న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదనలకు, ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పుకు విరుద్ధమైన భావాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే చర్చ జరపాలని నారాయణ డిమాండ్ చేశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించటానికి అయిదురోజులు సరిపోతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పంపిన బిల్లును తిరస్కరించటం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు.