మరోసారి అఖిలపక్షం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం : సిఎం | Final decision after Once again All party Meeting : Kirankumar Reddy | Sakshi
Sakshi News home page

మరోసారి అఖిలపక్షం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం : సిఎం

Published Tue, Dec 10 2013 4:20 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

మరోసారి అఖిలపక్షం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం : సిఎం - Sakshi

మరోసారి అఖిలపక్షం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం : సిఎం

హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరోసారి అఖిలపక్ష సమావేశం  నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఈ రోజు సీఎం అధ్యక్షతన జరిగిన  అఖిలపక్ష సమావేశం  ముగిసింది. పార్టీలు చెప్పిన అభిప్రాయాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామని సీఎం చెప్పారు.

సమావేశానికి  అన్నిపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కొణతాల రామకృష్ణ, శోభానాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోదండ రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ తరపున నారాయణ, గుండా మల్లేష్, సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బీజేపీ నుండి నాగం జనార్థన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement