Brijesh Kumar Tribunal
-
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతా: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు, సీనియర్ లాయర్లతో ఆయన చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల వివాదంపై ఈనెల 15నుంచి విచారణ జరపనున్న నేపథ్యంలో న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని ఆయన చెప్పారు.కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత నెలలో మూడు రోజుల పాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టమేమీ ఉండదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఏపీ బేసిన్ బయట ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏ మేరకు మళ్లిస్తోందని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ప్రశ్నించగా.. ఉమ్మడి రాష్ట్రంలో అంతర్గత ఏర్పాటు ద్వారా 512 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటోందని వైద్యనాథన్ వివరించారు.ఇందులో ఇతర బేసిన్లకు 323 టీఎంసీలను మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్లో 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ ఎదుట తన వాదనలు కొనసాగించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 15-17కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తుది వాదనలను వినగా, మిగతా వాదనలను ఏప్రిల్ 15 నుంచి చేపట్టే విచారణలో వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. -
తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా ఏపీకి నష్టం ఉండదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టమేమీ ఉండదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఏపీ బేసిన్ బయట ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏ మేరకు మళ్లిస్తోందని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ప్రశ్నించగా.. ఉమ్మడి రాష్ట్రంలో అంతర్గత ఏర్పాటు ద్వారా 512 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటోందని వైద్యనాథన్ వివరించారు. ఇందులో ఇతర బేసిన్లకు 323 టీఎంసీలను మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్లో 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ ఎదుట బుధవారం మూడోరోజు తన వాదనలు కొనసాగించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం ఏపీలో కృష్ణా డెల్టాకు డ్రెయిన్ల కింద 43.2 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టు నుంచి మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయని ట్రిబ్యునల్‌కు వైద్యనాథన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరిపై పట్టిసీమ ఎత్తిపోతలను ఏపీ నిర్మించిందని, 2015 నుంచి ఆ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తోందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఏడాదిలో 100 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని చెప్పారు. కృష్ణా బేసిన్లో 2023–24లో తీవ్రమైన నీటి కొరత ఉందని, ఆ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులోకి కేవలం 145 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చిందన్నారు. అయినాసరే కృష్ణా డెల్టా కింద దాదాపు 125 టీఎంసీలను ఏపీ వినియోగించుకుందని వివరించారు. ఇందులో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించిన జలాలే 40 టీఎంసీలన్నారు. ఏపీలోని ప్రాజెక్టులకు అదనపు నీటి వనరులు అందుబాటులో ఉన్నాయని.. అక్కడ ఆదా చేసిన నీటిని తెలంగాణలో బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. ఎస్ఆర్బీసీ, ఎస్ఎల్బీసీ ఒకేసారి చేపట్టినా... శ్రీశైలంఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)ని నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీ ద్వారా 150 టీఎంసీలను అందించడానికి ప్రతిపాదించారన్నారు. కానీ.. ఈ పథకానికి నీటిని కేటాయించాలని కేడబ్ల్యూడీటీ–1 ఎదుట ఉమ్మడి రాష్ట్రం ఒత్తిడి చేయలేదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఇతర బేసిన్లలోని ప్రాజెక్టులకు నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చిoదన్నారు. శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ), ఎస్ఎల్బీసీలను 1980లో ఒకేసారి చేపట్టారని.. ఎస్ఎల్బీసీకి మిగులు జలాలుగా కేటాయించగా, ఎస్ఆర్బీసీకి 75 శాతం లభ్యత కింద నికర జలాలను ఉమ్మడి రాష్ట్రం కేటాయించిదని ట్రిబ్యునల్‌కు వివరించారు. కేడబ్ల్యూటీటీ–2 ఎదుట ఎస్ఆర్బీసీకి నికర జలాలను కేటాయించాలని కోరకుండా.. బేసిన్ బయటకు నీటిని తరలించే తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తెచ్చిoదని వివరించారు. ఏప్రిల్ 15కు వాయిదా కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రోజుల విచారణ బుధవారం ముగిసింది. విచారణను ఏప్రిల్ 15–17కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తుది వాదనలను వినగా, తదుపరి వాదనలను ఏప్రిల్ 15 నుంచి చేపట్టే విచారణలో వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. -
బేసిన్లో ఒక పంటకైనా నీరివ్వండి
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహకంలోని (బేసిన్) తెలంగాణ ప్రాంతంలో పునరుత్పత్తి అయ్యే జలాలను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని cc ఏకరవు పెట్టింది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కంటే ముందే ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం కాలువ వ్యవస్థను చేపట్టి ఉంటే తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేవని పేర్కొంది. ఏపీలో బేసిన్ ఆవలకు కృష్ణా జలాలను భారీగా తరలిస్తున్నారని.. తెలంగాణలో బేసిన్లో కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొందని పేర్కొంది.బేసిన్‌లోని రైతులకు ఒక్క పంటకైనా నీళ్లందించేలా కేటాయింపులు చేయాలని వాదించింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2లో రెండో రోజు గురువారం తెలంగాణ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. నీటి కొరత.. సరఫరా కంటే డిమాండ్లు ఎక్కువ.. వంటి పలు విషయాల్లో కృష్ణా, కావేరి బేసిన్ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా పంట వాస్తవిక నీటి అవసరాన్ని అంచనా వేయాలని కావేరీ ట్రిబ్యునల్ సూచించిందని పేర్కొన్నారు. సాంబ వంటి దీర్ఘకాలిక రకాలను కాకుండా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండిస్తే నీటిని మిగిల్చి.. మిగతా ఆయకట్టుకు అందించవచ్చని కావేరి ట్రిబ్యునల్ పేర్కొందని వివరించారు. కృష్ణా బేసిన్లో కూడా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగుచేయడం ద్వారా వినియోగాన్ని తగ్గించి.. మిగిలిన నీటిని బేసిన్‌లోని రైతులకు కనీసం ఒక్క పంటకైనా అందించడానికి కేటాయించాలని వాదించారు. -
అవసరాలకే కేటాయించాలి.. అత్యాశకు కాదు!
సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీర్చడానికి నీళ్లు కేటాయించాలి కానీ అత్యాశ తీర్చడానికి కాదని తెలంగాణ పేర్కొంది. ఏపీలో కృష్ణా పరీవాహకం పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తెలంగాణ పరీవాహకం పరిధిలోని ప్రాంతాలు కనీసం ఒక ఆరుతడి పంటకు సైతం సాగునీటికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. రైతులు నీళ్లు లభించక గోస పడుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలు కృష్ణా నీళ్లు వాడుకోవడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట.. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ బుధవారం వాదనలు వినించారు. శాస్త్రీయ విధానంలో విశ్లేషించాలి కృష్ణా నదీ పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు ఏపీ 323 టీఎంసీల కృష్ణా నికర జలాలను తరలించుకుంటోందని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, చింతలపుడి ఎత్తిపోతల ద్వారా 27 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుని అవసరాలు తీర్చుకోవడానికి అవకాశముందని తెలిపారు. ఏపీ కృష్ణా జలాలను తరలిస్తున్న ఇతర నదుల పరీవాహక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నీటి లభ్యతను వివరించారు. పెన్నా పరీవాహకంలో 75 శాతం లభ్యత ఆధారంగా 98 టీఎంసీలు, సగటు లభ్యత ఆధారంగా 195 టీఎంసీల లభ్యత ఉందని తెలిపారు. గుండ్లకమ్మ వంటి నదుల కింద సైతం నీటి లభ్యత ఉందన్నారు. సమర్థ నీటి వినియోగాన్ని శాస్త్రీయ విధానంలో విశ్లేషిస్తే నీటి అవసరాలు తగ్గుతాయని, దీంతో మిగిలే జలాలను పరీవాహక ప్రాంతం లోపలి ప్రాజెక్టులకు కేటాయించాలని సూచించారు. గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే అవకాశం పోయింది.. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కింద రాష్ట్రంలో సాగునీరు సరఫరా చేస్తున్న, సరఫరా చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతాలకు.. వాస్తవానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్, కృష్ణా ప్రాజెక్టు కాల్వలు, భీమా ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. 1956లో తెలంగాణ, ఆంధ్రను కలిపి ఉమ్మడి ఏపీగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర సరిహద్దులు మారిపోవడంతో గ్రావిటీ ద్వారా నీళ్లను పొందే అవకాశాన్ని తాము కోల్పోయామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల కింద నీటి వినియోగం చాలా తక్కువ అని, నిర్మాణంలోని ప్రాజెక్టులకు జరిపే నికర జలాల కేటాయింపులతో కృష్ణా పరీవాహకంలోని 25 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మందికి జీవోనోపాధి లభించనుందని వైద్య నాథన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1956 తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజధాని ప్రాంత అభివృద్ధితో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కింద తగ్గిన నీటి వినియోగాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఏపీలోని వాగుల ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌కు సరఫరా అవుతున్న 75 టీఎంసీల జలాలను లెక్కించలేదని, వాటిని సైతం లెక్కించాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాలను న్యాయోచితంగా వాడుకోవాలని పేర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలను వైద్యనాథన్ వివరించారు. గురువారం ఏపీ వాదనలు వినిపించనుండగా, శుక్రవారం రెండు రాష్ట్రాలు ప్రతివాదనలు వినిపించనున్నాయి. -
సాగుకే కాదు.. తాగు నీరూ ఉండదు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో, ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సర్కారు తీరు ఇలాగే ఉంటే కృష్ణా బేసిన్లో సాగు నీటికే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై విచారిస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయవాదులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని, జలాలను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుందంటూ 2013లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను ఇప్పటి విచారణలో చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. దీనినీ వాదనల్లో వినిపించి ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయం మరోలా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఆ ట్రిబ్యునలే ఉల్లంఘించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పలేకపోయిందని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనల వల్లే సెక్షన్–3 కింద కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన అదనపు విధి విధానాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై ముందుగా వాదనలు వింటామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేస్తున్నారు. నాడే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై ముందుగా అధ్యయనం చేసిన ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పు ఇచ్చింది. ‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్ (మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్న వారికే మొదటి హక్కు)’ న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక ఒప్పందాలు, వినియోగాల ప్రాతిపదికగా 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెపెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు, 1960 సెప్టెంబరు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా వర్గీకరించి నీటిని కేటాయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్కకట్టింది. ఆ ప్రాతిపదికన మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. వాటిని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.పునఃపంపిణీ చట్టవిరుద్ధంబచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. దానిప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం ఆ ట్రిబ్యునల్ విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే మిగతా 165 టీఎంసీల కేటాయింపులో విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. ఇందుకు భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) – 1956 సెక్షన్ 6(2) ప్రకారం.. నదీ జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపుల జోలికి వెళ్లడంలేదు. ఆ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుంది.– కేంద్ర ప్రభుత్వానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టీకరణ -
Telangana: సెక్షన్–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: అందుబాటులో ఉన్న కృష్ణా జలాలు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పునఃపంపిణీకి మార్గం ఏర్పడింది. అలాగే తెలంగాణ కోరుతున్న విధంగా ఇప్పటికే వాడకంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నీటి కేటాయింపులను కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించేందుకు అవకా శం చిక్కింది. తొలుత అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదనపు రెఫరెన్స్ ప్రకారమే విచారణ నిర్వహించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతే ఏపీ కోరిన విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద విచారణ నిర్వహిస్తామని తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ (ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ విచా రణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ట్రిబ్యు నల్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాంతర విచారణ జరపలేం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్– 89 కింద రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ముగియడంతో ట్రిబ్యునల్‌లో ఇకవిచారణను ప్రారంభించాల్సి ఉండగా, ఐఎస్‌డబ్ల్యూడీఏ చట్టంలోని సెక్షన్–3 కింద కేంద్రం అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో పాటు సెక్షన్–89 కింద కేంద్రం చేసిన రిఫరెన్స్ కూడా విచారణకు సిద్ధంగా ఉండగా, రెండింటినీ కలిపి విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ఐఏ దాఖలు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన అదనపు రెఫరెన్స్‌ను సవాలు చేస్తూ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అదనపు రెఫరెన్స్‌పై స్టే విధించాలని ఏపీ కోరగా, తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనవచ్చని ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కాగా కేంద్రం జారీ చేసిన రెండు రెఫరెన్స్‌ల్లో కొన్ని అంశాలు ఒకేలా ఉండగా, మరికొన్ని అంశాలు లేవు. రెండు రిఫరెన్స్‌లను కలిపి విచారించి తాము ఒకే తీర్పు జారీ చేస్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూలంగా తుది తీర్పు వస్తే ఇబ్బందులొస్తాయని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అభిప్రాయపడింది. అదే జరిగితే తమ తీర్పులోని నిర్ణయాలు, నిర్థారణకు వచ్చిన అంశాలను రెండు రెఫరెన్స్‌ల వారీగా విభజించడం ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రెఫరెన్స్‌లను కలిపి విచారించడం కంటే వేర్వేరుగా విచారించడమే మేలని తేల్చి చెప్పింది. తొలుత రెండో రిఫరెన్స్‌పై విచారణే సమంజసం అయితే తొలుత ఏ రెఫరెన్స్‌పై విచారణ జరపాలన్న ప్రశ్న తలెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి జారీ చేసిన రెండో రెఫరెన్స్‌పై తొలుత విచారణ నిర్వహించడమే సమంజసమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ప్రాజెక్టుల వారీ’గా నీటి కేటాయింపులు జరపాలంటూ మొదటి రెఫరెన్స్‌లో ఉన్న అంశంతో పాటు మరికొన్ని ఇతర అంశాలతో రెండో రెఫరెన్స్‌కు సంబంధం ఉండడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే మొదటి రెఫరెన్స్ కింద నిర్వహించిన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను రెండో రెఫరెన్స్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడానికి ట్రిబ్యునల్ అంగీకరించింది. అయితే, రెండో రెఫరెన్స్ కింద నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌ను మొదటి రెఫరెన్స్ కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఆయా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రెండు రెఫరెన్స్‌ల కింద ఏపీ, తెలంగాణ దాఖలు చేసిన అభ్యర్థనలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను రెండు రెఫరెన్స్‌లకు ఉమ్మడి రికార్డులుగా పరిగణించాలని తెలంగాణ తన ఐఏలో కోరడంతో ట్రిబ్యునల్ ఈ మిశ్రమ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19 నుంచి 21 మధ్య నిర్వహిస్తామని తెలిపింది. సెక్షన్– 89 ఏమిటి? ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89లోని క్లాజు(ఏ) కింద బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే ఇప్పుడు జరపాలని ఇందులో (తొలి రెఫరెన్స్) ట్రిబ్యునల్‌ను కోరింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన అపరేషన్స్ ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేయాలని క్లాజు(బీ) కింద సూచించింది. ‘ప్రాజెక్టుల వారీ’గా అని సెక్షన్ 89 ఉండగా, అందులో ఏ ప్రాజెక్టు లొస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. సెక్షన్ –3 ఏమిటి ? తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఐఎస్‌డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్–3 కింద జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు అదనపు రెఫరెన్స్ (మరిన్ని విధివిధానాలను) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇందులో కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్–89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ గజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. ఉమ్మడి ఏపీకి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్–1 గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించగా, 65 శాతం లభ్యతతో 1005 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్ ఎగువన లభ్యతలోకి వచ్చిన కృష్ణా జలాలను కలిపి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అదనపు రిఫరెన్స్‌లో కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఈ 45 టీఎంసీలకు 1005 టీంఎసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీలను సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2 రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. తాజాగా సెక్షన్–3 కిందే తొలుత విచారణ జరపాలని ట్రిబ్యునల్ భావించడంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టైంది. తెలంగాణలో ప్రతిపాదన/నిర్మాణం దశలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీ, నారాయణపేట–కొడంగల్ వంటి ప్రాజెక్టులకు సైతం నీళ్లు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్ పరిశీలించడానికి వీలు కలిగింది. -
‘బ్రిజేష్’కు 5 డీపీఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా 555 టీఎంసీలను కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్– 2కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందులో 238 టీఎంసీల నీటి అవసరాలు కలి గిన ఐదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మంగళ వారం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అదనపు విధి విధానాలు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)ను గతంలో జారీ చేసింది. దీని ఆధారంగా కృష్ణా జలాల పంపిణీ విధానంపై ట్రిబ్యునల్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదన లతో స్టేట్మెంట్ ఆఫ్ కేస్‌లను ఇప్పటికే దాఖలు చేశాయి. నవంబర్ 6 నుంచి 8 వరకు ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ జర గాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53 టీఎంసీలు, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 25.4 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కలుపు కొని మొత్తం 238 టీఎంసీలను ఆయా ప్రాజెక్టులకు కేటాయించాలని కోరుతూ వాటి డీపీఆర్‌లను తాజాగా ట్రిబ్యునల్‌కు అందజేసింది. వీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బీసీ ప్రాజె క్టుకు మరో20 టీఎంసీలు, కొడంగల్– నారా యణపేట ఎత్తిపోతలకు 7టీఎంసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల అవ సరాలకు 299 టీఎంసీలు అవసరమని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఇక భవిష్య త్లో నిర్మించనున్న జూరాల వరద కాల్వ, కోయి ల్కొండ ప్రాజెక్టు, జూరాల–శ్రీశైలం మధ్య లో కొత్త బరాజ్, భీమాపై మరో బరాజ్ అవసరాలు కలుపుకొని మొత్తం 555 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పాత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు చిన్న నీటిపారుదలకు 89.15, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 105.7, భీమా ఎత్తి పోతలకు 20, జూరాలకు 17.8, తాగునీటి సరఫరాకు 5.7, పాకాల చెరువుకు 2.6, వైరా చెరువుకు 3.7, పాలేరు ప్రాజెక్టుకు 4 , డిండి ప్రాజెక్టుకు 3.5, కోయిల్‌సాగర్‌కు 3.9, ఆర్డీఎస్కు 15.9, మూసీకి 9.4, లంకసాగర్‌కు 1, కోటిపల్లివాగుకు 2, ఓకచెట్టి వాగుకు 1.9 టీఎంసీలు కలిపి మొత్తం 299 టీఎంసీలను ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు తెలంగాణ కోరింది. -
నోటిఫికేషన్‌పై మరింత అధ్యయనం చేయాలి: ఏపీ ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ట్రిబ్యునల్ తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నది జలాల పంపకాలపై విచారణాంశాలను నోటిఫై చేసింది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఆదేశాలను అనుసరించి.. విచారణకు సిద్ధమైంది బ్రిజేష్ ట్రిబ్యునల్. మరోవైపు నవంబర్ 15 లోపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇవాళ విచారణ ప్రారంభం కాగా.. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం చేయాల్సి ఉందని, దానిపై పూర్తి అధ్యయనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగతిన విచారణ చేపట్టాలని కోరింది. నీటి పంపకాలను వెంటనే చేపట్టాలని ట్రిబ్యునల్‌కు కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేసింది ట్రిబ్యునల్. -
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
-
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాలు ఇవ్వడంపై ఏపీ సర్కార్ సుప్రీంకి వెళ్లింది. కేంద్ర నిర్ణయాలన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని సీఎం జగన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపీ ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్‌కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్‌కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్‌ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
కృష్ణా జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశంపైనా చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్–89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదావరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటాయింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు. అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటాయించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. -
బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్‌కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్‌కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్‌ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. -
Fact Check: గురివింద కలగన్నారు..!
రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకు వచి్చనా.. వెంటనే అందులో లోపాలంటూ దుష్ప్రచారం చేయడం, వాటిని సీఎం జగన్‌కు అంటగట్టడం ఈనాడు రామోజీకి నిత్యకృత్యమైపోయింది. తమ ఇషు్టడైన చంద్రబాబు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడంతో సదరు రామోజీకి ఈ ప్రభుత్వంపై మరింత అక్కసు పెరిగిపోయింది. ఇది ప్రతిరోజూ ఈనాడులో కనిపిస్తూనే ఉంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే ధ్యేయంగా రామోజీ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాలను తానే దగ్గరుండి స్వయంగా చూసినట్లు కలగని ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే దూడను గాటికి కట్టేయమన్నట్లుగా ఉన్నాయి రామోజీరావు తెలివితేటలు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. మరొకటిగా ఊహించుకుని.. అభూత కల్పనలతో సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ నీతి మాలిన రోత రాతలను యథావిధిగా అచ్చేశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఆ విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునః సమీక్షించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ కూడా బుధవారం వెల్లడించలేదు. కానీ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. దీని వల్ల దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. దీనిపై ఏ వేదికపై కూడా సీఎం జగన్ నోరు మెదపక పోవడం వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతోందంటూ ‘కృష్ణా జలాలపై పునఃసమీక్ష’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. అసలు నిజం ఏమిటంటే.. ► విభజన తర్వాత 2014 జూలై 14న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 545/2015ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విని్పంచడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన తెలంగాణ సర్కార్ ఆ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ► తెలంగాణ కోరిన విధంగా సెక్షన్–3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేస్తే.. అది చట్టవిరుద్ధమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తేల్చిచెబుతూ 2021 ఆగస్టు 17న.. 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ► ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. తెలంగాణ సర్కార్ కోరిన విధంగా సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను పునఃసమీక్షించడానికి అవకాశమే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని గుర్తు చేస్తూ.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ వస్తున్నారు. ► రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. వాటిపై స్పష్టత వచ్చాక.. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కోరేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. -
వరద జలాలతో అనుమతి రాదనే నికర జలాలతోనే
సాక్షి, హైదరాబాద్: వరద జలాలపై ప్రతిపాదిస్తే ప్రాజెక్టుకు అనుమతి రాదనే, నికర జలాలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్టు తెలంగాణ గుర్తు చేసింది. పాత ప్రతిపాదన(జూరాల)కు కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టుకు మధ్య నీటిని ఎత్తిపోసే ప్రదేశం ఒకటే మారిందని, డిజైన్‌లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేసింది. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కృష్ణా జల వివాదాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ, ఏపీ వాదనలు వినిపించాయి. 2015లో జీవోనెం 105 ప్రకారం పాలమూరు–రంగారెడ్డిని వరద నీటితో చేపట్టిన ప్రాజెక్టుగా, 2022లో జీవోనెం.216 ప్రకారం నికర జలాలతో చేపట్టినట్లు చూపారని తెలంగాణను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ప్రశ్నించారు. అంతకు ముందు జూరాల నుంచి, ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చేపట్టడాన్ని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ తరపు న్యాయవాది స్పందిస్తూ వరద నీటితో అనుమతులు రావనే నికర జలాలు కేటాయింపుతో చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగిస్తే అందుకు విరుద్ధంగా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేశారు. ఆ అధికారం అపెక్స్‌కు లేదంటూ ఏపీ వాదనలు నీటి పంపకాలు చేసే బాధ్యత అపెక్స్ కౌన్సిల్‌కు లేదని, ఒక్క. ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ వాదించింది. ఉమ్మడి ఏపీలోనే 2013 లోనే పాలమూరు ప్రాజెక్టును ప్రతిపాదించారని, తెలంగాణ ఏర్పడ్డాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని తెలంగాణ గుర్తు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇందులో ఏపీ 300 టీఎంసీలను బేసిన్ అవతలికి తరలిస్తోందని, బేసిన్ పారామీటర్ ప్రకారం 811 టీఎంసీల్లో 70 శాతం నీటిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిపై ట్రిబ్యునల్ చైర్మన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రకారం కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచే అధికారం లేదని గుర్తు చేశారు. మరోవైపు ఏపీ వేసిన అఫిడవిట్‌పై తెలంగాణ వాదనలు వినిపించడానికి వీలుగా ట్రిబ్యునల్ విచారణను జూలై 12కు వాయిదా వేశారు. జూలై 12, 13, 14వ తేదీల్లో తెలంగాణ ఏపీ వేసిన అఫిడవిట్‌పై వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు. -
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పే చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమలుపై కృష్ణా బేసిన్ (పరీవాహక ప్రాంతం)లోని నాలుగు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆ తీర్పు చట్టవిరుద్దమని, దాన్ని అమలు చేయవద్దని ఏపీ, తెలంగాణ వాదిస్తుండగా.. తక్షణమే అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర కోరుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 రాష్ట్రాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించాయి. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా బలమైన వాదనలను వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాన్ని ఉల్లంఘించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్: ఆంధ్రప్రదేశ్ ♦ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఇచ్చిన తీర్పును అమలుచేస్తూ 1976 మే 31న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ♦ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956ను 2002లో కేంద్రం సవరించింది. సవరించిన సెక్షన్–4(2) ప్రకారం 2002కు ముందు నదీజల వివాదాలను పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించకూడదు. సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సమీక్షించింది. ఇది చట్టవిరుద్ధం. ♦బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా క్యారీ ఓవర్ కింద మా రాష్ట్రానికి 150 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేశాక క్యారీ ఓవర్ కింద 30 టీఎంసీలు, 50% నీటి లభ్యత ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ పద్ధతిలో క్యారీ ఓవర్ కింద నీటి వినియోగం అసాధ్యం. దీన్ని మార్చాలి. ♦ 75%, 65% లభ్యత మధ్య ఉన్న జలాలు, 50% లభ్యత ఆధారంగా మిగులు జలాలు వెరసి 448 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువనున్న రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. వీటి ఆధారంగా కర్ణాటక సర్కార్‌కు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడం, అదనంగా 100 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం రావడంలో తీవ్రజాప్యం జరుగుతుంది. ఇది బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీకి శరాఘాతమే. ♦తుంగభద్ర సబ్ బేసిన్ (కే–8)లో 65% లభ్యత ఆధారంగా 36 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయిస్తే.. 12.24 టీఎంసీలు వాడుకునేలా అప్పర్ తుంగ, 18.55 టీఎంసీలు వినియోగించుకునేలా సింగటలూరును కర్ణాటక నిర్మించింది. 9 టీఎంసీల కేటాయింపు ఉన్న అప్పర్ భద్రను 29.90 టీఎంసీలు వాడుకునేలా చేపట్టింది. ♦ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే అక్రమంగా 300 టీఎంసీలు వాడుకునేలా కర్ణాటక, 90 టీఎంసీలు వాడుకునేలా మహారాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టాయి. ♦ ఏపీ, తెలంగాణల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు (చిన్న నీటివనరులను మినహాయించి) 75% నీటి లభ్యత ఆధారంగా 641.74 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ.. 2014–15 నుంచి 2017–18 వరకు సగటున 481 టీఎంసీలే ఈ ప్రాజెక్టులకు వచ్చాయి. ♦ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిని వాడుకోవడానికి వీలుగా తక్షణమే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని కర్ణాటక సర్కారు చేస్తున్న వాదనలు అన్యాయం. ♦ చట్టవిరుద్ధంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన జలాల్లో మార్పులు చేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీకి న్యాయం చేయాలి. ఏపీకి న్యాయం చేసే వరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయకూడదు. తీర్పును అమలు చేయవద్దు: తెలంగాణ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయవద్దు. ఈ తీర్పును అమలు చేస్తే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన క్యారీ ఓవర్ జలాలను మా రాష్ట్రం వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు చేయాలి. అప్పటిదాకా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయకూడదు. తక్షణం అమలు చేస్తేనే ఉపయోగం: కర్ణాటక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న తుది తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్లయినా ఆ తీర్పు అమల్లోకి రావడం లేదు. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు వృథాగా కడలిపాలవుతున్నాయి. వాటిని వాడుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.13,321 కోట్లు ఖర్చుచేశాం. తక్షణమే తీర్పు అమలు చేస్తే ప్రాజెక్టులను పూర్తిచేసి, కేటాయించిన నీటిని వాడుకుంటాం. దీనివల్ల ఏపీ, తెలంగాణలకు నష్టం ఉండదు. నోటిఫై చేయాల్సిందే: మహారాష్ట్ర బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పటిదాకా అమలు చేయకపోవడం అన్యాయం. తక్షణమే తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలి. దీనివల్ల నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. -
కృష్ణా బోర్డుకు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు మాత్రమే ఉందని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నీటిని పంపిణీ చేసే అధికారం కృష్ణా బోర్డు పరిధిలో లేకున్నా తెలంగాణ సర్కార్ పదే పదే ఆ అంశాన్ని బోర్డు సమావేశాల్లో అజెండాగా చేర్చుతుండటాన్ని తప్పుపడుతున్నారు. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తే.. ఆ మేరకు కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటును కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ 211.065 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తోందని.. దీంతో ఆ మేర కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో వాదిస్తుండటాన్ని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1980 జూలై 7న గోదావరి ట్రిబ్యునల్ జారీచేసిన తీర్పు ప్రకారం.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21, సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకునే హక్కును కల్పించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ సర్కార్ ఆ 45 టీఎంసీలు తమకే దక్కుతాయని, ఆ మేరకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా బోర్డును కోరుతోంది. అదనపు వాటా కోసం ఏపీ పట్టు.. నిజానికి.. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్ బేసిన్లకు 68.40, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 24.650, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 83.190, ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.065 టీఎంసీల గోదావరి జలా లను తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏ రాష్ట్రం తరలించినా.. ఆ మేర కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటు బేసిన్ పరిధిలోని మిగిలిన రాష్ట్రాల కు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం.. తెలంగాణ తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్ ముందు నుంచీ కోరుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖను కోరింది. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ మొహిలే అధ్యక్షతన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017లో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసినప్పటికీ ఇప్పటివరకూ కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు. తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే ఉంది. కృష్ణా బోర్డు పరిధిలోకి ఆ అంశం రాదు. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటాను ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. తెలంగాణ సర్కార్ ఈ అంశాన్ని ప్రస్తావించేం దుకు కృష్ణా బోర్డు అనుమతివ్వకూడదు. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ -
రేపటి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం తిరిగి మొదలు కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ఝాకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది పలు ప్రశ్నలు సంధించనున్నారు. గత మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా తెలంగాణ తరఫు సాక్షి సమాధానమిచ్చారు. ప్రస్తుత విచారణలో ఇవే అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. వాదనలపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌తో వారు చర్చించనున్నారు. -
'కృష్ణా జలాల పునఃపంపిణీ' అసాధ్యం!
(రామగోపాలరెడ్డి ఆలమూరు–సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన కృష్ణా నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ)–1956 సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పునఃపంపణీ చేయడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలకు కానే కాదని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్–4(2), సెక్షన్–6(2) ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పే అంతిమం అని, అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ముట్టుకోక పోవడానికి అదే కారణమని ఎత్తిచూపుతున్నారు. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 వెరసి 448 టీఎంసీలను మాత్రమే అదనంగా మూడు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనపై న్యాయ శాఖ వెల్లడించే అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ అవస్థి శుక్రవారం స్పష్టం చేయడమే అందుకు తార్కాణమని చెబుతున్నారు. పునఃపంపిణీ చేయాలంటున్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాదనలు విన్పించలేదని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయాలని 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ 2015 మే 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని నాటి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి తేల్చి చెబుతూ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 20న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్–5(2) కింద ముసాయిదా, 5(3) కింద కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని.. ప్రతిపాదన పంపితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జూన్ 9న తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని కోరుతూ జూన్ 14న కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ.. న్యాయ శాఖ అభిప్రాయం కోరింది. ఇప్పటికే తేల్చి చెప్పిన కేంద్రం విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కాకుండా.. నాలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాలను పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏపీ, తెలంగాణ సర్కార్లు కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కోరింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికే ట్రిబ్యునల్ గడువును పొడిగించామే తప్ప.. నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాదని స్పష్టం చేస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని 2016 అక్టోబర్ 19న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ మేరకు గత ఐదేళ్లుగా విచారణ చేస్తోంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కష్టమే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను సెక్షన్–3 రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే.. బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న ఇచ్చిన తుది నివేదికను సెక్షన్–6(2) ప్రకారం నోటిఫై చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదు. ఇక రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించే ప్రశ్నే లేదు. కాదూ కూడదని కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మిగతా మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాలకూ 2,578 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2020 డిసెంబర్ 30న సెక్షన్–5(2) కింద ముసాయిదా, 2013 నవంబర్ 29న సెక్షన్–5(3) కింద తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ నివేదికలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా వాటికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటిదాకా కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఆ ట్రిబ్యునల్ గడువును పొడిగించింది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేనాటి కంటే ముందు అంటే 2014 జూన్ 2కు ముందు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తూ తీర్పు ఇస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని విభజన చట్టంలో సెక్షన్–89 స్పష్టం చేసింది. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7)(ఈ)/4 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు అలానే కొనసాగించాలి. ఈ దృష్ట్యా 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని రాసిన లేఖను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ కేంద్రం చేసిన సర్దుబాటు ఒప్పందాన్ని అంగీకరిస్తూ తెలంగాణ సర్కార్ సంతకం చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని విస్మరించి.. సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ పాత పల్లవిని కొత్తగా అందుకుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది బహిరంగ రహస్యమేనని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష చట్టవిరుద్ధం కృష్ణా నదీ జలాలను బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969 ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో 2,060.. పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసింది. వాటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976 మే 31న తుది తీర్పు ఇచ్చింది. ఇందులో 749.16 టీఎంసీలతో 1971 మే 7న కుదిరిన అంతర్రాష్ట ఒప్పందం మేరకు చేపట్టిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించింది. వీటికి అదనంగా 50.84 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84, శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జలాల్లో రాయలసీమకు 144.70, కోస్తాకు 387.34, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించడంతో కోస్తాకు నీటి వాటా 367.34 టీఎంసీలకు తగ్గి.. తెలంగాణ వాటా 298.96 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టానికి 2002 ఆగస్టు 6న కేంద్రం చేసిన సవరణ ప్రకారం.. ఈ సవరణకు ముందు జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఈ సవరణ కంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ముందు వెలువడింది కాబట్టి.. అదే అంతిమమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్–3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం సాధ్యం కానే కాదని స్పష్టం చేస్తున్నారు. -
Krishna River Management Board: ఆ మూడు అంశాలే అజెండా
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఒక నీటి సంవత్సరంలో కోటాలో మిగిలిన జలాలను తర్వాత వచ్చే ఏడాదిలో వాడుకోవడం, వరద సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశాలే అజెండాగా మంగళవారం కృష్ణా బోర్డు సమావేశమవుతోంది. కరోనా నేపథ్యంలో వర్చువల్ విధానంలో బోర్డు 13వ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం సమాచారం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ఇదే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఏటా బోర్డు సమావేశంలో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును బోర్డు ప్రతిపాదించడం.. రెండు రాష్ట్రాలు అంగీకరించడం రివాజుగా వస్తోంది. మంగళవారం జరిగే భేటీలోనూ ఇదే పద్ధతిలో లాంఛనంగా నీటిని పంపిణీ చేయనుంది. ఒక నీటి సంవత్సరం కోటాలో మిగిలిన జలాలను క్యారీ ఓవర్ జలాలుగా పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులకు వివరించి.. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని బోర్డు వర్గాలు తెలిపాయి. శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు ఎవరు వినియోగించుకున్నా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సమావేశంలో మరో దఫా చర్చించనున్నారు. బోర్డు చైర్మన్ పరమేశం ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఆయనకు వీడ్కోలు పలకనున్నారు. -
నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వెలిగొండ, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెంచాలని రాయలసీమ ఉద్యమ నేత, కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ ‘నిత్యం కరువు కాటకాలను ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలను ఎక్కడి నుంచి తరలించినా మాకు సమ్మతమే. దీనిపై అనవసర రాజకీయాలు తగదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ముందు రాయలసీమ అవసరాలు తీరాక కింది ప్రాంతాలకు వదలాలి. ఇప్పటికే రాజధాని, హైకోర్ట్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కోస్తాకే తరలించారు. కనీసం కరువు సీమకు నీళ్లిచ్చే విషయంలో అయినా రాజకీయాలు కాకుండా మానవతా కోణంలో ఆలోచించండి. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్దత కల్పించాలి. తెలంగాణాతో మాట్లాడి 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. -
ఆ ఐదింటికి నికర జలాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణాజలాల్లో మిగులు నీటిని బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే కేటాయించాలని కోరింది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలను తీర్చేవిధంగా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 200 టీఎంసీల మేర నికర జలాలు కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌లో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో తెలంగాణ అవసరాలు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న సాగు డిమాండ్, ఏపీకి అక్రమంగా జరిగిన కేటాయింపుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రాజెక్టులు, తాగు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం కలిపి 936.58 టీఎంసీల నీరు అవసరమని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ‘గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు పూర్తిస్థాయిలో ఖర్చుకావు, తిరిగి 80 శాతం వివిధ రూపాల్లో బేసిన్‌లోని జల వనరులకు చేరుతాయి. కావున నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా పేర్కొనాల’ని కోరింది. ఇతర బేసిన్లకు నీటి తరలింపు.. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహక ప్రాంతం తక్కువే అయినప్పటికీ, భారీ ఎత్తున కృష్ణాజలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 397 టీఎంసీల కృష్ణాజలాలను పెన్నా, ఇతర బేసిన్లకు ఏపీ తరలిస్తున్నదని, శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఇతర బేసిన్లకు ఈ నీటిని తరలిస్తున్నదని తెలిపింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణలోని 36.45 లక్షల హెక్టార్ల భూమి సాగు యోగ్యంగా ఉందని తెలిపింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ కేటాయింపుల్లో సర్దుబాటు చేసిన 299 టీఎంసీల ద్వారా 5.75 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగులోకొచ్చిందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా మరో 10.38 లక్షల హెక్టార్లు సాగులోకి రానుండగా, మరో 20.32 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి వసతి కల్పించాల్సి ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా ఏపీ బేసిన్ ఆవలకు తరలిస్తున్న నీటి నుంచి 75 శాతం డిపెండబిలిటీపై ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎస్ఎల్బీసీ)కు 33 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 34 టీఎంసీలు, నెట్టెంపాడుకు 19.38 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 84.85 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 29 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని కోరింది. వలసలకు నిలయమైన పాత మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజల వెతలు ఈ ప్రాజెక్టుల ద్వారా తీరుతాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌పై ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి. -
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఏపీ తరఫు సాక్షి అయిన వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది రవీందర్రావు పలు ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి ఏపీలో వాతావరణం ఆధారంగా ఏర్పాటు చేసిన అగ్రో క్లైమేట్ జోన్లపై పలు ప్రశ్నలు వేశారు. గోదావరి జోన్లో ఏడీఆర్‌గా ఉన్న తాను తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త వంగడాల తయారీకి సాయం చేశానని, ఎంటీయూ 1061, ఎంటీయూ 1075 తదితర వరి వంగడాలను తెలంగాణ కోసం తయారు చేసినట్లు సత్యనారాయణ చెప్పారు. జాతీయ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు సిఫార్సుల మేరకు వ్యవసాయ వాతావరణ జోన్లు ఏర్పాటు చేస్తారని, ఉమ్మడి ఏపీలో మొత్తం 9 ఉన్నట్లు సమాధానాలిచ్చారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగనుంది. -
హిమాలయాల నుంచి గోదావరి వరకు..
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానానికి సంబంధించి సరికొత్త ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తెరపైకి తీసుకురానుంది. హిమాలయాల నుంచి మానస్–సంకోశ్–తీస్తా–గంగా–సువర్ణరేఖ–మహానదుల మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరనుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సులో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రతిపాదించనున్నారు. హిమాలయాల నుంచి గోదావరికి నదీ ప్రవాహాలు మళ్లిస్తే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని వివరించనున్నారు. 938 టీఎంసీల నీటితో గోదావరికి అనుసంధానం చేస్తే దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టమవుతుందని, కృష్ణా బేసిన్లో భవిష్యత్ నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రకటించనున్నారు. ‘గోదావరి–కావేరీ’నే ప్రధానం..! హైదరాబాద్‌లోని బేగంపేట తాజ్ వివాంటా హోటల్లో జరగనున్న సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సాగునీటి శాఖ మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరవనున్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అటునుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దానిపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా.. నీటి లభ్యత, ముంపు తదితరాలపై రాష్ట్రం అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. 575 టీఎంసీలపై పట్టు.. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికున్న 811 టీఎంసీల వాటాలో 575 టీఎంసీలు రాష్ట్ర వాటా కింద కేటాయించాలని రాష్ట్రం కోరనుంది. పోలవరం, పట్టిసీమల కింద దక్కే వాటాలతో పాటు, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా తేల్చిన తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని పట్టుబట్టే అవకాశముంది. కాళేశ్వరం జాతీయ హోదాపైనా కేంద్రాన్ని కోరనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించిన తరువాతే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించాలని డిమాండ్ చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిని అడ్డగోలుగా తరలిస్తున్న విషయాన్ని భేటీలో లేవనెత్తాలని సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ అంశాన్నీ ప్రస్తావించనున్నారు. -
కృష్ణా జలాలపై రెండో రోజూ కొనసాగిన విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం కూడా విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు న్యాయవాది వైద్య నాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని కూడా ఏపీ తరలిస్తోందన్న ఆరోపణల్లో నిజం లేదని, ఇక్కడ కృష్ణా నది నిర్వహణ బోర్డు ఆదేశాల మేరకే నీటి విడుదల జరుగుతోందని వైద్యనాథన్ అడిగిన ప్రశ్నకు సుబ్బారావు బదులిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టు కావడం వల్ల ఇక్కడి నుంచి నీటి తరలింపునకు ఆస్కారం లేదని జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు అంశమే తలెత్తదు కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. ఇది న్యాయపరిధిలోని అంశమని సుబ్బారావు సమాధానమిచ్చారు. వరద సమయంలో మిగులు జలాల తరలింపునకు అదనపు సామర్థ్యం పెంచడం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెల్ 880 అడుగులకు చేరుతుంది కదా అని ప్రశ్నించగా.. సామర్థ్యం పెంపు అనే ది డిజైనర్ల నిర్ణయమని సుబ్బారావు చెప్పారు. హెడ్‌రెగ్యులేటర్ సిల్ స్థాయి 841 అడుగులే ఉండాలని డిజైనర్లకు సూచించారా? అని ప్రశ్నించగా.. ఇది నిజం కాదని సుబ్బారావు తెలిపారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది. -
కృష్ణా బోర్డు పరిధిలోనే శ్రీశైలం
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జలాశయం కృష్ణా యాజమాన్యబోర్డు పరిధిలోనే ఉందని ఏపీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ సోమవారం తిరిగి ప్రారంభమై ంది. ఈ సందర్భంగా ఏపీ తరఫున హాజరైన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో బోర్డు ఆదేశాలను ఏపీ పాటిస్తోందా? అని వైద్యనాథన్ ప్రశ్నించారు. పాక్షికంగా రిజర్వాయర్‌ను ఏపీ నియంత్రిస్తున్నా నీటి వినియోగంపై బోర్డు ఆదేశాలనే పాటిస్తున్నామని సుబ్బారావు తెలిపారు. నీటి వినియోగానికి సంబంధించి ఉమ్మడి ఏపీలో ఆపరేషన్ మాన్యువల్ ఉండేదని, ఇప్పుడు రిజర్వాయర్ పరిధి బోర్డు నియంత్రణలో ఉందని చెప్పారు. బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అధికంగా నీటిని వినియోగిస్తున్నామని చేస్తున్న ఆరోపణలు ఆమోదయోగ్యం కాదన్నారు. ముచ్చుమర్రి వద్ద 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపులు, 989 క్యూసెక్కుల సామర్థ్యంతో 4 పంపులు ఉన్నాయని సుబ్బారావు తెలిపారు. మరి ఇన్ని పంపులు ఉంటే నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా సాగునీటి అవసరాలకు వినియోగించుకొనే ఉద్దేశం కనిపిస్తోంది కదా? అని వైద్యనాథన్ పేర్కొనగా.. ముచ్చుమర్రి పథకం హంద్రీనీవా సుజల స్రవంతితో భాగమని సుబ్బారావు వివరించారు. కాగా, తమ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణా నది నుంచి 936.58 టీఎంసీల నీరు అవసరమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేసింది. -
డెల్టా సాగుకు 152 టీఎంసీలు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా డెల్టాలో సాగుకు 152.2 టీఎంసీల నీరు అవసరమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదించింది. గోదావరి నుంచి డెల్టాకు 80 టీఎంసీలే మళ్లిస్తున్నామని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఏపీ తరఫు సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా మళ్లించి డెల్టా సాగు అవసరాలు తీర్చితే పులిచింతల నీటి అవసరం ఉండదు కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. డెల్టా నీటి అవసరాలు 152.2 టీఎంసీలని, గోదావరి నుంచి 80 టీఎంసీలే మళ్లిస్తున్నట్లు సుబ్బారావు సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ద్వారా సముద్రంలోకి వెళ్తున్న నీటిని ఆపి సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా వినియోగించు కొనేందుకు సాధ్యమవుతుందా అని ప్రశ్నించగా.. అందు కు 17 నుంచి 590 అడుగులకు నీరు ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు. ఇక గోదావరి, పెన్నార్ నదుల అనుసంధానంపై అధ్యయనం జరుగుతోందన్నారు. కాగా, తదుపరి విచారణ వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో జరగనుంది. -
అమరావతిలో సాగుకు నీరు అవసరంలేదు కదా!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం విజయవాడ సమీపంలో ప్రతిపాదించిన భూమిలో ఇక నుంచి సాగు ఉండదు కనుక ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న నీరు ఇక నుంచి అవసరం ఉండదు కదా! అని తెలంగాణ ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో శుక్రవారం కూడా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ తరఫున సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణులు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రాజధాని ప్రాంతానికి సాగునీరు అవసరం లేదని ప్రశ్నించగా.. ఏపీ సీఆర్డీఏ రాజధానికి 217.23 చ.కి.మీ భూమిని ప్రతిపాదించిందని, ఇది ప్రస్తుతానికి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ అని, ఇక్కడ రాజధాని నిర్మించడం వల్ల వైకుంటపురం పంపింగ్ స్కీం కిందకు వచ్చే ఆయకట్టు మాత్రమే దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఏపీ నూతన రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా 2,380 చ.కి.మీ పరిధిలో ఉందని వైద్యనాథన్ ప్రశ్నించగా.. తనకు ఉన్న సమాచారం మేరకు 217 చ.కి.మీటర్లేనని సుబ్బారావు చెప్పారు. కృష్ణా డెల్టా చాలా వరకు ప్రకాశం బ్యారేజీ దిగువకు వస్తుందని, ప్రతిపాదిత రాజధాని ఎగువన ఉందని, ఈ ప్రాంతంలో సాగుభూమిని తగ్గించబోరని సుబ్బారావు సమాధానం చెప్పారు. విచారణ నవంబర్‌కి వాయిదా.. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా వివిధ ప్రశ్నలకు సుబ్బారావు ముందుగానే సిద్ధం చేసిన నోట్‌ను చూసి చదవడంపై వైద్యనాథన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాక్షిగా తనకు ఉన్న సమాచారం మాత్రమే సుబ్బారావు వెల్లడించాలని, కానీ ఆయన ఎవరో రాసిచ్చిన సమాచారాన్ని చదువుతున్నారని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సుబ్బారావు స్పందిస్తూ.. వివిధ అంశాలకు సంబంధించి తాను ముందుగానే నోటు సిద్ధం చేసుకున్నానని, అదే చెబుతున్నానని బదులిచ్చారు. ఇలా ముందు ముందు సాగితే అంగీకరించబోమని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ కల్పించుకొని ‘మీ ప్రశ్నలను ముందుగానే ఊహించారేమో!’అని వ్యాఖ్యానించింది. ఇక పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గత మూడేళ్లుగా 101.25 టీఎంసీల నీరు ఎత్తిపోశామని, కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీల నీరు అవసరమని, కేడబ్ల్యూడీటీ– 1 కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి పులిచింతల రిజర్వాయర్‌ను నాగార్జున సాగర్ కుడి కాలువకు కలిపి అక్కడి నుంచి ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదనపు ఆయకట్టుకు నీరివ్వడంపై పరిశీలిస్తామని పలు ప్రశ్నలకు సుబ్బారావు సమాధానం చెప్పారు. తదుపరి విచారణను ట్రిబ్యునల్ వచ్చే నెల 15, 16, 17వ తేదీలకు వాయిదా వేసింది. -
కృష్ణా జలాలపై విచారణ సెప్టెంబర్‌కు వాయిదా
- రెండు రాష్ట్రాల ప్రతిపాదిత అంశాలపై ముగిసిన వాదనలు - విచారణాంశాలపై ఆగస్టు 16న పత్రాలు సమర్పించాలన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై జరుగుతున్న విచారణను జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 14, 15 తేదీలకు వాయిదా వేసింది. ఆగస్టు 16లోపు ఈ కేసు విచారణకు సంబంధించి విచారణాంశాలపై అదనపు పత్రాలను ఇరు రాష్ట్రాలు సమర్పిం చాలని ఆదేశించింది. కృష్ణా జలాల పంపిణీలో ఏయే అంశాలను విచారించాలన్న దానిపై ఏపీ, తెలంగాణ సమర్పించిన ముసాయి దాలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఏపీ 11, తెలంగాణ 16 అంశాలను ప్రతిపా దించాయి. ఏపీ ప్రతిపాదించిన అంశాల్లో ఒకదాన్ని తిరస్కరించిన ట్రిబ్యునల్, తెలంగా ణ సూచించిన అంశాలను పలు సవరణలతో విచారణకు అమోదించింది. వీటిపై సెప్టెంబర్ 13 నుంచి వాదనలు వింటామని పేర్కొంది. ఏపీపై ఆగ్రహం.. విభజన చట్టంలోని షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కోర డంపై గురువారం విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయిం పులను ఎలా కోరతారని ప్రశ్నించింది. శుక్రవా రం విచారణలో కూడా ఏపీ ఈ అంశాన్ని లేవ నెత్తింది. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు సెక్షన్– 89తో సంబంధం లేదని వాదించారు. కాగా విభజన చట్టం రూపకల్పనలో దురదృష్టవశా త్తు తప్పులు దొర్లాయని గంగూలీ అన్నారు. సెక్షన్–89లోనే ఈ ప్రాజెక్టుల పేర్లను కూడా పొందుపరిచి ఉండాల్సిందని అభిప్రాయప డ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల ఆధా రిత ప్రాజెక్టులని వైద్యనాథన్ పేర్కొన్నారు. మిగులు జలాలు ఉంటే అంధ్రప్రదేశ్ ప్రభు త్వం ప్రకాశం బ్యారేజీ నుంచి వినియో గించుకోవాలి.. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ యత్నిస్తోందని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటా యింపుల సమయంలో మిగుల జలాలు ఉంటే షెడ్యూల్ 11లోని ప్రాజెక్టులకు కేటాయింపు లపై అప్పుడు ఆలోచిద్దామని అభిప్రా యపడింది. ఇక కృష్ణా నదీ జలాల యాజ మాన్య బోర్డు 2015లో నీటి నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపులను చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది. అనంతరం ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన విచారణాంశాలపై ఆగస్టు 16వ తేదీలోపు అదనపు పత్రాలను సమర్పిం చాలని ఇరు రాష్ట్రాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. -
విచారణాంశాలపై నేడు నిర్ణయం
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో వాదనలు - నీటి అవసరాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలన్న తెలంగాణ - కొరత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి - ఈ తరహా పంపకాలకు తాము సిద్ధమన్న ఏపీ - ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై వివరణ ఇవ్వాలన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించిన విచారణాంశాలను ట్రిబ్యునల్ శుక్రవారం నిర్ణయించనుంది. ముసాయిదాలోని అంశాలపై ఇప్పటికే బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు వివరణ సమర్పించిన ఇరు రాష్ట్రాలు.. గురువారం సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ఎ.కె.గంగూలీ, తెలంగాణ తరఫున వైద్యనాథన్ వాదించారు. నీటి లభ్యత తక్కువ ఉన్న సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రిబ్యునలే నిర్ణయించాలని, ప్రాజెక్టులవారీ కేటాయింపులు చేసేటప్పుడు బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో అధిక నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. మొత్తం నీటి లభ్యత, బేసిన్‌లోని అవసరాల కోసం ఒక్కో ప్రాజెక్టుకు ఎంత నీరు అవసరమనేది నిర్ధారించేందుకు పంటల సాగు పద్ధతి, పంట సమయం, ఎంత నీరు అవసరమో శాస్త్రీయంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు అవసరం లేదని.. ఏపీ, తెలంగాణల్లోని ప్రాజెక్టులకు మాత్రం అలా కేటాయించాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ప్రోటోకాల్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకుని... రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్–89లో పేర్కొన్న ‘ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు’అంశంపై వివరణ ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ అంశంపై విచారణ జరపడానికి ప్రాథమికంగా అంగీకరించింది. అలాగైతే వారికీ ఇవ్వొద్దు.. ఇక తెలంగాణలో కృష్ణా బేసిన్ పరిధిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, ఖనిజ నిల్వలున్న ప్రాంతాలకు సాగునీటిని కేటాయించకూడదని ఏపీ ప్రభుత్వం వాదించగా.. దీనిని తెలంగాణ తప్పుబట్టింది. ఏపీ నూతన రాజధాని కోసం 33 వేల ఎకరాల పంట భూములను సేకరించినందున అక్కడ ప్రస్తుతం పంటలు సాగు చేసే పరిస్థితి లేదని.. మరి ఆ ప్రాంతానికి కూడా సాగునీరు ఇవ్వకూడదని పేర్కొంది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలుపుతూ.. రాజధాని నిర్మాణంతో నీటి పంపకాల అంశాన్ని ముడిపెట్టవద్దని వ్యాఖ్యానించింది. మొత్తంగా ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్... రెండు రాష్ట్రాలు సమర్పించిన ముసాయిదాల్లో ఏ అంశాలను విచారించాలన్న దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
‘ఆర్డీఎస్’ ఈసారీ అంతే!
- ఈ ఏడాదీ జరగని ఆధునీకరణ పనులు.. కాల్వల ఎత్తు పెంపునకు ఏపీ ససేమిరా - వచ్చే ఏడాది వరకు రైతులకు తప్పని నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగలనుంది. మూడే ళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాదీ మూలన పడ్డాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కాలేదు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా పాత పాలమూరు జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావట్లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వలకు మరమ్మతులు చేసి ఎత్తు పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. దీంతో కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు తెలంగాణ ప్రభుత్వం రూ. 72 కోట్ల నిధులను డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడేళ్లుగా అడ్డుపడుతున్నారు. గతేడాది దీనిపై మంత్రి హరీశ్‌రావు స్వయంగా కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అక్కడ సానుకూలత వచ్చింది. ప్యాకేజీ–1లో ని హెడ్‌వర్క్స్ అంచనాను రూ. 13 కోట్లకు పెంచగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సర్కారు మోకాలడ్డు... తుంగభద్ర బోర్డు సమావేశంలో ఆర్డీఎస్ కాల్వల్లో పూడికతీత, కాల్వల మరమ్మతులకు అంగీకరించిన ఏపీ.. కట్ట ఎత్తు పెంచుకునేం దుకు మాత్రం అంగీకరించలేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా ఆ నీటిని ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా తీసుకో వచ్చని తెలంగాణ చెప్పినా కూడా ఏపీ సర్కారు వినిపించుకోలేదు. ఈ అంశంపై మరోసారి చర్చల్లో ఏపీని ఒప్పించి పనులు మొదలుపెడదామన్నా వర్షాకాలం మొదలు కావడంతో తుంగభద్ర కాల్వల్లో నీరు చేరే పరిస్థితులున్నాయి. -
ఏపీకి కోత పెట్టండి
కృష్ణా బేసిన్‌కు అవతలే అధికంగా నీటిని వినియోగిస్తోంది ► రాష్ట్రానికి మరిన్ని జలాలు ఇవ్వాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు రాష్ట్రం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నికర జలాల కేటాయింపుల్లో కోత పెట్టి.. వాటిని తెలంగాణకు కేటాయించా లని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తు తం ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాలో 351 టీఎంసీల మేర కృష్ణా బేసిన్ అవతలే వాడుకుంటోందని స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో ఆ రాష్ట్ర వాస్తవ అవసరాలు 150 నుంచి 200 టీఎంసీలకు మించి ఉండవని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటాయే ఉందని... కానీ రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకం, సాగు యోగ్య భూమి, జనాభా తదితరాలను దృష్టిలో పెట్టు కుంటే లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు రాష్ట్రానికే దక్కాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేటాయింపులు పెంచాలని మంగళవారం బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ ఇదివరకే సమర్పించిన అఫిడవిట్‌ను తప్పు పడుతూ కౌంటర్లో స్పష్టత నిచ్చింది. ‘కృష్ణా’ ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలి ఏపీ తమకు ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల తోపాటు హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఇతర కొత్త ప్రాజెక్టులకు కలిపి సాగునీటి అవసరాలకు 917.9 టీఎం సీలు.. రాజధాని అమరావతితో పాటు తాగు నీటి అవసరాలకు 110.13 టీఎంసీలు (మొత్తంగా 1059.03 టీఎంసీలు) కేటాయిం చాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరింది. దీనిని తెలంగాణ తమ కౌంటర్లో తప్పుపట్టింది. నీటి కేటాయింపులో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. బేసిన్‌లోని ప్రాజెక్టులకు 75 శాతం నీటి లభ్యత పూర్తయిన తర్వాతే పక్క బేసిన్‌లోని ప్రాజె క్టులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 75 శాతానికి మించి వచ్చే నీటిలోనూ తొలి ప్రాధాన్యం బేసిన్‌లోని ప్రాజెక్టులకే ఇవ్వా లని కోరింది. సరాసరి నీటి లభ్యతకు మించి వచ్చే నీటిని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద అవసరాలకు వినియో గించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక తాగునీటి అవసరాలకు ఏపీ కోరుతున్న 110 టీఎంసీలు.. ఢిల్లీ అవ సరాలను మించి ఉన్నాయని స్పష్టం చేసింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ కౌంటర్లో వివరించింది. ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, ఆ నీటిని ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ కింద వాడుకునే అవకాశం ఇవ్వా లని కోరింది. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలి స్తోం దని.. ఈ మేర కృష్ణా డెల్టాలో ఏపీకి కోతలు పెట్టాలని విన్నవించింది. రాష్ట్ర అఫిడవిట్, కౌంటర్లపై ఈ నెల 4, 5 తేదీల్లో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తిరిగి విచారణ చేయనుంది. -
‘కృష్ణా’పై మరోసారి విచారణ
అఫిడవిట్ సమర్పణకు గడువు కోరనున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివా దంపై మరోమారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం విచారణ జరుగనుంది. ఉమ్మడి రాష్ట్రా నికి చేసిన కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు కృష్ణా జలాలను పంచుకోవా లంటూ అక్టోబర్‌లో తీర్పును వెలువరించిన అనంతరం తొలిసారి ట్రిబ్యునల్ మళ్లీ దీనిపై విచారణ జరుపనుంది. దీనికోసం రాష్ట్ర అధి కారులు సోమవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే తాను సమర్పించాల్సిన అంశంపై తెలంగాణ వాయిదా కోరే అవ కాశం ఉండగా, సుప్రీంకోర్టులో ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అంశాన్ని ఏపీ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. నిజా నికి రెండు రాష్ట్రాలకే తదుపరి విచారణ పరిమితం అవుతుందని పేర్కొంటూ తీర్పు వెలువరించిన సమ యంలోనే నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ తెలంగాణ, ఏపీకే పరి మితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధిపై వివాదం పరిష్కారమైందని, నీటి కేటాయిుంపులు, ప్రాజెక్టు వారీ కేటా యింపులు తేల్చేందుకు మళ్లీ విచారణను చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
‘కృష్ణా’తీర్పుపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు
అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రంపై ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న వారితో సమావేశంకానుంది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేక ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోనే పోరాటం చేయాలా? లేదా ట్రిబ్యునల్ ముందే పునర్విచారణ కోరాలా? అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల సలహా తీసుకోవాలని అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు నిర్ణయించారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సైతం ఈ నెల 14న మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
కృష్ణా జలాలపై కేబినెట్ సబ్‌కమిటీ
మంత్రి హరీశ్ నేతృత్వంలో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తదుపరి కార్యాచరణపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించారు. అవసరాన్ని బట్టి నిపుణులను కమిటీ ఆహ్వానించవచ్చని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశాలు, ఇప్పటికే ఉన్న రిట్ పిటిషన్‌పై వాదనలు చేసే అవకాశం, మరింత వాటా రాబట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితరాలపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు. -
బ్రిజేష్‌కుమార్ తీర్పు.. ఆంధ్రాకు అన్యాయం
- సీఎం పట్టించుకోకపోవడం విడ్డూరం - శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య ద్వారకానగర్ (విశాఖ): కృష్ణానదీ జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సీఎం చంద్రబాబు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నదీజలాల అన్యాయంపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని, కృష్ణాజలాల పంపకంలో ఆంధ్రాకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే రాయలసీమ నీటి ఎద్దడితో అలమటిస్తూంటే, కృష్ణాలోని 35 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతోందని, కృష్ణా డెల్టా కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచేలా చూడాలని రామచంద్రయ్య కోరారు. చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమేనని, ప్రధానమైన పోలవరం వదిలేసి, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టులు చేపట్టడం కాసుల ఆకాంక్షేనని ఆరోపించారు. చంద్రబాబు అనుకూల మీడియా ఎంత ప్రచార ఆర్భాటాలు చేపట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన రూ. 60 వేల కోట్ల అప్పుకు వడ్డీ ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిపై పదేళ్ల వరకు ఆంధ్రాకు హక్కు ఉన్నా సచివాలయాన్ని తెలంగాణాకు అప్పగిస్తామని సీఎం చెబుతున్నారని, ఇష్టానుసారం అప్పగించడానికి అదేమీ హెరిటేజ్ ఆస్తి కాదని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం
ట్రిబ్యునల్ తీర్పుపై మంత్రి ఉమా సాక్షి, అమరావతి: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన ‘మాన్యువల్’పై బ్రిజేష్‌కుమార్ తీర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఆదివారం విజయవాడలో మీడియాకు వివరించారు. సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు, అంతర్రాష్ట్ర అధికారులతో రెండు మూడు రోజుల్లో సంప్రదింపులు జరిపి, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అసమర్థ విధానాలతోనే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని వివరించారు. బ్రిజేష్‌కుమార్ తీర్పు, అంతకు ముందు జరిగిన అంశాలన్నింటినీ క్రోడీకరించిన సంచికను రైతుల అవగాహన కోసం పంపిణీ చేయనున్నామని తెలిపారు. -
బ్రిజేష్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన ట్రిబ్యునల్ తీర్పు ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమని చెప్పారు. ఈ తీర్పు వల్ల ప్రజలు నష్టపోతారని అన్నారు. తీర్పును ప్రాధాన్యాంశంగా తీసుకుని చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సొంత డబ్బా కొట్టుకోవడానికి వస్తున్న సర్వేల ఫలితాలను లెక్కలోకి తీసుకోవద్దని కోరారు. అవి అధికార టీఆర్ఎస్ పార్టీ తన కోసం చేయించుకున్న సర్వేలని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎగువ రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని సూచించారు. -
కృష్ణా జలాలపై దొంగ నిద్ర!
ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలినా కళ్లు తెరవని సర్కార్ - తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని నిపుణుల సూచన - నిపుణులు, జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనలు బేఖాతర్ - తీర్పును సుప్రీంలో సవాల్ చేయకూడదని సీఎం నిర్ణయం - సర్కార్ తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన - రాష్ట్రంలో ఆయకట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం సాక్షి, హైదరాబాద్ : బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నా ప్రభుత్వం తోసిపుచ్చుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపిస్తూనే... ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలన్న సూచనను ముఖ్యమంత్రి కొట్టిపారేస్తున్నారని జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలమేరకే చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ అధికారం పంచుకుంటున్నా సీఎం వైఫల్యం వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరైన రీతిలో స్పందించకుండా... తన స్వప్రయోజనాలకోసం మరోసారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం సమర్థవంతమైన వాదనలు విన్పించలేదని సాక్షాత్తూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ వ్యాఖ్యలు చేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. సర్కార్ ఇదే రీతిలో నిర్లక్ష్యం చేస్తే రెండు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని.. ఫలితంగా రాష్ట్రంలోని ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్ తరాలు క్షమించవని అధికారపార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ద్విముఖ వ్యూహం సూచించిన నిపుణులు... కృష్ణా జలాల పునఃపంపిణీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ ఈనెల 19న ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 89(ఏ) (బీ) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కరవు పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నీటి విడుదలకు సంబంధించిన ‘మ్యాన్యువల్’ను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఖరారు చేయనుంది. ఇదే అంశంపై రెండు వారాల్లోగా అభిప్రాయాలు తెలపాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఒక రాష్ట్రం చెప్పిన అభిప్రాయంపై మరొక రాష్ట్రం అభ్యంతరాలను తెలిపేందుకు మరో రెండు వారాలు, ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వడానికి మరో వారం సమయం ఇచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, న్యాయ నిపుణులతో జలవనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చించి వ్యూహాన్ని రూపొందించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అభిప్రాయం చెప్పేందుకు ఓ వైపు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేలా ఖరారు చేసిన వ్యూహాన్ని సర్కార్‌కు నివేదించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మార్చిన బ్రిజేష్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారీగా కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ స్పష్టమైన అవార్డును అప్పట్లోనే జారీ చేసింది. విభజన నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మార్పులు చేర్పులు చేసే అవకాశం లేనే లేదు. కృష్ణా నదిలో 2060 టీఎంసీలు నికర జలాలు, 70 టీఎంసీలు పునర్ వినియోగం కలుపుకుని 2130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని తేల్చిన బచావత్ ట్రిబ్యునల్.. కరవు పరిస్థితులు ఉత్పన్నమైతే ఇబ్బందులు ఎదుర్కోకుండా దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 150 టీఎంసీలను క్వారీ ఓవర్‌గా కేటాయించింది. నికర జలాలు 2130 టీఎంసీలను నదీ పరివాహక రాష్ట్రాలు వినియోగించుకున్నాక 150 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకునే వెసులుబాటును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. కానీ.. ఇందులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మార్పులు చేసింది. 2130 టీఎంసీలు నాలుగు రాష్ట్రాలు వినియోగించుకున్నాక.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత ఆధారంగా 120 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవచ్చునని తేల్చిచెప్పింది. క్యారీ ఓవర్లో కోటాపైనే దృష్టి.. క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించనుంది. నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణం, జనాభా ఆధారంగా క్యారీ ఓవర్ కోటా కింద వంద టీఎంసీలు కేటాయించాలంటూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైందని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సర్కార్‌కు నివేదించారు. కృష్ణా డెల్టాకు 1885 నుంచి నీటి సరఫరా చేస్తోన్న నేపథ్యంలో.. క్యారీ ఓవర్ కోటాలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ వాదించాలని సూచించారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తోన్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీల వాటా ఇవ్వాలని, నాగార్జున సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ 45 టీఎంసీలు వినియోగించుకునేలా బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం కుడి కాలువ, పట్టిసీమ ద్వారా మళ్లిస్తోన్న గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 90 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది. జూరాల, సింగూరు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ముంపు ప్రాంతాల కింద ఎగువ రాష్ట్రాలకు 30 టీఎంసీల వాటా అప్పట్లోనే ఇచ్చామని.. ఇప్పుడు తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ద్విముఖ వ్యూహాన్ని సీఎం చంద్రబాబునాయుడు తోసిపుచ్చుతున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో డిసెంబర్ 30, 2010న దాఖలు చేసిన కేసుతోపాటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేసి సమర్థవంతమైన వాదనలు విన్పించాలన్న ప్రతిపాదననూ కొట్టిపారేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో పాత కేసులో మాత్రమే వాదనలు విన్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు, కరవు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సోమవారం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇలాగైతే ఆయకట్టు ఎడారే..! బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రంలో రాయలసీమ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలో ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుండటం.. మహారాష్ట్ర, కర్ణాటకలకు నీటి కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పెంచడం.. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై కార్యాచరణ(మ్యాన్యువల్)ను రూపొందించకపోవడం.. వెరసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే కేటాయించిన నీటి కన్నా అధికంగా నీటిని వినియోగిస్తుండటంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్లకు ఆలస్యంగా నీళ్లు చేరుతున్నాయి. దాంతో జూన్ నెలాఖరు నుంచి జూలై ఆఖరులోగా సాగు కావాల్సిన ఖరీఫ్ పంటలు ఆగస్టు నుంచి సెప్టెంబరు దాకా సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడం.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.52 మీటర్లకు పెంచేందుకు అంగీకరించడంతో- జూరాల రిజర్వాయర్‌కు వరద నీటి చేరికలో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకూ వరద జలాల చేరిక ఆలస్యమవుతుంది. దుర్భిక్ష పరిస్థితుల ఏర్పడినప్పుడు ఎగువ రాష్ట్రాల నుంచి చుక్క నీరు కూడా దిగువకు వచ్చే అవకాశం లేదు. మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న స్వేచ్ఛను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు చేసి.. వాటిని కూడా పంచడం వల్ల హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రానికి శరాఘాతంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయకూదని సర్కార్ నిర్ణయించడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉంది. -
ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతంలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నీటి పంపకాల వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం అఖిలపక్షాన్ని పిలిచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఉన్నదాంట్లోనే పంచుకోండి!
-
మిగులు కృష్ణార్పణమేనా?
• మిగులు జలాలపై గతంలో రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చిన బచావత్ ట్రిబ్యునల్ • ఎగువ రాష్ట్రాలకూ పంచిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ • కేంద్రం గెజిట్‌లో ప్రచురిస్తే దిగువ రాష్ట్రాలకు 140 టీఎంసీల మేర నష్టం • తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన 5 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం మిగులు గల్లంతు బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల నికర జలాలు, మరో 70 టీఎంసీల రీ జనరేషన్ జలాలు ఉన్నట్టు తేల్చింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల ప్రవాహాలను పరిగణిస్తూ 65 శాతం నీటి లభ్యత లెక్కతో 2,578 టీఎంసీల జలాలు ఉన్నట్టు లెక్కలేసింది. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు (మొత్తం 448) జలాలు ఉన్నట్టు తేల్చింది. ఈ నీటిని మూడు రాష్ట్రాలకు(మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఏపీకి 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని కేటాయించింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలు కేటారుుంచింది. ఈ 285 టీఎంసీల నీటిని ఆధారం చేసుకునే తెలంగాణలో 5 ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. బచావత్ తీర్పుకు విరుద్ధంగా మిగులు జలాలు పంచారని రెండు రాష్ట్రాలు ఎప్పట్నుంచో కేంద్రానికి చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే ఎగువ రాష్ట్రాలు అదనంగా 254 టీఎంసీలు అంటే.. మొత్తంగా 1,573 టీఎంసీలను వాడుకుంటాయి. అదే జరిగితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి ప్రవాహం తగ్గనుంది. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ర్టంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఐదు ప్రాజెక్టులపై ప్రభావం.. ట్రిబ్యునల్ తీర్పు ప్రధానంగా తెలంగాణలోని ఐదు ప్రాజెక్టులపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కష్టంగా మారనుంది. ఇప్పటి వరకు మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయకపోవడంతో ఆ నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని చేపట్టారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను సైతం కర్ణాటక, మహారాష్ట్రకు కేటాయించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. నెట్టెంపాడు, కల్వకర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను మిగులు జలాల ఆధారంగా చేపట్టారు. వీటి ద్వారా సుమారు 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులకు ఏలాంటి కేటాయింపులు జరగలేదు. దాంతో వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. క్యారీ ఓవర్‌పైనే ఆశలు.. ఒకవేళ వివాదం ఏపీ, తెలంగాణలకే పరిమితమైతే.. క్యారీఓవర్ జలాలు, పోలవరం, పట్టిసీమలో వాటాలపైనే ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు నడవనున్నా యి. క్యారీ ఓవర్ అంటే నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకొని తక్కువగా వచ్చినప్పుడు వినియోగించుకోవడం. బచావత్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాల 75% నీటి లభ్యత ఆధారంగా నీటిని పంపిణీ చేసింది. ఈ నీరు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు ఎక్కువ ఏడాదుల్లో అందుబాటులో ఉంటుంది. దిగువన ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఏడాదుల్లో తక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంద ర్భాల్లో నీటి లోటును పూడ్చడానికి ఎక్కువ నీరు వచ్చినప్పుడే శ్రీశైలం, సాగర్‌లో నిల్వ చేసుకొని తర్వాత తక్కువ వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు ఉమ్మడి ఏపీకి 150 టీఎంసీల క్యారీ ఓవర్ ఇచ్చింది. ఇందులో పరీవాహకం ఆధారంగా చూస్తే తమకు 100 టీఎం సీలు దక్కాలన్నది తెలంగాణ వాదన. దీనికితోడు 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరానికి అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపింది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. ఇది పోలవరంలో అంతర్భాగం కానందున దీనిద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా ఈ 90 టీఎంసీలు దక్కాలని తెలంగాణ వాదించనుంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న నీటి వాటాకు క్యారీ ఓవర్ జలాలు 100 టీఎంసీలు, పోలవరం, పట్టిసీమ ద్వారా వచ్చే 90 టీఎంసీలు కలిపి మొత్తంగా నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 489 టీఎంసీలకు పెంచాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. దీనికి తోడు రాజోలిబండ కుడి కాల్వకు కేటాయించిన 4 టీఎంసీలను రద్దు చేసి, ఆ నీటిని పంచాలని తెలంగాణ కోరే అవకాశాలుంటాయి. అనుకున్నదే జరిగింది. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలకు కలిపి పునఃపంపిణీ చేయాలంటూ రెండేళ్లుగా చేస్తున్న పోరాటం బూడిదలో కలిసింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారం వెలువరించిన తీర్పు రాష్ట్రానికి అశనిపాతమైంది. ఒకవేళ కేంద్రం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పును గెజిట్‌లో ప్రచురిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోనుంది. ఆల్మట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలపై పోరాడే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోనుంది. మిగులు జలాలపై రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన 5 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. - సాక్షి, హైదరాబాద్ -
ఉన్నదాంట్లోనే పంచుకోండి!
కృష్ణా జలాల వివాదంపై తేల్చి చెప్పిన బ్రిజేశ్ ట్రిబ్యునల్ ► ఉమ్మడి రాష్ట్రంలోని నీటి కేటాయింపులనే పంచుకోవాలి ► మహారాష్ట్ర, కర్ణాటకలకు సంబంధం లేదు ► తీర్పులో 9 అంశాలకు వివరణ ► 2 రాష్ట్రాల మధ్య పంపకాలపై డిసెంబర్ 14న విచారణ ► రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా తీర్పు.. రెండేళ్లుగా చేస్తున్న వాదనలు గాలికి.. ► మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం! సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై అంతా అనుమానిస్తున్నట్టే జరిగింది! కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. నదీ జలాలను నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయించాలంటూ రెండేళ్లుగా తెలంగాణ చేస్తున్న వాదనలకు నీళ్లొదిలింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. మున్ముందు మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్పీ వంటి ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. అంతేకాదు ఎగువ రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశలన్నీ సుప్రీంకోర్టుపైనే పెట్టుకుంది. రెండు రాష్ట్రాలే పంచుకోవాలి.. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 పరిధి, విస్తృతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ఈ ట్రిబ్యునల్ బుధవారం తీర్పు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. సెక్షన్-89 ఇదే చెబుతోందంటూ 124 పేజీల తీర్పును వెలువరించింది. విచారణ ప్రాతిపదిక కోసం నాలుగు రాష్ట్రాల సమ్మతితో ఎంచుకున్న 9 సంశయాలకు సవివరణతో కూడిన సమాధానాలు ఇచ్చింది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ (ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టు వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. వాటికి జవాబులను తదుపరి రెండు వారాల్లో సమర్పించాలని, తిరిగి వాటిపై ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వారంలోగా సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో తెలిపింది. విడిపోవడంతో తలెత్తిన వివాదం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు నీటి కేటాయింపులు చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో కేంద్రానికి అవార్డు ఇచ్చింది. సమీక్షల అనంతరం 2013లో తదుపరి అవార్డును సమర్పించింది. అయితే ఈ కేటాయింపులతో అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంలో పిటిషన్ వేసింది. దీంతో ఆ అవార్డును నోటిఫై న్యాయస్థానం చేయకుండా స్టే విధించింది. ఇదేక్రమంలో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో కృష్ణా నదీ నీటి కేటాయింపుల కోసం కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను గడువును పొడిగించింది. ఇందుకుగాను చట్టంలో సెక్షన్ 89ను పొందుపరిచింది. అయితే ఈ సెక్షన్-89 కేవలం రెండు కొత్త రాష్ట్రాలకే కాదని, నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుందని, అందువల్ల బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తిరిగి అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాదించాయి. దీంతో ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలను విచారణకు ప్రాతిపదికగా తీసుకుంది. 9 అంశాలపై ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే.. 1. కృష్ణా నదీ జలాల కేటాయింపు వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏప్రిల్ 2, 2004న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను నియమించింది. 2010 డిసెంబర్ 13న ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో 2013 నవంబర్ 29న నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 5(3) ప్రకారం తదుపరి అవార్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు జరిపింది. ఈ లెక్కన తుది తీర్పు వచ్చినట్టేనే? తీర్పు: ట్రిబ్యునల్ తదుపరి ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో, కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 12 పరిధిలో తదుపరి సూచనలు చేయనిపక్షంలో తుది తీర్పు వచ్చినట్టే. 2. నవంబర్ 29, 2013న తుది అవార్డు కేటాయించిన తర్వాత ఈ ట్రిబ్యునల్ కాలపరిధి పూర్తయ్యిందా? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపు జరపాల్సి ఉన్నందున అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ట్రిబ్యునల్ తిరిగి పనిచేస్తోందా? తీర్పు: కాల పరిమితి పూర్తవలేదు. సెక్షన్ 89 కింద కేటాయింపులు జరిపేందుకు ఈ ట్రిబ్యునల్ పనిచేస్తూనే ఉంది. 3. కేంద్ర ప్రభుత్వం 2014 మే 15న సెక్షన్ 89 ద్వారా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్‌పై చేసిన విధివిధానాలు రెండు కొత్త రాష్ట్రాల వరకే పరిమితమా? తీర్పు: అవును. ప్రాజెక్టు వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ రెండు కొత్త రాష్ట్రాల మధ్య మాత్రమే. 4. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం.. ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతి, విధివిధానాలు నాలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా? కేవలం రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితమా? తీర్పు: రెండు కొత్త రాష్ట్రాలకు మాత్రమే. 5. 2013 నవంబర్ 29 నాటి తుది అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలనే పరిగణనలోకి తీసుకుని రెండు కొత్త రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరపాలా? తీర్పు: అవును. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటి నుంచే రెండు కొత్త రాష్ట్రాలకు ప్రాజెక్టు వారీగా కేటాయింపులు జరపాలి 6. రెండు కొత్త రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, నియంత్రణకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85(8)(ఏ), 85(8)(ఇ)... పాత అవార్డులను పక్కనపెట్టి తిరిగి కేటాయింపులు జరపడాన్ని నిషేధిస్తున్నాయా? తీర్పు: ఈ సెక్షన్లు అలా నిషేధించడం లేదు.. కానీ నీటి వివాద పరిష్కార ట్రిబ్యునళ్ల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, తిరగదోడడంగానీ వీలు కాదన్న న్యాయ సమీక్షలను బలపరుస్తున్నాయి. 7. 2011లో కేంద్రం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 5(3) కింద చేసిన సూచనలకు సమాధానంగా 2013లో ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బీ) ద్వారా తలెత్తిన ప్రశ్నలు కూడా నాటి కేంద్రం సూచనల్లాగే ఉన్నాయి. సెక్షన్ 89కు కూడా సమాధానం 2013నాటి అవార్డులో చూడొచ్చా? తీర్పు: ఈ అంశానికి ఇప్పుడు మనుగడ లేదు. సెక్షన్ 89ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పరిమితం చేస్తూ మొత్తం అంశాన్ని కొత్తగా చూడాలి 8. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్ధిష్ట కేటాయింపులు జరపకుండా.. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకే కేటాయింపులు జరిపితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా? తీర్పు: వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. దీనికి మద్దతుగా ఎలాంటి వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు. 9. 2010 డిసెంబర్ 30 నాటి అవార్డు, 2013 నవంబర్ 29 నాటి అవార్డులు నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 6 ప్రకారం గెజిట్‌లో నోటిఫై కాలేదు. అలాగే ఈ అవార్డులపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటప్పుడు ఆ రెండు అవార్డులను ‘ఫైనల్ అండ్ బైండింగ్’గా పరిగణించగలమా? తీర్పు: తొలి అంశాన్ని చర్చించినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాం. ట్రిబ్యునల్ నిర్ణయం వివాదాన్ని పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ ఏదైనా తదుపరి ఉత్తర్వు ఇవ్వనంత వరకు, సుప్రీంకోర్టు ఏదైనా అప్పీలుపై ఉత్తర్వు ఇవ్వనంతవరకు ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం. -
‘కృష్ణా’పై రాష్ట్ర వాదనతో ఏకీభవించిన ఏపీ
- సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాలకు నీటి పంపకమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ సర్కారు వాదనలు - ఏపీ అదనంగా 400 టీఎంసీలను వాడుకుంటోందని తెలంగాణ ఆక్షేపణ - ఆగస్ట్ 16న తదుపరి విచారణ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను 4 రాష్ట్రాలకు పంచాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీభవించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇరు రాష్ట్రాల వాదనలు శనివారం కొనసాగాయి. తదుపరి విచారణను ఆగస్ట్ 16కు బ్రిజేష్ కుమార్ వాయిదా వేశారు. ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ప్రాజెక్ట్‌ల వారీగా నిర్దిష్ట కేటాయింపులు జరపాలని ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. అందువల్ల 4 రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని కోరారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బేసిన్ పరిధిలో ఉండే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిగాయని తెలిపారు. సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌ల వారీగా నీటి కేటాయింపులేనని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలను వినిపించారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నట్లుగా నీటి పంపకాలను ఏపీ, తెలంగాణ కు పరిమితం చేయరాదన్నారు. ఏపీ, తెలంగాణాకు పరిమితం చేయడం విభజన చట్టంలోని సెక్షన్ 89 స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేవలం రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను పరిమితం చేస్తే తెలంగాణ కు ఆన్యాయమే జరుగుతుందని. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని, తెలంగాణ కు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా ఒక ఒప్పందం జరిగిందని, ఇప్పటికీ అదే అమలవుతోందని వైద్యనాథన్ వివరించారు. ఏపీకి 512 టీఎంసీల హక్కు మాత్రమే ఉన్నా అదనంగాా 400 టీఎంసీలను వాడుకుంటోందని ఆక్షేపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కు 90 టీఎంసీల నీరు ఏపీ నుంచి రావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ వారీగా నీటి కేటాయింపులు చేసే సమయంలో ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌లోకి నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ కు 45 టీఎంసీలు, కర్నాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యనాథన్ పేర్కొన్నారు. -
కృష్ణా జలాల సమస్య 4 రాష్ట్రాలదే
♦ ఏపీ, తెలంగాణ, మహారాష్ర్ట, కర్ణాటక మధ్య పంపిణీ చేయాలి ♦ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం చట్టం స్ఫూర్తిని నీరుగార్చడమే ♦ కర్ణాటక, మహారాష్ట్రల వాదనలో పస లేదు ♦ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీ తప్పనిసరిగా నదీ పరివాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య జరగాల్సిందేనని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. కృష్ణా జలాల పంపిణీని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తిని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల వారీగా పంపిణీ జరగాలంటే 4 రాష్ట్ర్రాల్లోని ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సోమవారం కృష్ణా నదీ పరివాహక రాష్ట్రాల వాదనలు కొనసాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ఏకే గంగూలీ వాదనలను కొనసాగించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జలాల వివాదం చట్టంలోని పలు అంశాలను ప్రస్తావించారు. సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీని ఎపీ, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలన్న కర్నాటక, మహారాష్ట్రల వాదనలో పస లేదని గంగూలీ స్పష్టం చేశారు. నీటి పంపిణీ తెలుగు రాష్ట్రాల మధ్యనే జరగాలన్న ప్రస్తావన ఏదీ లేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల పంపిణీ 4 రాష్ట్రాల సమస్య అని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్‌ల వారీగా మళ్లీ కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఈ దశలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ జోక్యం చేసుకుంటూ.... ఎన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలో చట్టంలో లేనందువల్ల తెలుగు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను పరిమితం చేయొచ్చు కదా! అని ప్రశ్నించారు. అయితే, ఈ రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులు జరపాలని కూడా చట్టంలో లేదని గంగూలీ బదులిచ్చారు. నదీ జలాల పంపకాలు జరిపే ముందు, నదిపై కొత్తగా నిర్మించిన ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుందని, తర్వాతే కేటాయింపులు జరపాలని చెప్పారు. ప్రాజెక్ట్‌ల వారీగా మళ్లీ కేటాయింపులు జరపడానికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని పొడిగించారని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్ట్లుఉన్నాయో తెలిసిన తర్వాతే తదనుగుణంగా నీటి కేటాయింపులు జరపడం సాధ్యమవుతుందన్నారు. గతంలో మొత్తంగా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిగాయని, ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయింపుల కోసమే విభజన చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారని ఏకే గంగూలీ గుర్తుచేశారు. కృష్ణా జలాల పంపిణీ మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీల మధ్య జరిగిందన్నారు. దీన్ని యథాతథంగా అమలు చేయాలంటే ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో లేదన్నారు. నేడు తెలంగాణ వాదనలు ప్రాజెక్ట్‌ల వారీగా నీటి కేటాయింపుల గురించి ఏకే గంగూలీ వాదిస్తున్న దశలో బ్రిజేష్ కుమార్ జోక్యం చేసుకుంటూ... ఏపీలోని ప్రాజెక్ట్‌ల వివరాలను కోరారు. విభజన చట్టం 11 షెడ్యూల్లోని రెండు ప్రాజెక్ట్‌లు తప్ప మిగిలినవి పూర్తి కాలేదని గంగూలీ తెలిపారు. హంద్రీ-నీవా, కల్వకుర్తి పూర్తయ్యాయని, గాలేరు-నగరి, వెలిగొండ, నెట్టెంపాడు తదితర ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు ఎలా సాధ్యమని బ్రిజేష్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం వైద్యనాథన్ వాదనలు వినిపిస్తారు. -
'కృష్ణా' వివాదంపై బ్రిజేష్ ట్రైబ్యునల్‌లో విచారణ
ఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన న్యాయమూర్తిని ట్రైబ్యునల్‌లో నియమించడంపై అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో ట్రైబ్యునలే సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, కర్ణాటక అభ్యంతరాలను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యంతరాలను పక్కనపెట్టి వాదనలు కొనసాగించాలని కేంద్రం సూచించినట్టు సమాచారం. -
కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీం వాయిదా
ఢిల్లీ: కృష్ణా జల వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ల పై వాయిదా పడింది. బుధవారం సుప్రీంకోర్టులో రెండు గంటలపాటు ఈఅంశంపై వాదనలు జరిగాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించాలా వద్దా అనే అంశంపై వాదనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించగా.. ఏపీకి కేటాయింపుల్లో సరైన ప్రాతిపదిక ఏదీ లేదని ఏపీ తరుఫు న్యాయవాది చెప్పారు. మరోపక్క, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. -
అఫిడవిట్లు ఇవ్వండి
ఏపీ, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం అఫిడవిట్ దాఖలుకు జనవరి 5 గడువు.. తదుపరి విచారణ 7న ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణలకే పరిమితమన్న మహారాష్ట్ర, కర్ణాటక న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా నదీ జలాల వివాదం ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు ఆదేశించారు. ఈ మేరకు జనవరి 5 వరకు గడువు ఇస్తూ.. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేశారు. గురువారం నాటి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ భేటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కాలపరిమితి పొడిగింపు పొందిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. గడువు ముగిసినా కేంద్రం అఫిడవిట్ సమర్పించలేదు. గురువారం ట్రిబ్యునల్ భేటీలో.. అఫిడవిట్ సమర్పించడానికి గడువు కా వాలని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీ కోరగా 3 వారాల గడువు ఇచ్చింది. తాము విచారించాల్సిన అంశాలను పేర్కొంటూ అఫిడవిట్లు సమర్పించాలని నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది. జనవరి 7న ట్రిబ్యునల్ విచారణ పరిధిని నిర్ధారించాకే తదుపరి విచారణకు అనుమతిస్తామని బ్రిజేశ్ స్పష్టం చేశారు. పొడిగించిన ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణలకే పరిమితమని మహారాష్ట్ర, కర్ణాటకలు పునరుద్ఘాటించాయి. -
రెండు రాష్ట్రాలా.. నాలుగు రాష్ట్రాలా?
* కృష్ణాజల వివాదాల్లో రాష్ట్రాల పరిధిపై నేడు మరోమారు బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై గురువారం మరోమారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివాదాలకే విచారణను పరిమితం చేయాలా, మహారాష్ట్ర, కర్ణాటకలను చేర్చాలా అన్న దానిపై ట్రిబ్యునల్ అందరి వాదనలు విననుంది. ఇందులో కేంద్రం వెల్లడించే నిర్ణయమే కీలకం కానుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. దీనిపై గతంలో జరిగిన విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ఏపీ, తెలంగాణలు నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరపాలని కోరగా, కర్ణాటక, మహారాష్ట్ర వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం చేసే నిర్ణయం కీలకంగా మారింది. దీనిపై గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన కేంద్రం, రెండు రాష్ట్రాలకే విచారణను పరిమితం చేయాలని తెలిపింది. నివేదిక రూపంలో అభిప్రాయాన్ని చెప్పాలని ట్రిబ్యునల్ సూచించినా అది జరుగలేదు. కాగా, కృష్ణా జలాలపై బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే నెల 1 న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
కృష్ణా జలాల కేసుపై నేడు సుప్రీంలో విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ ఎస్ఎల్పీని అడ్మిట్ చేసుకునే విధంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రమే న్యాయవాదులు రవీందర్రావుతోపాటు అంతర్రాష్ట్ర నదీ వివాదాలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌తో సోమవారం ఉదయం సమావేశమై కేసు పూర్వాపరాలను మరోమారు వివరించే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ చట్టంలోని 5(2) అధికరణ కింద, తర్వాత దాన్ని సవరిస్తూ 5(3) కింద వెలువరించినతీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణను కొనసాగించేందుకు అంగీకరించిన కోర్టు... తీర్పును మాత్రం గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరోరాష్ట్రం మహారాష్ట్ర.. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అంగీకరించడంతో గత నెలలోనే ఎస్ఎల్పీ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్మిట్ చేసుకోవచ్చా.. లేదా అన్న అంశంపై కోర్టు విచారించనుంది. -
2 రాష్ట్రాలా? 4 రాష్ట్రాలా?
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిపై అయోమయం నేడు రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న ట్రిబ్యునల్ వ్యతిరేకత వ్యక్తం చేయనున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధి విషయంలో అయోమయం నెలకొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ట్రిబ్యునల్ గడువును రెండేళ్లపాటు పొడిగించిన విషయం విదితమే. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం.. రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడంతో పాటు కరువు నెలకొన్న సంవత్సరాల్లో అనుసరించడానికి ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ ప్రొటోకాల్స్ రూపొందించడం ట్రిబ్యునల్ బాధ్యతగా చట్టంలో పేర్కొన్నారు. అయితే ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయింపులు చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అఫిడవిట్లు సమర్పించిన విషయం విదితమే. కానీ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకే పరిమితమని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తన తాజా లేఖలో స్పష్టం చేసింది. కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంపై బుధవారం జరగనున్న సమావేశంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను ట్రిబ్యునల్ తీసుకోనుంది. ఈ మేరకు అభిప్రాయం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ట్రిబ్యునల్ పరిధి రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు స్టే సంగతేమిటి? కృష్ణా జలాల కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. రాష్ట్ర విభజన తర్వాత.. ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేసి తాజాగా నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అరుుతే సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో.. ఆమల్లోలే ని తీర్పు మేరకు ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడం సాధ్యమేనా? అనే కోణంలో ట్రిబ్యునల్ ముందు వాదించేందుకు ఏపీ సమాయత్తమవుతోంది. 65 శాతం నీటి లభ్యత గురించి తేల్చండి దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా నీటి కేటాయింపులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అప్పట్లో అఖిలపక్షం విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరంపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ రాలేదు. దీని ఆధారంగా.. ట్రిబ్యునల్ తీర్పులో కీలకాంశమైన 65 శాతం డిపెండబిలిటీ పై కేంద్రం వైఖరి చెప్పకుండా, ట్రిబ్యునల్ పరిధి విషయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సొంత వ్యాఖ్యానం చెబుతూ రెండు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొనడాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయానికి రాష్ట్రం వచ్చింది. మెుత్తం మీద రెండు రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ట్రిబ్యునల్‌కు లేదని, అందరి వాదనల విన్న తర్వాత నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
తీర్మానాలతో సరిపెట్టొద్దు
కర్నూలు రూరల్: సాగు నీటి సలహా మండలి సమావేశాన్ని తీర్మానాలతో సరిపెట్టవద్దని, రైతులకు ప్రయోజనం కలించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన ఐఏబీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లాలో జరిగిన మొదటి సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీశారు. అలాగే సాగు నీటి సమస్యలపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మధ్యలోనే నిష్ర్కమించారు. కోస్తా ప్రాంతానికి మేలు చేసే విధంగా శ్రీశైలం నీటి మట్టాన్ని తగ్గించి ప్రభుత్వం కర్నూలు, కడప జిల్లా రైతుల కడుపుకొడుతోందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సాగుతో కేసీ వాటా నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, నీటి పారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు ఆర్.నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. * తుంగభద్ర దిగువ కాలువ కింద 30,000 ఎకరాలకు నీరందించాలి. * బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పులో పేర్కొన్న 400 టీఎంసీల నీటి కేటాయింపును తక్షణం అమలుపరచాలి. * ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కట్ట ఎత్తును ఎట్టి పరిస్థితుల్లో పెంచరాదు. * 31/7/2014 నుంచి సుంకేసుల బ్యారేజీ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు వదలాలి. * మాల్యాల నుంచి రెండు పంపుల ద్వారా కేసీ కాలువకు నీళ్లు వదలాలి. * ఎలెల్సీలో నీటి ప్రవాహం 3000 క్యూసెక్కుల ఉండే విధంగా చూడాలి. * ఎల్లెల్సీలో 72.00 కి.మీ నుంచి 185.00 కి.మీ వరకు పైప్‌లైన్ వేసి నీటి చౌర్యాన్ని అరికట్టాలి. * కేటాయించిన 10 టీఎంసీల నీటిని ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెన్న అహోబిలం రిజర్వాయర్‌కు మళ్లించరాదు. * వీబీఆర్ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం తేదీ 31/7/2014 నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వదలాలి. * వెలుగోడు రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, కి.మీ 0.00 నుంచి 18.00 కి.మీ లైనింగ్ పనులకు తక్షణం ఉత్తర్వులివ్వాలి. * కేసీ కెనాల్ కింద కర్నూలు జిల్లాలో 1,00,476 ఎకరాలకు, కడప జిల్లాలో 74,912 ఎకరాలకు మొత్తంగా 1,75,388 ఎకరాలకు నీరందించాలి. * ఆలూరు బ్రాంచి కాలువ ద్వారా ఖరీఫ్‌లో 8,019 ఎకరాలకు నీరందించాలి. * అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగంగా ఉన్న పాలేరు, తిమ్మరాజు మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద గల ఆయకట్టును ఎస్ఆర్బీసీలో చేర్చాలి. * ఎస్ఆర్బీసీ బ్లాక్‌లో 1 నుంచి 16 బ్లాక్‌లలో ఖరీఫ్‌కు 1,19,057 ఎకరాలకు నీరందించాలి. * శివభాష్యం సాగర్కింద ఖరీఫ్‌లో 13,000 ఎకరాలకు నీరందించాలి. * కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలి. ఆ హక్కు ఎవరు ఇచ్చారు.. శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి 789కి తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతానికి సీఎంలా వ్యవహరిస్తున్నారు. జిందాల్ ప్యాక్టరీ నిర్మించేందుకు భూములు ఇస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన యాజమాన్యంపై మీరు పదేళ్లుగా ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఎస్పీవై రెడ్డిని ప్రశ్నించారు. - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే సిమెంటు కంపెనీలపై చర్యలు తీసుకోండి ప్యాపిలి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న దుమ్ము, ధూళి వల్ల సమీపంలోని పొలాలు పంటలు పండటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పశువులకు మేత మేసేందుకు కూడా గడ్డి మొలచని విధంగా ఆ ప్రాంతం కాలుష్యయుతంగా మారింది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. - బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే ఆర్డీఎస్‌పై కర్ణాటక పెత్తనం తగదు ఆర్డీఎస్‌పై కర్ణాటక పెత్తనం చలాయిస్తుంది. ఆర్డీఎస్కు ఉన్న ఐదు స్లూయిజ్‌లు, 19 పైపులలో నాలుగు స్లూయిజ్‌లు 18 పైపులు మూత వేయడంతో దిగువకు నీరు రావడం లేదు. దీనివల్ల పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలంలో ఉన్న కేసీ ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సెంట్రల్ ఫోర్స్ ఏర్పాటు చేసైనా మూత వేసిన స్లూయిజ్‌లు, పైపులను తెరిపించి కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి. - గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే జల చౌర్యాన్ని అడ్డుకోవాలి ఎల్లెల్సీ నీరు చివరి ఆయకట్టకు అందడం లేదు. ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. కర్ణాటక ప్రాంత రైతులు చేస్తున్న జలచౌర్యాన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి సమావేశంలో తీర్మానాలు చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల సందర్భంగా ఎల్లెల్సీ జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు పైపులను వేయిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. - సాయి ప్రసాద్‌రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే ఎత్తిపోతలను పూర్తి చేయాలి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పనులు వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలి. విద్యుత్ సరఫరా సమస్యతో కొన్ని పథకాలు పూర్తయినా మొదలు పెట్టకపోవడం సమంజసం కాదు. చిన్న చిన్న కారణాలతో పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు. పులి కనుమ పథకానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరలో సాగునీరు అందించాలి. - -బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే భూసేకరణ సాకు చూపొద్దు ఆలూరు నియోజకవర్గ పరిధిలో తాగు, సాగు నీరు సమస్యలు ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో అత్యంత కరువు నెలకొన్న ప్రాంతంగా ఆలూరు గుర్తింపు పొందింది ఆలూరు బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన నగరడోణ జలాశయం పనులు పూర్తి చేయాలి. భూ సేకరణతో పనులు సాగడం లేదనే సాకుతో అధికారులు తప్పించుకుంటున్నారు. - గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే పార్టీలకతీతంగా పోరాటం తుంగభద్ర జలాశయం నుంచి చట్టప్రకారం జిల్లాకు రావాల్సిన నీటి వాటాలో కోత పడుతోంది. దీంతో జిల్లా ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీలకతీతంగా తుంగభద్ర జలాల హక్కులపై పోరాడాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా కర్ణాటక ప్రభుత్వం అడ్డుగోలుగా ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోంది. దీనిని అడ్డుకోవాలి. - జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే నష్టపరిహారం ఇప్పించండి ఎస్సార్బీసీలో భూములు కోల్పోయిన నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. తక్షణమే వారికి పరిహారం చెల్లించాలి. ఉపాధి చూపిస్తామని భూములు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించుకొని పరిహారం చెల్లించలేదు. - బీసీ జనార్దన్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే -
‘బచావత్’నూ తిరగదోడాలి!
► ఆ ట్రిబ్యునల్ తీర్పు నుంచే తెలంగాణకు అన్యాయం ► బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులోనూ అదే తీరు ► తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ► సమగ్ర సమీక్షతో నాలుగు రాష్ట్రాలకు కొత్తగా కేటాయింపులు జరగాలి ► 24న కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు సిద్ధమైన కేసీఆర్ సర్కారు ► ట్రిబ్యునల్ స్పందనతో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం మొత్తాన్ని తిరగదోడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును ఇప్పటికే వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారు.. అంతకుముందున్న బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునూ పూర్తిగా సమీక్షించాలని భావిస్తోంది. ఈ రెండు ట్రిబ్యునళ్ల అవార్డుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. రాష్ర్ట విభజన నేపథ్యంలో... ఉమ్మడి రాష్ట్రానికి ఉద్దేశించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాని గడువును పెంచింది. ఈ మేరకు పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల పంపిణీపై ఈనెల 24న బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట తొలిసారిగా వాదనలు జరగనున్నాయి. ఈ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మిగులు జలాల పంపిణీతో తమకు అన్యాయం జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కూడా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఈ విషయాన్ని కూడా సమీక్షించాలంటూ గట్టి వాదనలు వినిపించాలని కేసీఆర్ సర్కారు తాజాగా నిర్ణయించింది. ‘మొదటి(బచావత్) ట్రిబ్యునల్ ముందు వాదనల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం కోణంలో ఏమీ ఆలోచించలేదు. అప్పుడే చాలా అన్యాయం జరిగింది. తొలి ట్రిబ్యునల్ కేటాయింపుల స్ఫూర్తిని అలాగే పాటిస్తూ మిగులు జలాలను పంపిణీ చేసిన రెండో(బ్రిజేశ్‌కుమార్) ట్రిబ్యునల్ అవార్డుతోనూ తెలంగాణ ప్రాంతానికి నష్టమే జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రాంతం తరఫున వాదించే దిక్కులేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ఉంది. అందుకే నీటి కేటాయింపులను సమూలంగా సమీక్షించాలనేది ఈ ప్రభుత్వ డిమాండ్’ అని సాగునీటి శాఖ ముఖ్యుడొకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఇది జరగాలంటే ఈ ట్రిబ్యునల్ ప్రస్తుత విచారణ పరిధిని కేవలం తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయకుండా కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలూ సవరించాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంటు ఆమోదించిన పునర్విభజన చట్టానికే సవరణలు అవసర మా? లేక కేంద్రమే ఈ నిర్ణయాన్ని తీసుకుంటే సరిపోతుందా?.. అలాగే దీనికి సుప్రీంకోర్టు ఆమోదం తప్పనిసరా? వంటి అంశాలపై న్యాయనిపుణులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అంగీకరించకపోతే ఎలా? నాలుగు రాష్ట్రాల కేటాయింపులను మొదటి నుంచీ సమీక్షించాలనే డిమాండ్‌ను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అంగీకరించడం ప్రశ్నార్థకమే! రాష్ట్ర డిమాండ్‌ను ఒకవేళ ట్రిబ్యునల్ తిరస్కరించే పక్షంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం ముందుపెట్టాలని, లేదంటే సుప్రీంను ఆశ్రయించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. ఒక రాష్ట్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరితే.. కేంద్రం అందుకు అంగీకరించాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే కేటాయింపులను తిరగదోడాలని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు సంబంధించి నేడో రేపో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నత స్థాయిలో సమీక్ష జరపనున్నారు. ప్రాతిపదికలనే ప్రశ్నిద్దాం! రెండు ట్రిబ్యునళ్లు కూడా మొత్తం నీటి లభ్యత, ప్రస్తుత ప్రాజెక్టుల అవసరాలు, రాష్ట్రాల డిమాండ్లనే తప్ప... ఆయా రాష్ట్రాల్లోని వాస్తవ నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం, ప్రాంతాలవారీగా సమకూరుతున్న జల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకోలేదన్నది రాష్ర్ట ప్రభుత్వ ఆరోపణ. దీనికి తగిన గణాంకాలనూ సేకరించింది. అలాగే ప్రాంతాల వెనకబాటుతనం, పేదరికం, తాగునీటి అవసరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని వాదించనుంది. ‘తుంగభద్ర నుంచి మహబూబ్‌నగర్‌కే 19 టీఎంసీలు రావల్సి ఉండేది. భీమాకు 100 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ గనుక ఇవి పరిగణనలోకి తీసుకుని ఉంటే గురుత్వ కాలువల ద్వారానే బోలెడు నీరు వచ్చి ఉండేది. అలాగే రాజోలిబండ డైవర్షన్ కెనాల్‌కు 5 టీఎంసీలు ఎలా ఇచ్చారు? బేసిన్ బయట ఉన్న తెలుగు గంగకు 25 టీఎంసీలు ఎలా ఇచ్చారు? ఇలా రెండు ట్రిబ్యునళ్ల ఎదుట కూడా కేవలం సీమాంధ్ర కోణంలో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించిందే తప్ప తెలంగాణ గురించి అస్సలు ఆలోచించలేదు. అందుకే సమూల, సమగ్ర సమీక్ష జరిపి పునఃకేటాయింపులు చేయాలని అడుగుతున్నాం’’ అని సాగునీటి శాఖ అధికారి వ్యాఖ్యానించారు. 24న కృష్ణా ట్రిబ్యునల్ భేటీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన జల వివాదాల నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల వాదనలు వినడానికి బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ తొలిసారి ఈనెల 24న సమావేశం కానుంది. దీంతో ఏపీ పక్షాన వాదించడానికి సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీని ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. అరుుతే ట్రిబ్యునల్ ముందు ఏ విధమైన వాదనలు విన్పించాలనే అంశంపై రాష్ర్టం ఇంకా ఓ తుది నిర్ణయూనికి రాలేదు. -
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు
-
మళ్లీ పంచాలి!
-
మళ్లీ పంచాలి!
* కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్రం డిమాండ్ * బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించేందుకు సిద్ధం * ఉమ్మడి రాష్ట్రంలో నీటికేటాయింపుల్లో అన్యాయం.. ఎగువ రాష్ట్రాలతోనూ సమస్య * తెలంగాణలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉండగా.. నీటి కోటా 36.4 శాతమే ట్రిబ్యునల్ ఎదుట ఉమ్మడి * ఆంధ్రప్రదేశ్ వాదనలు సమ్మతం కాదు * మహారాష్ట్ర, కర్ణాటకతో సహా మళ్లీ విడిగా వాదనలు వినాలి.. * మొత్తం జలాలను నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలి * మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని కోరనున్న టీ-సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని.. మళ్లీ వాదనలు వినాల్సిందేనని కోరనుంది. అంతేగాకుండా కృష్ణా నీటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మాత్రమేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను కూడా కలుపుకొని మొత్తం నదీజలాలను తిరిగి పంచాలని విజ్ఞప్తి చేయనుంది. నదిలో నీటి లభ్యత శాతం, నీటి ప్రవాహం అంచనా కోసం పరిగణనలోకి తీసుకున్న 47 ఏళ్ల సమయం విషయంలో పలు అభ్యంతరాలను వెల్లడించనుంది. మొత్తంగా ప్రస్తుతమున్న దానికంటే ఎక్కువ నీటి కేటాయింపులు పొందాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సమావేశాల్లో తన వాదన వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఎటూ తేలని పంపిణీ.. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. అయితే జలాలను పంపిణీ చేస్తూ ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగకపోవడంతో.. పదేళ్ల కింద బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కృష్ణా ట్రిబ్యునల్-2ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించింది. కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉండడంతో.. ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే ఈ లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. దాంతో రెండు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యను పరిష్కరించడానికి వీలుగా అదే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగించారు. ఈ ట్రిబ్యునల్ తొలి సమావేశం వచ్చే నెల 24వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ ట్రిబ్యునల్ సమావేశంలో తమ వాదనలను వినిపించడానికి ఆయా రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. మొదటి నుంచీ పంచాలి.. వాస్తవానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు ఉద్దేశం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి మాత్రమే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే వచ్చే నెలలో జరగనున్న ఈ ట్రిబ్యునల్ సమావేశాలకు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్ణాటకను కూడా ఆహ్వానించారు. దీంతో కృష్ణా జల వివాదం రెండు రాష్ట్రాల మధ్యనే కాకుండా నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనల్ని వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సర్కారు వెల్లడించనుంది. ముఖ్యంగా నీటి పంపిణీని మళ్లీ మొదటి నుంచీ చేయాలని కోరనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని... వాటి ఆధారంగా చేసిన కేటాయింపులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున వాటిని వ్యతిరేకించనుంది. నాలుగు రాష్ట్రాల సమస్య కృష్ణా నది జల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశంగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరనుంది. తద్వారా ఎక్కువ నీటిని పొందవచ్చని అంచనా వేస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదంగా చూస్తే... ఆలమట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉండదు. కేవలం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దాంతో నీటి కోటా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయా న్ని దృష్టిలో ఉంచుకుని.. కృష్ణా జలాల సమస్యను నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాలని తెలంగాణ సర్కా రు కోరనుంది. ప్రత్యేకించి నీటి కేటాయింపుల్లో నది పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ నీటి కేటాయింపు మాత్రం 36.4 శాతమే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ.. కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని వాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో అన్యాయం తెలంగాణ వాదనల సందర్భంగా కేవలం ఆంధ్రప్రదేశ్తోనే పంచాయితీ ఉందని మాత్రమేగాకుండా... ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వల్ల కూడా అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ట్రిబ్యునల్ మందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం పద్ధతి, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని కోల్పోవడం, నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47 ఏళ్ల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం.. తదితర అంశాల్లో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. అలాగే నది నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడాన్ని కూడా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కృష్ణా నీటిని ఇతర నదుల పరీవాహక ప్రాంతాలకు వినియోగించడానికి అనుమతించ వద్దని కోరనుంది. మిగులు జలాల పంపిణీని కూడా రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేయనుంది. -
ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరగనున్న ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మూడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపు, పంపిణీ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరి నదీ జల వనరుల మండలి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. -
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని భావించిన ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ విన్నవించిన అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. దీంతో మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం కావడంతో ఆ ప్రాజెక్టులను భారీ మొత్తంలో ఖర్చుపెట్టి పూర్తి చేశారు. ట్రిబ్యునల్ తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగనుంది. -
ఆఖరు నిమిషంలో హడావుడి
నత్తనడక: బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం విచారణ జాబితాలోకి పాత ఎస్ఎల్పీ..హుటాహుటిన కొత్త ఎస్ఎల్పీ దాఖలు రెండూ కలిపి విచారించమని నివేదించనున్న రాష్ట్ర సర్కార్ నేడు ‘సుప్రీం’లో విచారణ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం మరోసారి బహిర్గతమైంది. రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు విషయంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)ను గురువారం వరకు దాఖలు చేయకుండా ఉదాసీనతను ఘనంగా చాటింది. కృష్ణా జలాల నీటి కేటాయింపులపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పుపై గతంలో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో.. హడావుడిగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పుపై గురువారం ఎస్ఎల్పీ దాఖలు చేసింది. రెండింటిని కలిపి విచారించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని శుక్రవారం అభ్యర్థించాలనుకుంటోంది. పాత పిటిషన్ ఇదీ.. 2010 డిసెంబర్ 30న వెలువరించిన ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో పలు అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆ తీర్పును వ్యతిరేకిస్తూ 2011 మార్చి 28న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే.. - ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడ్డాక రావాలని సుప్రీంకోర్టు 2011 సెప్టెంబరు 16న తన మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా.. తాము తుది తీర్పు ఇచ్చేవరకు ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయరాదని కేంద్రాన్ని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 29నాటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పులో మనకు రావాల్సిన కృష్ణా మిగులు జలాల ను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయడం, అలమట్టి డ్యామ్ ఎత్తు పెంపును సమ్మతించడం, నీటి లభ్యత అంచనా కోసం 65 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలు మనకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. - ఇదే సమయంలో తీవ్ర కరువు ప్రాంతాల్లో నీటిని అందించడానికి ఉద్దేశించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదు. ఈ తుది తీర్పు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోనుంది. - అయితే, ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారమే ట్రిబ్యునల్ తీర్పు అమలవుతుంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన నెలన్నర తరువాత శుక్రవారం ఈ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తుది తీర్పును సవరించాలని, అంతవరకు ప్రస్తుత స్టేను కొనసాగించాలని తాజా పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ‘సుప్రీం’ను కోరింది. ‘65 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకోవడం అన్యాయం. ఇది బచావత్ అవార్డును తిరగదోడడమే. ఈ అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదు. ఆల్మట్టి విషయంలో రాష్ట్రవాదనలను పట్టించుకోలేదు. మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారు’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. అలాగే, ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పుపై పాత పిటిషన్‌ను, తుది తీర్పుపై వేసిన తాజా పిటిషన్‌ను కలిపి విచారించాలని ‘సుప్రీం’ను సర్కార్ కోరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. -
బ్రిజేష్ ట్రిబ్యునల్ మాకొద్దు
-
అఖిలపక్ష సమావేశానికి వెళ్లేది వీరే
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించనుంది. సీఎంతో పాటు బొత్స సత్యనారాయణ, జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారధి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాద రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నుంచి నారాయణ, గుండా మల్లేష్, సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, బీజేపీ తరపున నాగం జనార్థన్ రెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. -
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం
-
ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, మండల బుద్ధప్రసాద్, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ తరపున నారాయణ, గుండా మల్లేష్ పాల్గొన్నారు. సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బీజేపీ నుండి నాగం జనార్థన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్‌సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ హాజరు అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
ముంచిన పెద్దమనిషే.. మళ్లీ పంచుతారట !
* ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నీటి పంపిణీ బాధ్యత జస్టిస్ బ్రిజేశ్కుమార్కే అప్పగింత *ఆ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్టు ముసాయిదా బిల్లులో కేంద్రం వెల్లడి *దిగువ రాష్ట్రాల హక్కులు పట్టని ట్రిబ్యునల్‌కే ఈ బాధ్యత ఇవ్వడంపై సీవూంధ్రలో భయాందోళన సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాలతో ఉన్న నీటి తగాదాల్లో మనల్ని నిండా ముంచేసిన పెద్ద మనిషి .. ఇప్పుడు అన్నదమ్ముల (ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల)కు నీటిని పంపిణీ చేయబోతున్నారు! నదీ పరీవాహకంలోని దిగువ రాష్ట్రాల సమస్యలు, హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా కృష్ణా జలాలపై తీర్పునిచ్చిన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013లో కేంద్రం పేర్కొంది. ఆయన ఎంపిక తెలంగాణకు దిగువ రాష్ట్రం కాబోయే సీవూంధ్రలో కొత్త ఆందోళనకు దారితీస్తోంది. ఒకవైపు వున రాష్ట్రమే ఈ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో.. తిరిగి ఆయున ద్వారా తెలంగాణ- సీవూంధ్ర నీటి పంపిణీ చేయించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. గతంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేని పక్షంలో 1956 అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టానికి లోబడి నీరు కేటాయించాలని, అలాగే కరువు పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిర్వహణా ప్రాధాన్యాలు (ఆపరేషనల్ ప్రొటోకాల్) స్పష్టంగా పేర్కొనాలని బ్రిజేశ్ కుమార్‌ను కోరనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. బోర్డులతో గందరగోళం తుంగభద్ర బోర్డు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పరిమాణాన్ని ఏనాడూ కర్ణాటక విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి జలచౌర్యం జరుగుతున్నా బోర్డు తీసుకున్న చర్యలేవీ లేవు. ఇప్పుడు కృష్ణా, గోదావరి నదుల్లోని నీటి పంపకాలు పక్కాగా అమలు చేయడానికి రెండు దశల వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో బోర్డులు తీసుకునే నిర్ణయాలు ఇరు రాష్ట్రాలు అమలు చేయడానికి అంగీకరించని పరిస్థితుల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మాత్రం కేంద్రం ఎలాంటి సమాధానాన్ని వివరించలేదు. కరువు పరిస్థితుల్లో దిగువ రాష్ట్రానికి నీరు అందకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఈ రెండు దశల వ్యవస్థ కూడా గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కృష్ణా-గోదావరి ఉన్నతమండలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. సాంకేతిక అంశాలను పరిశీలించే మండళ్లపై పర్యవేక్షణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్రతిపాదనలకు ఇది ఆమోదం తెలుపుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే.. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భవిష్యత్తులో తలెత్తే అంశాలను ప్రస్తుత కృష్ణా నదీ వివాదాల ట్రిబ్యునల్ పరిష్కారం చూపని పక్షంలో కొత్త ట్రిబ్యునల్‌కు నివేదించాలి. కృష్ణా, గోదావరిల రోజువారీ వ్యవహారాల కోసం ఉన్నతాధికారుల నేతృత్వంలో యాజమాన్య మండళ్లను ఏర్పాటు చేస్తారు. కేంద్రంలో కార్యద ర్శి/అదనపు కార్యదర్శి స్థాయిలోని అధికారి ఈ బోర్డులకు అధ్యక్షత వహిస్తారు. విభజన పూర్తై 60 రోజుల్లోగా ఇవి ఏర్పాటవుతాయి. కృష్ణా యాజమాన్య మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గోదావరి యాజమాన్య మండలి తెలంగాణ రాష్ట్రం నుంచి పనిచేస్తాయి. ఈ బోర్డుల్లోకి ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ నిపుణులను డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటారు. తర్వాత వారిని బోర్డు శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఒక్కో బోర్డుకు చీఫ్ ఇంజనీర్(సీడబ్ల్యుసీ) స్థాయిలో కార్యదర్శి ఉంటారు. బోర్డులు పనిచేయడానికి అదనపు సిబ్బందిని కేంద్రం మంజూరు చేస్తుంది. డ్యామ్‌లు, హెడ్‌వర్క్స్, రిజర్వాయర్ల భద్రత కోసం సీఐఎస్ఎఫ్ బలగాలను నియమిస్తారు. ఈ బోర్డు ఖర్చులను ఇరు రాష్ట్రాలు భరించాలి. యాజమాన్య మండళ్లు డ్యామ్‌లు, హెడ్‌వర్క్స్, కాలువలు, జల విద్యుత్కేంద్రాలు పరిపాలన, నియంత్రణ, అమలు, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టులు కూడా కొత్త బోర్డుల పరిధిలోకే వస్తాయి. తాగు, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత.. నీటి వివాదం తలెత్తితే ముందుగా తాగునీరు, తర్వాత పారిశుధ్య అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్కా.. సాగుకా? దేనికి నీటిని కేటాయించాలనే వివాదం వస్తే ముందు సాగుకు నీరివ్వాలని ముసాయిదా బిల్లు స్పష్టం పేర్కొంది. సమైక్య రాష్ట్రంలో ఈ రెండు నదుల నీటి పంపకాలు.. ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు ప్రకారమే అమల్లో ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించే పక్షంలో ఇరు రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి. ఈ యాజమాన్య మండళ్లు ఇరు రాష్ట్రాలకు ప్రకృతి విపత్తు/కరువు/వరదలపై సలహాలు ఇవ్వాలి. బోర్డు నిర్ణయాలు అమలు చేసే విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి. యాజమాన్య మండలి నిర్ణయాన్ని అమలు చేయకుంటే కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆంక్షలు విధిస్తుంది. ట్రిబ్యునల్ కొనసాగింపు ఎలా..? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తామని కేంద్రం ముసాయిదా బిల్లులో పేర్కొంది. అయితే అదెలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి దీనిని నియమించారు. అందుకు ఇచ్చిన నియమ నిబంధనలు వేరని, ఇక్కడ కొత్త రాష్ట్రాల నీటి పంపిణీకి ఆ నిబంధనలకు సంబంధం లేదని, అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్ ఎలా కొనసాగుతుందని జల వనరుల నిపుణుడు ఒకరు ప్రశ్నించారు. ఆ ఆరు ప్రాజెక్టులకు నీళ్లెలా ఇస్తారో? బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ ఆరు ప్రాజెక్టులకు చుక్కనీటి కేటారుుంపుల్లేవు... వురిప్పుడు ఆయనే ఓ కొత్త పాత్ర పోషిస్తూ అవే ప్రాజెక్టులకు నీళ్లెలా పంచుతారు? గతంలో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే బాధ్యతను కేంద్రం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు అప్పగించనున్న నేపథ్యంలో తలెత్తుతున్న సందేహమిది. ఈ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను నికర జలాలుగా మార్చి కేటాయించిన నీటిని నాగార్జునసాగర్, జూరాల, తెలుగుగంగకు క్యారీ ఓవర్ నీటిగా తీర్పునిచ్చిన నేపథ్యంలో నెట్టెంపాడు(21.4 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఎఎంఆర్పీ(30 టీఎంసీలు), వెలిగొండ(43.5 టీఎంసీలు), హంద్రీనీవా సుజల స్రవంతి(40 టీఎంసీలు), గాలేరు నగరి సుజల స్రవంతి(38 టీఎంసీలు) ప్రాజెక్టులకు కావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీటిని ఎక్కడ నుంచి ఇస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు మాత్రం క్యారీఓవర్‌గా 145 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు, జూరాల 9 టీఎంసీలు కేటాయించారని నిపుణులు చెబుతున్నారు. కానీ పైన పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు నీరు కేటాయించకపోవడం వల్ల అవి ప్రశ్నార్థకంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎత్తిపోతల ద్వారా వీటికి నీరు మళ్లించాలని చూసినా, కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న కృష్ణా యాజమాన్య మండలి(మేనేజ్మెంట్ బోర్డు) అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులకు నీటి లభ్యత అనుమానాస్పదమే. అదీకాక కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండితే తప్ప.. తెలంగాణకు అటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీరు వచ్చే అవకాశమే లేదు. ఈ ఆరు ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలంటే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును మార్చాల్సిందేనని నిపుణులు వాదిస్తున్నారు. మరి అది సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
సీఎం మహాదుర్మార్గుడు : నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహాదుర్మార్గుడని, ఆయన వైఖరి ఫలితమే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ఎందుకూ పనికి రాడనుకున్న సుదర్శన్‌రెడ్డి అనే న్యాయవాదిని పెట్టి సరిగా వాదనలు వినిపించకుండా చేశారని ధ్వజమెత్తారు. పార్టీ నేతలు దాసరి మల్లేశం, మాలతీరాణి, కృష్ణసాగర్‌తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలలో అన్యాయం జరిగి ఉండేది కాదన్నారు. ఆర్డీఎస్ కుడికాల్వకు నాలుగు టీఎంసీల నీరు కేటాయించుకునేలా వాదనలు వినిపించిన న్యాయవాది కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు చేసే నెట్టెంపాడు, జూరాల సంగతిని విస్మరించారని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు కింద తమ గ్రామాలు పోతుంటే, లాభాలు మాత్రం కృష్ణా ఆయకట్టుకు దక్కుతున్నాయని వివరించారు. ఈ అన్యాయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. -
నికరంగా వచ్చేది 442 టీఎంసీలే!
వర్షాలు ఓ మోస్తరుగా కురిసినా కృష్ణా ఆయకట్టు ఎడారే భారీ వరదలు వస్తేనే... ఇక రాష్ట్రానికి నీరు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే జరిగేది ఇదే సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు సరైన వర్షాలు కురవని సమయాల్లోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అసలైన నీటికష్టాలను చూపించనుంది. ఈ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మంచి వర్షాలు కురిసినా నీటి కష్టాలను ఎదుర్కొనక తప్పదు. మనకు కేటాయించిన 1,005 టీఎంసీల్లో 442 టీఎంసీలు దిగువకు వదిలిన తర్వాత ఎగువ రాష్ట్రాలు మిగిలిన నీటిని కూడా వాడుకునే విధంగా ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ నిబంధన కారణంగా జనవరివరకు రాష్ట్రంలోకి నీటి రాకను ఎగువ రాష్ట్రాలు అడ్డుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో పంటలకు నీరు కరువై ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కృష్ణా నదిలో మొత్తం 2,578 టీఎంసీలు నీరు ఉన్నట్టు బ్రిజేశ్‌కుమార్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇందులో 75 శాతం డిపెండబులిటీ అంచనా ప్రకారం (బచావత్ ట్రిబ్యునల్) 2,130 టీఎంసీలు కాగా, 65 శాతం డిపెండబులిటీ అంచనా ప్రకారం 1,630 టీఎంసీలు, మిగులు (సరాసరి) జలాల కింద మరో 285 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు గుర్తించారు. ఇందులో మన రాష్ట్రానికి 1,005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ర్టకు 666 టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ పద్ధతి అమల్లోకి వస్తే మనకు కేటాయించిన 1,005 టీఎంసీల్లో ఎగువ నుంచి నికరంగా 442 టీఎంసీల నీరే రానుంది. 75 శాతం డిపెండబులిటీ ప్రకారం అంచనా వేసిన 2,130 టీఎంసీలను ముందుగా ఉపయోగించుకోవాలని ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాలకు సూచించింది. పైగా ఎగువ రాష్ట్రాలు తమ కోటా మేర ఉపయోగించుకున్న తర్వాతే దిగువకు నీటిని విడుదల చేయాలని పేర్కొంది. అంటే ఈ 2,130 టీఎంసీల్లో మనకు 811 టీఎంసీలు రావాల్సి ఉంది. అయితే.. ఈ 811 టీఎంసీల నీటిలో మన రాష్ట్ర పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాల ద్వారా 369 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు ట్రిబ్యునల్ అంచనా వేసింది. అంటే మన దగ్గర లభ్యమయ్యే 369 టీఎంసీలను 811 టీఎంసీల నుంచి పక్కన పెడితే... మిగిలిన 442 టీఎంసీలే ఎగువ ప్రాంతం నుంచి వస్తాయి. కానీ మన వద్ద వర్షాలు రాకపోతే మనకు దక్కే నీరు 442 టీఎంసీలే. మనకు ఈ మేరకు నీటిని విడుదల చేసిన తర్వాత ఎగువ రాష్ట్రాలు మిగిలిన (65 శాతం డిపెండబులిటి లభ్యత) నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే జనవరి (వింటర్ మాన్సూన్ ముగిసిన తర్వాత) మాసం వరకు కూడా మనకు కేటాయించిన కోటా మేర నీరు రాకపోతే బోర్డు దృష్టికి తీసుకురావచ్చని మాత్రం చెప్పింది. అంటే... జనవరి మాసం వరకు నీటి విడుదలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. కృష్ణానదిలో జనవరి మాసం వచ్చే నాటికి నీటి ప్రవాహం గణనీయంగా పడిపోనుంది. మన రాష్ర్టంలో కురిసే వర్షాల ద్వారా 369 టీఎంసీలు రాకపోతే... జనవరి తర్వాత బోర్డుకు ఫిర్యాదు చేసినా... పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ సమయానికి ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత తగ్గిపోతుంది. ఫలితంగా దిగువకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. పైగా కర్ణాటకలోని ఆలమట్టి, మహారాష్ర్టలోని కోయినా వంటి ప్రస్తుత ప్రాజెక్టులకు నీటి కోటాను ట్రిబ్యునల్ పెంచింది. ఆ తీర్పు అమల్లోకి వచ్చిన వెంటనే వారి వాడకం గణనీయంగా పెరిగిపోనుంది. ఒక్క ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుతోనే ఏకంగా 130 టీఎంసీల నీటిని అదనంగా కర్ణాటక ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే ఉన్న 173 టీఎంసీల నీటి వాడకాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 303 టీఎంసీలకు పెంచుకోనుంది. దాంతో దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోనుంది. -
బ్రిజేశ్ తీర్పు... ‘కృష్ణా’కు గొడ్డలిపెట్టు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘‘కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేశ్ కమిటీ ఇచ్చిన తీర్పు కృష్ణా పరీవాహక ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తోంది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కృష్ణానదిపై ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యి ఉంటే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. పులిచింతల ముంపు బాధితులను, నల్లగొండ రైతాంగాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో జరగనున్న నష్టాన్ని వివరించడం, తీర్పు గెజిట్ వెలువడకుండా నిలవరించేలా ఒత్తిడి పెంచేందుకు వైఎస్ విజయమ్మ బుధవారం పులిచింతల ప్రాజెక్టుపై నీటిదీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ దీక్షకు తరలివచ్చారు. దీక్షలో విజయమ్మ మాట్లాడుతూ తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు వల్లే ఈ విపత్కర పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టుకు శత్రువు చంద్రబాబే అని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందు, ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాసం అందించకుండానే ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హడావుడి పడిపోతున్నారని, ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనని ఆమె పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌పై విరుచుకుపడిన వక్తలు నీటిదీక్షలో పాల్గొన్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రైతుల గురించి, వారి బాగోగుల గురించి ఆలోచించని నేతలు, అదే రైతుల పక్షాన పోరాడేందుకు వచ్చే నాయకులకు అడ్డంకులు మాత్రం సృష్టిస్తారని విమర్శించారు. పులిచింతలకు వచ్చే సమయంలో మంత్రి పోలీసులతో తనిఖీలు చేయించారని, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చర్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, పదవి నాలుగు నెలల ముచ్చటే అని వ్యాఖ్యానించారు. జిల్లా నేతలు సైతం మంత్రి తీరుపై మండి పడ్డారు. ‘పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చేయలేరు. మంత్రి ఉత్తమ్ ఎందుకు ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. పులిచింతలకు వస్తుంటే పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేశారు..’ అని వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగ కన్వీనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం పరి శీల కుడు గున్నం నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, కోదాడ కో ఆర్డినేటర్ ఎర్నేని వెంకటరత్నం (బాబు), తుంగతుర్తి కో ఆర్డినేటర్ ఇరుగు వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీకళారెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిజేశ్ తీర్పుపై సుప్రీంకెళ్తాం: చంద్రబాబు
* రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పార్లమెంట్లో పోరాటం * తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి * జలాల కోసం అన్ని పార్టీలూ ఐక్యంగా పోరాడాలి * ఈ మెయిల్ విభజనను అడ్డుకుంటాం సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డు ఏకపక్షంగా ఉన్నందున దీనిపై వారం రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళతామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అవార్డు గెజిట్ నోటిఫికేషన్ కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని చెప్పారు. అవార్డు నోటిఫై అయితే 2050 వరకు కృష్ణాడెల్టా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఆ తరువాత కూడా ఈ అవార్డు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని కృష్ణానది ఇసుక తిన్నెల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేవరకు పార్లమెంటులో తమ ఎంపీలు పోరాటం కొనసాగిస్తారని చెప్పారు. కృష్ణానది మిగులు జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినందున దీనిపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. ఈ విషయంపై ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. ఆంధ్రాలో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు ఇప్పుడు అన్యాయం జరుగుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. వాళ్ల రాష్ట్రంలో గెలవలేని వాళ్లు మన రాష్ట్రాన్ని విభజించేందుకు ముందుకు వస్తే అంగీకరించేది లేదని, ఈ-మెయిల్ విభజనలను అడ్డుకుంటామని చెప్పారు. ప్రసంగంలో తడబాట్లు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అఫిడవిట్ రాష్ట్రానికి మరణశాసనంగా మారిందంటూ పదేపదే చెప్పిన చంద్రబాబు తన ప్రసంగంలో పదేపదే తడబడ్డారు. జ్యోతిబసు తనను రెండుసారు ్లముఖ్యమంత్రిగా ఉండమని కోరినా తాను తిరస్కరించానని చెప్పారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని సరిచేసుకుంటూ తనను ప్రధానిమంత్రిగా ఉండాలని కోరారని తెలిపారు. అబ్దుల్ కలాం, కె.ఆర్.నారాయణన్‌లను ప్రధానిగా చేసిన ఘనత (వీరు రాష్ట్రపతులుగా చేశారు) తనదేనని చెప్పారు. తరువాత ఈ తడబాటును సరిదిద్దుకోకుండానే ఉపన్యాసం కొనసాగించడంతో అక్కడున్నవారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేసే సమయంలో మూడొంతుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గురివిందగింజ తరహాలో తమ సభలోని లోపాలను చూసుకోకుండా పులిచింతల ప్రాజెక్టువద్ద జరిగిన విజయమ్మ సభ గురించి చర్చించడంపై పార్టీ కార్యకర్తలు చిరాకు పడ్డారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సీ ఎన్.రాజకుమారి, మాజీమంత్రులు కోడెల శివప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు, కరణం బలరాం, మాజీ చీఫ్‌విప్ కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్యేలు దేవినినే ఉమ, జయమంగళ వెంకటరమణ, ధూళిపాళ నరేంద్ర, పార్టీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జూరాల ధర్నా రద్దు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద తలపెట్టిన ధర్నాను రద్దు చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బదులు రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తేవటాన్ని నిరసిస్తూ గురువారం బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జూరాల వద్ద చేపట్టిన ధర్నాను రద్దు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. -
సోనియా వల్లే కృష్ణా కష్టాలు
-
బ్రిజేష్ తీర్పుపై పోరుకు సన్నద్ధం
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాయలసీమకు శాపంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముప్పేట పోరుకు సన్నద్ధం కావాలని వివిధ పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఈశ్వరయ్య ప్రకటించారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాయలసీమతోపాటు మహబూబ్‌నగర్, ప్రకాశం, నెల్లూరు, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఈ విషయాలను రాష్ర్టపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు జాతీయ పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 9 లేదా 10వ తేది గండికోట జలాశయం వద్ద ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని, ఇందులో భాగంగా పోలవరం, దమ్ముగూడెం-సాగర్ టైల్‌పాండ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేత గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. దళిత ప్రజాపార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా, అశాస్త్రీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ మిగులు జలాలు కూడా మూడు రాష్ట్రాలకు పంచడం అన్యాయమన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.లింగమూర్తి , జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి ఎంవీ సుబ్బారెడ్డి, పాత కడప నీటి సంఘం అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల ఫోరం నాయకులు జేవీ రమణ, టీడీపీ నాయకుడు బాలకృష్ణయాదవ్, సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలే శరణ్యం... సాంకేతిక కారణాలతో ట్రిబ్యునల్ తీర్పు ఆగిపోయే పరిస్థితి లేదు. దీనిని ఆపాలంటే ప్రజా ఆందోళనలే శరణ్యం. ట్రిబ్యునల్‌కు కర్ణాటక కరువే కనిపించిందిగానీ రాయలసీమ కరువు కనబడకపోవడం దురదృష్టకరం. నాయకులు ఓట్లు, సీట్లు తప్ప నీళ్ల గురించి పట్టించుకోవడం లేదు. - ఎన్.రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు ట్రిబ్యునల్ తీర్పు శాపం.. ట్రిబ్యునల్ తీర్పు రాయలసీమ పాలిట శాపం. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీరు కేటాయిస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ‘సీమ’ రైతాంగానికి తీవ్ర నిరాశ మిగిలింది. భవిష్యత్తులో తాగునీటికి సైతం వలసలు తప్పేలా లేవు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎ స్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అన్యాయంపై నోరు విప్పాలి. - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు నిక రజలాలు కేటాయించాలి.. రాయల సీమ ప్రాజెక్టులకు 200 టీఎంసీల నికర జలాలు కేటాయించాలి. పోలవరం, దుమ్ముగూడెం-టెయిల్‌ఫాండ్ ప్రాజెక్టుల్లో తొలి ప్రాధాన్యత రాయలసీమకే ఇవ్వాలి. - రమేష్‌నాయుడు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ప్రాజెక్టులకు నీరివ్వాలి.. ఇంతకాలం ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకున్న 285 టీఎంసీల మిగులు జలాలను సైతం ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడం వల్ల మనకు అన్యాయం జరిగింది. జూరాల, ఆర్డీఎస్లకు మినహా తెలుగుగంగకు కూడా నికర జలాలు ఇవ్వలేదు. కేటాయించిన నీటిని క్యారీ ఓవర్ కింద ఉంచడం తీవ్ర అభ్యంతరకరం. క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని సీమ ప్రాజెక్టులకు ఇవ్వాలి. - ఎం.వెంకట శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
నేడు వైఎస్ విజయమ్మ ధర్నా
అచ్చంపేట, న్యూస్‌లైన్: కృష్ణా మిగులు జలాలపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిర్మాణంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశే ఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్లు వెల్లడించారు. విజయమ్మ ధర్నా చేయనున్న పులిచింతల ప్రాజెక్టు ప్రదేశాన్ని పరిశీలించడానికి మంగళవారం ఇక్కడకు వచ్చిన వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. విజయమ్మ ప్రాజెక్టుపైనే ధర్నా చేస్తారని స్పష్టం చేశారు. దీనికి ప్రాజెక్టుపైన రోడ్డు మార్గం అనుకూలంగా ఉందని చెప్పారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు వేలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఎడారే.. ట్రిబ్యునల్ తీర్పు వల్ల కృష్ణా మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా పోతాయని, అప్పుడు రాష్ట్రం ఎడారి అవుతుందని తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. సాగు, తాగు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దీన్ని ప్రతి ఒక్క రు వ్యతిరేకించాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ నిర్మాణం జరిగిందన్నారు. అప్పుడే ఆయన వ్యతిరేకించినట్లయితే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ధ్వజమెత్తారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం.. వైఎస్ విజయ మ్మ పులిచింతల ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం 10గంటలకు ధర్నా చేపడతారని ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరాం చెప్పారు. మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, కృష్ణాజిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కోటగిరి గోపాల్, చౌడవరపు జగదీశ్, లీగల్ సెల్ కన్వీనర్ సామినేటి రాము, జగ్గయ్యపేట టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ వ ట్టెం మ నోహర్, మండల కన్వీనర్ సందెపోగు సత్యం, నాయకులు గంగసాని నరసింహారెడ్డి, త మ్మా ప్రవీణ్‌రెడ్డి, అనుముల సాంబిరెడ్డి, షేక్ రహమాన్ పాల్గొన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు
* సలహాల కోసం త్వరలో అఖిలపక్షం... రాష్ట్ర కేబినెట్ నిర్ణయం * బీసీ క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితి రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు * మావోయిస్టుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం పెంపు * జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాల నివారణకు ట్రిబ్యునల్ * జంటనగరాలకు గోదావరి జలాల తరలింపునకు హడ్కో నుంచి రూ. 1,000 కోట్ల రుణం * చిత్తూరు మంచినీటి పథకానికి అమోదం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అలాగే బీసీల్లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల రూ.6 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. సుమారు 75 రోజుల అనంతరం జరిగిన ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇటీవలి తీర్పుపై చర్చించారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ విలేకరులకు వెల్లడించారు. ‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఈ విషయమై త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలు తీసుకోవాలి..’ అని కేబినెట్ నిర్ణరుుంచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల నిరోధానికి బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. పట్టణాలు, నగరాల్లో వ్యాపార ప్రకటనల నియంత్రణకు పురపాలక వ్యాపార ప్రకటనల విధానం తీసుకువచ్చేందుకు చట్టంలో సవరణలు చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో రూ.4,300 కోట్ల వ్యయంతో చేపడుతున్న మంచినీటి పథకానికి గతంలో జారీచేసిన పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవికలురైతే ఇచ్చే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్ర గాయాలకు గురైతే పరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచారు. మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వతంగా అంగవికలురైతే రూ.10 లక్షల పరిహారం ఇస్తారు. తీవ్రంగా గాయపడితే ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచారు. పౌరులు మరణిస్తే ఇస్తున్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందితే ప్రస్తుతం కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2.40 లక్షల నుంచి రూ.3 లక్షలకు పరిహారం పెంచారు. ఇన్స్పెక్టర్, ఆ పైస్థాయి అధికారులు మరణిస్తే పరిహారాన్ని రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే రూ.3.60 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్రంగా గాయపడితే 2.40 లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు పరిహారాన్ని పెంచారు. 13 ప్రభుత్వ శాఖల్లో 14,115 పోస్టుల భర్తీ 13 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 14,115 పోస్టులను భర్తీ చేయూలని మంత్రివర్గం నిర్ణరుుంచింది. జంటనగరాలకు గోదావరి జలాలు తరలింపు పథకానికి హడ్కో నుంచి రూ.1000 కోట్ల రుణం తీసుకోనుంది. ఆర్టీసీ రూ.320 కోట్ల రుణం తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. కాపులను బీసీల్లో చేర్చడానికి సర్వే నిమిత్తం రూ.65 లక్షలు విడుదల చేయాలని నిర్ణరుుంచింది. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులను ఇతరులకు బదలాయించేందుకు ఆ కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు, రుణాల రీ షెడ్యూల్‌కు త్వరలో బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణరుుంచింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటునకు ఏపీఐఐసీకి 1473 ఎకరాలను మార్కెట్ ధరపై పది శాతం అదనంగా లీజుకు కేటాయించనున్నారు. గేమింగ్ పాలసీకి ఆమోదముద్ర ఆంధ్రప్రదేశ్ గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పాలసీ 2014-19కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా తొలుత రాజధానిలో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ఏపీఐఐసీ స్థలం సమకూరుస్తుంది. ఈ సిటీలో కంపెనీలు పూర్తిగా కార్యకలాపాలు నిర్వహించేలా మౌలిక వసతులు సమకూరుస్తారు. కంపెనీలకు స్థలాలు, కార్యాలయ భవనాలను కొన్ని పరిమితులకు లోబడి రాయితీపై కేటాయిస్తారు. తరువాత టైర్-2 నగరాలైన విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్ నగరాల్లోనూ ఇదే తరహాలో గే మింగ్ సిటీని అభివృద్ధి పరుస్తారు. -
సోనియా వల్లే కృష్ణా కష్టాలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి
* మిగులు జలాలపై మన రాష్ట్రానికి హక్కు ఉండదని తీర్పు వచ్చిందే బాబు హయాంలోనే.. * దీన్ని కౌంటర్ చేయాల్సిన చంద్రబాబు.. సీఎంగా ఉండి కూడా పట్టించుకోలేదు * తర్వాత వైఎస్ సీఎం అయ్యాక వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కట్టడానికి యత్నించారు * ఈ సమయంలో కర్ణాటక ఇంజక్షన్ ఆర్డర్ కోరితే.. దాన్నుంచి తప్పించుకోవడానికి నాడు వైఎస్ లేఖ రాశారు * రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మా పర్యటనతో దేశమంతా తెలుస్తోంది.. * అందుకే ఇప్పుడు రాయల తెలంగాణను తెరపైకి తెచ్చారు? సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా గట్టిగా ప్రభావితం చేశారని, అందువల్లే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తుది తీర్పు వెలువడిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలనే ఆరాటంతోనే ఆమె మిగులు జలాల అంశమే లేకుండా చేశారని విమర్శించారు. ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకూ, ట్రిబ్యునల్ తీర్పునకూ లింకు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చెప్పి సోనియాగాంధీ పుట్టిన రోజైన 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటన చేశారు. 2010లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. అంటే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత 2010లో ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఇపుడు మళ్లీ డిసెంబర్ 9న రాష్ట్ర విభజన చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ మిగులు జలాలు వివాదాస్పదం కాకుండా చేయాలని చెప్పి.. ఎటువంటి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 9లోపు ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడేలా చేశారు. ఇంత స్పష్టంగా తేదీలతో సహా జరుగుతూ ఉంటే ఇంత కన్నా సంకేతాలు ఏం కావాలి.. ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేశారనడానికి? తాజా తీర్పుతో ఇక మిగులు జలాలే మీకు లేవు, మీ చావు మీరు చావండి అని చెపుతున్నారు’’ అని జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టూ ఎందుకు కట్టలేదు చంద్రబాబూ.. ‘‘1973లో కృష్ణా నదీ జలాలపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై.. 1976లో కర్ణాటక కొన్ని వివరణలు అడిగింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ వివరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగులు జలాలపై పూర్తి హక్కులు ఉన్నట్లే! అప్పటి నుంచి 2004 సంవత్సరం వరకూ అంటే 1976 నుంచి 28 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఈ తీర్పును అనుసరించి ప్రాజెక్టులు కట్టుకుందామన్న ఆలోచన ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు’’ అని జగన్ విమర్శించారు. ‘‘ఆ తరువాత 1997వ సంవత్సరంలో కర్ణాటక వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికి దే వేగౌడను ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఈ సమయంలోనే కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతునిచ్చింది. దేవెగౌడ ప్రధానిగా ఉండగా, చంద్రబాబు సీఎంగా ఉండగా ఇది జరిగింది. ఆ తరువాత 2000లో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తీర్పు వచ్చింది. అంటే చంద్రబాబు.. మంచి న్యాయవాదులను పెట్టలేదా? లేదా నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారా? మరొకటా...మరొకటా...అనేది నేను వేరే చెప్పనవసరం లేదు’’ అని జగన్మోహన్రెడ్డి అన్నారు. అది దారుణమైన తీర్పు.. ‘‘ఆ తీర్పు ఎంత దారుణమైనదీ అంటే.. దిగువ రాష్ట్రాలకు.. కేటాయించిన జలాలకన్నా ఎక్కువ హక్కు ఉండదు. మరో మాటలో చెప్పాలంటే , బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు ఎలాంటి హక్కూ ఉండదు. (బాబు హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ఈ సందర్భంగా చదివి వినిపించారు) అంటే మనకున్న మిగులు జలాలను, మనకున్న హక్కును సుప్రీంకోర్టు తీసేసింది. దీనిని కౌంటర్ చేయాల్సింది పోయి, దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాల్సింది పోయి, 2000 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు, ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 1973 నుంచి 2003 వరకూ ఈ ట్రిబ్యునల్ తీర్పు అమల్లో ఉంటుంది, 2004లో కొత్త ట్రిబ్యునల్ వస్తుంది, ఈలోపు ఎన్ని పెద్ద ప్రాజెక్టులను మనం కట్టగలితే అన్ని కట్టి వాటన్నింటికీ కూడా మనం నికర జలాల హక్కును తెచ్చుకోవచ్చునని దివంగత రాజశేఖరరెడ్డి చెప్పినా.. చంద్రబాబు తాను చేయాల్సిన పని చేయలేకపోయారు’’ అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే వైఎస్ ఆ నోట్ ఇచ్చారు.. ‘‘2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరక్కుండా ఉండటం కోసమని చెప్పి కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందే, ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగితే అన్ని కట్టి వీలైన మేరకు నికర జలాలను కేటాయింపజేసుకోవడం కోసం వైఎస్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇలా వైఎస్ ప్రాజెక్టులు కడుతున్నారని తెలిసి.. కర్ణాటక రాష్ట్రం కొత్త ట్రిబ్యునల్‌ను కలిసి ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని అడిగింది. అలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒక నోట్ ఇచ్చారు. ఈ నోట్‌ను ప్రభుత్వం అంతర్గతంగా సర్క్యులేట్ చేసింది. సచివాలయంలో ఎవరినడిగినా ఈ నోట్ ఇస్తారు. రహస్యమేమీ కాదు. ఇందులో స్పష్టంగా ఇచ్చారు. ఆ లేఖలో తప్పేమీ అనలేదు. అవన్నీ నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు అని అంటూ తన మనసులో ఉన్న మాట, ఏదైతే తాను చేయాలనుకున్నారో అదే వైఎస్ చెప్పారు. అది తప్పు కూడా కాదు. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా, దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడే రాష్ట్రానికి అన్యాయం జరిగే తీర్పు వచ్చింది. ఇందుకు సంబంధించి వాదనలు జరిగినపుడు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ .. బాబు హయాంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ ‘మీ ప్రాజెక్టులను నిర్మించకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వకూడదు’ అని ప్రశ్నించింది. అపుడు ఆ ఇంజెక్షన్ ఆర్డర్‌ను తప్పించుకోవడానికి, మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించడానికి వైఎస్ రాసిన లేఖ ఇది. అందులో కూడా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే ఆయన ఉటంకించారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా బాబు దానిని పట్టుకుని యాగీ చేస్తున్నారు.’’ అని జగన్మోహన్రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. (1976లో బచావత్ ఇచ్చిన వివరణలను ఈ సందర్భంగా జగన్ విలేకరులకు ఇచ్చారు) కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారో వారికి తెలుసా...? ‘‘అసలు కాంగ్రెస్ వాళ్లు విభజన విషయంలో ఏం చేస్తున్నారో వారికి తెలుసా..? ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా పడితే అలా విభజిస్తున్నారు. ఈ క్రమంలో వారేమీ పట్టించుకోవడం లేదు. ఇపుడు తాజాగా రాయల తెలంగాణను తెరమీదకు తెచ్చారు. జాతీయ స్థాయిలో నేను రాజకీయ పార్టీల వద్దకు వెళ్లి ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను. ఇపుడు ఈ విషయం అందరికీ తెలుస్తోంది. అందుకే ఇపుడు రాయల తెలంగాణ అంటున్నారు. అసలు రాయలసీమను విభజించే హక్కు వారికి ఎవరిచ్చారు? రెండు జిల్లాలనే ఎందుకు.. అసలు అన్ని జిల్లాలను కలిపేసి దానికి తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే సరిపోతుంది కదా... ఇలా చేస్తే అందరమూ సంతోషంగా ఉంటాం. ఈ ప్రతిపాదనకు తొలుత మద్దతు తెలిపేది నేనే.. ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా చేస్తున్నారు. ఏం నాన్సెన్స్ ఇది! (ఎంత తెలివి తక్కువ తనం ఇది!) అందుకే అన్ని రాజకీయ పక్షాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అన్యాయాన్ని ఆపమని. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాలని కోరుతున్నా... కేంద్రంలో 272 సీట్లతో ఎవరు అధికారంలో ఉంటే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా ఇష్టమొచ్చినట్లు చీల్చేసే పరిస్థితి ఉండకూడదని అంటున్నా.. ఈ రాష్ట్రాలన్నీ కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడినవే. అసెంబ్లీలో ఏక గ్రీవ తీర్మానం కాకపోయినా మూడింట రెండువంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్రాలు విభజించేలా ఉండాలి. అలాగే పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటేనే విభజనకు పూనుకోవాలి. ఈ సవరణ ప్రజాస్వామ్యం బతికి బట్టడం కోసం చేయాలని కోరుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే అదొక చెడు సంప్రదాయంగా మిగిలి పోతుంది. ఇవాళ ఇక్కడ చేస్తే రేపు ఇతర రాష్ట్రాలను కూడా ఇలాగే ఓట్లకోసం, సీట్ల కోసం విభజించే ప్రమాదముంది. పార్లమెంటులో మా పార్టీకి ఉన్న బలం మూడే.. అందుకే ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలని అన్ని పార్టీల నేతలను కోరుతున్నాం. దేవుడు కూడా మాకు తోడుగా ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాం’’ అని జగన్ అన్నారు. సమైక్యం కోసం అందర్నీ కలుస్తాం మంగళవారం ఏవో ఇతర పనుల కారణంగా యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో ఉన్న అపాయింట్మెంట్ రద్దయిందని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మళ్లీ ఆరో తేదీన కలవమని సమాచారమిచ్చారని, ఆ రోజు కలుసుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తామని అన్నారు. ‘‘వారిని మళ్లీ కలవడానికి మాకు ఎలాంటి నామోషీ లేదు, తగ్గుతాం.. ప్రాధేయపడతాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తగ్గి వ్యవహరిస్తాం’’ అని జగన్ అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలుఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్ల కిందట మరణించిన వ్యక్తిపై నిందలా? ‘‘రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని తిట్టాల్సింది పోయి చంద్రబాబు.. నాలుగేళ్ల క్రితం చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట చనిపోయిన ఆ వ్యక్తి ఏదో ఒక లెటర్ ఇచ్చారు అని చంద్రబాబు చెబుతారు. ఆ లెటర్ ఎందుకు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఆ లెటర్ మంచి చేయడానికే ఇచ్చారని అందరికీ తెలుసు. వైఎస్ చనిపోయాక రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతూ వస్తున్నాయి. రోశయ్యనుగాని, కిరణ్నుగాని ట్రిబ్యునల్‌కు వేరే లేఖ ఎవరైనా ఇవ్వొద్దన్నారా? వేరే వాదనలు వినిపించవద్దని ఎవరైనా మెడపై కత్తి పెట్టారా? అవన్నీ చేయరు కానీ, అన్యాయంగా మాట్లాడతారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు.. సోనియాను తిట్టకుండా, రోశయ్యను తిట్టకుండా, కిరణ్‌ను తిట్టకుండా నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేస్తారు. ధర్నా చేస్తానని అంటారు.. అసలు ముందు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసి ఆయనే తప్పు చేశారు. రెండోది ఇపుడు సోనియాగాంధీ తప్పిదం చేస్తున్నారు. ఇవీ రాజకీయాలు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందీ అంటే నీళ్లు కూడా లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. విభజనతో కింది రాష్ట్రానికి నీళ్లు దొరకవు అన్న సంగతి తెలిసినా, పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకవు అని తెలిసినా చంద్రబాబు వ్యతిరేకించరు...పైగా మద్దతిస్తారు. ఈ వ్యవస్థలో నిజాయితీ పూర్తిగా కరువైన ఇంతటి దారుణమైన రాజకీయాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదు’’ అని జగన్ అన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై విజయమ్మ ధర్నా
4న పులిచింతల, 5న గండికోట, 6న జూరాల వద్ద ధర్నాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోనున్న నేపథ్యంలో... మూడు ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టుల వద్ద ధర్నాలు చేపట్టాలని భావించినట్లు పార్టీ కేంద్ర పాలకమండలి (సీజీసీ) సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో ఈ నెల 4న పులిచింతల ప్రాజెక్టు వద్ద, 5న వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్ద, 6న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే బి.గురునాధరెడ్డి, అధికారప్రతినిధి గట్టు రామచంద్రరావులతో కలిసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం పదింటికి పులిచింతల వద్ద ధర్నాలో విజయమ్మ పాల్గొంటారని వివరించారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో స్టే తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రిబ్యునల్ తీర్పును షెడ్యూల్లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ట్రిబ్యునల్ తీర్పు పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని ఉమ్మారెడ్డి చెప్పారు. గోబెల్స్ ప్రచారానికి అలవాటుపడిన చంద్రబాబు ప్రతీదానికి వైఎస్‌పై బురదచల్లే ప్రయత్నంచేస్తున్నారని దుయ్యబట్టారు. -
ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు
కడప : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు, ఎల్లుండి దీక్షలు చేపట్టనున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద బుధవారం విజయమ్మ దీక్షకు చేయనున్నట్లు కృష్ణాజిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. మరోవైపు విజయమ్మ ఎల్లుండి వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ సమీపంలో దీక్ష చేపట్టనున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిగులు జలాలు రాకుంటే రాయలసీమ ఎడారేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, పార్టీ నేత శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రైతుల ఆందోళన
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈరోజు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నేతలు కోరారు. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం పరిశీలించాలని కోరారు. కృష్ణా ఆయకట్టులో నిర్మించిన ప్రాజెక్టులకు నష్టం జరగకుండా చేయాలని రైతు సంఘం నేత రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు రూపాయల ఖర్చు పెట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావిస్తున్నారు. -
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది: గట్టు
* వ్యవసాయం గురించి బాబు మాట్లాడటంపై ఎద్దేవా * ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని ధ్వజం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తన తొమ్మిదేళ్ల హయాంలో వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ అనే మాటలను ఉచ్ఛరించడమే ఆయన అవమానంగా భావించేవారన్నారు. పంటకు చీడపురుగులా వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసిన బాబు.. నీళ్లు, వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడటం చూసి తెలుగు ప్రజానీకం నవ్వుకుంటోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బాబు పాపాల వల్లే అని ప్రజలు భావిస్తుంటే, గోబెల్స్ ప్రచారానికి అలవాటుపడిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందే రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టి ఉంటే మిగులు జలాల విషయంలో అన్యాయం జరిగేది కాదన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదనే ఆలోచనతో వైఎస్ జలయజ్ఞం ప్రారంభించారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తర్వాత వచ్చే ట్రిబ్యున ళ్లు నీటి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే వైఎస్ వాటిని చేపట్టారన్నారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలు మన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. మిగులు జలాలపై కింది రాష్ట్రాలకు ఉండే స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామే తప్ప హక్కుగా కోరడంలేదని వైఎస్ ట్రిబ్యునల్‌కు వివరించినట్లు గట్టు తెలిపారు. ఇదంతా తెలిసి కూడా టీడీపీ నేతలు కావాలనే ఆయనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిత్యం ఆకాశానికెత్తే ఆ రెండు దిన పత్రికలు కూడా కృష్ణాజలాల విషయంలో బాబు వైఫల్యంపై అప్పట్లో పలు కథనాలు వెలువరించాయని ‘ఈనాడు’లో వచ్చిన వార్తా కథనాలను చూపించారు. -
అఖిలపక్షం తర్వాతే సుప్రీంకోర్టుకు!
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : కృష్ణానీటిపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ట్రిబ్యునల్ తీర్పుపై శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు.అఖిలపక్షంలో వచ్చే సూచనల అనంతరమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ సమీక్షా వివరాలను నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.అన్ని పార్టీలు కూడా ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.ట్రిబ్యునల్ తీర్పుపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు రాకుండా ప్రభుత్వం అఖిల పక్షానికి మొగ్గు చూపింది. వారం రోజుల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి ప్రకటించారు.అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లి ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉన్న విషయం తెలిసిందే. నిర్మాణంలో లేని కాల్వకు నీటి కేటాయింపు తెలియదన్న మంత్రి : ఇదిలా ఉండగా,ఆర్డీఎస్ కుడి ప్రధానకాల్వకు ట్రిబ్యునల్ నాలుగు టీఎంసీల నీటిని కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాల్వ ప్రస్తుతం నిర్మాణంలో లేదు. భవిష్యత్తులో నిర్మిస్తామని ట్రిబ్యునల్ ముందు రాష్ర్ట ప్రభుత్వం చెప్పింది. దాంతో దానికి నాలుగు టీఎంసీల కేటాయింపు వచ్చింది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువ స్తే ఆ సంగతి తనకు తెలియదన్నారు. సాధారణంగా ట్రిబ్యునల్ ముందు అన్ని రాష్ట్రాలు కూడా తాము భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు మన రాష్ర్టం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించి నిర్మించబోయే ప్రాజెక్టుల జాబితాను ట్రిబ్యునల్ ముందు ఉంచాయి.అందులో ఆర్డీఎస్ కుడి ప్రధానకాల్వ ఉంది.అందుకే ట్రిబ్యునల్ దీనికి 4 టీఎంసీలను కేటాయించింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా మాస్టర్‌ప్లాన్‌లోని కొన్ని ప్రాజెక్టులకు నీటిని కేటాయించింది. -
బ్రిజేష్‌కుమార్ తీర్పుపై అఖిలపక్ష భేటీ
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ తీర్పుపై ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. శనివారం ఉదయం జరగాల్సిన సుదర్శన్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా పడింది. కృష్ణా మిగులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. -
'తెలుగు జాతిని అవమానపరిచే విధంగా ఉంది'
ఏలూరు: కృష్ణానది మిగులు జలాల పంపిణీపై శుక్రవారం బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఇ చ్చిన తుది తీర్పు తెలుగు జాతిని అవమానపరిచే విధంగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో నష్టపోనున్నారని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో ఆయా నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడనుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం దాదాపు రూ.4,418 కోట్లు వ్యయం చేసినా, మిగులు జలాలపై ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం, మనం లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో సర్కారు సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. -
అన్యాయం కాదు... న్యాయమూ కాదు! : సుదర్శన్ రెడ్డి
మిగతాది సుప్రీంలో తేలుతుంది... మరో ఎస్ఎల్పీ వేయాల్సి ఉంటుంది బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్రం తరపు న్యాయవాది సుదర్శన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన తీర్పులో సవరణలకు ఎంతవరకు ఆస్కా రం ఉంటుందనేది చూసి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుదితీర్పును ఇచ్చిందని, మిగతాది సుప్రీంకోర్టులో తేలుతుందని రాష్ట్రం తరఫున ట్రిబ్యునల్ ఎదుట వాదించిన సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ప్రకటించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆల్మట్టి డ్యాం అనుమతుల విషయాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చూస్తుందని, ఈ విషయమై రాష్ట్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, అందులోని అంశాలన్నింటిపైనా అక్కడ వాదనలు జరుగుతాయని స్పష్టంచేశారు. ‘‘ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై మనం స్పెషల్ లీవ్ పిటిషన్లో పలు ప్రశ్నలు లేవనెత్తాం. అది పెండింగ్‌లో ఉంది. ఇప్పుడొచ్చిన తీర్పును పరిశీలించి మనం లాంఛనంగా మరో ఎస్ఎల్పీ వేయాల్సి ఉంటుంది. తుదితీర్పుపై ట్రిబ్యునల్ ఇక సమీక్ష చేయడమంటూ ఉండదు’’ అని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందా, ఊరట లభించిందా? అన్న ప్రశ్నకు.. ‘‘అన్యాయం జరిగిందని చెప్పడానికి లేదు, జరగలేదని చెప్పడానికి లేదు’’ అని బదులిచ్చారు. తీర్పును పూర్తిగా చూసేవరకు వివరాలు తెలియవని, అయితే ఆర్డీఎస్ కుడికాలువకు 4 టీఎంసీలివ్వడం మంచి విషయమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితెలా ఉంటుందన్న ప్రశ్నకు.. ‘‘మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీళ్ల విషయానికొస్తే హక్కనేది ఎప్పటికీ రాదు. మిగులు జలాలపై గతంలో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడూ స్వేచ్ఛ ఉంది. తెలుగుగంగకు 25 టీఎంసీలిచ్చారు. ఆ కేటాయింపులు అలాగే ఉన్నాయి. మనకు 150 టీఎంసీలు క్యారీఓవర్ ఇచ్చారు. వాటిని మనం ప్రాజెక్టులకు వాడుకోవచ్చు. విభజన తర్వాత ఏమిటనేది జీవోఎం లేదా మరేదైనా కమిటీ చేస్తుంది. విభజన తర్వాత కిందిరాష్ట్రానికి మిగులు జలాలపై హక్కు గురించి ఇక్కడ మాట్లాడటం సరికాదు’’ అని ఆయన బదులిచ్చారు. ట్రిబ్యునల్ ఎదుట వాదనలు సరిగా వినిపించలేదన్న విమర్శలను ప్రస్తావించగా.. విమర్శలనేవి ఎవరైనా చేయవచ్చని, సరిగా వాదించాం కనుకే ఈ పరిస్థితిలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. -
నీటి ‘విభజన’ మరింత క్లిష్టం
రెండు రాష్ట్రాలేర్పడితే కృష్ణా నీటి పంపిణీలో ఎన్నో చిక్కుముళ్లు 1,005 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ వుూడు రకాలుగా పంచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల నడువు కృష్ణా జలాల పంపిణీ వురింత క్లిష్టతరం కానుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్ర నడువు కృష్ణా జలాల పంపిణీ కథే ఇంకా వుుగియులేదు. ఇంకా సుప్రీంకోర్టులో ఈ వివాదానికి తుది పరిష్కారం దొరకాల్సి ఉంది. ఈలోపు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తాత్కాలికంగా పాత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వునకు దక్కిన మొత్తం వాటాను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే 65 శాతం డిపెండబిలిటీతో కనిపిస్తున్న అదనపు నికర జలాలను, మిగులు జలాలను కూడా పంపిణీ చేయూలంటే సుప్రీం తుది తీర్పు దాకా వేచి ఉండాల్సిందే. ఒకవేళ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును అవులు చేయూల్సిన పరిస్థితి వస్తే... 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు మూడు రకాలుగా పంపిణీ చేయూలి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, కృష్ణా డెల్టాలకు ఎలాగూ నికర జలాల కేటారుుంపులున్నారుు. ఇప్పటికే ఎలాంటి స్పష్టమైన నీటి కేటారుుంపుల్లేని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం. ఇక అదనపు నికర జలాలు (65 శాతం డిపెండబిలిటీ ద్వారా వచ్చే కోటా), మిగులు జలాల్ని ఏ ప్రాతిపదికన వీటికి కేటారుుంచాలనేది సంక్లిష్టంగా వూరనుంది. ఈ పరిస్థితిలో పోలవరానికి జాతీయు హోదా ఇచ్చినా ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు, చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రకరకాల సవుస్యలు సృష్టిస్తూనే ఉన్నారుు.గోదావరి నీటిని కృష్ణాకు వుళ్లించేందుకు ఉద్దేశించిన దువుు్మగూడెం ప్రాజెక్టుకు తెలంగాణ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనువూనమే. 2000 మే నెలతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు వుుగిసి.. 2004 ఏప్రిల్‌లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి.. ఇన్నేళ్లు గడిస్తేగానీ ఇప్పటికీ నీటి పంపిణీ ప్రక్రియు వుుగియులేదు. కావేరీ, నర్మద వంటి జల వివాదాలు దాదాపు 3 దశాబ్దాలుగా సాగుతున్నా ఇంకా పరిష్కారం దొరకలేదు సరికదా సాక్షా త్తూ ప్రధాని జోక్యం చేసుకున్నా దిగువ రాష్ట్రాలకు సకాలంలో కాసింత నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సీవూంధ్ర సకాలంలో నీటి విడుదలకోసం వుహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలంగాణపై కొత్తగా ఆధారపడాల్సిన స్థితి వస్తుంది. -
బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!
ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు. అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం! బాబు హయాంలోనే బాబ్లీ.. రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ఆనాడే నిర్మించి ఉంటే... ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు. ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది. నికర జలాలంటే... కృష్ణా బేసిన్లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు. మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు. వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు. డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి. -
మిగులు మట్టే - నీటముంచిన బ్రిజేశ్ ట్రిబ్యునల్
కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు పాతర మిగులు జలాల్లోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా కంటితుడుపుగా 4 టీఎంసీల అదనపు కేటాయింపు నీటి వాడకంపై పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు దాని నిర్ణయాలపై సమీక్షకు అథారిటీ 2050 దాకా అమల్లో ఉండేలా తుది తీర్పు ఈ దెబ్బతో కృష్ణా డెల్టా ఇక ‘కృష్ణార్పణమే’ వర్షాభావముంటే రాష్ట్రానికి కృష్ణా జలాలు సున్నా సాక్షి, న్యూఢిల్లీ: భయపడ్డంతా అయింది. కృష్ణా జలాల పంపకంలో మనకు తీరని అన్యాయం జరిగింది. ఊరట దొరకవచ్చన్న ఆశ అడియాసగా మిగిలింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ సారథ్యంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ప్రకటించిన తుది తీర్పు నామమాత్రపు సవరణలకే పరిమితమైంది. గత తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన కొండంత అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఏమాత్రమూ సవరించలేదు. జలాల సక్రమ పంపిణీ ఆవశ్యకతపై రాష్ట్రం చేసిన ఆక్రందనలు, ట్రిబ్యునల్ లోగడ వెలువరించిన తీర్పుపై చెప్పిన తీవ్ర అభ్యంతరాలు, ఎగువ రాష్ట్రాల దాష్టీకాలను ఎత్తిచూపుతూ సాగించిన వాదనలు ఏవీ పని చేయలేదు. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై రాష్ర్టం చేసిన విన్నపాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా గతంలో ఇచ్చిన తీర్పులో కేవలం కొద్ది మార్పులకే ట్రిబ్యునల్ పరిమితమైంది. కర్ణాటకకు గతంలో కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలు కోత విధించి, వాటిని రాష్ర్టంలోని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వకు కేటాయించడం, వివిధ డిపెండబిలిటీల వద్ద రాష్ట్రాలు జలాల్ని ఏ తీరున వినియోగించుకోవాలనేది స్పష్టంగా నిర్దేశించడం, కృష్ణా బేసిన్ పరిధిలోని సబ్ బేసిన్ల మధ్య నీటి బదిలీ కుదరదని మహారాష్ట్రకు తెగేసి చెప్పడం, కృష్ణా జలాల నిర్ణయం అమలు బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) ఏర్పాటు, దాని నిర్ణయూలపై అభ్యంతరాలుంటే సమీక్షకు రివ్యూ అథారిటీ ఏర్పాటు, వరదలపై హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు... ట్రిబ్యునల్ తుదితీర్పులో చేసిన ప్రధాన సవరణలు ఇవే. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు, సకాలంలో నీటి విడుదల తదితర అంశాలపై రాష్ట్రం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల విషయంలో మనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించిన మీదట దాదాపు మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలపై వాదనలు వింటూ వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, సవరణలతో తాజాగా వెలువరించిన తుది తీర్పు మనకు తీరని అన్యాయమే చేసింది. దాంతో ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టులో మన రాష్ట్రం పోరాటం కొనసాగించడం అనివార్యమైంది. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు గత తీర్పులో అనుమతించిన ట్రిబ్యునల్, దాన్ని తుది తీర్పులో సవరించలేదు. కేవలం అనుమతుల విషయమై పెట్టిన నిబంధనను మాత్రం సవరించింది. కర్ణాటక తనకు లభించినట్టు చెబుతున్న అనుమతులన్నింటినీ సంబంధిత సంస్థలు, విభాగాల ముందుంచాలని, అవి సరిపోతాయా లేక మళ్లీ తాజా అనుమతులు తీసుకోవాలా అనేది ఆ విభాగాలు, సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొంది. ఈ సవరణతో ఆలమట్టి విషయంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఈ తీర్పు 2050 దాకా అమల్లో ఉంటుంది. అయితే ఈ తుది తీర్పును అధికారికంగా ప్రచురించొద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించడమొక్కటే మన రాష్ట్రానికి కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు. పావుగంటలో ముగిసింది... జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ చైర్మన్‌గా, జస్టిస్ డి.కె.సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తుది తీర్పును ప్రకటించింది. ట్రిబ్యునల్ తరఫున జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తుది తీర్పును వెలువరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వర్తించే ప్రధానాంశాలను వరుస క్రమంలో చదివారు. ఇదంతా మొత్తం పావుగంటలోపే పూర్తరుుంది. తుదితీర్పు ప్రకటన పూర్తయిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారిమన్, అంద్యార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తీర్పు సంతృప్తికరంగా ఉందంటూ హర్షం వెలిబుచ్చారు. ట్రిబ్యునల్ పని పూర్తయింది... కృష్ణా జలాల విషయమై మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్... సుదీర్ఘ విచారణ అనంతరం అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 5(2) కింద 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులోని అంశాలపై అభ్యంతరాలు చెబుతూ సవరణల కోసం 2011లో మూడు రాష్ట్రాలు, కేంద్రం చేసిన దరఖాస్తులపై ట్రిబ్యునల్ దాదాపు మూడేళ్ల పాటు పరిశీలన సాగించి, అన్ని పక్షాల వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ఆ మీదట గత తీర్పునకు సవరణలతో తాజాగా తుది తీర్పును ప్రకటించింది. చట్టంలోని సెక్షన్ 5(3) కింద ఇచ్చిన ఈ తుది తీర్పుతో ట్రిబ్యునల్‌కు అప్పగించిన పని సంపూర్ణంగా పూర్తయింది. చేసిన సవరణలివీ... 65 శాతం డిపెండబిలిటీ వద్ద కర్ణాటకకు కేటాయించిన జలాల్లోంచి 4 టీఎంసీలను తొలగించి వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు కేటాయించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర, ఎగువ తుంగ నుంచి ఒక్కో టీఎంసీ, సింగత్లూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల చొప్పున మొత్తం 4 టీఎంసీలకు కోతపెట్టారు. వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు తొలిసారిగా కేటాయించారు. దాంతో మన రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు 1005 టీఎంసీలకు పెరిగాయి. వివిధ డిపెండబిలిటీల వద్ద జలాలను మూడు రాష్ట్రాలు ఏ తీరున వినియోగించుకోవాలో స్పష్టపరిచారు. 75 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలు పూర్తిగా వాడుకున్నాకే 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులకు సిద్ధపడాలి. అలాగే, 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలూ వినియోగించుకున్న తర్వాతే సగటు జలాల కేటాయింపుల వాడకానికి దిగాలి. నికర జలాల వినియోగం పూర్తయ్యూక వాడుకోవాల్సిన మిగులు జలాల వినియోగం విషయుంలో... దిగువ, అతి దిగువ రాష్ట్రాల జల వినియోగం జరిగాకే ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపులను వినియోగించుకోవాలి. అన్ని రకాల కేటారుుంపుల మేరకు జలాల వినియోగం తర్వాత ఏమైనా జలాలు మిగిలితే వాటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. అయితే, చట్టం కింద ఏర్పాటయ్యే ఏదైనా సంబంధిత ప్రాధికార సంస్థ చేపట్టే తదుపరి సమీక్ష, పరిశీలన వరకే ఆంధ్రప్రదేశ్ ఇలా వాడుకోగలుగుతుంది. అంతే తప్ప మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి హక్కూ సంక్రమించదు. ఆలమట్టిపైనా ఊరట లేదు! ప్రస్తుతం ఆలమట్టి డ్యాం ఎత్తుకు 519.6 మీటర్ల వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వాడకానికి అనుమతి ఉంది. అయితే తాజా తీర్పు తర్వాత దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యమూ పెరగుతుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆలమట్టి ద్వారా కర్ణాటక నీటి వాడ కం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులపైనా మన రాష్ట్రం అభ్యంతరాలు తెలిపింది. తుదితీర్పు ప్రకారం క్లియరెన్స్‌లకు సంబంధించిన పత్రాల్ని కర్ణాటక రాష్ట్రం సంబంధిత అధికార విభాగా ల ముందుంచాలి. సదరు క్లియరెన్స్‌లు, ఇప్పటికే ఇచ్చినవి అయితే, ఇప్పటికీ వర్తిస్తాయా లేదా అనేది సంబంధిత విభాగాలు తేల్చాలని ట్రిబ్యునల్ పేర్కొంది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల్లో ఒక సబ్ బేసిన్ నుంచి మరో సబ్ బేసిన్‌కు, అంటే కోయ్నా సబ్ బేసిన్ నుంచి బీమా సబ్ బేసిన్‌కు జలాలను బదిలీ చేసుకోవడానికి మహారాష్ట్ర అనుమతి కోరగా ట్రిబ్యునల్ నిరాకరించింది. అలాగే కొన్ని పరిమితులకు లోబడి కేటాయింపులన్నింటినీ వాడుకునేందుకు అనుమతించింది. -
ఆరుప్రాజెక్టులు ప్రశ్నార్థకం
భారీ వరదలు వస్తేనే వీటికి మనుగడ సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం రాష్ర్టంలో ప్రధానంగా ఆరు ప్రాజెక్టులపై త్రీవంగా పడనుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కష్టంగా మారింది. ఇప్పటివరకు మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయకపోవడంతో ఆ నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని చేపట్టారు. ప్రస్తుతం ట్రిబ్యునల్ మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. రాష్ర్టంలో మిగులు జలాలను ఆధారం చేసుకుని ఏడు ప్రాజెక్టులను చేపట్టారు. నెట్టెంపాడు, కల్వకర్తి, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ ప్రాజెక్టులను మిగులు జలాల ఆధారంగా చేపట్టారు. అయితే కొత్త ట్రిబ్యునల్ తీర్పులో తెలుగుగంగకు నీటిని కేటాయించారు. మిగిలిన ఆరు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులను చేయలేదు. దాంతో వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సుమారు రూ.20 వేల కోట్లకుపైగా వ్యయం చేశారు. ఇవి పూర్తయితే సుమారు 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులతో ప్రయోజనం పొందే జిల్లాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలుతో పాటు కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో ఇక వరద నీరే ఆధారం కానుంది. ఇందులో చాలా ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు కావడంతో వరదలు వచ్చిన సమయంలో నీటిని పంపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు కొత్తగా వచ్చే నియంత్రణ బోర్డు అనుమతి అవసరం ఉంటుంది. -
చట్టాలను ఉల్లంఘించి తీర్పు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పొలాలు ఎడారే: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్ కుమార్ చట్టాలను ఉల్లంఘించి తీర్పును వెలువరించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎగువ రాష్ట్రాలకు నీటిని కేటాయించేందుకు అవసరమైన లెక్కలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. ఈ తీర్పుపై ఏమి చేయాలో పార్టీలో చర్చించి చెప్తామన్నారు. శుక్రవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వీరప్ప మొయిలీ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైన బ్రిజేశ్‌కుమార్... కర్ణాటకకు మేలు కలిగేలా ఉత్తర్వులిచ్చారని చెప్పారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవటంతో పాటు కర్ణాటక అదనంగా ప్రాజెక్టులు నిర్మించేందుకు బ్రిజే్శ్కుమార్ ఏ అధికారంతో అనుమతిస్తారని ప్రశ్నించారు. గత ట్రిబ్యునళ్ల తీర్పులను తిరిగి తెరిచే అధికారం ఎవరికీ లేదన్న ఉత్తర్వులనూ ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా 2006లో మిగులు జలాలపై హక్కులు కోరబోమని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ఈ లేఖ వల్ల మనకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. ట్రిబ్యునల్ ముందు రాష్ర్టం వాద నలను ప్రభుత్వం సక్రమంగా వినిపించలేకపోయిందని, ఇందుకు న్యాయవాదులు సమర్థులు కాకపోవటమే కారణమని చెప్పారు. మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు లేకపోవటం దారుణమన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల 13 జిల్లాల్లో పొలాలు ఎడారిగా మారుతాయని అన్నారు. బలహీనమైన నాయకత్వం, ప్రభుత్వం రాష్ట్రానికి శనిగా మారాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం, ఓట్లు, సీట్లు తప్ప వేరే ఏమీ పట్టడం లేదని బాబు ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ? చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి ఈ కథనం ఇచ్చింది. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. {పాజెక్టులు పూర్తి చేస్తే మిగులు జలాలపై హక్కులు కోరవచ్చని ట్రిబ్యునల్ చెబుతోంది. మీ తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయలేదు. అదే చేస్తే రాష్ట్రానికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా? బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును 2000 మే నెల వరకూ నిర్దేశించింది. మీరు 1995 సెప్టెంబర్‌లో సీఎం పదవి చేపట్టి 2004 వరకూ కొనసాగారు. అయినా మిగులు జలాల లభ్యత ఆధారంగా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకపోవడం వాస్తవం కాదా? కర్ణాటక అసలు ఆల్మట్టి ప్రాజెక్టును చేపట్టిందే మీరు సీఎంగా ఉన్నప్పుడు. పైగా మీ పార్టీ నాయకుడికి చెందిన కాంట్రాక్ట్ సంస్థే దాని నిర్మాణం పూర్తి చేసింది. దాని ఎత్తు పెంచుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా మీ హయాంలోనే... వాటన్నింటినీ మీరు అడ్డుకుని ఉంటే ఈరోజు ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తును పెంచుకోవడాన్ని సమర్థించేది కాదుకదా? మిగులు జలాలపై ఆధారపడి కల్వకుర్తి, గాలేరు నగరి, నెట్టెంపాడు, ఏఎమ్మార్, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శంకుస్థాపన జరిగినా ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టును కట్టడానికి వీలులేదని ట్రిబ్యునల్ అభ్యంతరపెట్టిన విషయం మీకు తెలియంది కాదు. ఆ సమయంలోనే ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేయాల్సి వస్తుందన్న కారణంతో వైఎస్ మిగులు జలాలపై లేఖ రాశారన్న విషయం అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ ప్రాజెక్టులన్నీ మీ హయాంలో పూర్తయి ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కాదుకదా? మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కూడా మీరు సీఎంగా ఉన్నప్పుడే మొదలుపెట్టిన విషయం మరిచిపోయారా? అప్పుడు సహకరించి ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండటం అవకాశవాదం కాదా? -
బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ రోజు కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇలాంటి తీర్పు నిచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని, ప్రధానినీ, రాష్ట్రపతినీ తానే ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆయన హయాంలో కర్ణాటకలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే బాబు ముఖ్యమంత్రిగా ఉండి వారికి సహకరించారన్నారు. బాబు పాలనలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆయనకు అనుకూలంగా ఉండే ఓ పత్రికతో పాటు మరిన్ని పత్రికలు వార్తలు రాశాయని, అవి పూర్తయితే తుపాను వస్తేనే ఇక మన ప్రాజెక్టులకు నీళ్లు అన్నట్లుగా కథనాలు కూడా వచ్చాయన్నారు. బాబు గాలేరు-నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించి ఉంటే మనం కృష్ణా ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు పొందడానికి ఆస్కారం ఉండేదన్నారు. బాబు హయాంలో నిర్మించిన అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 నుంచి 524 అడుగుల నీటిని పెంచుకోవడానికి ఇపుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎం కాగానే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన తెలుగుగంగ పథకాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ దానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేశారని అందువల్లే ఆ ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఇపుడు 33 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. -
రాష్ట్రానికి గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదని, తీర్పునిచ్చిన రోజు రాష్ట్రానికి ఒక దుర్దినమని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిబ్యునల్ తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. తక్షణమే దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని లేకుంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ఇదే ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తాత్కాలిక తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఆదేశించినా ట్రిబ్యునల్ తుది తీర్పులో అన్యాయాన్ని ఏ మాత్రం సరిదిద్దలేదని మైసూరారెడ్డి ఆరోపించారు. ఒక నదిలో నీటి లభ్యతను 75 శాతం తీసుకుంటారని, బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతమే తీసుకుందన్నారు.ట్రిబ్యునల్ తాజా తీర్పు వల్ల ఎగువ రాష్ట్రాలు నీటినంతా వాడుకున్నాక దిగువ రాష్ట్రానికి వచ్చేది ఏమీ ఉండవన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అరకొరగా మాత్రమే నీరు వస్తున్నాయన్నారు. కృష్ణలో కర్ణాటకకు 171, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ అదనంగా కేటాయించాక ఇక మన రాష్ట్రానికి అదనంగా నీరు ఎక్కడినుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన వాటికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా నాలుగైదు టీఎంసీల నీరే దక్కిందని చెప్పారు. మిగులు జలాలు తమకు అక్కర లేదని దివంగత వైఎస్ లేఖ రాసినందువల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందని టీడీపీ చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని జరుగుతున్నపుడు అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో బురద జల్లడం సరికాదన్నారు. వైఎస్ లేఖ రాసిన సందర్భం వేరని ఈ అంశంపై ఆయన బతికి ఉండగానే అసెంబ్లీలో చర్చకు వస్తే సవివరమైన సమాధానం ఇచ్చారని మైసూరా గుర్తు చేశారు. జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను తక్షణం నిలిపి వేయాలని కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ మిగులుజలాల వాడకానికి సంబంధించి గతంలో బచావత్ 6సి కింద పొందుపర్చిన సారాం శాన్నే తెలియజేస్తూ లేఖను రాశారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కూడా కోరారన్నారు. టీడీపీ వారు పూర్వాపరాలు తెలియకుండా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిజేశ్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే ప్రధాన ప్రతిపక్షంగా దానిని విమర్శించకుండా ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు హయాంలో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అల్మట్టి లాంటి అక్రమ ప్రాజెక్టులను ఇపుడు బ్రిజేశ్ ట్రిబ్యునల్ క్రమబద్ధం చేసిందన్నారు. బాబు పాలనలో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలు కడుతుంటే నిర్లక్ష్యం వహించారని, కృష్ణా ఆయకట్టు రైతులను ఇక మెట్టపంటల వైపు మళ్లించాలని బాబు చెప్పారని మైసూరా గుర్తు చేశారు. వీటికి సంబంధించి బాబు అనుకూల పత్రికలో వచ్చిన అప్పటి వార్తల క్లిప్పింగ్‌లను ఆయన ప్రదర్శించారు. టీడీపీ హయాంలో వేసిన రాజారావు కమిటీ కృష్ణాలో 268 టీఎంసీల మిగులు జలాలున్నాయని నివేదిక ఇచ్చిందని ఇదే ఎగువ రాష్ట్రాల వాదనలకు ప్రాతిపదిక అయిందని మైసూరా విమర్శించారు. ఆ నివేదిక రూపొందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించారని ధ్వజమెత్తారు. -
కృష్ణా డెల్టా ఉప్పు కయ్యే!
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఫలితం కృష్ణా నీటిలో లవణాల శాతం పెరుగుదల తాగేందుకు, సాగుకూ నిరుపయోగం వరి పండించడం మరచిపోదాం.. పాడి పరిశ్రమకూ మంగళం పాడదాం.. భవిష్యత్తులో కృష్ణా డెల్టా రైతులు ఇక నమ్ముకోవాల్సింది.. అమ్ముకోవాల్సిందీ ఉప్పు మాత్రమే! కృష్ణా నదీ జలాల వివాదాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీసుకొస్తున్న పెను ఉపద్రవమిది!! కృష్ణా జలాల వివాదంలో ఇప్పటివరకూ ఎవరూ దృష్టిసారించని ఓ పెను ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం.. మనకు వచ్చేది లవణాల నీరే! వర్షపు నీరు నేలను తాకినప్పుడు మట్టిలోని కొన్ని లవణాలను కరిగించి తన వెంట మోసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా నది ప్రవహించే ప్రాంతాల్లో అగ్నిపర్వత అవశేషాలతో కూడిన రాతి నేలలు (బసాల్ట్) ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిలోకి చేరే లవణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు తాజాగా వచ్చిన నీటిని వాడుకొని అప్పటికే నిల్వ ఉంచిన నీటిని మహారాష్ట, కర్ణాటక కిందకు వదులుతాయి. అంటే నాణ్యమైన నీటిని ఆ రాష్ట్రాలు వినియోగించుకోగా, లవణాలతో కూడిన నీరంతా కిందకు వచ్చి చేరుతుందన్నమాట! పైనుంచి స్వచ్ఛమైన జలాలు తగ్గిపోతే నీటిలో లవణాల శాతం పెరిగిపోయి సాగుకు కాదు కదా.. కనీసం పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయే ప్రమాదముంది. నది పరీవాహక ప్రాంతంలో నీటిలోని లవణాల మోతాదు లీటర్‌కు 500 మిల్లీ గ్రాములకు మించితే ఆ నీరు వాడుకునేందుకు పనికిరాని స్థాయికి చేరుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలతో పోలిస్తే సోడియం మోతాదు పెరిగిపోవడం లేదా సోడియం కార్బొనేట్ వంటి లవణాలు ఉండటం వల్ల సాగునీరు, వ్యవసాయ భూములపై దుష్ర్పభావం చూపుతుంది. కాలక్రమంలో నేల చౌడుబారి సాగుకు పనికిరాని ఉప్పుకయ్యగా మిగులుతుంది. కృష్ణా బేసిన్లో లవణాలన్నింటినీ వదిలించుకోవాలంటే దాదాపు 850 టీఎంసీల వరకూ నీటిని సముద్రంలోకి వదిలేయాలి. బేసిన్ బయట వాడుకుంటున్న మరో 360 టీఎంసీల నీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటే వదిలేయాల్సిన నీటి పరిమాణం మొత్తం మరో 490 టీఎంసీలకు పెరుగుతుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో లభ్యమయ్యే మొత్తం 2,578 టీఎంసీల నీటిలో ఎవరికీ కేటాయించని జలాలు.. దాదాపు 16 టీఎంసీలు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకుగాను ఈ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా నేరుగా సముద్రంలోకి కలిపేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎగువ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న లవణాల మాటేమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నీటి పరిమాణంతో పాటు అత్యంత ముఖ్యమైన ఈ నీటి నాణ్యత అంశాన్ని ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోకపోవడం చిత్రమే. అంతర్జాతీయంగా చేదు అనుభవాలు.. ఆస్ట్రేలియాలోని ముర్రే డార్లింగ్ జలాలను విచ్చలవిడిగా వాడటం వల్ల క్షారత పెరిగిపోయింది. ఈ నష్టాన్ని నివారించేందుకు రివర్ అథారిటీ 1997లో చర్యలు చేపట్టింది. నీటి నాణ్యతను 1993 నాటి స్థాయికి చేర్చేందుకు అప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతున్న జలాల వినియోగంలో కోత పెట్టారు. ఫలితంగా బేసిన్ ప్రాంతంలో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. కొలరాడో కథ కూడా ఇలాంటిదే. అమెరికాలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోవడంతో మెక్సికోకు చేరే నీటి నాణ్యత దెబ్బతినడం మొదలైంది. దీనిపై మెక్సికో నిరసన వ్యక్తం చేయడంతో అమెరికా వాడుతున్న నాణ్యతతో కూడిన నీరు లభించేలా చూసేందుకు 1974లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. -
మిగులు కృష్ణార్పణం
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని నష్టం మనకు దక్కాల్సిన మిగులు జలాలు ఎగువ రాష్ట్రాలకు పంపిణీ కొంపముంచిన 65 శాతం డిపెండబిలిటీ విధానం కృష్ణా పరిధిలో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే.. రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదయ్యే సమయాల్లో రాష్ట్రానికి కృష్ణా నీరు వస్తుందా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమే! కొత్త తీర్పు అమల్లో లేని సమయాల్లోనే కృష్ణా బేసిన్లో తీవ్ర నీటి కొరత నెలకొంటోంది. మిగులు జలాలు కాదు కదా.. నికర జలాలు రావడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త తీర్పు ప్రకారం మిగులు జిలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే.. దిగువన ఉన్న మనకు తీరని నష్టం వాటిల్లనుంది. భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 65 శాతం డిపెండబిలిటీతో నష్టం ఇలా.. ఇప్పుడు అమలవుతున్న పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే... అదనంగా మరో 254 టీఎంసీలు అంటే... మొత్తం 1,573 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేర దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీటి ప్రవాహం తగ్గనుంది. ఈ 254 టీఎంసీలు అంటే... మన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిమాణంతో సమానం. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పటివరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మాత్రమే సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయి. అంతకుముందు వరుసగా సాగర్, డెల్టా ఆయకట్టు రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపుల్ని పెంచడానికి వీలుగా ట్రిబ్యునల్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. నదుల్లో నీటి లభ్యతలను అంచనా వేయడానికి వీలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలవుతున్న పద్ధతి 75 శాతం డిపెండబిలిటీ మాత్రమే. అంటే వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన ప్రవాహాన్ని సరాసరిగా తీసుకుని నీటిని అంచనా వేస్తారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీని పరిగణనలోకి తీసుకుంది. అంటే వందేళ్లలో 65 ఏళ్లల్లో వచ్చిన నీటిని సరాసరిగా పరిగణిస్తారు. దాంతో నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పద్ధతిన కర్ణాటకకు 61 టీఎంసీలు, మహారాష్ట్రకు 43 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే 112 ఏళ్లల్లో వచ్చిన సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకోవాలని మనం కోరితే.. ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల్లో వచ్చిన వరదను సరాసరి నీటిగా పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల కూడా మనకు తీరని అన్యాయం జరిగింది. ‘మిగులు’ను పంచేసిన ట్రిబ్యునల్.. గత బచావత్ ట్రిబ్యునల్... మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన మనకు ఇచ్చింది. కరువొచ్చినా... వరదలు వచ్చినా నష్టపోయేది దిగువ రాష్ర్టమేనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసేసింది. మొత్తం 285టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని ఆధారం చేసుకునే మన రాష్ర్టంలో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. అలాగే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల కూడా దిగువకు సకాలంలో నీరు రాదు. ఇప్పటివరకు 173 టీఎంసీల వాడకమే ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాడకం భవిష్యత్తులో 303 టీఎంసీలకు పెరగనుంది. అంటే దిగువకు రావాల్సిన 130 టీఎంసీల నీరు కర్ణాటక వాడుకోవడానికి అవకాశం ఏర్పడనుంది. దాంతో మన ప్రాజెక్టుల పరిధిలోని ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. -
ట్రిబ్యునల్ తీర్పు బాధాకరం:హరికృష్ణ
హైదరాబాద్: కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా రావడం చాలా బాధాకరమని నందమూరి హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ దుర్నీతితో వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి సంభవించిందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అనుసరించిన నిర్లక్ష్య వైఖరితో ఇటువంటి పరిస్థితి దాపురించిందన్నారు. నీటి వాటాల కోసం పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు విభజనకు సహకరిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. బ్రజేశ్‌కుమార్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేకాంశాలు చోటు చేసుకున్నాయి. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా కూడా అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా తీర్పునివ్వడంతో కృష్ణా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. -
'వాదనలు వినిపించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి వైఫల్యం'
-
ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం
-
'వాదనలు వినిపించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి వైఫల్యం'
కృష్ణా జలాలపై నియమించిన బ్రిజేష్ కుమార్ ట్ర్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలైమందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.నారాయణ అభివర్ణించారు.ప్రాంతాలవారీగా విడిపోయిన కేబినెట్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఇప్పటికైన జోక్యం చేసుకోని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా నారాయణ విజ్ఞప్తి చేశారు. బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేడు న్యూఢిల్లీలో తుది తీర్పును వెలువరించింది. కృష్ణా జలాలపై 1001 టీఎంసీల నుంచి 1005 టీఎంసీలకు పెంచెందుకు సుముఖుత వ్యక్తం చేసింది. అలాగే ఆల్మట్టి ఎత్తును పెంచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. -
కృష్ణా జలాలపై తుది తీర్పు, రాష్ట్రానికి తీరని నష్టం
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావించాలి. -
నేడు కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు
-
ఏదైనా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే..!
కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని తుంగభద్ర ప్రాజెక్టు కిందకు వచ్చే రాష్ట్ర రైతుల కష్టాలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో కర్ణాటకపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలకు తాము సుముఖంగా లేమని ఆ రాష్ట్రం స్పష్టం చేసింది. దాంతో రెండు రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో జరిగిన సమావేశం ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండానే ముగిసినట్టయింది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీటిని అందించే హై లెవెల్ కెనాల్ విషయమై పలు ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. జిల్లాకు సాగునీరు సరిగ్గా అందేలా చూసేందుకు కెనాల్ ఆధునీకరణతో పాటు సమాంతరంగా మరో కాల్వను తవ్వాలనే ప్రతిపాదనను మన రాష్ర్టం రూపొందించింది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం బెంగళూరులోని ఆ రాష్ట్ర సచివాలయంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ర్టం తరఫున మంత్రులు రఘువీరారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎంఎల్ఏ మధుసూదన్గుప్తాతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎంబి పాటిల్, రెవెన్యూమంత్రి వి.శ్రీనివాసప్రసాద్, న్యాయ శాఖ మంత్రి టీబీ జయచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. సమావేశం అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న హెచ్ఎల్సీ నుంచి అనంతపురం జిల్లాకు 2,575 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం 1,000-1,200 క్యూసెక్కులకు మించి రావడం లేదని తెలిపారు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీర్పు రావాల్సి ఉండగా.. ఉభయ రాష్ట్రాల సాంకేతిక, న్యాయ బృందాలు చర్చలు కొనసాగిస్తాయని చెప్పారు. బెంగళూరు-బళ్లారి మధ్య దూరం తగ్గించే రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గానికి అవసరమైన భూ సేకరణను సత్వరమే పూర్తి చేయాలని కూడా కర్ణాటకను కోరినట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లాలో భూ సేకరణ పూర్తయిందని, రెండు స్టేషన్ల మధ్య ప్రయోగాత్మకంగా రైలు నడపడం కూడా ప్రారంభమైందని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదంపై తటస్థ సంస్థ సర్వే ఈ సమావేశం తర్వాత మన ప్రతినిధుల బృందం కర్ణాటక రెవిన్యూ మంత్రితో సమావేశమయ్యింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై చర్చించింది. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవో సత్వరమే తేల్చాల్సిందిగా సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియాకు ఈ బాధ్యతను అప్పగించాలని రాష్ట్ర ప్రతినిధి బృందం సూచించింది. ఈ సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో సంబంధం లేని తటస్థ సంస్థతో సర్వే చేయించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అనంతరం రఘువీరారెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
నీటియుద్ధాలే రేపటి నిజం
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ మధ్యన నదీ జలాల గురించి పత్రికల వారి సమావేశంలో మా ట్లాడారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ చర్చ అవసరాన్ని మరింత స్ప ష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా నీటి కోసం ఎలాంటి యుద్ధాలు, వివాదాలు తలెత్తబో వని మంత్రి మాటల సారాంశం. తెలంగాణవాదులు కూడా ఇదే చెప్పారు. మంత్రివర్యులు తన మీడియా ప్రసంగంలో కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన కేటాయింపుల వివరాలు కూడా అందించారు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం - ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్న వారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెంతైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవసాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ గణాంకాలన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్ స్థానంలో వచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేయబోయే నీటి కేటాయింపుల వల్ల జరిగే అనర్థాలు. రెండవది, మిగులు జలాలకు సంబంధించినది. తెలంగాణవాదులు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అంశం-నీటి దోపిడి. తెలంగాణవాదుల ఆరోపణ ప్రకారం, మిగులు జలాలతో కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. కాగా, జూరాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తెచ్చుకునే ఉద్దేశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం కూడా ఇందులో ఉంది. మొన్న పాలమూరులో జరిగిన బీజేపీ సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అంటే సముద్రాన్ని హైదరాబాద్‌కు తెస్తాం అనే ధోరణి ఈ అభిప్రాయాలలో ప్రతిబింబిస్తున్నది. అయినా మన మంత్రివర్యులకు ఇవేమీ కనిపించలేదు. వీటిని బట్టి మనం అర్థం చేసు కోవలసినది - నీటి యుద్ధాలు పొంచి ఉన్నాయి. అంటే మహబుబ్‌నగర్-కర్నూలు జిల్లాలలో వియ్యంకుల మధ్య, మొగుడు-పెండ్లాల మధ్య, అన్నా-చెల్లెళ్ల మధ్య, బావ - బావమరుదుల మధ్య నీటి యుద్ధాలు జరగడం అనివా ర్యంగా కనిపిస్తోంది. నిజానికి విభజనవాదులు మొదట వాదించిన తీరు ఇదే, నీటి యుద్ధాలు జరుగుతాయనే. ఇప్పుడు మాత్రం జరగవంటున్నారు. దీనిలో పరమార్ధ మేమిటో వారే చెప్పాలి. బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల లో జరిగే అనర్థాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే సమాచారం అందుతోంది. బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాల వరద నీటిని పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో మంచి వర్షాల కాలం, తక్కువ వర్షాల కాలం రెండు ఉన్నాయి. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 47 సంవత్సరాల వరద నీటిని తీసుకుంటే, అది మంచి వర్షాల కాలం మాత్రమే. అంటే తక్కువ వర్షాల కాలాన్ని తీసుకో లేదన్న మాట. దీని ద్వారా నీటి లభ్యతను పెంచి పంచడం జరిగింది. అదేగాక 75 శాతం ప్రాబబిలిటి కాకుండా 65 శాతం ప్రాబబిలిటిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కూడా లభ్యత నీటిని పెంచడం జరిగింది. అంటే ఈ నీటి లభ్యత గణాంకాలలో చాలా మార్పులు చోటుచేసు కున్నాయి. కుడి పక్కన ఉన్న పట్టికలో ఆ మార్పుల తీరును చూడవచ్చు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? బ్రిజేష్, అంతకు ముందు నియమించిన బచావత్ కమిటీల మధ్య వ్యత్యాసం ప్రకారం సగటున (మంచి వర్షాలు - తక్కువ వర్షాలు నమోదైన సంవత్సరాల ప్రకారం) మన రాష్ట్రానికి కేటాయించిన నీరు 100 సంవత్సరాలలో 55 సంవత్సరాలు మాత్రమే రావటం జరుగుతుంది. అదే తక్కువ వర్షాల సంవత్సరాల ప్రకారం చూస్తే 40 నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ. అంతేకాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే కొత్త అనుమతుల (ఆలమట్టి ఎత్తు పెంచడం, మహారాష్ట్రలో విద్యుత్ ప్లాంటులకు నీరు, చట్ట వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించడం, వగైరాల) వల్ల ఈ సగటు నీటి లభ్యత 55 శాతం నుంచి 40 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువ వర్షాల కాలంలో ఇది 30 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమ నించాల్సిన విషయం-ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్నవారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత రాజకీయ నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెం తైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవ సాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి