
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లాలో సీనియర్ రాజకీయనేత ఎంవీ మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనతో పాటు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, నేతలు, మరో వంద కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గొప్పనాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన అవినీతిపై విసుగెత్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు. పార్టీలో చేరిన అనంతరం రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు.