ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు | YS Vijayamma deeksha for Tribunal verdict on Krishna waters on 4th,5th | Sakshi
Sakshi News home page

ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు

Published Tue, Dec 3 2013 12:11 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు - Sakshi

ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు

కడప : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు, ఎల్లుండి దీక్షలు చేపట్టనున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద బుధవారం విజయమ్మ దీక్షకు చేయనున్నట్లు కృష్ణాజిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

మరోవైపు విజయమ్మ ఎల్లుండి వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ సమీపంలో దీక్ష చేపట్టనున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిగులు జలాలు రాకుంటే రాయలసీమ ఎడారేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, పార్టీ నేత శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement