అఖిలపక్ష సమావేశానికి వెళ్లేది వీరే | All-party meet to Manmohan singh on Brijesh Kumar Tribunal Verdic | Sakshi
Sakshi News home page

అఖిలపక్ష సమావేశానికి వెళ్లేది వీరే

Published Thu, Dec 19 2013 12:34 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

All-party meet to Manmohan singh on Brijesh Kumar Tribunal Verdic

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు వినతిపత్రం సమర్పించనుంది. సీఎంతో పాటు బొత్స సత్యనారాయణ, జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారధి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాద రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నుంచి నారాయణ, గుండా మల్లేష్, సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, బీజేపీ తరపున నాగం జనార్థన్ రెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement