హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, మండల బుద్ధప్రసాద్, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ తరపున నారాయణ, గుండా మల్లేష్ పాల్గొన్నారు.
సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బీజేపీ నుండి నాగం జనార్థన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ హాజరు అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.