పార్లమెంటులో వాణి వినిపిస్తాం కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వ వైఖరి ఉంది. స్వయం పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి కష్టాలు రానివ్వం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాజీ లేకుండా పోరాడుతాం. ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాలతోపాటు పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తాం. –సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి.. సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డిప్రాజెక్టును చేపట్టింది.
ప్రాజెక్టుకు 27 వేల ఎకరాల భూమి అవసరం.23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు పైగా నిర్వాసితులు అవుతున్నారు. పర్యావరణ తుది అనుమతుల కోసం ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకం.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. ఏపీ కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టి, పర్యావరణ తుది అనుమతులు పొందాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు
తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎత్తిపోసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు చేపట్టిన ‘పాలమూరు–నంగారెడ్డి’ పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఈ పథకానికి పర్యావరణ తుది అనుమతులు తీసుకునే ప్రక్రియ ను వేగిరం చేసేదిశగా చర్యలు చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ చేయాల్సిన జిల్లాల్లో త్వరితగతిన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించినట్టు సమాచారం. పాలమూరు ప్రాజె క్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ మంగళవారం ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును వేగవంతం చేయడం, పర్యావరణ మదింపు కమిటీ అనుమతులు త్వరగా పొందడంపై చర్చించినట్టు తెలిసింది.
త్వరగా అనుమతులు సాధిద్దాం
శ్రీశైలం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి..సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, ముంపు ప్రాంతాల అధ్యయనం,ప్రజాభిప్రాయ సేకరణ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలో పంపుహౌస్‌లు, రిజర్వాయర్, టన్నెల్, ప్రధాన కాల్వల నిర్మాణానికి మొత్తంగా 27 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 25 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని, మరో 2 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని ఇంజనీర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్‌లో 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉందని.. ప్రాజెక్టు నిర్మాణంతో 23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు మంది నిర్వాసితులు అవుతున్నారని వెల్లడించారు. భారీగా భూమి, అటవీ అవసరాలు, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంటుందని, వీటికి 2017లోనే కేంద్ర పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) తొలి దశ అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలను (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్) కూడా ఖరారు చేసిందని.. ఆ విధానాలకు అనుగుణంగా సమర్పించే పర్యావరణ నివేదిక ఆధారంగా తుది పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తుందని వివరించారు. ఈ నివేదిక తయారీలో ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకమని తెలిపారు. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నిర్వాసితులు, ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణకు తేదీలు నిర్ణయించినా.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందన్నారు.
ప్రస్తుతం కేంద్రం పర్యావరణ అనుమతుల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోందని, ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసిందని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసేలా.. ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. దీనికి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం: సీఎం కేసీఆర్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వ వైఖరి ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అన్ని వేదికల మీదా రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో పునరుద్ఘాటించారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడం, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జల విద్యుదుత్పత్తిని కొనసాగించడంపై రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
ఈ అంశాలకు సంబంధించి ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాలతోపాటు పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సూచించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగునీటి వివక్ష గురించి లోతుగా చర్చించారు.
స్వయం పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి కష్టాలు రానివ్వకూడదని తీర్మానించారు. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని, ఎత్తుగడలను అనుసరించాలనే దానిపై అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే , అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. ఏపీ కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులు చేసింది.ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టి, పర్యావరణ తుది అనుమతులు పొందాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది.60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని ఎత్తిపోసి.. సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, ముంపు ప్రాంతాల అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలో పంపుహౌస్‌లు, రిజర్వాయర్, టన్నెల్, ప్రధాన కాల్వల నిర్మాణానికి 27 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 25 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని, మరో 2 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని ఇంజనీర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్‌లో 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉందని.. ప్రాజెక్టు నిర్మాణంతో 23 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11 వేలకు మంది నిర్వాసితులు అవుతున్నారని వెల్లడించారు.
భారీగా భూమి, అటవీ అవసరాలు, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంటుందని, వీటికి 2017లోనే కేంద్ర పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) తొలి దశ అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలను కూడా ఖరారు చేసిందని.. ఆ విధానాలకు అనుగుణంగా సమర్పించే పర్యావరణ నివేదిక ఆధారంగా తుది పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తుందని వివరించారు.
ఈ నివేదిక తయారీలో ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ కీలకమని తెలిపారు. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నిర్వాసితులను కలిసి ప్రజాభిప్రాయ సేకరణకు తేదీలు నిర్ణయించినా.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం కేంద్రం పర్యావరణ అనుమతుల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోందని, ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసిందని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసేలా.. ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment