Krishna Water Dispute Tribunal
-
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ రెండు నెలలు వాయిదా
సాక్షి, ఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీ నూతన విధివిధానాల అంశంపై విచారణను ట్రిబ్యునల్ రెండు నెలలు వాయిదా వేసింది. బుధ, గురువారాల్లో విచారణ జరగాల్సి ఉండగా.. స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఫైల్ చేయాలని తెలుగు రాష్ట్రాలను ఇవాళ ఆదేశిస్తూ జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై ట్రిబ్యునల్ విచారణ చేయాల్సి ఉంది. అక్టోబరు 6వ తేదీన కేంద్రం జారీ చేసిన విధివిధానాలపై ఇరువర్గాల వాదనలు వింటూ విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. కేంద్ర గెజిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఈనెల 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రానుంది. ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ -
ఇవాళ, రేపు కృష్ణా ట్రైబ్యునల్ విచారణ
-
నోటిఫికేషన్‌పై మరింత అధ్యయనం చేయాలి: ఏపీ ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ట్రిబ్యునల్ తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నది జలాల పంపకాలపై విచారణాంశాలను నోటిఫై చేసింది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఆదేశాలను అనుసరించి.. విచారణకు సిద్ధమైంది బ్రిజేష్ ట్రిబ్యునల్. మరోవైపు నవంబర్ 15 లోపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇవాళ విచారణ ప్రారంభం కాగా.. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం చేయాల్సి ఉందని, దానిపై పూర్తి అధ్యయనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగతిన విచారణ చేపట్టాలని కోరింది. నీటి పంపకాలను వెంటనే చేపట్టాలని ట్రిబ్యునల్‌కు కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేసింది ట్రిబ్యునల్. -
17న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధివిధానాలను రూపొందించేందుకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) అక్టోబర్ 17న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్ కర్వ్), విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ముసాయిదా నివేదికను ఖరారు చేసేందుకు ఆగస్టు 23న సమావేశం కావాలని ఆర్ఎంసీ చైర్మన్ ఆర్కే పిళ్లై తొలుత నిర్ణయించారు. కానీ, ఆ సమావేశం వాయిదా వేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కార్ మళ్లీ వాయిదా వేయాలని కోరింది. దీంతో అక్టోబర్ 17వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. -
పాత పద్ధతిలోనే కృష్ణా నీటి పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను వచ్చే నీటి సంవత్సరంలో పాత పద్ధతిలోనే ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లకు మరమ్మతులు, బోర్డు నిర్వహణకు వీలుగా సీడ్ మనీ కింద రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన 16వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరు కాగా తెలంగాణ తరఫున నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. వాటాలు తేల్చే అధికారం ట్రిబ్యునల్‌దే వచ్చే నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ కోరడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేంద్రం పంపిణీ చేసిందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ వల్ల మిగిలిన జలాల్లో 20 టీఎంసీలు తెలంగాణలో బీమాకు కేటాయించామని, వాటిని వెనక్కి తీసుకుంటే.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా 80 శాతమవుతుందని వివరించారు. దీనిపై కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ స్పందిస్తూ.. నీటి వాటాలు తేల్చడం తమ పరిధిలో లేదని, ఆ అధికారం ట్రిబ్యునల్‌కే ఉంటుందని తేల్చిచెప్పారు. పాత పద్ధతిలోనే 2022–23లోనూ నీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తిపై అసహనం.. గతేడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తెలంగాణ వృథా చేయడంపై కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం, సాగర్‌లలో సాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని, జలవిద్యుదుత్పత్తికి కాదని స్పష్టం చేశారు. గ్రిడ్‌ను కాపాడుకోవడం కోసమే విద్యుదుత్పత్తి చేశామని తెలంగాణ అధికారులు సమర్థించుకోవడాన్ని తప్పుబట్టారు. రెండు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై అధ్యయనం చేయడానికి ఆరుగురు సభ్యులతో (బోర్డు నుంచి ఇద్దరితోపాటు ఏపీ ఈఎన్సీ, జెన్కో సీఈ, తెలంగాణ ఈఎన్సీ, జెన్కో సీఈ) కమిటీని ఏర్పాటు చేశారు. 15 రోజుల్లోగా నివేదిక ఆధారంగా రెండు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వరద జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు.. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద నీటిని రెండు రాష్ట్రాల్లో ఎవరు మళ్లించినా కోటా కింద లెక్కించకూడదని ఏపీ అధికారులు కోరారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రమైన ఏపీకి వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని.. నర్మదా, కావేరి బోర్డులు కూడా వరద జలాలను కోటా కింద లెక్కించడం లేదని ఏపీ అధికారులు ప్రస్తావించారు. దీనిపై కూడా ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ఆదేశించారు. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. రూల్ కర్వ్ ఖరారయ్యాక ప్రాజెక్టుల అప్పగింత.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు తక్షణమే అప్పగించాలని ఛైర్మన్ ఎంపీ సింగ్ కోరారు. ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌పై తమ భూభాగంలోని అవుట్లెట్లను ఏపీ సర్కార్ అప్పగిస్తూ జీవోలు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ రూల్ కర్వ్ (శ్రీశైలం, సాగర్ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు ఎంత పరిమాణంలో నీటిని విడుదల చేయాలి) ఖరారయ్యాక తమ అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. 2 ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా రూపొందించిన రూల్ కర్వ్‌పై అధ్యయనం చేసి నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆరుగురు సభ్యుల కమిటీని బోర్డు ఛైర్మన్ ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా రూల్ కర్వ్‌ను ఖరారు చేస్తామన్నారు. ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం.. అజెండా అంశాలు ముగిశాక కృష్ణా, తుంగభద్ర బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ఆర్డీఎస్ వివాదం పరిష్కారానికి జాయింట్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాయి. పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)తో అధ్యయనం నిర్వహించి నివేదిక ఆధారంగా ఆర్డీఎస్ వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని 2 బోర్డులు నిర్ణయించాయి. -
కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
-
కృష్ణా జలాలపై కౌంటర్ వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపకానికి సంబంధించి కర్ణాటక సర్కార్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్(ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలమట్టి డ్యాం ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేందుకు కృష్ణా ట్రిబ్యునల్–2 అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును కేంద్రం అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కర్ణాటక ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. అవార్డును నోటిఫై చేయకపోవడం వల్ల కర్ణాటక వాటా జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో కాలువలు తవ్వించామని తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డును అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదిస్తూ.. ఏపీ ప్రయోజనాలను వివరించారు. కర్ణాటక దాఖలు చేసిన ఐఏకి తదుపరి విచారణలోపు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మహారాష్ట్ర దాఖలు చేసిన ఐఏను జత చేస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. -
రేపట్నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ అమలు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అనేక చర్చలు, వాదోపవాదాలు, అభ్యంతరాల నడుమ ప్రయోగాత్మకంగా తొలిదశలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టుల నుంచి కేంద్రం స్వాధీన ప్రక్రియ మొదలు పెట్టనుంది. గోదావరిలో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టుపై బోర్డు పెత్తనం ఉండనుండగా కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 16 ఔట్లెట్లను స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు చూసేలా రంగం సిద్ధం చేసుకుంది. కృష్ణాలో బోర్డు ప్రతిపాదించిన ఔట్లెట్లపై ఏపీ నుంచి అభ్యంతరాలు లేకున్నా తెలంగాణ మాత్రం విద్యుదుత్పత్తి కేంద్రాలు (పవర్‌హౌస్)లపై బోర్డు పెత్తానాన్ని సహించలేమని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సమ్మతిస్తుండగా తెలంగాణ మాత్రం తమ ప్రభుత్వంతో చర్చించాకే వైఖరిని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల జారీపై సందిగ్ధత నెలకొంది. పవర్‌హౌస్‌లపై వాడీవేడిగా చర్చ... ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసే క్రమంలో సోమవారం గోదావరి బోర్డు భేటీ కాగా మంగళవారం కృష్ణా బోర్డు భేటీ జలసౌధలో జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ మోహన్‌రావు తదితరలు పాల్గొన్నారు. ఏపీ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చంతా బోర్డుల పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపైనే జరిగింది. కృష్ణా బోర్డు సబ్ కమిటీ మొత్తంగా శ్రీశైలంపై ఉన్న 12 ఔట్లెట్లు, సాగర్ పరిధిలోని 18 ఔట్లెట్లను కలిపి మొత్తం 30 ఔట్లెట్లు బోర్డు పరిధిలో ఉంచాలని ప్రతిపాదించింది. అయితే దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవర్‌హౌస్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అధీనానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఈ దశలో నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్ అమలును ఆపాలి’ అని రజత్ కుమార్ వాదించారు. అయితే గెజిట్ వెలువడ్డాక, అమలును ఆపలేమని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ తరఫున శ్యామలరావు మాట్లాడుతూ విద్యుదుత్పత్తి ఆపాలని పదేపదే కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని, తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా చూడాలని కోరారు. దీనికి రజత్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అయినందున ఉత్పత్తి ఆపడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై మరోమారు కల్పించకున్న శ్యామల్రావు... ఈ ఏడాది పులిచింతల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుపుతున్నారన్న తమ ఫిర్యాదు నేపథ్యంలో గెజిట్ వెలువడిందని... ఈ నేపథ్యంలో పవర్‌హౌస్‌లను కాదని మిగిలిన ఔట్లెట్లను బోర్డు పరిధిలో ఉంచుతామంటే కుదరదని ఏపీ తేల్చిచెప్పింది. 16 ప్రాజెక్టులపై బోర్డు తీర్మానం... ఇరు రాష్ట్రాల వాదోపవాదాల అనంతరం పవర్‌హౌస్‌లు కలుపుకొని 16 ఔట్లెట్లను తన పరిధిలోకి తీసుకునేలా బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏపీ ఓకే చెప్పింది. 16 ఔట్లెట్లపై బోర్డు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు సమ్మతించింది. అయితే దీనిపై తెలంగాణ మత్రం నిర్ణయం చెప్పలేదు. పవర్‌హౌస్‌లను సైతం తీసుకుంటామని చెబుతున్నందున దీనిపై ప్రతిపాదనలు వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఔట్లెట్లను అప్పగిస్తామని తెలిపింది. ఇక ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించినా కేవలం నిర్వహణ (ఆపరేషన్స్) మాత్రమే చూడాలని, ప్రాజెక్టులపై యాజమాన్య హక్కు (ఓనర్షిప్) మాత్రం రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసిన కృష్ణా బోర్డు... ‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న అన్ని ఔట్లెట్లను ప్రాధాన్యంగా రెండు రాష్ట్రాలు ఈ నెల 14లోగా బోర్డుకు అప్పగించాలి’ అని బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పటికే జరిగిన గోదావరి బోర్డు భేటీలో పెద్దవాగును ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించగా, దీనిపై రెండు రాష్ట్రాలు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇరు రాష్ట్రాలు కూడా రెండు బోర్డులకు విడివిడిగా ఇవ్వాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్ మనీకి సంబందించి ప్రభుత్వంతో చర్చించాకే నిధుల విడుదలపై నిర్ణయం చెబుతామని వెల్లడించాయి. బోర్డు బాధ్యత ఇదీ... కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు కట్టబెడుతూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించగా రెండు రాష్ట్రాల్లోని నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్లో చేర్చింది. షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు 100 శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుల్లోని ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోకి తీసుకొని రోజువారీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కేంద్రం భద్రత కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. బోర్డులు తాము స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో ఏవైనా కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. గెజిట్ ప్రకారం షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులు ఇవీ.. కృష్ణాలోః శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్, నాగార్జునసాగర్ పరిధిలో సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్‌పాండ్, తుంగభద్ర, దాని పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాలువలు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు–పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంప్‌హౌస్, ఎస్సారెస్పీ స్టేజ్–2లోని మైలవరం రిజర్వాయర్, వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ–ఎన్ఎస్–ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణా లింకు, కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్. గోదావరిలోః పెద్దవాగు రిజర్వాయర్ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తపట్టణం ఎత్తిపోతలు, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి, తొర్రిగడ్డ ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, చాగలనాడు ఎత్తిపోతలు, వెంకటనగరం ఎత్తిపోతలు, శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు (అదనంగా రోజుకు ఒక టీఎంసీ), చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకులగూడెం బ్యారేజి, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లు. -
కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉంటుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్–3 కింద వేసే ట్రిబ్యునల్ కూడా తెలంగాణ, ఏపీలకే పరిమితమై ఉంటుందని పేర్కొంది. బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలను ఇందులోకి లాగబోమని స్పష్టం చేసింది. సెక్షన్–3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని సైతం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరింది. ఈ మేరకు రెండురోజుల క్రితం అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. 811 టీఎంసీల నీటినే పునఃపంపిణీ చేయండి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయం జరిగేలా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని.. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ భేటీలో సీఎం కేసీఆర్ కోరారు. అయితే సుప్రీంకోర్టులో కేసు కారణంగా తాము ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తెలంగాణ గనుక కేసును ఉపసంహరించుకుంటే తాము త్వరగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసును విరమించుకునేలా తెలంగాణ ప్రభుత్వం రిట్ దాఖలు చేసింది. ఈ రిట్‌పై గడిచిన నెల రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. అయితే 2015లో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లో కర్ణాటక, మహారాష్ట్రలు ప్రతివాదులుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యాయి. తెలంగాణ పిటిషన్‌పై తమ అభిప్రాయాలు అఫిడవిట్ రూపంలో తెలియజేస్తామని గత విచారణల సందర్భంగా కోర్టుకు తెలిపాయి. ఈ కేసు తాజాగా ఈ నెల 27న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రతివాదులుగా కర్ణాటక, మహారాష్ట్రలను తొలగించాలని అందులో కోరింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన 811 టీఎంసీల నీటిని మాత్రమే తెలుగు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని విన్నవించింది. కర్ణాటక, మహారాష్ట్రలకు ఇదివరకే కేటాయించిన నీటి విషయం జోలికి తాము వెళ్లబోమని తెలిపింది. -
పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం మేరకే మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం రైతు దినోత్సవ సభలో ఆయన కృష్ణా జలాల అంశంపై మాట్లాడుతూ.. నీటి విషయంలో జరుగుతున్న గొడవలు చూస్తున్నామని, ఇటీవల కాలంలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మొదట్లో మౌనంగా ఉన్నా.. తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారన్నారు. ‘గతంలో ఏపీ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక. దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 144 టీఎంసీలు, కోస్తాకు 369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడుగులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకున్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే ఆ సమయంలో గాడిదలు కాశారా’అని జగన్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం 369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్రంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిం దకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైల ంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. ఈ రెం డేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20–25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800అడుగుల లోపే నీటిని తీసు కునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల వద్దే తెలం గాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగు ల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడు గులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు న్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాశారా’అని జగన్ ప్రశ్నించారు. సఖ్యతతోనే పరిష్కారం: జగన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు.రాబోయే రోజుల్లోనూ వేలు పెట్టను. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యతతోనే పరిష్కారాలు వెతుక్కోవాలి. -
‘పాలమూరు’పై ఫోకస్
పార్లమెంటులో వాణి వినిపిస్తాం కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వ వైఖరి ఉంది. స్వయం పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి కష్టాలు రానివ్వం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాజీ లేకుండా పోరాడుతాం. ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాలతోపాటు పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తాం. –సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి.. సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డిప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టుకు 27 వేల ఎకరాల భూమి అవసరం.23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు పైగా నిర్వాసితులు అవుతున్నారు. పర్యావరణ తుది అనుమతుల కోసం ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకం. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. ఏపీ కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టి, పర్యావరణ తుది అనుమతులు పొందాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎత్తిపోసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు చేపట్టిన ‘పాలమూరు–నంగారెడ్డి’ పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఈ పథకానికి పర్యావరణ తుది అనుమతులు తీసుకునే ప్రక్రియ ను వేగిరం చేసేదిశగా చర్యలు చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ చేయాల్సిన జిల్లాల్లో త్వరితగతిన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించినట్టు సమాచారం. పాలమూరు ప్రాజె క్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ మంగళవారం ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును వేగవంతం చేయడం, పర్యావరణ మదింపు కమిటీ అనుమతులు త్వరగా పొందడంపై చర్చించినట్టు తెలిసింది. త్వరగా అనుమతులు సాధిద్దాం శ్రీశైలం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి..సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, ముంపు ప్రాంతాల అధ్యయనం,ప్రజాభిప్రాయ సేకరణ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలో పంపుహౌస్‌లు, రిజర్వాయర్, టన్నెల్, ప్రధాన కాల్వల నిర్మాణానికి మొత్తంగా 27 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 25 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని, మరో 2 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని ఇంజనీర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్లో 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉందని.. ప్రాజెక్టు నిర్మాణంతో 23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు మంది నిర్వాసితులు అవుతున్నారని వెల్లడించారు. భారీగా భూమి, అటవీ అవసరాలు, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంటుందని, వీటికి 2017లోనే కేంద్ర పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) తొలి దశ అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలను (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్) కూడా ఖరారు చేసిందని.. ఆ విధానాలకు అనుగుణంగా సమర్పించే పర్యావరణ నివేదిక ఆధారంగా తుది పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తుందని వివరించారు. ఈ నివేదిక తయారీలో ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకమని తెలిపారు. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నిర్వాసితులు, ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణకు తేదీలు నిర్ణయించినా.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం కేంద్రం పర్యావరణ అనుమతుల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోందని, ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసిందని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసేలా.. ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. దీనికి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం: సీఎం కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వ వైఖరి ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అన్ని వేదికల మీదా రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో పునరుద్ఘాటించారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడం, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జల విద్యుదుత్పత్తిని కొనసాగించడంపై రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఈ అంశాలకు సంబంధించి ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాలతోపాటు పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సూచించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగునీటి వివక్ష గురించి లోతుగా చర్చించారు. స్వయం పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి కష్టాలు రానివ్వకూడదని తీర్మానించారు. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని, ఎత్తుగడలను అనుసరించాలనే దానిపై అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే , అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. ఏపీ కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులు చేసింది.ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టి, పర్యావరణ తుది అనుమతులు పొందాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది.60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి.. సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, ముంపు ప్రాంతాల అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలో పంపుహౌస్‌లు, రిజర్వాయర్, టన్నెల్, ప్రధాన కాల్వల నిర్మాణానికి 27 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 25 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని, మరో 2 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని ఇంజనీర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్లో 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉందని.. ప్రాజెక్టు నిర్మాణంతో 23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు మంది నిర్వాసితులు అవుతున్నారని వెల్లడించారు. భారీగా భూమి, అటవీ అవసరాలు, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంటుందని, వీటికి 2017లోనే కేంద్ర పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) తొలి దశ అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలను కూడా ఖరారు చేసిందని.. ఆ విధానాలకు అనుగుణంగా సమర్పించే పర్యావరణ నివేదిక ఆధారంగా తుది పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తుందని వివరించారు. ఈ నివేదిక తయారీలో ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకమని తెలిపారు. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నిర్వాసితులను కలిసి ప్రజాభిప్రాయ సేకరణకు తేదీలు నిర్ణయించినా.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం కేంద్రం పర్యావరణ అనుమతుల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోందని, ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసిందని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసేలా.. ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. -
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద టెన్షన్..టెన్షన్
నాగార్జునసాగర్/దోమలపెంట(అచ్చంపేట)/ధరూరు/అమరచింత/హుజూర్నగర్: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద అదే టెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూనే ఉండటం, ఆపాలంటూ ఏపీ సర్కారు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తుండటం నేపథ్యంలో.. ప్రాజెక్టుల వద్ద ఇరువైపులా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల దాకా ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నాగార్జునసాగర్ కొత్త వంతెన, ప్రధాన విద్యుత్ కేంద్రం వద్ద, మెయిన్ డ్యామ్, ఎర్త్ డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు మోహరించాయి. ప్రధాన విద్యుత్ కేంద్రం వైపువెళ్లే దారిని మూసివేశారు. తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. సాగర్‌లోని 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 31,723 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 30,525 క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు పవర్‌హౌజ్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ ఇక్కడికి సమీపంలోని ఈగలపెంట వద్ద క్యాంపు వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎగువన జూరాల ప్రాజెక్టు వద్ద, దిగువన పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండో చోట్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. సరిహద్దులో వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. చదవండి : అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా -
నీళ్లపై గరంగరం!
♦ ప్రాజెక్టుల్లో సరిపడా జలాలు లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆపాలని ఏపీ సర్కారు అంటోంది. తమ హక్కు మేరకే ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ♦ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. తెలంగాణ సర్కారు జూరాల వద్ద నిఘా పెట్టింది. ♦ ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద రెండు ప్లటూన్ల చొప్పన బలగాలను మోహరించింది. చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. నాగార్జునసాగర్/ధరూరు/అమరచింత/హుజూర్నగర్ (చింతలపాలెం)/దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి.. దానిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తులు, ప్రయత్నాలతో పరిస్థితి వేడెక్కుతోంది. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద తమవైపు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాయి. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం ఆయా ప్రాజెక్టుల వద్ద తెలంగాణ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. వారిని ఇక్కడి పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపేశారు. ప్రాజెక్టుల సమీపంలో ఏపీ నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీనితో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏపీ కూడా తమవైపు బందోబస్తు కట్టుదిట్టం చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 240 మందిని, పులిచింతల వద్ద 300 మందిని మోహరించింది. నాగార్జునసాగర్ వద్ద హడావుడి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ.. గురువారం తెలంగాణ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను ఇక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఏపీ అధికారుల నుంచి వినతిపత్రం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. పులిచింతల వద్ద 250 మందితో గస్తీ పులిచింతల ప్రాజెక్టులోని తెలంగాణ పవర్ హౌజ్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ప్రాజెక్ట్ ఎస్ఈ రమేశ్‌బాబు గురువారం టీఎస్ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం వద్ద వారు భేటీ అయ్యారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలితే.. సముద్రంలో కలవడం తప్ప ప్రయోజనం లేదని, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు కోరారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జెన్కో ఎస్ఈ చెప్పారు. కాగా పులిచింతల డ్యామ్, పవర్‌హౌజ్ ప్రాంతాల్లో దాదాపు 250 మంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తితో పులిచింతలకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తోంది. పులిచింతల టీఎస్ జెన్కో కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, 4 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. జూరాల దగ్గర భద్రత పెంపు కృష్ణా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి అంశం వేడెక్కడంతో.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల వద్ద ప్రభుత్వం భద్రతను మరింతగా పెంచింది. మూడు రోజులుగా ఇక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టుపైకి వెళ్లే జీరో పాయింట్ దగ్గర, ప్రాజెక్టు కంట్రోల్ రూం సమీపంలో, జెన్కో జల విద్యుత్ కేంద్రం వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఉదయమే జూరాల ప్రాజెక్టుపై రాకపోకలను నిలిపివేశారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేట్లు మూసి, వాహనాలను నిలిపేస్తే ఎలాగని స్థానికులు, వాహనదారులు నిలదీయడంతో రాకపోకలకు అనుమతించారు. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిఘా నీడలో శ్రీశైలం ఎడమ ప్లాంట్ తెలంగాణ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలో ఉన్నాయి. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా పెట్టారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ కేంద్రంలోకి ఇంజనీర్లు, ఉద్యోగులకు తప్ప ఇతరులెవరినీ అనుమతించడం లేదు. గురువారం అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు భూగర్భకేంద్రాన్ని సందర్శించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చుక్క నీటినీ వదలొద్దు
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి.సింగ్ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం నిష్క్రియాపరత్వం.. రెండు రాష్ట్రాల మధ్యనున్న జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అభిప్రాయపడింది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య ముందు నుంచీ వివాదాలు నెలకొని ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్–13ని అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవినపెట్టిందని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందని, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సూచించింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీ మార్చాలి.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే, ఆ తేదీన ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన సమావేశంలో వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని సమావేశం సూచించింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కె.జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఈఎన్సీ నాగేందర్రావు, సీఈ నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘కృష్ణా’ త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశంపై చర్చించేందుకు గురువారం కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖలు రాశారు. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపులపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఏపీకి 33.40 టీఎంసీలను బోర్డు కేటాయించగా, ఏపీ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద జోన్–3కి నీటిని కేటాయించడంపై రాష్ట్రం అభ్యంతరం చెప్పింది. తెలంగాణ పరిధిలోని జోన్–2కే నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో జోన్–3కి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీంతో పాటే తెలంగాణకు వాటా ప్రకారం 60 టీఎంసీలు రావాల్సిన పూర్తి స్థాయి కేటాయింపులు చేయకపోవడంపై నిలదీసింది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరయ్యే అవకాశం ఉంది. -
అఖిలపక్ష సమావేశానికి వెళ్లేది వీరే
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించనుంది. సీఎంతో పాటు బొత్స సత్యనారాయణ, జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారధి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాద రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నుంచి నారాయణ, గుండా మల్లేష్, సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, బీజేపీ తరపున నాగం జనార్థన్ రెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. -
కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లండి: మైసూరా
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని..... తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. ట్రిబ్యునల్ తీర్పును సవరించకుంటే రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులకు మెట్ట పంటల వైపు మళ్లించాలని ఆనాడే చంద్రబాబు అన్నారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం ట్రిబ్యునల్ ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి..వాటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణ జలలాపై ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.