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలినవారిని బంధువులు గుర్తించారు. అంతుచిక్కని 36 మృతదేహాలను పోలీసులు నమోదు చేసుకున్నారే తప్ప వాటిమీద దర్యాప్తు చేయలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో మంతెన గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి చంపి కృష్ణా నదిలో పడవేసిన విషయం ఆరు నెలల తరువాత గాని వెలుగుచూడలేదు. బ్యారేజి వద్ద నిఘా పెంచాలి... ప్రకాశం బ్యారేజికి ఇరువైపులా పోలీసులు నిఘా పెంచి వాహనాల తనిఖీలు చేపట్టగలిగితే కొన్ని కేసులు చిక్కుముడి వీడగలదు. గుంటూరు జిల్లా పరిధి ప్రకాశం బ్యారేజి 36వ కానా వరకు ఉండగా, తాడేపల్లి అవుట్ పోస్టు వద్ద నుంచి 6వ కానా కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత సంవత్సరకాలంలో ఆత్మహత్యలకు పాల్పడబోయిన 15 మందిని పోలీసులు కాపాడగలిగారు. అలాగే అవుట్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేయడం వల్ల సంఘ విద్రోహశక్తులను అదుపులోకి తీసుకోగలిగారు. ప్రకాశం బ్యారేజిని అడ్డాగా చేసుకుని గంజాయి అమ్మకాలను కూడా నివారించగలిగారు. అవుట్‌పోస్టు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయగలిగితే... తాడేపల్లి పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టు మాదిరిగానే విజయవాడ పోలీసులు అటువైపు బ్యారేజి వద్ద అవుట్ పోస్టుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బ్యారేజిపై ఆత్మహత్యలు, హత్యలను నిలువరించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓ ప్రేమ జంట బ్యారేజి మీద మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ప్రియురాలు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన వాహనచోదకులు 100కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిఘా అయితే పెంచారు కానీ ప్రియుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. చివరకు మృతదేహం ఎవరిదో ఈ నాటికీ గుర్తించలేకపోయారు. అదే అవుట్ పోస్టు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ప్రియుడిని ఆనాడే గుర్తించగలిగేవారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజి 34వ కానా వద్ద జీన్ ప్యాంటు, టీషర్టు ధరించిన సుమారు 20 సంవత్సరాల లోపు వయస్సు గల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా, అనేది పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రకాశం బ్యారేజి మొత్తం కనబడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నది వద్ద చాలా వరకు హత్యలను, ఆత్మహత్యలను నిలువరించే అవకాశం లేకపోలేదు. -
ప్రకాశం బ్యారేజి భద్రతకు ముప్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రైతులు ఆధునిక దేవాలయంగా భావించే ప్రకాశం బ్యారేజి భద్రతకు ముప్పువాటిల్లే పరిస్థితులను అధికారులు, నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ బ్యారేజి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగువ, దిగువ అప్రాన్‌లకు 500 మీటర్లలోపు నదిలో తవ్వకాలు జరపరాదనే నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తమకు అనుమతులు ఉన్నాయని చెబుతూ కొంత మంది బ్యారేజీకి సమీపంలో రాత్రీ పగలు ఇసుక తవ్వుతున్నారు. ఆ ఇసుకను పడవల ద్వారా ఒడ్డుకు చేర్చి, అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా హ్యాపీ క్లబ్‌కు సమీపంలో నిల్వ చేస్తున్నారు. ఇసుకను తవ్వే సమయంలోనూ, ఒడ్డుకు చేర్చే సమయంలో సాధారణంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అయితే ఈ రెండు శాఖల సిబ్బంది మూడు రోజుల నుంచి అక్కడ కనిపించకపోవడం సందేహాలకు తావిస్తుంది. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒక రహదారిని నిర్మిస్తున్న బడా నిర్మాణ సంస్థకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. ఇసుక తవ్వకాల వల్ల బ్యారేజీ పరిరక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే భయం రైతులను వెన్నాడుతోంది. ర్యాంపులకే అనుమతులు లేవు.. ఇసుక లారీల రాకపోకల వల్ల బ్యారేజీ కట్టడానికి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ఎగువ అప్రాన్కు కిలోమీటరు దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ఇరిగేషన్ అధికారులు గత సంవత్సరం మార్చి 9న ప్రకటించారు. అంతేకాక ఉండవల్లి గ్రామంలోని పిడబ్ల్యుడి వర్క్‌షాపుకు సమీపంలో ర్యాంపు వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం ఆ ప్రాంతంలో కొనసాగిన ర్యాంపు వల్ల ఉండవల్లి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. శిథిలావస్థలో ఉన్న వంతెనపై నుంచి లారీల రాకపోకలు కొనసాగడంతో అది ఎప్పుడు కూలిపోతుందోనని భయపడ్డారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎగువ అప్రాన్కు కిలోమీటరు దూరంలో ర్యాంపులకు కూడా అనుమతి ఇవ్వ లేదు. ర్యాంపు విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు బ్యారేజీకి అరకిలోమీటరు దూరంలో ఇసుక తవ్వకాలకు, రవాణాకు అనుమతి ఎలా ఇచ్చారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా వర్క్‌షాపుకు సమీపంలోని బకింగ్‌హామ్ కాలువపై ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరడంతో వాహనాల రాకపోకలను నిలువరించడానికి ఇరిగేషన్ అధికారులు వంతెనకు అడ్డంగా బారికేడ్లు వేశారు. ఇటీవల వాటిని పూర్తిగా తొలగించడంపై సందేహాలు కలుగుతున్నాయి. ఇసుక తవ్వకాల విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల్లోని ఉన్నతాధికారులను వివరణ కోరగా, ఫైల్ స్టేటస్ తమకు తెలియదని చెప్పారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాంబశివరావును ఈ విషయమై ప్రశ్నించగా, గతంలో ఇచ్చిన అనుమతులకు పర్మిట్లు ఉన్నాయని, వాటిని ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు.