కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లండి: మైసూరా
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని..... తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. ట్రిబ్యునల్ తీర్పును సవరించకుంటే రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులకు మెట్ట పంటల వైపు మళ్లించాలని ఆనాడే చంద్రబాబు అన్నారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం ట్రిబ్యునల్ ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి..వాటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణ జలలాపై ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.