నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌, బండి రియాక్షన్‌ | Revanth Reddy And Bandi Sanjay Serious Comments On KCR Government Over Tension At Nagarjuna Sagar - Sakshi
Sakshi News home page

అదంతా కేసీఆర్‌ ఎన్నికల స్టంట్‌.. రేవంత్‌, బండి రియాక్షన్‌

Published Thu, Nov 30 2023 10:55 AM | Last Updated on Thu, Nov 30 2023 12:08 PM

Revanth And Bandi Sanjay Serious Comments On KCR Government - Sakshi

సాక్షి, కరీంనగర్‌/కొడంగల్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్‌ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. 

ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బండి సంజయ్‌ నాగార్జున సాగర్‌ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్‌ తీసుకొచ్చే కేసీఆర్‌ అండ్‌ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్‌ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక​ ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్‌ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement