బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో ఏపీకి చుక్కెదురు | AP vs Telangana: Tribunal hearing on Krishna water Postponed To Feb19th | Sakshi
Sakshi News home page

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో ఏపీకి చుక్కెదురు

Published Thu, Jan 16 2025 8:00 PM | Last Updated on Thu, Jan 16 2025 8:31 PM

AP vs Telangana: Tribunal hearing on Krishna water Postponed To Feb19th

ఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికి సంబంధించి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వానికి  చుక్కెదురైంది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర వినతి మేరకు తొలుత రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై విచారణ చేస్తామని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.

రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ. దానిని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ పట్టించుకోలేదు. జలాల పంపిణీ అంశానికి సంబంధించి ట్రిబ్యునల్‌ను ఒప్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు అయ్యింది. 

811 టీఎంసీలలో ఏపీ, తెలంగాణలకు ఎంత కేటాయించాలనే అంశంపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరపనుంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశం తొలుత వినడం సముచితమన్న ట్రిబ్యునల్.. 
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు ముందే ఈ విషయంపై  నిర్ణయం అవసరమని పేర్కొంది. సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచారిస్తామని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.

సెక్షన్‌ 89, సెక్షన్‌-3 రెండింటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా, ఏపీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సెక్షన్‌లు వేర్వేరుని, సెక్షన్‌-3పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సెక్షన్‌ 89పై విచారించాలని కోరింది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్షన్‌-3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని స్పష్టం చేసిం
ది. తెలంగాణ వినతిని సమ్మతిస్తూ సెక్షన్‌-3 ప్రకారం తొలుత వాదనలు వింటామని ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఒప్పుకోమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది, దాంతో విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21 వరకూ తిరిగి ఇరు రాష్ట్రాల వాదనలు తిరిగి విననుంది ట్రిబ్యునల్‌. 

కాగా, కృష్ణ నీటి పంపకాలపై ఈరోజు వాదనలు జరిగాయి. రెండు రోజుల పాటు వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ అనూ హ్యంగా ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో రేవంత్‌ రెడ్డి అధికారులతో సైతం చర్చించారు కూడా. 

కృష్ణా జల వివాదాలు, పరిణామాలు ఇలా.. 

1969 ఏప్రిల్‌ 10న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలో కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1 ఏర్పాటైంది. 
1976 మే 27న: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదిక (ఫైనల్‌ అవార్డు) ఇచ్చింది. 
1976 మే 31: బచావత్‌ అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 25 ఏళ్ల వరకూ అవార్డును పునః సమీక్షించాలంటూ కోరవద్దని షరతు పెట్టింది. 
2004 ఏప్రిల్‌ 2: బచావత్‌ అవార్డు కాల పరిధి ముగియడంతో కృష్ణా జలాలను సెక్షన్‌–3 కింద పునఃపంపిణీ చేయాలని మూడు రాష్ట్రాలు కోరడంతో జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–2ను ఏర్పాటు చేసిన కేంద్రం 
2010 డిసెంబర్‌ 30: మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. 
2013 నవంబర్‌ 29: మూడు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ సెక్షన్‌–5(3) కింద బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. (ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో దాన్ని కేంద్రం అమల్లోకి తేలేదు) 
2014 మార్చి 1: ఉమ్మడి ఏపీని విభజిస్తూ చట్టాన్ని ఆమోదించిన కేంద్రం. ఆ చట్టంలో సెక్షన్‌–89 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయం. 
2014 మే 15: బ్రిజేశ్‌ ట్రిబ్యుల్‌ తుది నివేదికలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను.. తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు అప్పగించిన కేంద్రం. 
2016 అక్టోబర్‌ 19: మొత్తం కృష్ణా పరీవాహక ప్రాంతం పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనిపై వాదనలు విన్న ట్రిబ్యునల్‌ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకే పరిమితం అవుతామంటూ ఉత్తర్వులిచ్చింది. 
2020 అక్టోబర్‌ 6: అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. దీనితో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని ఉపసంహరించుకుని ప్రతిపాదన పంపాలని.. న్యాయ సలహా తీసుకుని, తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. 
2021, అక్టోబర్‌ 6: కృష్ణా జలాలను సెక్షన్‌–3 కింద పునఃపంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. 
2023, అక్టోబర్‌ 4: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement