Fact Check: గురివింద కలగన్నారు..! | Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan | Sakshi
Sakshi News home page

Fact Check: గురివింద కలగన్నారు..!

Published Fri, Oct 6 2023 4:13 AM | Last Updated on Fri, Oct 6 2023 4:15 AM

Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan - Sakshi

రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకు వచి్చనా.. వెంటనే అందులో లోపాలంటూ దుష్ప్రచారం చేయడం, వాటిని సీఎం జగన్‌కు అంటగట్టడం ఈనాడు రామోజీకి నిత్యకృత్యమైపోయింది. తమ ఇషు్టడైన చంద్రబాబు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడంతో సదరు రామోజీకి ఈ ప్రభుత్వంపై మరింత అక్కసు పెరిగిపోయింది. ఇది ప్రతిరోజూ ఈనాడులో కనిపిస్తూనే ఉంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే ధ్యేయంగా రామోజీ ముందుకు వెళుతు­న్నారు. ఇందులో భాగంగా తాజాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాలను తానే దగ్గరుండి స్వయంగా చూసినట్లు కలగని ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. 

సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే దూడను గాటికి కట్టేయమన్నట్లుగా ఉన్నాయి రామోజీరావు తెలివితేటలు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. మరొకటిగా ఊహించుకుని.. అభూత కల్పనలతో సీఎం వైఎస్‌ జగన్‌పై బురదజల్లుతూ నీతి మాలిన రోత రాతలను యథావిధిగా అచ్చేశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఆ విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను పునః సమీక్షించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ కూడా బుధవారం వెల్లడించలేదు. కానీ.. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను పునఃసమీక్షించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. దీని వల్ల దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. దీనిపై ఏ వేదికపై కూడా సీఎం జగన్‌ నోరు మెదపక పోవడం వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతోందంటూ ‘కృష్ణా జలాలపై పునఃసమీక్ష’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. అసలు నిజం ఏమిటంటే..  

► విభజన తర్వాత 2014 జూలై 14న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956లో సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్‌ కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ 545/2015ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విని్పంచడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన తెలంగాణ సర్కార్‌ ఆ రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.  

► తెలంగాణ కోరిన విధంగా సెక్షన్‌–3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేస్తే.. అది చట్టవిరుద్ధమని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తేల్చిచెబుతూ 2021 ఆగస్టు 17న.. 2022 జూన్‌ 25న సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలు రాశారు.  

► ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. తెలంగాణ సర్కార్‌ కోరిన విధంగా సెక్షన్‌–3 ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన కృష్ణా జలాలను పునఃసమీక్షించడానికి అవకాశమే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని గుర్తు చేస్తూ.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ వస్తున్నారు.
 
► రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన  మరిన్ని విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. వాటిపై స్పష్టత వచ్చాక.. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.  

►  కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కోరేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ఢిల్లీకి వెళ్లారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement