'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం' | mysura reddy blames andhra pradesh government | Sakshi
Sakshi News home page

'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం'

Published Fri, Jun 12 2015 4:20 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం' - Sakshi

'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం'

హైదరాబాద్:రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతున్నదేనని విమర్శించారు.శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన మైసూరా.. విభజన చట్టాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు.

 

 రాష్ట్ర విభజన చట్ట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సీడబ్యూసీ అనుమతి తీసుకోవాలన్నారు. విభజన చట్టాన్ని ఉల్లఘించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్టిసీమ విషయంలో ఏపీ ప్రభుత్వం సీడబ్యూసీ అనుమతి తీసుకుంటే బాగుంటేదని మైసూరా తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ అనుమతులు తీసుకోకుండా చేపట్టారన్నారు. రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం తగదన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్యూసీకి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాస్తారన్నారు. చట్టాలను రెండు రాష్ట్రాల సీఎంలు గౌరవించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement