Ministry of Jal Shakti
-
మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉండగా.. 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని వివరించారు. అందువల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన 70శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ... కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంతో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల ఎన్నో ఏళ్లుగా తెలంగాణ నష్టపోతోందని.. ఈ ఏడాది సైతం ఏపీ కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందని వివరించారు. ఇక ముందు ఏపీ ఇలా వాటాకు మించి జలాలను తరలించుకు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని.. అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండిపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022లోనే సమర్పించినా.. అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ వివరించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.ఏపీ తీరు చట్టవిరుద్ధంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. ఆ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని.. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోదికుంట వాగు, చనాకా కొరట బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’, ‘పీఎంఆర్పీ 2024’ కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, ఈ క్రమంలో ఏర్పడే ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. -
డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. తాము ఆమోదించిన విధానం, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారా? లేదా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)దేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏకు బుధవారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం, 1,396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రం వాల్ డిజైన్.. నిర్మించే విధానంపై డిసెంబర్ 26న సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక ఇచ్చారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ(పీవోఈ)తో సీడబ్ల్యూసీ డిజైన్స్ సీఈ విజయ్‌శరణ్ ఈ నెల 9న ఒకసారి.. 15న రెండోసారి.. 17న మూడోసారి సమీక్షించారు. ఈ సమీక్షల్లో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రం వాల్ నిర్మించే విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ.. వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సీఈని ఆదేశించారు. సీడబ్ల్యూసీ లేఖలో ప్రధానాంశాలివీ ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే టీ–16 కాంక్రీట్ మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా, ధృడంగా, సీపేజీని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారో నివేదికలో పేర్కొనాలి. ప్లాసిŠట్క్ కాంక్రీట్ నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం ట్రెంచ్ కట్టర్, గ్రాబర్‌తో భూమిని తవ్వుతూ.. ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతూ రాతిపొర తగిలే వరకూ ప్యానల్‌ను దించుతూ పోతారు. రాతి పొర తగిలాక.. కఠిన శిల(హార్డ్ రాక్)లోకి ఎగువ మొన నుంచి ఏకీకృత రీతిలో రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించాలి. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లోగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోయాలి. ⇒ కఠిన శిల ఫర్మియబులిటీ, సీపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సీపేజీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైతే.. దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్ (అధిక ఒత్తిడితో సిమెంట్‌ను రాతి పొరల్లోకి పంపడం) చేసే విధానాన్ని ఖరారు చేయాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్‌కూ మరో ప్యానల్ మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అన్నది నిర్ధారించాలి. ⇒ పాత డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాసిŠట్క్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయాఫ్రం వాల్ మందం 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ మందం 0.5 శాతం అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏమిటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయ్యాక.. ప్రధాన డ్యామ్ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రం వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నివేదికలో స్పష్టం చేయాలి. ⇒ ప్రాజెక్టు పనులను రోజూవారీ, నెలవారీ సమీక్షిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారా? లేదా అన్నది పీపీఏ నివేదిక ఇవ్వాలి. -
పక్కా.. అది బ్యారేజే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. -
పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు గోదావరి ఇలా..గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..తొలి దశ..– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు. – బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.రెండో దశ– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. – సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.మూడో దశ:– బొల్లాపల్లి రిజర్వాయర్‌లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి. -
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండిమేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు!బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరుమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నేటి నుంచి శ్రీశైలం, సాగర్‌లో ఎన్డీఎస్ఏ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను ఎన్డీఎస్ఏ బృందం సందర్శించనుంది. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది. ఎన్డీఎస్ఏ సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను, ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టును తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఎన్డీఎస్ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, సీఎస్ఎంఆర్ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎని మిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రా జెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత (ప్లజ్ పూల్) ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతోపాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని, దీనికి రూ. 800 కోట్లు అవసరమని కేఆర్ఎంబీ గతంలో అంచనా వేసింది. ఇక నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మారి్పడి వంటి పనులు చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు రూ. 20 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఎన్డీఎస్ఏ బృందం తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
జాతీయ హోదా చాన్స్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. షెకావత్‌తో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీఎస్ శాంతికుమారి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, సీఈ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హోదా పరిశీలనే లేదు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు వివిధ అనుమతులకు సంబంధించిన రెండు వినతిపత్రాలను రాష్ట్ర బృందం షెకావత్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రస్తుతం దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించడంగానీ, పరిగణనలోకి తీసుకోవడంగానీ లేదు. జాతీయ హోదా అంశాన్ని కేంద్రం పక్కనపెట్టింది. పోలవరం తర్వాత కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదానే వెనక్కి తీసుకోవాలనే యోచన ఉంది. అయితే జాతీయ హోదాకు బదులు పాలమూరు ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ పథకం ద్వారా గరిష్ట సాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అనుమతులు ఇప్పించండి పాలమూరు ప్రాజెక్టును మిగులు జలాల ఆధారంగా చేపట్టినా.. తర్వాత ప్రభుత్వం 75శాతం డిపెండబులిటీ ఆధారంగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయించిందని కేంద్ర మంత్రికి రాష్ట్ర బృందం తెలిపింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద వినియోగించుకోలేని 45 టీఎంసీలు, గోదావరి మళ్లింపు జలాల ఆధారంగా రాష్ట్రానికి దక్కే వాటా 45 టీఎంసీలు ఉన్నాయని వివరించింది. రూ.55,086 కోట్ల వ్యయఅంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంంఘం పరిశీలనకు పంపామని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, వైల్డ్‌లైఫ్ వంటి అనుమతులు వచ్చాయని.. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఈ అనుమతులు వీలైనంత త్వరగా ఇప్పించేలా చొరవ చూపాలని కోరింది. సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విధానం లేదని కేంద్ర‡ మంత్రి షెకావత్ చెప్పారని భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ఇతర పథకాల కింద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన అనుమతులు ఇప్పించే అంశంపై సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రం వేరే విధంగా సాయం చేస్తామన్న కేంద్ర మంత్రి హామీకి రాష్ట్రం ఓకే చెప్పిందా? అని ప్రశ్నించగా.. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘విభజన’ను పూర్తి చేయండి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని అమిత్ షా కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలి. పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలి. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్న విషయంపై దృష్టి సారించాలి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలి..’’ అని వినతిపత్రంలో కోరారు. ‘మెట్రో’ సవరణలను ఆమోదించండి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ అయిన సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ‘‘హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిశీలించండి. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అవసరమైన మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలి. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి..’’ అని రాష్ట్ర బృందం కోరింది. నేడు యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరగనుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పేపర్ లీక్‌లతో టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించిందని.. దానిని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చిస్తామని వెల్లడించారు. -
పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి ప్రస్తుత సీజన్ (2023–24)లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్), సవరించిన అంచనా వ్యయం (తొలిదశ పూర్తి) ఖరారే అజెండాగా ఈనెల 20న ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, జల్‌శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొంటారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పీపీఏ సభ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల సీపేజీకి అడ్డుకట్ట వేయడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలా? పాతదానికే మరమ్మతు చేయాలా? వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి వీలుగా ప్రస్తుత సీజన్లో చేపట్టాల్సిన పనులను, అందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.16,119.57 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు రూ.15,505.81 కోట్లు అవసరమని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)ని నియమించింది. ఆ కమిటీ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. ఈనెల 20న జరిగే సమావేశంలో తొలిదశ సవరించిన అంచనా వ్యయంపై చర్చించనున్నారు. -
‘పోలవరం’పై మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా ఖరారుచేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ–సవరించిన వ్యయ కమిటీ)ని ఏర్పాటుచేస్తూ గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ (పీపీఓ) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచామిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్సీసీకి సీడబ్ల్యూసీ సీఈ (పీఏఓ) యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ ఖరారుచేసిన సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి రెండు వారాల్లోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌సీసీని ఆదేశించారు. ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌శక్తి శాఖ పంపనుంది. పీఐబీ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలిదశ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి 2013–14 ధరల ప్రకారం కేవలం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ, 2013, భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది.. కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లు దండుకోవడమే. 2016, సెప్టెంబరు 7 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు అదే చేశారు. ఇదే అంశాన్ని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ సవరించిన వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారుచేస్తూ ఈనెల 13న కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి, పీఐబీకి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, సంబంధిత ప్రాజెక్టును ప్రతిపాదించే శాఖ అధికారులతో ఆర్‌సీసీని ఏర్పాటుచేయాలని 2016, సెప్టెంబరు 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్సీసీ ఇచ్చే నివేదికే అత్యంత కీలకం. దీనిని యథాతథంగా పీఐబీ ఆమోదించనుంది. తొలిదశ పూర్తికాగానే రెండో దశ.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు) స్థాయిలో నీటిని నిల్వచేయాలంటే.. ఇటీవల లైడార్ సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే 90 గ్రామాల పరిధిలోని 171 ఆవాసాల్లోని 37,568 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో ఇప్పటికే 12,658 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మరో 24,910 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలంటే 137గ్రామాల పరిధిలోని 200 ఆవాసాల్లో 64,155 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశలో, రెండో దశలో నీటిని నిల్వచేయాలంటే ముంపునకు గురయ్యే 1,10,879 హెకార్ల భూమిని సేకరించాలి. మరోవైపు.. తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేశాక.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్ల వరకూ 194.6 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం నిల్వచేయనుంది. రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి సవరించిన అంచనా వ్యయాన్ని తొలిదశ పనులు పూర్తయ్యే నాటికి కేంద్రం ఆమోదించనుంది. -
కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 6న జారీ చేసిన కొత్త విధి విధానాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విధి విధానాల అమలును నిలిపేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారించాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఈ ట్రిబ్యునల్ అవార్డు గడువు ముగియడంతో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై 2010 డిసెంబర్ 30న ఓ నివేదికను, 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను అందజేసింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం సగటు లభ్యత ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ నివేదికలను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బేసిన్‌లోని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లను దాఖలు చేశాయి. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటిని కేటాయించి, నీటి లభ్యత తక్కువ ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా జలాల విడుదలకు నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని రూపొందించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విభజన చట్టం నిర్దేశించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. దీని ప్రకారం 2016 అక్టోబర్ నుంచి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పునఃపంపిణీ కుదరని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ మేరకు కొత్త విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసింది. ఈ విధి విధానాల ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా కేటాయించిన జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసి, రెండు రాష్ట్రాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ విస్తృతార్థం ఇస్తూ.. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులుగా కూడా వర్గీకరించింది. ఈ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. -
Fact Check: గురివింద కలగన్నారు..!
రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకు వచి్చనా.. వెంటనే అందులో లోపాలంటూ దుష్ప్రచారం చేయడం, వాటిని సీఎం జగన్‌కు అంటగట్టడం ఈనాడు రామోజీకి నిత్యకృత్యమైపోయింది. తమ ఇషు్టడైన చంద్రబాబు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడంతో సదరు రామోజీకి ఈ ప్రభుత్వంపై మరింత అక్కసు పెరిగిపోయింది. ఇది ప్రతిరోజూ ఈనాడులో కనిపిస్తూనే ఉంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే ధ్యేయంగా రామోజీ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాలను తానే దగ్గరుండి స్వయంగా చూసినట్లు కలగని ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే దూడను గాటికి కట్టేయమన్నట్లుగా ఉన్నాయి రామోజీరావు తెలివితేటలు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. మరొకటిగా ఊహించుకుని.. అభూత కల్పనలతో సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ నీతి మాలిన రోత రాతలను యథావిధిగా అచ్చేశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఆ విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునః సమీక్షించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ కూడా బుధవారం వెల్లడించలేదు. కానీ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. దీని వల్ల దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. దీనిపై ఏ వేదికపై కూడా సీఎం జగన్ నోరు మెదపక పోవడం వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతోందంటూ ‘కృష్ణా జలాలపై పునఃసమీక్ష’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. అసలు నిజం ఏమిటంటే.. ► విభజన తర్వాత 2014 జూలై 14న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 545/2015ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విని్పంచడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన తెలంగాణ సర్కార్ ఆ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ► తెలంగాణ కోరిన విధంగా సెక్షన్–3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేస్తే.. అది చట్టవిరుద్ధమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తేల్చిచెబుతూ 2021 ఆగస్టు 17న.. 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ► ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. తెలంగాణ సర్కార్ కోరిన విధంగా సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను పునఃసమీక్షించడానికి అవకాశమే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని గుర్తు చేస్తూ.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ వస్తున్నారు. ► రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. వాటిపై స్పష్టత వచ్చాక.. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కోరేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
నేడు జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమావేశం
-
Polavaram Project: కొత్త డయాఫ్రమ్ వాల్!
సాక్షి, అమరావతి: పోలవరం ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆవశ్యకతపై నివేదిక సమర్పించడమే అజెండాగా కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా వరద ప్రవాహాన్ని దిగువకు పంపే స్పిల్ వేను గోదావరి కుడి గట్టుకు అవతల రాతి నేలపై.. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564, గ్యాప్–2లో 1,750, గ్యాప్–3లో 140 మీటర్లు) గోదావరి గర్భంలో ఇసుక తిన్నెలపై నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను రూపొందించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించారు. గ్యాప్–1, గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. కమీషన్ల కోసం చంద్రబాబు ఘోర తప్పిదం.. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాలి. వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ చంద్రబాబు కమీషన్ల దాహంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికి పూర్తి చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఇరువైపులా 800 మీటర్ల పొడవున ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గోదావరికి 2019 అక్టోబర్‌లో భారీ వరద వచ్చింది. 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో 800 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నిర్వాకాల కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఆ తప్పిదాలను సరిదిద్దేందుకు రూ.2,020 కోట్లకుపైగా వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశారు. గోదావరి వరదను మళ్లించాక ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవుతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. వరద ఉద్ధృతికి గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. ► వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో జి.కొండ కుడివైపున 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకూ 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్ గత సర్కారు నిర్వాకాలతో దెబ్బతింది. ► దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించి 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకూ 185 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనట్లు తేల్చారు. ► 480 నుంచి 510 మీటర్ల మధ్య 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 950 – 1,020 మధ్య 70 మీటర్ల మేర దెబ్బతినగా 1,170 నుంచి 1,370 మీటర్ల వరకూ 200 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు తేల్చారు. అంటే 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో 485 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ► 363 మీటర్ల నుంచి 1,035 మీటర్ల వరకూ 672 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఐదు మీటర్ల మేర దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. డ్యామ్ భద్రత దృష్ట్యా.. దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని తొలుత సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ప్రతిపాదించారు. అయితే ఈ పనులు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేయలేదు. అంతిమంగా ఇది డ్యామ్ భద్రతకే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈనెల 3న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం కంటే డ్యామ్ భద్రత దృష్ట్యా 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొగ్గు చూపారు. దీనిపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వాలని జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించడంతో నేడు ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో 75 శాతం (నికర జలాలు) లభ్యత ఆధారంగా ఏటా సగటున 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం తాజాగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.7 టీఎంసీలను వినియోగించుకోవడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అంటే ట్రిబ్యునల్ అనుమతించిన దాని కంటే పోలవరం వద్ద గోదావరిలో నికర జలాల లభ్యత 13.37 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో సబ్ బేసిన్ల వారీగా గోదావరిలో నీటి లభ్యతను తేల్చాకే రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో గోదావరి బోర్డు ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది. పోలవరానికి సగటున 1,198.35 టీఎంసీలు తెలుగు రాష్ట్రాల పరిధిలో పెన్‌గంగా (జీ–7), ప్రాణహిత (జీ–9), దిగువ గోదావరి (జీ–10), ఇంద్రావతి(జీ–11), శబరి (జీ–12) పరీవాహక ప్రాంతాలలో 1971–72 నుంచి 2011–12 మధ్య 41 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో ఏటా 1,435 టీఎంసీల నికర జలాల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం వద్దకు ఏటా సగటున 1,198.35 టీఎంసీల ప్రవాహం వస్తుందని అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల మధ్య ఏటా సగటున 778.39 టీఎంసీల ప్రవాహం ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 45.83 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. -
పోలవరానికి రూ.17,148 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన రూ.17,148 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర కేబినెట్‌కు పంపాల్సిన ప్రతిపాదన (మెమొరాండం)ను ఈనెల 31లోగా సిద్ధంచేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులకు ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం ఆయన సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు ఆ వివరాలను తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉధృతికి ఏర్పడిన అగాథాలలో ఇసుక పూడ్చివేత పనులు పూర్తయ్యాయని.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. షెడ్యూలు ప్రకారమే పనులు చేస్తుండటంతో మంత్రి షెకావత్ సంతృప్తి వ్యక్తంచేశారు. 36 గ్రామాలకు పునరావాసం కల్పించడానికి ఓకే.. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని.. కానీ, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని.. అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. ఈ వ్యయాన్ని కలుపుకుంటే.. తొలిదశ పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమని వివరించారు. ఇందుకు మంత్రి షెకావత్ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఈనెల 15లోగా సీడబ్ల్యూసీకి పీపీఏ పంపాలని.. అనంతరం ఈనెల 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు. ఆ మెమొరాండాన్ని కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని షెకావత్ చెప్పారు. డయాఫ్రమ్‌వాల్‌పై మేధోమథనం.. మరోవైపు.. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల.. దానికి సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే పనులపై నిర్మాణ సంస్థ మేఘా అనుమానాలు వ్యక్తంచేస్తోందని మంత్రి షెకావత్‌కు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. మంత్రి స్పందిస్తూ.. పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? గ్యాప్–2లో మొత్తం 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా స్పందిస్తూ.. పాత దానిలో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు.. మొత్తం 1,396 మీటర్ల పొడవున కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేయడానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలపై సోమవారంలోగా తుది నిర్ణయాన్ని తనకు వెల్లడించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరాకు మంత్రి షెకావత్ కోరారు. పోలవరం పనులకు లైన్ క్లియర్ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను మరో ఏడాదిపాటు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు 2024 జులై లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి అఫిడవిట్ దాఖలు చేసేదాకా ఈ ఉత్తర్వులు అమలులోనే.. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్విఘ్నంగా కొనసాగించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ జారీచేసిన ‘స్టాప్‌వర్క్ ఆర్డర్’ అమలును మరో ఏడాదిపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్త యోగేంద్రపాల్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల నుంచి 2024, జులై వరకూ లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేసేవరకూ అమల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. తద్వారా పోలవరం పనులకు కేంద్ర లైన్‌క్లియర్ చేసింది. బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చాకే ఆ ప్రాజెక్టు పనులను జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. వీటివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ ఒడిశా సర్కార్ 2007లో సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ 2011, ఫిబ్రవరి 8న కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను జారీచేసింది. ప్రాజెక్టు పనులను చేపట్టాలంటే.. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేయడం లేదా ఎత్తేయడం తప్పినిసరి. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను ఎత్తేయడం న్యాయ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు పనులు చేసుకోవడానికి వీలుగా స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలుపుదల (అబయన్స్‌లో పెట్టాలని) చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి కేంద్రానికి ప్రతిపాదన పంపుతోంది. నిజానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయడానికి వీలుగా రెండేళ్లపాటు స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం 2019 నుంచి స్టాప్‌వర్క్ ఆర్డర్ నుంచి రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ వస్తోంది. ఈ గడువు ఈ నెలతో పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లపాటు నిలుపుదల చేయాలని కోరగా జులై 2024 వరకు లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్ దాఖలుచేసే వరకూ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేసింది. -
నేడు పోలవరంపై కీలక భేటీ..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్ల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే అజెండాగా సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి రూ.పదివేల కోట్లను అడ్‌హక్ (ముందస్తు)గా విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు కోరారు. దీనికి స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చూడాలని కేంద్ర ఆర్థికశాఖను ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు తొలిదశను సత్వరమే పూర్తిచేయడానికి వీలుగా రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని 2016లో నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే ఇప్పటికే అధికంగా ఖర్చుచేసిన నేపథ్యంలో అదనంగా నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. అదనంగా నిధులు మంజూరు చేయాలంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తప్పినిసరి. ఆ క్రమంలోనే రూ.12,911.15 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదన పంపాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మిలాసీతారామన్ కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను పీపీఏ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పంపారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించి.. కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, సత్వరమే పూర్తిచేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఫలించిన సీఎం జగన్ కృషి.. పోలవరం తొలిదశకు రూ.12,911 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలపై కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరలతో నిధులిచ్చేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) డైరెక్టర్ ఎల్కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు ఆమోదం తెలిపారని ఆ లేఖలో పేర్కొన్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్రమంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని కోరామన్నారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తొలిదశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ.10,000 కోట్లను అడ్‌హాక్‌గా (ముందస్తుగా) ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి 3న ఢిల్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు. 2017–18 ధరల ప్రకారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఖరారుచేసిన రూ.55,656.87 కోట్లను ఆమోదించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేసేటప్పుడు విభాగాల వారీగా పరిమితులు విధిస్తున్నారని, దాన్ని తొలగించి ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రీయింబర్స్మెంట్ చేయాలని కూడా కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించారు. రూ.10,911.15 కోట్లు ఇవ్వాలని సీడబ్ల్యూసీ సిఫారసు ఫలితంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ దీనిపై స్పందించి ప్రాజెక్టు తొలిదశలో ప్రధాన డ్యామ్, కాలువల పనుల పూర్తికి, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులను కోరారు. పోలవరం తొలిదశ పూర్తికి రూ.15వేల కోట్లు మంజూరు చేయాలని పీపీఏ ద్వారా కేంద్ర జలశక్తి శాఖకు గత ఏడాది జనవరి 10న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంకజ్‌కుమార్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్వీందర్ సింఘ వోరా రూ.10,911.15 కోట్లను ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించాలని సూచించారు. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 4న సీఎం జగన్‌తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుకు తిన్నెలు కోతకు ఏర్పడ్డ భారీ అగాధాలను పరిశీలించారు. ఆ సమయంలో డయాఫ్రం వాల్ మరమ్మతులు, భారీ అగాధాలను పూడ్చివేసి యధాస్థితికి తేవడానికి చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈయన ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్, అగాధాలను పూడ్చివేసి యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఖరారు చేశాయి. ఇందుకు రూ.2,020.05 కోట్ల వ్యయమవుతుందని తేలుస్తూ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక సమర్పించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న పంకజ్‌కుమార్ తొలిదశ పూర్తికి రూ.10,911.15 కోట్లు, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టడానికి రూ.2,000 కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు పోలవరానికి మంజూరు చేయాలని చేసిన సిఫార్సును కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలిఏడాది దాని పూర్తి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటి నిల్వచేయాలి. ఈ సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంలోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్లలో నీటిని నిల్వచేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటి నిల్వచేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. -
పునరావాసం కల్పించాకే.. పోలవరంలో నీటి నిల్వ
సాక్షి, అమరావతి: నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో లైడార్ సర్వే ప్రకారం ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ ఝా అధ్యక్షతన కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల కార్యదర్శులు పంకజ్‌కుమార్, సౌరబ్గార్గ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, పీపీఏ సీఈవో, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీధర్ సభ్యులుగా కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాన్ని బుధవారం వర్చువల్‌గా చైర్మన్ అనిల్‌కుమార్ ఝా నిర్వహించారు. నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం పోలవరం తొలి దశ పనుల పూర్తికి సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని.. ఆ మేరకు నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించామని.. వాటిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని రాష్ట్ర అధికారులు వివరించారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో వాటితోపాటు మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. వెరసి మొత్తం 25,528 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని.. ఇందుకు రూ.7,304 కోట్లు అవసరమని.. ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించామని చెప్పారు. వాటిని ఆమోదించి నిధులిస్తే పునరావాసాన్ని త్వరితగతిన కల్పిస్తామని చెప్పారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇవ్వాలని అధికారులను కేంద్ర కమిటీ ఆదేశించింది. నిర్వాసితుల జీవనోపాధులను మెరుగుపరిచేలా వారికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, విద్యార్హత ఆధారంగా వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించడానికి వీలుగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన వివరణకు కేంద్ర కమిటీకి సంతృప్తి వ్యక్తం చేసింది. పునరావాసం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని ప్రశంసించింది. అనుమానాల నివృత్తిపై సంప్రదింపులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర కమిటీ ఛైర్మన్ అనిల్‌కుమార్ ఝా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై కేంద్ర జల్ శక్తి శాఖ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. పోలవరం ముంపుపై మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసి, సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు. -
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు సమావేశం కొనసాగగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు. అలాగే నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించారు. కాగా, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శుక్రవారం నాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. చదవండి: ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా? -
జలపథంలో... తొలి పదం
దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే. దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం. ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది. వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది. ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది. అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం. నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది. మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే. ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి. ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం. పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు. -
పోలవరం పనులు భేష్..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధికారులను అభినందించారు. షెడ్యూల్ ప్రకారం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలెట్ ఛానల్ పూర్తి చేసి గోదావరి వరదను సమర్ధంగా మళ్లించారని రాష్ట్ర జలవనరుల అధికారులను, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని అభినందించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య పడిన అగాధాలను మళ్లీ వరద వచ్చేలోగా పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా ‘యు’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానించాలని చెప్పారు. తద్వారా వరదల్లోనూ ప్రధాన (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్) డ్యామ్ పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ముంపు ప్రభావంపై సోమవారం ఢిల్లీలో పంకజ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, పీపీఏ సీఈవో శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్యూసీ) చైర్మన్ కుష్వీందర్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పీపీఏ, రాష్ట్ర జల వనరులు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సవరించిన అంచనాలకు సానుకూలం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీడబ్యూసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్ల వరకు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2017–18 సవరించిన అంచనాల్లో పేర్కొన్నామని చెప్పారు. కానీ మరో 36 గ్రామాలు కూడా ముంపు పరిధిలోకి వస్తాయని, ఆ గ్రామాల్లో నిర్వాసితులకూ పునరావాసం కల్పించాలని కోరారు. దీనిపై పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో లైడార్ సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. తొలుత 41.15 మీటర్ల వరకు, ఆ తరువాత 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతెంత నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్యూసీ చైర్మన్ వోరాను ఆదేశించారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి అడ్‌హాక్‌గా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నిధులు ఎంత అవసరమో తేల్చడానికి పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నాలుగు రోజుల్లో సీడబ్యూసీ చైర్మన్ వోరా సమావేశం కానున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం ఉండదు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో భూమి ముంపునకు గురవుతోందని సుప్రీం కోర్టులో తెలంగాణ, ఒడిశా, చతీస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో సీడబ్యూసీ సర్వే చేసిందని, అందులో బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని వెల్లడైందని అధికారులు వివరించారు. సుప్రీం కోర్టు నియమించిన గోపాలకృష్షన్ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. సీడబ్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున చెప్పాల్సిన అంశాలను స్పష్టం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం వస్తారని వెదిరె శ్రీరాం చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో నీటి పారుదల విభాగం వ్యయం మొత్తాన్ని భరించాల్సిన బాధ్యత కేం‘ద్రానిదేనని పునరుద్ఘాటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. -
ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?
తప్పు ఎవరు చేసినా దాన్ని ఎత్తిచూపడం నిఖార్సయిన జర్నలిజం. అస్మదీయుడైన చంద్రబాబు చేసిన తప్పును తస్మదీయుడైన సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేసి.. అదే నిజమని ప్రజలను నమ్మించడానికి పదే పదే విషం చిమ్మడం ‘ఈనాడు’ రామోజీరావు మార్క్ పాత్రికేయం. కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016లో దక్కించుకున్న తక్షణమే... రామోజీ వియ్యంకుడి సంస్థ నవయుగకు రూ.2,917.78 కోట్లు విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టేశారు చంద్రబాబు. మిగిలిన కొన్ని పనులను యనమల బావమరిది సుధాకర్ యాదవ్‌కు పంచేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. సులభంగా చేయగలిగి... త్వరగా అధిక లాభాలు మిగిలే పనులనే చేపట్టిన చంద్రబాబు... రామోజీరావు, ఆయన వియ్యంకుడితో కలిసి ప్రజాధనాన్ని డీపీటీ(దోచుకో పంచుకో తినుకో) విధానంలో కాజేశారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారంటే.. వీళ్లెంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ దోపిడీ వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరగడానికి కారణమైంది. మానవతప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సాక్షాత్తూ ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ, డీడీఆర్పీ నిపుణులే తేల్చి చెప్పారు. ఆ మానవుడు చంద్రబాబేనని కూడా అందరికీ తెలుసు. కానీ రామోజీరావు మాత్రం ఒక్క ముక్క కూడా రాయరు. ఎందుకంటే తన వియ్యంకుడి పేరు బయటికొస్తుంది కాబట్టి!!. పైపెచ్చు తప్పంతా వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నట్లుగా పదే పదే విషపు రాతలు!!.మరీ ఇంత దుర్మార్గమా? చంద్రబాబు పాపాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. ప్రణాళికాయుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న ‘ఈనాడు’ కథనంలో డొల్లతనం ఇదిగో... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం బహుళార్ధక సాధక జాతీయ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. ప్రాజెక్టు పూర్తి చేయటంకన్నా జేబులు నింపుకోవటం పైనే దృష్టిపెట్టిన బాబు గ్యాంగ్ వైఖరితో ప్రాజెక్టు అస్తవ్యస్తమయింది. పరిస్థితిని చక్కదిద్దుతూ... ఆ సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం వైఎస్ జగన్ అడుగులేస్తుండటం రామోజీరావుకు మింగుడుపడటం లేదు. అభూత కల్పనలు, అవాస్తవాలతో పదే పదే ‘కలం’కూట విషం చిమ్ముతున్నారు. నిజానికి ఈ రాతలను జాగ్రత్తగా చూస్తే... తమ డీపీటీ విధానానికి విఘాతం కలిగిందనే అక్కసు తప్ప మరోటి కన్పించదు. చంద్రబాబు చేసిన పాపాల వల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకున్న వైనాన్ని ఇటీవల శాసనసభలో ఆధారాలతో సహా సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు అగాధాలను పూడ్చడానికి రూ.2,022 కోట్లు వ్యయమవుతుందని.. ఇదంతా ప్రాజెక్టుపై అదనపు భారమేనని స్పష్టం చేశారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. నాటి టీడీపీ ఎంపీ రాయపాటిని అడ్డంపెట్టుకుని పోలవరంలో ప్రజాధనాన్ని దోచేయడానికి స్కెచ్ వేసిన చంద్రబాబు, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కోరుతూ వచ్చారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటంతో 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ► ఆ వెంటనే పోలవరం హెడ్ వర్క్స్‌లో రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.4,054 కోట్లను.. ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా రూ.5,386 కోట్లకు పెంచేసి.. అనుచితంగా రూ.1,332 కోట్ల ప్రయోజనం చేకూర్చారు చంద్రబాబు. ఆ తర్వాత 2016, డిసెంబర్ 30న పనులు ప్రారంభించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ► ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ నుంచి రూ.2917.78 కోట్ల పనులను తప్పించి.. నిబంధలనకు విరుద్ధంగా లంప్సమ్ విధానంలో వాటిని నామినేషన్ పద్ధతిపై రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. సులభంగా చేయగలిగి.. అధికంగా లాభాలు వచ్చే స్పిల్ వే పునాది, స్పిల్ ఛానల్ కాంక్రీట్ వంటి మాస్ కాంక్రీట్ పనులను చేపట్టి.. నవయుగకు రూ.1675 కోట్ల బిల్లులు చెల్లించేసి.. భారీ ఎత్తున కమీషన్లు పంచుకు తిన్నారు. ► పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.71 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.182 కోట్లకు పెంచేసి... దాన్ని యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్‌పై ఇచ్చేశారు చంద్రబాబు. ఇదీ కథ. జీవచ్ఛవంగా మార్చిన చంద్రబాబు.. జీవనాడిగా రూపునిస్తోన్న వైఎస్ జగన్ స్పిల్ వే సాధారణంగా ఏ నీటిపారుదల ప్రాజెక్టులోనైనా... వరద నీటిని దిగువకు విడుదల చేసే స్పిల్ వేను నదికి అడ్డంగా కడతారు. నీటిని నిల్వ చేసే మట్టికట్టను నదికి ఆవల నిర్మిస్తారు. కానీ.. పోలవరం అలా కాదు. దీని నిర్మాణ ప్రాంతంలో ఉన్న భూభౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)... 194.6 టీఎంసీలను నిల్వచేసే ప్రధాన డ్యామ్ అయిన రాతిమట్టికట్ట(ఎర్త్ కమ్ రాక్ ఫిల్– ఈసీఆర్ఎఫ్ డ్యామ్)ను నదికి అడ్డంగానూ.... నదీ తీరానికి ఆవల కుడి వైపున స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను రూపొందించింది. మరి ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలి? కానీ చంద్రబాబు ఎలా నిర్మించారు? దానివల్ల జరిగిన నష్టమేంటి? ఆ నష్టాన్ని పూడుస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు? అనేవి ఒకసారి చూద్దాం... గోదావరికి అడ్డంగా ప్రధాన డ్యామ్ నిర్మించాలంటే తొలుత గోదావరి తీరానికి ఆవల కుడి వైపున 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో స్పిల్ వే నిర్మించాలి. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను దానికి ఏర్పాటుచేయాలి. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ వ్యవస్థను గేట్లకు ఏర్పాటు చేయాలి. తొలుత ఈ పనులు పూర్తి చేయాలి. అలా చేస్తే ఎంత వరద వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. 2016, డిసెంబర్ నుంచి 2019, మే మధ్య కేవలం పునాది స్థాయికి మాత్రమే చంద్రబాబు దీని పనులు చేశారు. ఇందులో ఎక్కువ కమీషన్లు రావని... అక్కడితో వదిలేసి, సులువుగా పూర్తయ్యే... ఎక్కువ కమీషన్లు వచ్చే మిగతా పనులపై ఫోకస్ పెట్టారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. కేంద్రం నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నా... రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేసి 2021, జూన్ నాటికి 48 గేట్లతో సహా స్పిల్ వేను నూరుశాతం పూర్తి చేశారు. స్పిల్ చానెల్ స్పిల్ వే నుంచి దిగువకు విడుదలయ్యే వరద నీటికి నదిలోకి కలపడానికి 2.764 కి.మీ.ల పొడవున.. 1100 మీటర్ల వెడల్పుతో స్పిల్ చానెల్‌ను నిర్మించాలి. స్పిల్ వే పూర్తయ్యేలోగా ఈ పనులు కూడా పూర్తి చేయాలి. 2016, డిసెంబర్ నుంచి 2019, మే మధ్య స్పిల్ చానెల్లో కాంక్రీట్‌ను కుప్పగా పోసే పనులను చంద్రబాబు చేపట్టారు. కాంక్రీట్ పోసినందుకు ఘనపుటడుగుల చొప్పున కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించవచ్చు కనక ఎక్కువ కమీషన్లొస్తాయి. ఈజీ ప్లస్ లాభాలెక్కువ. అందుకే కాంక్రీట్ పోశారు తప్ప... ఇందులో కష్టతరమైన డౌన్‌స్ట్రీమ్ కటాఫ్ వంటి పనులు వదిలేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక స్పిల్ చానెల్‌ను నూరుశాతం పూర్తి చేశారు. అప్రోచ్ చానెల్ నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించేలా 550 మీటర్ల వెడల్పుతో 2.310 కిమీల పొడవున అప్రోచ్ చానెల్ తవ్వాలి. స్పిల్ వే, స్పిల్ చానెల్ పూర్తయ్యే నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కానీ.. ఐదేళ్లలో అప్రోచ్ చానెల్ పనుల్లో చంద్రబాబు తట్టెడు మట్టి కూడా ఎత్తించలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులు నూరుశాతం పూర్తి చేశారు. పైలట్ చానెల్ స్పిల్ చానెల్ మీదుగా వచ్చే వరద జలాలను నదిలోకి మళ్లించేందుకు 1.026 కిమీల పొడవున పైలట్ చానెల్ తవ్వాలి. ఈ పనులు కూడా చంద్రబాబు ముట్టుకోలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ చానెల్, స్పిల్ వే, స్పిల్ చానెల్, ఫైలట్ చానెల్లను పూర్తి చేసి.. 2021, జూన్ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రపంచ చరిత్రలో నదీ సహజ ప్రవాహ దిశను ఇంత భారీ ఎత్తున మళ్లించడం ఇదే తొలి సారి. ఎగువ కాఫర్ డ్యామ్ ప్రధాన డ్యామ్‌ను నిర్మించడానికి వీలుగా దానికి ఎగువన గోదావరికి అడ్డంగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట) నిర్మించాలి. ఇది నిర్మిస్తే నీరు నిలుస్తుంది. ఇలా నిలవటం వల్ల పలు గ్రామాలు మునిగిపోతాయి. అందుకే ఈ ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులైన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 2018లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టిన చంద్రబాబు... కేవలం రూ.484 కోట్లతో 3,110 కుటుంబాలకే పునరావాసం కల్పించారు. మిగతా 17,836 కుటుంబాలకు పునరావాసం కల్పించలేక.. ఈ మట్టికట్టకు కుడి వైపున 400 మీటర్లు, ఎడమ వైపున 400 మీటర్లు గ్యాప్‌లు వదిలేశారు. అలా... ఎగువ కాఫర్ డ్యామ్‌ను గాలికొదిలేశారు. అయితే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 8,567 కుటుంబాలకు రూ.1,677 కోట్లతో పునరావాసం కల్పించి.. 2021 నాటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా స్పిల్ వే నుంచి దిగువకు విడుదల చేసిన వరద నీరు ఎగదన్నకుండా అడ్డుకోవడానికి.. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి దిగువన 1,655 మీటర్ల పొడవు... 30.5 మీటర్ల ఎత్తుతో లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మించాలి. 2018లో చేపట్టిన చంద్రబాబు.. కుడి వైపు 680 మీటర్ల వెడల్పున ఖాళీ వదిలేశారు. 2019లో ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల గుండా అధిక ఉద్ధృతితో గోదావరి ప్రవహించడం వల్ల దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య ప్రాంతం కోతకు గురై 36 మీటర్ల లోతున భారీ అగాధం ఏర్పడింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు జియోమెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధంలో వేసి పూడ్చుతూ వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెచ్చి.. ఫిబ్రవరి 15 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ (ప్రధాన డ్యామ్) దీన్ని మూడు భాగాలుగా... 2474.5 మీటర్ల పొడవున (గ్యాప్–1లో 584.5 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్లు, గ్యాప్–3లో 140 మీటర్ల పొడవు) 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో నిర్మించాలి. దీన్ని నిర్మించాలంటే గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అంటే.. అప్రోచ్ చానెల్, స్పిల్ వే, స్పిల్ చానెల్, పైలట్ చానెల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశాక... డ్యామ్‌కు పునాది అయిన డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలి. దానిపై ప్రధాన డ్యామ్ పనులు చేపట్టాలి. కానీ.. చంద్రబాబు వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించే పనులను బావర్ సంస్థకు నామినేషన్‌పై అప్పగించి... 2018 నాటికే పూర్తి చేసేశారు. 2019లో గోదావరికి భారీ వరదలు రావడం.. 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడం వల్ల.. దాని గ్యాప్‌ల గుండా 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి పెరిగింది. ఆ ఉద్ధృతికి గోదావరి గర్భం కోతకు గురై.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల గరిష్ఠంగా 35 మీటర్లు.. కనిష్ఠంగా 22 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న దాఖలాలు లేవు. చంద్రబాబు కక్కుర్తి కారణంగా తొలిసారి ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో డయాఫ్రమ్ వాల్ నష్టాన్ని పూడ్చడానికి నిపుణుల అధ్యయనం అవసరమైంది. ఒక వైపు డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చడంపై సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీలతో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం జరుపుతూనే... గ్యాప్–2లో 393 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేసింది. గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను సైతం పూర్తి చేసింది. గతనెల (మార్చి) 5న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చటంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ కొన్ని మార్గదర్శకాలివ్వటంతో... వాటి ప్రకారం పనులు ఆరంభించి, ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేయడం ఎలా? ► పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెప్టెంబరు 7న అంగీకరించడం. ► 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు తల ఊపింది కూడా చంద్రబాబే. ► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమోరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని పునరుద్ఘాటించింది. పునరావాసాన్ని గాలికొదిలేసింది. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా ఉన్నా నోరు మెదపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ► ఇదే విషయాన్ని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ ద్వారా తెలిపింది. కానీ దానికి చంద్రబాబు స్పందించలేదు. ► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.23 ఓట్లు. అలాంటిది కమీషన్ల మాయలో పడి కేవలం రూ.20,398 కోట్లిస్తే పూర్తి చేస్తామని చంద్రబాబు అంగీకరించటమే ప్రాజెక్టుకు శాపంగా మారింది. ► నిజానికి ఏ ప్రాజెక్టయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా అంచనా వేసిన వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికీ అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం నాటి లేఖ ప్రస్తావనే తెస్తోంది. సవాలక్ష కొర్రీలు పెడుతోంది. ఇలా చంద్రబాబు చేసిన ద్రోహాన్ని... ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించకపోవటం అంతకన్నా పెద్ద ద్రోహం కాదా రామోజీ? ► 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని గత 45 నెలలుగా ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. -
పోలవరం నావిగేషన్ కెనాల్‌పై కదలిక
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌పై కేంద్రం కదిలింది. కేంద్ర షిప్పింగ్, పోర్టుల శాఖ కార్యదర్శి సుదాన్‡్షపంత్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) చైర్మన్ సంజయ్ బందోపాధ్యాయ, సీడబ్య్లూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్ కుశ్వీందర్ వోరా, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలతో గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ జలమార్గం–4లో పేర్కొన్న క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను అభివృద్ధి చేయాలంటే రూ.876.38 కోట్ల వరకు ఖర్చవుతుందని సమావేశంలో రాష్ట్ర అధికారులు వివరించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం ఇప్పటికే నావిగేషన్ కెనాల్, మూడు లాక్‌లు, టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం చేపట్టిన నావిగేషన్ కెనాల్‌ను చిన్న పడవల రవాణాకు ఉపయోగించుకుని.. దానికి సమాంతరంగా క్లాస్–3 ప్రమాణాలతో మరో నావిగేషన్ కెనాల్ తవ్వి, దాన్ని భారీ నౌకల రవాణాకు వాడుకోవాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనపై అధ్యయనానికి కేంద్ర షిప్పింగ్, ఐడబ్ల్యూఏఐ, సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ వేస్తామన్నారు. రెండు నెలల్లోగా అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం నావిగేషన్ కెనాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకూ నావిగేషన్ కెనాల్ పనులు ఆపేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2016 నుంచి ఉలుకూ పలుకులేని ఐడబ్ల్యూఏఐ నిజానికి.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను 2004–05లోనే కేంద్రం ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు (ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీల పొడవుతో అప్రోచ్ చానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు.. 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులు దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తిచేసింది. అలాగే.. ► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ► ఈ క్రమంలో 2016లో ఐడబ్ల్యూఏఐ గోదావరి, కృష్ణా నదులను జాతీయ జలమార్గం–4గా ప్రకటించి.. అందులో భాగంగానే ధవళేశ్వరం నుంచి భద్రాచలం స్ట్రెచ్‌ను చేర్చింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. ► క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు.. 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ► ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుందని.. ఆ మేరకు నిధులు విడుదలచేస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకమార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. కానీ, ఐడబ్ల్యూఏఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జలాశయం పూర్తవుతుండటంతో.. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ పనులు చేపట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ రంగంలోకి దిగింది. జాతీయ జలమార్గం ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ పనులను చేపట్టాలని ఐడబ్ల్యూఏఐకు సూచించింది. ఈ క్రమంలోనే గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. -
గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..
సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట. అత్యంత దిగువన బ్రహ్మపుత్ర హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. -
అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదుల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఎంపీ పర్‌భాత్‌భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది. కెన్–బెట్వా తరహాలోనే చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది. మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. ► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. ► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది. ► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి. -
పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది. 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. -
పోలవరం పరిహారం నేరుగా నిర్వాసితులకే
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలకు పరిహారం నేరుగా వారికే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రశ్నకు జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గురువారం లోక్‌సభలో ఈ మేరకు సమా«దానమిచ్చారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆఫీస్ మెమోరాండం 1.4.2014 నాటి ధరలకే ఇరిగేషన్ కాంపొనెంట్ మిగతా మొత్తం ఇవ్వాలని చెబుతోందన్నారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2014 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏపీ సర్కారు రూ.3,779.5 కోట్లు రీయింబర్స్ చేయాలని బిల్లులిచ్చిందని దీని నిమిత్తం రూ.3,431. 59 కోట్లు రీయింబర్స్ చేశామన్నారు. 2014 నుంచి 2022 వరకూ ఆర్‌అండ్‌ఆర్‌కు ఇచ్చిన రూ.2,267.29 కోట్ల బిల్లుకుగాను రూ.2,110.23 కోట్లు రీయింబర్స్ చేశామన్నారు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ ప్రతిపాదనల్లేవు పాత ప్రాజెక్టుల విస్తరణ, ఆధునీకరణ, పునరుద్ధరణల నిమిత్తం ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి ఐదు సోలార్ ప్రాజెక్టుల అనుమతి 4,100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఐదు సోలార్ పార్కులు ఏపీకి అనుమతించామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డిల ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరంలో స్థానిక యువత స్మార్ట్ సిటీ మిషన్ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మేయర్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఇతర భాగస్వాములతోపాటు స్థానిక యువత ఉంటారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తిల ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కాగా, విశాఖ మెట్రో నిమిత్తం 42.55 కి.మీ పొడవున రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం 2018లో ప్రతిపాదన ఇచ్చిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఈ మొత్తం కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఆర్థిక సాయం చేస్తుందని అప్పుడు ఏపీ ప్రభుత్వం తెలిపిందని.. కానీ ఆ తర్వాత కొరియా బ్యాంకు సాయానికి నిరాకరించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారా యణల ప్రశ్నకు జవాబిచ్చారు. విశాఖ మెట్రోకు సంబంధించి అధ్యయనం నిమిత్తం కేంద్రం రూ.3.5 కోట్లు విడుదల చేసిందన్నారు. -
పోలవరం వ్యయం రూ.20,744 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు డిసెంబర్ 15, 2022 వరకూ రూ.20,744 కోట్లు ఖర్చయిందని వార్షిక నివేదికలో జలశక్తి శాఖ పేర్కొంది. పనుల నిమిత్తం ఇప్పటి వరకూ రూ.13,226.04 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు అని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నీటి పారుదల విభాగాన్ని అమలు చేస్తోందని పేర్కొంది. 2,454 మీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 1,128.4 మీటర్ల పొడవైన స్పిల్ వేతో తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందించడంతోపాటు పలు ఇతర ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. 2022లో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ విభాగంలో భారతదేశం గెలుచుకున్న నాలుగు అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ ఒకటని తెలిపింది. -
ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ సహాయ నిరాకరణ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా..? బోర్డుల నోటిఫికేషన్ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు సంబంధించి ఆర్ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ ఆమోదించగా తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి. -
Polavaram: కేంద్రం సానుకూల స్పందన.. పోలవరానికి రూ.5,036 కోట్లు
సాక్షి, అమరావతి: నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని.. మార్చివరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పనకు రూ.2,242.25 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.1,115.12 కోట్లలో ముందస్తుగా రూ.3,087.37 కోట్లు వెరసి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ శివ్‌నందకుమార్ సోమవారం సిఫార్సు చేశారు. దీన్ని ఆమోదించిన కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్.. పోలవరానికి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గురువారం ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఒకట్రెండు రోజుల్లో మంత్రి షెకావత్ ఆమోదముద్ర వేసి, ఆర్థిక శాఖకు పంపుతారని, రీయింబర్స్ంట్ రూపంలో మంజూరు చేయాల్సిన రూ.1,948.95 కోట్లను రెండు వారాల్లోగా విడుదల చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి వరకూ చేయల్సిన పనులకు అవసరమైన రూ.3,087.37 కోట్లను ముందస్తుగా విడుదల చేస్తామని తెలిపాయి. వాటితో తొలిదశ పనులకు నిధుల సమస్య ఉత్పన్నం కాదని.. ఈలోగా 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,458.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ కొలిక్కి వస్తుందని వెల్లడించాయి. సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే.. పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అంటే గరిష్ఠ నిల్వ 194.6 టీఎంసీలను నిల్వచేసే స్థాయిలో పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్రంలో కదలిక.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయిన ప్రతిసారీ సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరానికి నిధులివ్వాలని కోరుతూ వస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలోనూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతోపాటు పోలవరం నిధుల అంశాన్ని జగన్ ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సత్వర పూర్తికి వీలుగా అడ్‌హక్ (ముందస్తు)గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని జనవరి 3న ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరానికి అడ్‌హక్‌గా నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర అధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీతో రాష్ట్ర అధికారులతో ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీ మూడుసార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో పోలవరానికి అడ్‌హక్‌గా నిధుల మంజూరుకు కేంద్ర కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించింది. పనుల్లో మరింత వేగానికి దోహదం పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.20,702.58 కోట్లను ఖర్చుచేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రూ.4,730.71 కోట్లను వ్యయంచేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక అంటే 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ రూ.15,971.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయచేసింది. అందులో ఇప్పటివరకూ రూ.13,098.57 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,873.30 కోట్లను రీయింబర్స్ చేయాలి. కేంద్ర జల్‌శక్తి శాఖ సూచనల మేరకు.. రీయింబర్స్ చేయాల్సిన రూ.2,873.30 కోట్లతోపాటు అడ్‌హక్‌గా మార్చివరకూ భూసేకరణ, సహాయ పునరావాసం కల్పనకు రూ.2,286.55 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.2,118 కోట్లు వెరసి రూ.7,278 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ, పీపీఏ రూ.5,306.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సిఫార్సు చేశాయి. ఈ నిధుల విడుదలైతే పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ కృషితోనే.. ముఖ్యమంత్రి కృషివల్లే పోలవరానికి రూ.5,036.32 కోట్ల విడుదలకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. ఇందులో రాష్ట్రచేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను రీయింబర్స్మెంట్ రూపంలోనూ.. మార్చివరకూ చేయాల్సిన పనులకు అవసరమైన రూ.3,087.37 కోట్లను విడుదల చేస్తుంది. ఇవి విడుదలైతే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమవుతాయి. సాంకేతికపరమైన సమస్యలను కేంద్రం త్వరితగతిన పరిష్కరిస్తే గడువులోగా ప్రాజెక్టును పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ -
పోలవరానికి నిధులు!
సాక్షి, అమరావతి: పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రూ.పది వేల కోట్లను ముందస్తు (అడ్‌హక్)గా ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ వినతిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రిచా శర్మ చెప్పారు. ఈ అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశం తర్వాత పోలవరానికి అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో 15 అంశాల అజెండాతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. పీపీఏ సభ్యులైన రిచా శర్మ ఇందులో పాల్గొన్నారు. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా సీఎం జగన్ ప్రతిపాదించిన మేరకు అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు. దీనిపై రిచా శర్మ, చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ అడ్‌హక్‌గా నిధులు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రీయింబర్స్ నిధులివ్వండి.. ఈ సీజన్లో మార్చి వరకూ పనులకు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 2,807 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ నెల 21న జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ అంశాలను వివరించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో చెప్పారు. ప్రణాళికాయుతంగా పూర్తి.. గోదావరికి జూన్‌లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గతేడాది ఆమోదించిన వర్కింగ్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో పీపీఏ కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనులను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికపై సర్వ సభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు. గోదావరిలో వరద ప్రవాహం 24 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో పనులు ప్రారంభించామని, జనవరి ఆఖరుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను డిజైన్ మేరకు 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఉన్న నీటిని తోడివేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–1లో పనులు ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని పీపీఏ ఆదేశించింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనుల పరీక్షలను నిర్వహించి సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఫిబ్రవరికి భూ ఉపరితలం స్థాయికి పూర్తి చేయాలని నిర్దేశించింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను ఆమోదించారు. తొలిదశలో కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలు, రెండో దశలో మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని పీపీఏ సూచించింది. డిసెంబర్లో పీపీఏ సమావేశాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహించి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చిద్దామని రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనకు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అంగీకరించారు. రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం తరలింపుపై కూడా సానుకూలంగా స్పందించారు. బ్యాక్ వాటర్‌పై రీ సర్వేకు నిరాకరణ గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంతోపాటు తమ భూభాగంలో 827 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) రేఖ తమ భూభాగంలో లేదని, ఎఫ్ఆర్ఎల్కు మించి జలాలు వెనక్కి ఎగదన్నడం వల్ల తమ భూభాగం ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఎల్ రేఖ ఏపీ భూభాగంలోనే ఉంటుందని, కావాలంటే క్షేత్రస్థాయిలో చూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్కు, బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధమే ఉండదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదని సూచించారు. ఈ దశలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇప్పటికే అధ్యయనం చేశామని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావమే ఉండదని అందులో తేలిందని, మళ్లీ అధ్యయనం చేసే ప్రశ్నే లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు ప్రాంతాల రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ రెండు దఫాలు సమావేశాలు నిర్వహించాయని గుర్తు చేశారు. జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ త్వరలో ముంపు ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
‘భగీరథ’కు అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు అంశం రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా వివాదం రాజేసింది. ఈ పథకానికి జాతీయ అవార్డు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. కేసీఆర్ సర్కార్ పేర్కొన్నట్లుగా జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకాన్ని తాము మదింపు చేయలేదని.. తెలంగాణలో 100% నల్లాల ద్వారా క్రమబద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొందని వివరించింది. కేవలం ఫంక్షనాలిటీ అసెస్మెంట్–2022 కింద జాతీయ జల్ జీవన్ మిషన్ నిబంధనలను అనుసరించి రోజుకు 55 లీటర్ల తలసరి తాగునీరు అందుతోందో లేదోనని పరిశీలించడంతోపాటు నీటి నాణ్యత బీఎస్ఐ 10,500 ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదోనని మాత్రమే పరిశీలించామని కేంద్ర జలవనరుల శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా 8% నివాసాలకు నిత్యం తలసరి 55 లీటర్లకన్నా తక్కువ తాగునీరు అందుతోందని, మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జాతీయ జల్‌జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లు వివరించింది. అవార్డు ఆ విభాగంలోనే.. గ్రామీణ గృహసముదాయాలకు క్రమబద్ధమైన నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసిన ఆదివారం బహూకరిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ వివరణ ఇచ్చింది. నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం పనితీరు మదింపు కోసం స్వీకరించే అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనని స్పష్టం చేసింది. 100% నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన గ్రామ పంచాయతీల ద్వారా ధ్రువీకరణ జరగలేదని తెలిపింది. పదేపదే అబద్ధాలెందుకు?: ఎర్రబెల్లి ‘గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నది మిషన్ భగీరథ ద్వారానే. తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందుతోందని మీ జలజీవన్ మిషన్ వెబ్సైట్లోనూ ఉంది. గ్రామీణ గృహసముదాయాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే అది మిషన్ భగీరథకు కాకుండా మరి దేనికి వచ్చినట్లు అవుతుంది?’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేంద్రం తీరును తప్పుబడుతూ శనివారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. గ్రామ పంచాయతీలన్నీ ధ్రువీకరించాలని తీర్మానాలు చేయలేదని కొత్త మెలిక పెట్టడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అబద్ధాలు పదేపదే చెప్పడం వల్ల అవి నిజాలు కావనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన.. -
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జీడబ్ల్యూడీటీ) ప్రకారమే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. జీడబ్ల్యూడీటీ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు వెనుక భాగంలో వరద నీటి మట్టం ఎంత ఉంటుందో, ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతే ఉంటుందని తేల్చి చెప్పింది. బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేశాకే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది. ముంపు ప్రభావంపై సాంకేతికంగా వాస్తవాలను వివరించి, ప్రభావిత రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 7న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి నివేదిక ఇవ్వాలని ఈనెల 6న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తా వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ అధికారి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల అధికారులు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకే.. పోలవరం నిర్మాణానికి అంగీకరిస్తూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిని జీడబ్ల్యూడీటీ ఆమోదించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. గోదావరికి వందేళ్లలో గరిష్టంగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అదే స్థాయిలో పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందన్నారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు వదిలేసేలా స్పిల్ వే డిజైన్‌ను సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించిందన్నారు. ఆ డిజైన్ ప్రకారమే కేంద్రం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను 2009 నాటికే ఇచ్చిందని.. ఆ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపు నివారణకు సీలేరు, శబరి నదులకు కరకట్టల నిర్మాణానికి ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వందల సార్లు ఆ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని చెప్పారు. ఈ కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అధ్యయనమే ప్రామాణికం పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిన నేపథ్యంలో పర్యావరణ అనుమతిని పునఃసమీక్షించే వరకు పనులు నిలిపివేయాలని ఒడిశా, చత్తీస్‌గఢ్ కోరడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిజైన్ ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ చేసిన అధ్యయనంలో భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగరం, భద్రాద్రి విద్యుత్కేంద్రం, గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ అని, అది చేసిన బ్యాక్ వాటర్ సర్వేనే ప్రామాణికమని స్పష్టంచేశారు. బ్యాక్ వాటర్‌తో ముంపు ఉండదని సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేల్చిందని చెప్పారు. గోదావరికి గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్ట్ పార్టీతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరగా, ఆ స్థాయిలో గోదావరికి వరద వచ్చే అవకాశమే లేదని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది నీటిని నిల్వ చేయడం వల్ల శబరి, సీలేరు ద్వారా వరద ఎగదన్ని తమ ప్రాంతం ముంపునకు గురైందన్న ఒడిశా వాదనను పీపీఏ సీఈవో కొట్టిపారేశారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటినే నిల్వ చేయలేదని, అందువల్ల వరద ఎగదన్నిందని చెప్పడం సబబు కాదని అన్నారు. ఈ ఏడాది వరదలకు తమ రాష్ట్రాంలోనూ గిరిజన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చత్తీస్‌గఢ్ అధికారులు చెప్పగా.. ఇంద్రావతి వరదల వల్లే ఆ ప్రాంతం ముంపునకు గురైందని సీడబ్ల్యూసీ అధికారులు తేల్చిచెప్పారు. -
‘పోలవరం’పై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావంపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల సందేహాలను నివృత్తి చేయడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌గుప్తా వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను ఈనెల 6న సుప్రీంకోర్టు విచారించింది. ముంపు ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
పోలవరం తొలిదశతో 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, అమరావతి: పోలవరం తొలి దశ పూర్తైతే కుడి కాలువ కింద 1.57 లక్షల ఎకరాలు(తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టు), ఎడమ కాలువ కింద 1.14 లక్షల (పుష్కర ఎత్తిపోతల) ఎకరాలతో కలిపి మొత్తం 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వాటర్ ప్లానింగ్, పాజెక్టుల విభాగం సభ్యుడు కె.వోహ్రాకు ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు వివరించారు. గోదావరి డెల్టాలో 10.13 లక్షలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు వెరసి రూ.23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు. తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.10,911 కోట్లు అవసరమని తెలిపారు. దీంతో ఏకీభవించిన వోహ్రా.. తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధుల మంజూరుకు నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి ఎం.రఘురాంను ఆదేశించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,587.87 కోట్లను ఆమోదించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ.పది వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని ఆదేశాల మేరకు పోలవరంతోపాటు సీఎం జగన్ ప్రస్తావించిన ఇతర అంశాల పరిష్కారంపై పీఎంవో నియమించిన కేంద్ర కమిటీ గత నెల 25న ఢిల్లీలో రాష్ట్ర అధికారుల కమిటీతో సమావేశమైంది. ఈ సమావేశంలో పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర కమిటీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.వోహ్రా మంగళవారం వర్చువల్ విధానంలో పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, సహాయ పునరావాస విభాగం కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తదితరులతో సమావేశమయ్యారు. రెండోదశలో... పోలవరం రెండో దశ పూర్తైతే ఆయకట్టులో మిగిలిన 4.02 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని, ఇందుకు మరో రూ.21 వేల కోట్లకుపైగా అవసరమని పోలవరం సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ప్రభావం పోలవరం తొలిదశపై ఏమాత్రం ఉండదని వోహ్రాకు వివరించారు. పోలవరం పూర్తయితే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతలతోపాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలను మూసేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల వరద జలాలపై ఆధారపడి చేపట్టామని చెప్పారు. వెంకటనగరం పంపింగ్ స్కీం ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీంతో పోలవరం తొలి దశ పూర్తికి నిధులపై నివేదిక పంపాలని పీపీఏ సభ్య కార్యదర్శిని వోహ్రా ఆదేశించారు. పీపీఏ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తామని చెప్పారు. -
1న పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం జల్ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీలో రాష్ట్ర అధికారుల బృందంతో కేంద్ర అధికారుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారులు చేసిన ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కేంద్ర కమిటీ సూచించింది. దీంతో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటిన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్‌గా భేటీ కానున్నారు. -
కృష్ణా, గోదావరి గెజిట్లు అమలయ్యేనా?
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు గడువు సమీపిస్తోంది. కానీ.. ఇప్పటికీ షెడ్యూల్–2లో ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందా.. లేదంటే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి కృషిచేస్తుందా.. అన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటుచేస్తూ 2014 మే 28న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కానీ పరిధిని కేంద్రం ఖరారు చేయకపోవడంవల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో బోర్డులు ప్రభావం చూపలేకపోతున్నాయి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే బోర్డుల పరిధిని ఖరారుచేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు నీటి కేటాయింపులు జరిగే వరకు బోర్డుల పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోసిపుచ్చుతూ బోర్డుల పరిధిని ఖరారు చేస్తామని తేల్చిచెప్పారు. తరువాత కేంద్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసేలా చేస్తోంది. ఇలా ఏపీ హక్కులను కాలరాస్తుండటాన్ని గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ ఏపీ హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై సీఎం జగన్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 15న రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసింది. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి ఆరునెలల్లో అంటే 2022 జనవరి 15న అమల్లోకి రావాలి. నోటిఫికేషన్ అమలుపై పలుమార్లు బోర్డులతో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఒకేసారి సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు డిపాజిట్ చేయలేమని, ఎప్పటికప్పుడు నిర్వహణ వ్యయాన్ని అందజేస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకునేందుకు ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లు సమర్పించింది. కానీ, తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్‌లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును ఆరునెలలు పొడగిస్తూ ఫిబ్రవరి 2న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ నోటిఫికేషన్లు ఈనెల 15 నుంచి అమలు కావాల్సి ఉంది. కుదరని ఏకాభిప్రాయం గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎం.పి.సింగ్, ఎం.కె.సిన్హా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పాతపాటే పాడుతోంది. దీంతో ఈనెల 15 నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును కేంద్రం మరోసారి పొడగిస్తుందా? లేదంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధకు కృషిచేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
తెలంగాణకు మరో అవకాశం.. ఈసారి కూడా హాజరు కాకుంటే...!
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో జల విద్యుదుత్పత్తికి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు (రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై అభిప్రాయాలు చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా బోర్డు మరో అవకాశం ఇచ్చింది. వాటిపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశాన్ని ఈనెల 16న ఏర్పాటు చేసింది. గత నెలలో జరిగిన రెండు ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో తెలంగాణకు మరో అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. 16న జరిగే మూడో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైతే బోర్డు ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా? వద్దా? అన్నవే కారణమవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి అప్పగించింది. గత నెల 20న మొదటి సారి, 30న రెండో సారి ఆర్ఎంసీ భేటీ అయ్యింది. ఈ రెండు సమావేశాలకు ఏపీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున అధికారులెవరూ రాలేదు. దీంతో మరోసారి అవకాశమివ్వనున్నారు. మూడో భేటీలో తెలంగాణ అధికారులు హాజరై అభిప్రాయాలు చెబితే ఇరు రాష్ట్రాల వాదనల ఆధారంగా ఆర్ఎంసీ నివేదిక ఇస్తుంది. వాటిని బోర్డు అమలు చేస్తుంది. తెలంగాణ అధికారులు గైర్హాజరైతే కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. స్పష్టమైన అభిప్రాయాలు చెప్పిన ఏపీ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడాలని ఏపీ తరపున ఆర్ఎంసీ భేటీలకు హాజరైన ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. సాగర్, శ్రీశైలంలో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాగుకు నీరు విడుదల చేసినప్పడే విద్యుదుత్పత్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని స్పష్టంచేశారు. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో సముద్రంలో జలాలు కలుస్తున్నప్పుడు వరద జలాలను ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని చెప్పారు. ఏపీ వాదనతో ఆర్ఎంసీ ఏకీభవించింది. -
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లోనే తప్పిదం.. ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది. అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కేంద్ర జల్‌శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు. -
డయాఫ్రమ్ వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీతో అధ్యయనం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్–ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పటిష్ఠతపై జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ)తో అధ్యయనం చేయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. ఇప్పటికే ఉన్న డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానం చేయాలా? అన్నది తేలుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం శ్రీరాం నేతృత్వంలో పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, సీడబ్ల్యూసీ రిటైర్డ్ సభ్యులు గోపాలకృష్ణన్, పీపీఏ, డీడీఆర్పీ, సీఎస్‌ఆర్‌ఎంస్, వ్యాప్కోస్ సంస్థల అధికారుల బృందం ఆదివారం కూడా మరోసారి పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. దౌలిగంగా నదిపై ఎన్‌హెచ్‌పీసీ చేపట్టిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఆ సంస్థ అధ్యయనం చేసిందని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ భార్గవ సమావేశంలో గుర్తుచేశారు. దాంతో ఆ సంస్థతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కూడా అధ్యయనం చేయించాలని శ్రీరాం అధికారులకు సూచించారు. వరద వచ్చేలోగా రక్షిత స్థాయికి పనులు గోదావరికి వరద ఉద్ధృతి వచ్చేలోపు అంటే జూలైలోగా దిగువ కాఫర్ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తిచేయాలని శ్రీరాం ఆదేశించారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో తొమ్మిది రకాల పరీక్షలను చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని.. వాటి ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తుందన్నారు. ఇక కోతకు గురైన ప్రాంతం పూడ్చే పనులకయ్యే వ్యయాన్ని సీడబ్ల్యూసీ అంచనా వేస్తుందని.. దాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. అలాగే, కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత.. డయాఫ్రమ్ వాల్‌పై స్పష్టత వచ్చాక ఈసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించి.. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్ పనుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేసేందుకు సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సంస్థ అధికారులతో పోలవరం ప్రాజెక్టు వద్దే లాబ్‌ను ఏర్పాటుచేయాలని శ్రీరామ్ ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు వస్తాయని.. పనులు నిర్విఘ్నంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పూర్తిపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు ఇక రాష్ట్ర జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ, పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్, కేంద్ర జల్‌శక్తి శాఖ సమన్వయంతో పనిచేయడం ద్వారా పోలవరాన్ని వేగంగా పూర్తిచేయాలని వెదిరె శ్రీరాం చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మేరకు నిధులు మంజూరుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చారిత్రక తప్పిదమే పోలవరం రూరల్: కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంవల్లే భారీ వరదలవల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, ఇందులో ఎలాంటి సందేహంలేదని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదీ పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర, రాష్ట్ర జలవనరుల నిపుణులు, కేంద్ర బృందం సభ్యులు శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇటువంటి సమస్య రావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం చేసిన అసమర్థ నిర్ణయమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. దీని కారణంగా భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 1.7 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నదని ప్రాథమికంగా అంచనా వేశారని, అంతేగాక పెద్ద అగాధాలు ఏర్పడ్డాయని అంబటి రాంబాబు తెలిపారు. సమస్యను పరిశీలించి, ఏ విధంగా అధిగమించాలన్న విషయంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారన్నారు. -
పోలవరంపై కీలక సమావేశం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం బృందం శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆదివారం మరోసారి తనిఖీ చేస్తుంది. అనంతరం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ప్రాజెక్టు డిజైన్లు, పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులపై వెదిరె శ్రీరాం కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై ఈనెల 17న వెదిరె శ్రీరాం, నిధుల మంజూరుపై 18న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశాలను కేంద్రం నిర్వహించింది. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి.. వాటిని యథాస్థితికి తేవడానికి చేయాల్సిన పనులకు అయ్యే వ్యయం, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అయ్యే వ్యయంపై నివేదిక ఇవ్వాలని వెదిరె శ్రీరాంకు ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సూచించారు. దాంతో శనివారం వెదిరె శ్రీరాం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తదితరులతో కూడిన బృందం పోలవరానికి వచ్చింది. వారు దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనులను పరిశీలించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ సూచనల మేరకు ఇసుక నాణ్యతతోపాటు 11 రకాల పరీక్షలు చేయించి.. జూలై 15లోగా నివేదిక ఇస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు వెదిరె శ్రీరాంకు వివరించారు. ఆ తర్వాత స్పిల్ వే, స్పిల్ చానల్, స్పిల్ వే గైడ్ బండ్ పనులను పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు పనులను మరోసారి పరిశీలించి.. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
పోలవరానికి నిధులపై కేంద్రం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నిధుల మంజూరుకు సిఫార్సు చేస్తూ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపుతామని బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయం మేరకు నిధులిస్తామని వెల్లడించారు. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలోని అధికారుల బృందం ఈనెల 22న ప్రాజెక్టును పరిశీలించి తొలి దశ, రెండో దశ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నిర్ధారిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే గుప్తా, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అదనపు పనులకు ఓకే ఇసుక నాణ్యతతో సహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా నివేదిక ఇస్తే ఏ విధానంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలో తేలుస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్‌తో పూడ్చాలా లేక డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను పోస్తూ పూడ్చాలా అన్నది తేలుస్తామన్నారు. వీటి డిజైన్లను సెప్టెంబర్‌లోగా ఖరారు చేసి అక్టోబర్ 1 నుంచి పూడ్చివేత ప్రారంభిస్తామన్నారు. ఈలోగా డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. కొత్తగా మరో వాల్ నిర్మించాలా లేక దెబ్బతిన్న ప్రాంతం వరకు కొత్తది నిర్మించి, ప్రస్తుత వాల్‌తో అనుసంధానం చేయాలా అన్నది తేలుస్తామన్నారు. ఆ పనులకు అదనపు నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని మార్చి 4న సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. దాంతో అదనపు నిధుల మంజూరుపై కూడా పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను పూర్తి చేస్తామని, ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించామని పీపీఏ, రాష్ట్ర అధికారులు వివరించారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి ప్రాజెక్టు పూర్తయినా ఒకేసారి నీటిని నిల్వ చేయడం సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధం. డ్యామ్ భద్రత దృష్ట్యా తొలి ఏడాది 41.15 మీటర్లలో, ఆ తర్వాత ఏటా 30 శాతం చొప్పున నీటి నిల్వను పెంచుతూ చివరకు 194.6 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఆలోగా 45.72 మీటర్ల పరిధిలో పునరావాసం కల్పిస్తారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ రూ.55,656.87 కోట్లుగా ఆమోదిస్తే.. ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) రూ.47,727.87 కోట్లుగా ఖరారు చేసింది. అదనపు పనులతో ఆ వ్యయం మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే అదనపు పనులతో సహా రెండు దశల పనులు పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో వెదిరె శ్రీరాం నేతృత్వంలోని బృందం నివేదిక ఇస్తుందని పంకజ్‌కుమార్ తెలిపారు. -
కోతకు గురైన ప్రాంతం పూడ్చటంపై స్పష్టత
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ దాదాపుగా ఖరారు చేసింది. ఇసుక నాణ్యతతోసహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) నివేదిక ఇస్తే.. జూలై 31లోగా హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్ (కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ వైబ్రో కాంపాక్షన్ చేయడం) లేదా డ్రెడ్జింగ్ (ఇసుకను తవ్వుతూ కోతకు గురైన ప్రాంతంలోకి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం) ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలా అన్నది నిర్ణయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. దానికి అనుగుణంగా ఆగస్టులోగా డిజైన్లు ఇస్తే.. సెప్టెంబర్‌లోగా ఆమోదిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పునాది డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై పూర్తిస్థాయిలో పరీక్షలు చేశాక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేక దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదనంగా చేపట్టాల్సిన ఈ పనులకు అయ్యే వ్యయాన్ని మంజూరు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో చర్చిస్తానని, బుధవారం నిర్వహించే సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈనెల 22న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అడ్డంకులను అధిగమించే మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు. డీవాటరింగ్‌కు నో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన నిల్వ ఉన్న నీటిని తోడివేసి (డీవాటరింగ్).. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో(–12 మీటర్ల నుంచి +15 మీటర్ల వరకు) ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానంలో పనులు చేయాలంటే రూ.3,200 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఆ విధానం ప్రకారం పనులు చేయడం కష్టమని సమావేశం నిర్ణయించింది. నిల్వ ఉన్న నీటిలోనే.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం(హైడ్రాలిక్ ఫిల్లింగ్), పురుషోత్తపట్నం వద్ద డ్రెజ్జింగ్ చేస్తూ అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైన్ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పోసి, వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూడ్చే విధానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇసుక నాణ్యతసహా 11 రకాల పరీక్షలు చేశాక.. అందులో ఏ విధానంపై పనులు చేయాలన్నది తేల్చాలని సమావేశం నిర్ణయించింది. డయాఫ్రమ్ వాల్‌పై ఎలా? ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను సగటున –30 మీటర్ల నుంచి –90 మీటర్ల లోతు నుంచి నిర్మించారు. గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతింది? ఏ మేరకు పటిష్ఠంగా ఉంది? అన్నది తేల్చడానికి శాస్త్రీయమైన పరీక్ష ఏదీలేదని నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే డిజైన్ల తయారీకి రెండునెలల సమయం ఉందని, ఆలోగా డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వెదిరె శ్రీరాం అధికారులను ఆదేశించారు. ఆ అధ్యయనం ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? ఇప్పుడున్న డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.గుప్తా, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్‌ఆర్‌ఎంస్ అధికారులు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. నిధుల మంజూరుపై నేడు సమావేశం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి, అదనంగా చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుపై బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిధుల మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై మంగళవారం మధ్యాహ్నం.3 గంటలకు జల్‌శక్తి శాఖలో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. నిధుల మంజూరుపై రేపు ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది. -
పోలవరంపై కీలక భేటీలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లు, నిధుల మంజూరుపై ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు ఆరు కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెల డ్రెడ్జింగ్ చేస్తూ.. అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైను ద్వారా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైనచోట పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూర్వస్థితికి తెచ్చే విధానాన్ని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ వి.ఎస్.రాజు, ప్రొఫెసర్ రమణ ప్రతిపాదించారు. దీనిపై ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది. ఖయ్యూం అహ్మద్ బృందం నివేదిక ఆధారంగా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంపై వెదిరె శ్రీరాం నేతృత్వంలో జరిగే సమావేశం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి నిధుల మంజూరుపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా తొలిదశ పనుల పూర్తికి ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. -
పోలవరాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చుతున్న విధానాన్ని పరిశీలించింది. ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాలను, డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న భాగాలను తనిఖీ చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇక్కడ చేపట్టాల్సిన పనులపై సీడబ్ల్యూసీ బృందం నివేదికను రూపొందించింది. దీనిపై ఈనెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కోతకు గురైన ప్రాంతాలను పూడ్చివేసే విధానానికి మెరుగులు దిద్దుతారు. ఈనెల 18న జరిగే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సమావేశంలో ఈ విధానంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. పురుషోత్తపట్నం వద్ద డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను ప్రధాన డ్యామ్ వద్ద కోతకు గురైన ప్రాంతాల్లోకి పొరలు పొరలుగా పంపింగ్ చేస్తూ వైబ్రో కాంపాక్షన్ ద్వారా పటిçష్టపరచాలని రాష్ట్ర జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేసి పాత దానికి అనుసంధానం చేసే పద్ధతిని కూడా ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం బృందంలో డైరెక్టర్ రాహుల్ కుమార్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్లు సోమేష్‌కుమార్, అశ్వని కుమార్ వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ తివారీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్ పి.దేవందర్‌రావు ఉన్నారు. ప్రాజెక్టు పనులను సీఈ సుధాకర్‌బాబు వారికి వివరించారు. -
Andhra Pradesh: సాగునీటి సవ్వడులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి నిధులను ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. దీనికి సంబంధించి రూ.2,559.37 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, జల్ శక్తితో చర్చించి త్వరగా నిధులు రప్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్‌ను నింపేలా ఎత్తిపోతల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాగునీటి పనులపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 29న జరిగిన సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలు, తీసుకున్న చర్యలపై అధికారుల నివేదిక ఆధారంగా ప్రాజెక్టుల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యాంశాలు ఇవీ... సాగునీటి పనులపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సీడబ్ల్యూసీ రాక.. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తి కాగా కోతకు గురైన ప్రాంతం ఇసుకతో పూడ్చివేత పనులు 76 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్ పూర్తైన నేపథ్యంలో ఈనెల 11న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈనెల 18న డిజైన్లపై డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం జరగనుంది. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. పీపీఏ అనుమతితోనే పోలవరం పనులు.. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.2,559.37 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రతి పనీ జరుగుతోందన్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. కేంద్ర అధికారులతో సమావేశం సందర్భంగా రీయింబర్స్ అంశాన్ని ప్రస్తావించాలని ఆదేశించారు. పెన్నాపై సకాలంలో జంట బ్యారేజీలు.. నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని వివరిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. వాయువేగంతో వెలిగొండ సొరంగం ► వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని సమీక్షలో అధికారులు తెలిపారు. ► 2014–19 మధ్య గత సర్కారు హయాంలో టన్నెల్ –1 పనులు కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పని మాత్రమే గత ప్రభుత్వ హయాంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. ► వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019–2022 వరకు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 2.8 కిలోమీటర్లు తవ్వి మొదటి టన్నెల్‌ను పూర్తి చేశారు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్ పనులు జరిగాయని అధికారులు తెలిపారు. ► వెలిగొండ టన్నెల్–2కు సంబంధించి 2014–2019 మధ్య రోజుకు 1.31 మీటర్ల పని మాత్రమే జరగ్గా 2019–22 మధ్య రోజుకు 2.46 మీటర్ల పనులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 500 మీటర్లపైన టన్నెల్ తవ్వకం పనులు చేస్తున్నట్లు చెప్పారు. ► సెప్టెంబరులో టన్నెల్–1 ద్వారా వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ► టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తూనే టన్నెల్–2లో పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి వంశధార ఎత్తిపోత.. ► కేంద్రానికి సమర్పించిన వంశధార ట్రిబ్యునల్ తుది నివేదికపై ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్సెల్పీ) దాఖలు చేయడంతో ఆ అవార్డు అమల్లోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడంలో జాప్యం చోటు చేసుకుని హిర మండలం రిజర్వాయర్‌ను నింపడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్ నింపవచ్చునని ప్రతిపాదించారు. దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ ఈ ఎత్తిపోతలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సుమారు రూ.189 కోట్లు వ్యయం కానుంది. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ► వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారం చెల్లింపుపై సీఎం జగన్ సమీక్షించారు. ఇందుకు దాదాపు రూ.226.71 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను శరవేగంగా పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ► గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వలసలను నివారించేలా.. ► తాగు, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి నీటి ఎద్దడిని నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు. ► చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్ కెనాల్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్ –2 (కోడూరు వరకు), జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్ స్కీం, ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి యూసీఐఎల్ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు (కుందూ నది), రాజోలి బండ డైవర్షన్ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిఫ్ట్ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా.. 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకోవడానికి కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వడంలో, జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర జల్ శక్తి శాఖ వ్యవహరించిన తీరును దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో లేవనెత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వివరించనున్నాయి. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే అనుమతి తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే తేల్చింది. కానీ.. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగానూ దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు వెరసి.. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక ప్రతిపాదించింది. అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. కానీ.. ఈ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్ 24న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికకీరణ వల్ల నీళ్లు మిగల్లేదని.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని ఏపీ, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. అప్పర్ భద్రను 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనపై ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులే.. అప్పర్ భద్ర పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టుతోపాటు కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. -
శ్రీశైలం, సాగర్‌కు డబ్బులివ్వండి
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు రూ.1,123.41 కోట్లు అవసరమని కృష్ణా బోర్డు అంచనా వేసింది. ఇక ఈ రెండు ప్రాజెక్టుల స్పిల్ వేలు, విద్యుత్కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఏటా మరో రూ.819.62 కోట్లు అవసరమని తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ, తెలంగాణ చెరో రూ.200 కోట్లు చొప్పున సీడ్ మనీగా బోర్డు ఖాతాలో జమ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.73.66 కోట్లు అవసరం కాగా నాగార్జునసాగర్‌లో పనులను పూర్తి చేసేందుకు రూ.207.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.280.91 కోట్లు అవసరమవుతాయి. ► శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే ఫ్లంజ్ ఫూల్ దెబ్బతింది. స్పిల్ వే మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.810.89 కోట్లు అవసరం. సాగర్ స్పిల్‌వే ఆధునికీకరణకు రూ.31.61 కోట్లు అవసరం. ► ప్రస్తుతం చేపట్టిన పనులతో పాటు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇందుకు రూ.1,123.41 కోట్లు వ్యయం కానుంది. ► ఏటా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు రూ.38.39 కోట్లు, రెండు విద్యుత్ కేంద్రాల నిర్వహణకు రూ.4.13 కోట్లు, శ్రీశైలంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు(హంద్రీ–నీవాలో భాగమైన మల్యాల, ముచ్చుమర్రి.. కల్వకుర్తి) నిర్వహణకు రూ.372.89 కోట్లు అవసరం. శ్రీశైలం నిర్వహణకు ఏటా రూ.415.41 కోట్లు అవసరం. ► నాగార్జునసాగర్ స్పిల్ వేకు రూ.17.45 కోట్లు, విద్యుత్కేంద్రాలకు రూ.14.70, ఎత్తిపోతల పథకాలకు రూ.372.06 కోట్లు వెరసి నిర్వహణకు రూ.404.21 కోట్లు కావాలి. ► ఉమ్మడి ప్రాజెక్టులను ఏటా నిర్వహించడం, చేపట్టిన పనులను పూర్తి చేయడం, మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.1,943.03 కోట్లు అవ సరం. ► సీడ్ మనీని తగ్గించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలి. వ్యయాన్ని నీటి వాటాలు, విద్యుత్ వాటాల దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి. -
పోలవరం ప్రాజెక్ట్ సవాళ్లను ఎదుర్కొనే కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధించిన కసరత్తును ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్, ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని 8 మంది నిపుణుల బృందం పూర్తి చేసింది. గోదావరి వరదల ఉధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్, వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని నిపుణుల బృందం రూపొందించింది. డయా ఫ్రమ్ వాల్ పరిస్థితిని అంచనా వేసి.. దాని పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. బావర్ సంస్థ ఇచ్చే నివేదిక, గోతులను పూడ్చే విధానంపై డీడీఆర్పీకి పోలవరం సీఈ సుధాకర్‌బాబు పంపనున్నారు. సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని వారంలోగా డీడీఆర్పీ ఖరారు చేస్తుంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ సూచనల మేరకు ప్రొఫెసర్ రాజు నేతృత్వంలోని బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చే పనులు పరిశీలించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పరిశీలించింది. శనివారం పోలవరంలో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం సమావేశమైంది. రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన నీటిని తోడకుండానే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్ చేస్తూ.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని రూపొందించింది. ప్రధాన డ్యామ్ డయా ఫ్రమ్ వాల్ పటిష్టతపై అధ్యయనం చేసే బాధ్యతను బావర్‌కు అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానం చేయాలా లేదంటే ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలా అన్న అంశాన్ని డీడీఆర్పీకి నివేదిస్తారు. డీడీఆర్పీ ఖరారు చేసే విధానాన్ని సీడబ్ల్యూసీకి పంపి.. అది ఆమోదించిన విధానం ప్రకారం ఆ పనులు చేపడతారు. -
యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అవసరమైన సహకారాన్ని సంపూర్ణంగా అందించాలని కేంద్ర ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓలను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమచేసిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ సహాయ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు బదిలీ రూపం (డీబీటీ)లో వారి ఖాతాల్లో జమచేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2014, మే 28న ఏర్పాటైన పీపీఏ పాలక మండలి తొలి సమావేశాన్ని మంగళవారం వర్చువల్‌గా పంకజ్‌కుమార్ నిర్వహించారు. ఏపీ సీఎస్ సమీర్‌శర్మ తరఫున రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సీఎస్ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై పాలక మండలి సంతృప్తి వ్యక్తంచేసింది. పీపీఏ సీఈఓ వ్యాఖ్యపై అభ్యంతరం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం బడ్జెట్లో కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడమేనని పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పడంపై జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడంలేదని గుర్తుచేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని పంకజ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో నీటిని నిల్వచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖాధికారులు చెప్పారు. కానీ, ఆగస్టులోగా తొలిదశలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని.. వాటికి నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని డీబీటీ రూపంలో వారి ఖాతాల్లో జమచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. పరిశీలిస్తాం పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులతోపాటు.. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించి, పెట్టుబడి అనుమతిచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కోరారు. రీయింబర్స్‌మెంట్‌లో జాప్యంలేకుండా చూసి.. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత తలెత్తకుండా చూస్తామని పంకజ్‌కుమార్ స్పష్టంచేశారు. -
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై భిన్నాభిప్రాయాలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఏర్పడిన గుంతలు పూడ్చే విధానం, ప్రధాన డ్యామ్ డిజైన్లపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఏప్రిల్ 1న ఢిల్లీలో సమావేశమై వాటిని కొలిక్కి తెద్దామని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నిపుణులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా హాజరవుతారని చెప్పారు. పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై వెదిరె శ్రీరాం అధ్యక్షతన శుక్రవారం వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మట్టికట్టల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు, నిపుణులు గోపాలకృష్ణన్, దేవేందర్‌సింగ్, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ సభ్యులు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ఎస్ఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన డ్యామ్ వద్ద నదీ గర్భంలో ఏర్పడిన గుంతలను పూడ్చడంపై ప్రధానంగా చర్చించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడకుండానే గుంతలు ఉన్న ప్రదేశాల్లో పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్ (అధిక ఒత్తిడితో కూరడం) చేయాలని వీఎస్ రాజు ప్రతిపాదించారు. దాంతో కోతకు గురైన ఇసుక పొరలు మునుపటిలా తయారవుతాయని చెప్పారు. దీనిపై ఏబీ పాండ్య, దేవేందర్‌సింగ్‌లు విభేదించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని పూర్తిగా తోడేసి పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్, వైబ్రో కాంపక్షన్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గ్యాప్–2లో 550 మీటర్లు, గ్యాప్–1లో 1,750 మీటర్ల పొడవున ప్రధాన డ్యామ్ డిజైన్ల పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏప్రిల్ 1న మరోసారి సమావేశమవ్వాలని వెదిరె శ్రీరాం నిర్ణయించారు. శుక్రవారంనాటి సమావేశంలో వెల్లడైన అంశాలపై మరోసారి అధ్యయనం చేసి తుది ప్రతిపాదనతో ఆ సమావేశానికి హాజరుకావాలని నిపుణులకు, అధికారులకు సూచించారు. -
చకచకా దిగువ కాఫర్ డ్యాం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కొలిక్కివస్తున్నాయి. దీంతో పనులు ఊపందుకుంటున్నాయి. గత ప్రభుత్వ చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌డ్యామ్, ప్రధాన డ్యామ్‌లో కొంత భాగం వరదలకు కోతకు గురయ్యాయి. వీటిని పూడ్చడానికి రూపొందించిన డిజైన్లు పోలవరం పీపీఏ, సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే ఆమోదించాలని ఇటీవల పోలవరం పరిశీలనకు వచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తదనుగుణంగా చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మించి, దానికి ఇరువైపులా ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చే విధానానికి సీడబ్ల్యూసీ ఆమోదించింది. రెండ్రోజుల్లోగా జియోమెంబ్రేన్ బ్యాగ్‌లను తెప్పించి, కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చనున్నారు. మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన సమయంలోనే ప్రధాన డ్యామ్ కూడా గ్యాప్–2 ప్రాంతంలో కూడా 12 మీటర్ల లోతుకు కోతకు గురయింది. ఈ ప్రాంతం పూడ్చివేత విధానాన్ని రూపొందించేందుకు ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈనెల 25లోగా ఈ కమిటీ విధానాన్ని రూపొందిస్తే.. దానిపై 28 లేదా 29న కేంద్ర మంత్రి షెకావత్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్పీలు సమావేశమై కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంతోపాటు ప్రధాన డ్యామ్ డిజైన్లను కొలిక్కి తేనున్నాయి. -
పోలవరం డిజైన్లలో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం డిజైన్ల ఆమోద ప్రక్రియలో ముందడుగు పడింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చివేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధించిన డిజైన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. పోలవరం పెండింగ్ డిజైన్లపై బుధవారం ఢిల్లీలో షెకావత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లతోపాటు గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, స్పిల్ చానల్ ఎడమ గట్టును పటిష్టం చేయడంపై ఢిల్లీ ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో నిపుణులతో చర్చించి ఈనెల 25లోగా డిజైన్లను కొలిక్కి తేవాలని షెకావత్ ఆదేశించారు. ఈనెల 28న లేదా 29న మళ్లీ సమావేశం నిర్వహించి ఆ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమం.. దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 నుంచి 660 మీటర్ల వరకూ 220 మీటర్ల పొడవున గోదావరి వరద ఉధృతికి 36 మీటర్ల లోతున కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లు వేసి పూడ్చేలా రూపొందించిన డిజైన్‌పై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఇటీవల నిర్వహించిన సమావేశంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పీపీఏ, సీడబ్ల్యూసీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వెదిరె శ్రీరాం ఇదే అంశాన్ని షెకావత్‌కు వివరించడంతో డిజైన్‌ను ఆమోదించాలని సీడబ్ల్యూసీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సీడబ్ల్యూసీ అధికారులు అక్కడికక్కడే ఆమోదించారు. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఈసీఆర్ఎఫ్ డిజైన్లు కొలిక్కి.. పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా గోదావరికి అడ్డంగా ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాలి. గ్యాప్–3లో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను ఇప్పటికే నిర్మించారు. గ్యాప్–1లో 5505 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవుతో ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి. గోదావరి వరద ఉధృతితో గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. గ్యాప్–1, గ్యాప్–2 ఈసీఆర్ఎఫ్ డిజైన్లతోపాటు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై షెకావత్ సమీక్షించారు. స్పిల్ వే ఎడమ గట్టును పటిష్టం చేసే డిజైన్‌ను కొలిక్కి తేవాలని ఆదేశించారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన షెకావత్ జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఈనెల 4న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 తదితర డిజైన్ల ఆమోదంలో పీపీఏ, సీడబ్ల్యూసీ జాప్యం వల్ల పనులకు అంతరాయం కలుగుతోందని షెకావత్ దృష్టికి సీఎం తెచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు దోహదం చేస్తుందని సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనకు షెకావత్ అంగీకరించారు. ఈ క్రమంలో పెండింగ్ డిజైన్లపై ఈనెల 10న వెదిరె శ్రీరాం సమీక్ష నిర్వహించి షెకావత్‌కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే షెకావత్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
దిగువ కాఫర్ డ్యామ్‌కు ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ (పునాది)లో కోతకు గురైన కొంత భాగంలో డయాఫ్రమ్ వాల్, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన కొంత భాగాన్ని, పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)లను పటిష్టం చేసే డిజైన్లను కొలిక్కి తెచ్చేందుకు వారంలోగా మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈనెల 4న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిజైన్లను పీపీఏ, సీడబ్ల్యూసీ సకాలంలో ఆమోదించకపోవడంతో పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్.. పక్షం రోజుల్లోగా పెండింగ్ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. పెండింగ్ డిజైన్లను కొలిక్కితేవడమే అజెండాగా గురువారం ఢిల్లీలో వెదిరె శ్రీరాం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సర్కార్ గోదావరి వరదను మళ్లించేలా పోలవరం స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. ఆ వరద ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 మీటర్ల నుంచి 660 మీటర్ల వరకు 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు మేర కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతాన్ని డయాఫ్రమ్ వాల్ నిర్మించి, ఇసుకతో నింపి, డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) చేస్తూ పూడుస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రతిపాదించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతోపాటు ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని డీడీఆర్పీ చైర్మన్, సభ్యులు చేసిన ప్రతిపాదనకు సలహాదారు వెదిరె శ్రీరాం ఆమోదం తెలిపారు. -
Andhra Pradesh: వడివడిగా వరదాయని
సాక్షి, అమరావతి: ఉత్తుంగ గోదావరిపై ఎనిమిది దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. స్పిల్ వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్‌తో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. జలాశయం, అనుసంధానాల పనులు 80.6 శాతం, కుడి కాలువ పనులు 92.57 శాతం, ఎడమ కాలువ పనులు 71.11 శాతం పూర్త య్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పను లు 20.19 శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68 శాతం పనులు పూర్తయ్యాయి. గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి లేమితో చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 2019, 2020లో గోదావరి వరద ఉధృతికి కొంత భాగం దెబ్బతింది. కోతకు గురైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్‌లను డ్యా మ్ డిజైన్ రివ్యూ ప్యానల్, సీడబ్ల్యూసీ మార్గదర్శ కా ల మేరకు బాగుచేసి జలాశయాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీడ బ్ల్యూసీ, ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. జీవనాడికి జవసత్వాలు.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోల వరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలు త వరద మళ్లించే స్పిల్ వేను పూర్తి చేసి తర్వాత కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా పునరావాస పను లు, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరద సమయంలోనూ పనులు కొనసాగించడం ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ సర్కార్ నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన ప నులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు. తాజాగా శుక్రవారం రోజు ఐదోసారి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పనుల పరిశీలనకు తొలిసారిగా రానుండటం గమనార్హం. ప్రణాళికాయుతంగా పనులు.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు తీయించింది. స్పిల్‌వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాదే ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. గతేడాది జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున మళ్లించింది. జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరంలో పునరావాసం, భూసేకరణకు రూ.35,669.08 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం లెక్కించగా.. అది రూ.33,163.28 కోట్లుగా సీడబ్ల్యూసీ తేల్చింది. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 1,846 ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 4,505 కుటుంబాలకు పునరావాసం కల్పించి రూ.6,654.39 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 38.41 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. తక్కువ ధరకే 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వస్తుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, ఉత్తరాంధ్ర తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. -
4న పోలవరానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను ఈనెల 4న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడి అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017–18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను యుద్ధప్రాతిపదికన ఆమోదించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి షెకావత్ ఈనెల 3న ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. విజయవాడ నుంచి 4న ఉదయం హెలీకాప్టర్‌లో సీఎం జగన్‌తో కలిసి షెకావత్ పోలవరానికి చేరుకుని.. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. -
పోలవరంపై ‘ఈనాడు’ తప్పుడు రాతలు బురద జల్లడానికే 'ఎత్తు'గడలు
సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. ఎలా సాధ్యమని కనీసం ఆలోచించకుండా దూడను గాటికి కట్టేసేందుకు పలుగుతో సిద్ధమవడం ‘ఈనాడు’ మార్కు అజ్ఞాన సంపదకు తార్కాణం. ఆ అజ్ఞానంతో పచ్చి అబద్ధాలను ప్రచురిస్తూ నిజమని నమ్మించే దుస్సాహసానికి ఒడిగట్టడం రామోజీకే సాధ్యం. కొత్త ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోవడంపై నీటిపారుదల రంగ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎత్తు తగ్గడం ఉత్తదే.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క అం గుళం కూడా తగ్గించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లే దని లోక్‌సభలో సాక్షాత్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గతేడాది ఫిబ్రవరి 11న స్పష్టం చేశారు. అయితే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు తనకు తానే ఊహించుకుని పదేపదే కల్పిత కథనాలను ప్రచురించడం ఏమిటని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని కమీషన్ల కోసం జీవచ్ఛవంలా మార్చిన చంద్రబాబును అపర భగీరథుడుగా కీ ర్తిస్తూ.. ప్రాజెక్టుకు జీవం పోసి శరవేగంగా ఫలాల ను అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అభూత కల్పనలతో అసత్యాలను అచ్చేస్తున్నారని ప్రాజెక్టు పనులను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఒకరు పేర్కొన్నారు. ఆ ప్రకారమే పోలవరంలోనూ.. పోలవరం డెడ్ స్టోరేజీ 17 మీటర్లు కాగా కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. ఈ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఆ డిజైన్ ప్రకారమే జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం తరఫున రా ష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. పూర్తి చేసిన తొలి ఏడాది సీడబ్ల్యూసీ మార్గదర్శకాల (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) మేరకు కనీస నీటి మట్టం 41.15 మీటర్ల కాంటూర్ స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో ఏడాది 150 టీఎంసీలు, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు అంటే 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. తొలి ఏడాది నీటి నిల్వ కోసం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను అనుసరించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా పనులు పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో తేల్చాలని జల్ శక్తి శాఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇదే తరహాలో రెండో ఏడాది 2/3, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిధులను తేల్చాలని నిర్దేశించింది. ఇదే అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం వర్చువల్ పద్ధతిలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలు అందచేస్తే కేంద్ర ఆర్థిక శాఖకు పంపి నిధులు విడుదల చేయాలని సూచిస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు వోహ్రా పేర్కొన్నారు. వారంలో సమర్పిస్తామని జలవనరుల అధికారులు తెలిపారు. మంగళవారం సమావేశంలో జరిగింది ఇది కాగా అజ్ఞానంతో విషం చిమ్మడంపై సాగునీటిరంగ నిపుణులు విస్తుపోతున్నారు. ఒకేసారి పూర్తి ఫలాలందించడం సాధ్యమా? కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో ఫలాలను అందించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. దశల వారీగా ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందిస్తారు. ఈ క్రమంలోనే పోలవరం పూర్తయ్యే తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి? పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) తెలుసా? ► ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టును నిర్మిస్తే అందులో నీటిని ఎలా నిల్వ చేయాలనే అంశంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా తప్పనిసరిగా వీటి ప్రకారమే నిల్వ చేయాలి. ► ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 1/3 వంతు మాత్రమే నిల్వ చేయాలి. రెండో ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 2/3 వంతు నీటిని నిల్వ చేయాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలి. ► అన్నీ సక్రమంగా ఉన్నాయని, ప్రాజెక్టు భద్రతకు ఢోకా లేదని నిర్ధారించుకున్నాకే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలి. పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి? పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. -
త్వరలో ‘అపెక్స్’ భేటీ!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమావేశం అజెండాను రూపొందించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. గతేడాది జూలై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును అజెండాలో ప్రధానంగా చేర్చాలని సూచించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మదింపు అంశాన్నీ పొందుపరచాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సూచించిన మేరకు మిగతా అంశాలను అజెండాలో చేర్చి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చించి అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతో చర్చించి వారు అందుబాటులో ఉండే రోజు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని షెకావత్ నిర్వహించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించింది. రెండో భేటీ 2020 అక్టోబర్ 6న జరిగింది. మూడో భేటీని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యేలోగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. -
‘కేంద్రం’ వాటాకు ‘కత్తెర’
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా జాతీయ హోదా పొందిన సాగు నీటి ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం ఇచ్చే నిధులకు కత్తెర వేసింది. కొత్త జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలి. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు వాటికి జాతీయ హోదా కల్పించి, అంచనా వ్యయంలో 90 శాతం నిధులను ఇప్పటివరకూ కేంద్రం భరిస్తోంది. ఇప్పుడా నిధుల్లో కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర ప్రాజెక్టులకూ ఇదే రీతిలో నిధులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, లడఖ్‌లకు పాత విధానంలోనే 90 శాతం ఇవ్వనుంది. ఇంతకు ముందే ఆమోదం పొందిన పోలవరంతోపాటు 15 జాతీయ ప్రాజెక్టులకు ప్రస్తుత పద్ధతి ప్రకారమే 90 శాతం నిధులిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తెలిపింది. జాతీయ హోదా కల్పన, నిధులు మరింత క్లిష్టం ► తాజా మార్గదర్శకాల ప్రకారం.. నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుదుత్పత్తి వ్యయం తదితర సమస్యల వల్ల నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాని అంతర్రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా కల్పించి, సత్వరమే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నీటి లభ్యత, పంపిణీ సమస్య లేకుండా ఒక రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించనుంది. ► ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తారు. ► రాష్ట్రం తన వాటా నిధులను జమ చేసి.. 75 శాతం ఖర్చు చేయకపోతే కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే.. ఆమోదం పొందిన పెరిగిన వ్యయంలో 20 శాతమే కేంద్రం భరిస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్రాలే భరించాలి. ► పాత విధానంలో కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టే జాతీయ హోదా కింద కేంద్రం నిధులిచ్చే చివరి ప్రాజెక్టు. ఏఐబీపీ నిధుల మంజూరులోనూ కోత నిధుల కొరత వల్ల సకాలంలో పూర్తి కాని దేశంలోని 99 ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం నిధులిస్తోంది. కొత్తగా ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకూ నిధుల మంజూరులో కోతలు పెడుతూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ► ఎనిమిది ఈశాన్య, రెండు హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢఖ్‌లలో ఏఐబీపీ కింద కొత్త ఎంపిక చేసే ప్రాజెక్టులకు వాటి అంచనా వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. ► కరవు నివారణ పథకం (డీపీఏపీ), ఎడారి నివారణ పథకం(డీడీపీ) అమలవుతున్న ప్రాంతాలు, గిరిజన, వరద ప్రభావిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, మరఠ్వాడ, కేబీకే (ఒడిశా) ప్రాంతాల్లో కొత్తగా ఎంపిక చేసే ఏఐబీపీ ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 60 శాతం ఇవ్వనుంది. మిగతా ప్రాంతాల్లో ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 25 శాతం నిధులిస్తుంది. మిగతా వ్యయాన్ని ఆ రాష్ట్రాలే భరించాలి. -
ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. చెక్‌డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు ఆంధ్రపద్రేశ్లో చెక్‌డ్యాంల బలోపేతానికి వాటర్ బాడీస్ రిపేర్ రెన్నోవేషన్, రీస్టోరేషన్ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్‌హాట్‌లు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్‌హాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో హాట్లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్‌కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఆర్‌ఐపీలో 31 ప్రాజెక్టులు డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గ్రామ్ ఉజాలలో మూడు జిల్లాలు గ్రామ్‌ఉజాల ప్రోగ్రామ్‌లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీసీఎస్‌ఎల్) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అప్పర్‌భద్ర కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
'అప్ప'నంగా.. ఇదేందప్పా?
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులే లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అవాస్తవాలను వల్లె వేస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గత నెల 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఇప్పటిదాకా నోటిఫై చేయని నేపథ్యంలో అప్పర్ భద్రకు సాంకేతిక, పెట్టుబడి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అప్పర్ భద్రను నిలుపుదల చేసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా, కర్ణాటకను సమర్థిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్(సౌత్) విభాగం డైరెక్టర్ ఎన్.ముఖర్జీ ఈనెల 12న జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నెల 25న దీన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి జల్ శక్తి శాఖ పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసలు ఏపీ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ వివరణ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం... ► ఏపీ సర్కార్ అభ్యంతరం–1: విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీల నీటి వినియోగం తగ్గిందని కర్ణాటక చెబుతున్న లెక్కలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కొట్టిపారేసింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్ ట్రిబ్యునల్ 9 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అప్పర్ భద్ర హైడ్రాలజీపై పునఃసమీక్షించాలి. ► సీడబ్ల్యూసీ సమాధానం: బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే అప్పర్ భద్రకు సాంకేతిక అనుమతి ఇచ్చాం. ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం అంశాన్ని సాంకేతిక అనుమతి ఇచ్చేటప్పుడు పరిశీలించాం. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్‌ను కర్ణాటక సర్కార్ కోరింది. తుంగభద్రలో నీటి లభ్యత లేనందున అప్పర్ భద్రకు నీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. విజయనగర చానళ్లు, భద్ర, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని ట్రిబ్యునలే తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రలాజికల్ క్లియరెన్స్ తప్పు. దాన్ని పునఃసమీక్షించాలి. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–2: మాస్టర్ ప్లాన్ తయారీకి కర్ణాటక సర్కార్ 2002లో నియమించిన కమిటీ తుంగభద్రలో ఆరు టీఎంసీలు మిగులు ఉందని తేల్చింది. కానీ ఆ ఆరు టీఎంసీలను అటు బచావత్గానీ ఇటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌గానీ కర్ణాటకకు కేటాయించలేదు. ► సీడబ్ల్యూసీ: ఆరు టీఎంసీలు మిగులు జలాలు కాదు. కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో భాగమే. కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో ఉపయోగించుకోని ఆరు టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించామని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ► ఏపీ సర్కార్: కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో నీటి వినియోగం తగ్గిందన్న కర్ణాటక వాదనపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? అక్కడ నీటి వినియోగం పెరిగిందేగానీ తగ్గలేదు. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–3: బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేటాయించింది. కానీ తుంగభద్ర డ్యామ్‌కు 1976–77 నుంచి 2007–08 వరకూ ఏటా సగటున 186.012 టీఎంసీలే వచ్చాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు ప్రవాహం మరింత తగ్గిపోతుంది. ఇది కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ► సీడబ్ల్యూసీ: కర్ణాటక సర్కార్ 2019 నవంబర్ 27న జారీ చేసిన జీవో 176 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 21.50 టీఎంసీలు, గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం వచ్చే అదనపు నీటిలో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 సబ్ బేసిన్లలో మిగిలిన ఆరు టీఎంసీలు వెరసి 29.90 టీఎంసీలతో అప్పర్ భద్రను చేపట్టినందున దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు ఒక్క చుక్క కూడా కేటాయించలేదు. అలాంటప్పుడు 21.5 టీఎంసీలు ఎక్కడ నుంచి వచ్చాయి? సబ్ బేసిన్లలో ఆరు టీఎంసీల మిగులు లేదు. కర్ణాటక కట్టుకథలనే సీడబ్ల్యూసీ వల్లె వేయడం ధర్మం కాదు. ► ఏపీ అభ్యంతరం–4: వేదవతిపై వాణీవిలాసాగర్, బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ల మధ్య కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీన్ని తుంగలో తొక్కుతూ అప్పర్ భద్రలో అంతర్భాగంగా పరశురాంపుర వద్ద బ్యారేజీని కర్ణాటక నిర్మిస్తోంది. ► సీడబ్ల్యూసీ: 2020 డిసెంబర్ 24న నిర్వహించిన సాంకేతిక సలహా మండలి సమావేశం దృష్టికి పరశురాంపుర బ్యారేజీ నిర్మాణం రాలేదు. అప్పర్ భద్ర డీపీఆర్‌లో కూడా ఆ బ్యారేజీ విషయం లేదు. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్ర ప్రాజెక్టులో అంతర్భాగంగా పరశురాంపుర బ్యారేజీ నిర్మిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ టెండర్లు పిలిచింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ► ఏపీ అభ్యంతరం–5: అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. అప్పర్ భద్ర డీపీఆర్‌లను మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు పంపకుండానే అనుమతి ఇచ్చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? ► సీడబ్ల్యూసీ: బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడం కాదా? ► ఏపీ అభ్యంతరం–6: అప్పర్ భద్రకు జాతీయ హోదా ప్రతిపాదనపై చర్చించేందుకు డిసెంబర్ 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నీటి వాటాలు, హైడ్రాలజీ గురించి వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు విషయంలో పరివాహక రాష్ట్రాలకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ► సీడబ్ల్యూసీ: హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశం మినిట్స్ ఇంకా రావాల్సి ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగానే అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చాం. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చామనడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాల్సిందే. ఇదీ అప్పర్ భద్ర ప్రాజెక్టు.. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. అయితే మాస్టర్ ప్లాన్, ఆధునికీకరణ, కృష్ణా డెల్టాకు పోలవరం మళ్లింపు జలాల్లో వాటా, పునరుత్పత్తి జలాలు, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు తదితరాల రూపంలో తమకు 30.4 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని ప్రకటించింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. ► ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి 2019 వరకూ రూ.4,830 కోట్లను ఖర్చు చేసిన కర్ణాటక సర్కార్ అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపింది. ► 2020 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో (2018–19 ధరల ప్రకారం) పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతేడాది మార్చి 25న జల్‌శక్తి శాఖ ఆమోదముద్ర వేసింది. ► ఈ రెండు అనుమతుల ఆధారంగా దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై గత డిసెంబర్ 6న జల్ శక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. -
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాతోపాటు ఇతర అంశాల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) ఏర్పాటు చేసిన కేంద్ర బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పీఎంవోకు కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 3న తనతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేంద్ర బృందంతో సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మరోసారి చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ భేటీ అవుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులకు వి/æ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ► రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ► 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ► విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. సానుకూలంగా స్పందించిన ప్రధాని సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో అధికారులను ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ స్వామినాథన్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందంతో చర్చించేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బృందం అజయ్ సేథ్, ఆర్థిక శాఖ(ఆర్థిక వ్యవహారాల విభాగం) కార్యదర్శి, పంకజ్‌కుమార్, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, దేబాశిస్ పాండా, కేంద్ర ఆర్థిక శాఖ (ఆర్థిక సేవల విభాగం), సుధాన్షు పాండే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి. రాష్ట్ర బృందం ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, షంషేర్‌సింగ్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్. -
డిజైన్ల ఆమోదంలో జాప్యమే కారణం
సాక్షి, అమరావతి: డిజైన్ల ఆమోదంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేస్తున్న జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్లను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం, సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) పనుల పురోగతిని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గురువారం వర్చువల్ విధానంలో సమీక్షించారు. పోలవరం పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను ఆదేశించారు. డిజైన్లను వేగంగా ఆమోదిస్తే ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని జవహర్‌రెడ్డి చెప్పగా.. తక్షణమే డీడీఆర్పీ సభ్యులు పనులను పరిశీలించి, డిజైన్లను ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈనెల 7న డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య పోలవరం పనులను పరిశీలించారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వర్చువల్ విధానంలో డీడీఆర్పీ సమావేశం నిర్వహించి డిజైన్లను ఆమోదిస్తే ఈ సీజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. ఇందుకు పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే డీడీఆర్పీ సమావేశం నిర్వహించి.. డిజైన్ల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఆదేశించారు. ప్రాజెక్టుకు ఇటీవల విడుదల చేసిన రూ.320 కోట్లకు యూసీలు (వినియోగ ధ్రువీకరణ పత్రాలు) పంపామని, రీయింబర్స్ చేయాల్సిన మిగతా నిధులను మంజూరు చేయాలని జవహర్‌రెడ్డి చేసిన వి/æ్ఞప్తిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై మరో సమావేశంలో చర్చిద్దామని పంకజ్‌కుమార్ చెప్పారు. ఏఐబీపీ, కాడ్వామ్ కింద చేపట్టిన గుండ్లకమ్మ, తోటపల్లి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసి.. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉన్నందువల్ల మిగిలిన పనులను పూర్తి చేయలేకపోతున్నట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకుని.. గడువులోగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. -
పోలవరం భూసేకరణ, పునరావాసానికే.. రూ.33,168 కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168 కోట్లు వ్యయమవుతుందని కేంద్ర జల్‌శక్తి శాఖ తేల్చింది. భూసేకరణ, పునరావాసానికి ఇప్పటిదాకా మంజూరు చేసిన రూ.6,583 కోట్లను మినహాయిస్తే ఇంకా రూ.26,585 కోట్లను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లకు సవరిస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా మండలి (టీఏసీ) 20 19, ఫిబ్రవరి 11న ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది. ఈ అంచనా వ్యయాన్ని పరిశీలించేందుకు 2019, ఏప్రిల్ 2న ఏర్పాటు చేసిన సవరించిన అంచనా కమిటీ (ఆర్సీసీ) దాన్ని రూ.47,725.87 కోట్లకు కుదించిందని ఎత్తిచూపింది. 2013–14 ధరల ప్రకారం చూస్తే ఆ వ్యయం రూ.29,027 కో ట్లుగా ఆర్సీసీ తేల్చిందని పేర్కొంది. విభజన చ ట్టంలో సెక్షన్–90 ప్రకారం.. ఏప్రిల్ 1, 2014 నాటి కి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన వంద శాతం నిధులను కేంద్రమే భరించాలని గుర్తుచేసింది. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన నిధులను అం దించాలని 2020–21 వార్షిక నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి జల్‌శక్తి శాఖ వివరించింది. అంతేకాక.. పోలవరం అంచనా వ్యయం విషయంలో సీఎం వైఎస్ జగన్ వాదనను బలపరుస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ నివేదిక ఇవ్వడం గమనార్హం. బాధ్యతంతా కేంద్రానిదే.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముం దు ఆ ప్రాజెక్టుకు రూ.5,185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇందులో రూ.562.47 కోట్లను సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ–యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్టు) కింద కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2014 తర్వాత నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అ య్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని విభజన చ ట్టంలో సెక్షన్–90 స్పష్టం చేస్తోంది. ప్రాజెక్టును పూ ర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. పనులుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేస్తూ వస్తోంది. భూసేకరణ, పునరావాసమే కీలకం.. కేంద్రం చేసిన 2013–భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే వ్యయం రూ.33,168 కోట్లకు చేరుకుంది. అలాగే, 2017–18 ధరల ప్రకారం జలాశయం, కుడి, ఎడమ కాలువలు, విద్యుత్కేంద్రం వంటి పనుల వ్యయం రూ.22,380.87 కోట్లకు చేరుకుంది. దాంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసింది. మరోవైపు.. ఏ జాతీయ ప్రాజెక్టుకులేని రీతిలో సీడబ్ల్యూసీ ఆమోదించిన సవరించిన వ్యయాన్ని మదింపు చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఆర్సీసీ పోలవరం వ్యయాన్ని రూ.47,725.87 కోట్లకు కుదించింది. తాజా ధరల మేరకు నిధులిస్తేనే.. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయం పెరిగిన నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ, ఆర్సీసీలు ఆమోదించిన మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీకి, ఇతర కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. 2020–21 వార్షిక నివేదికలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనలను బలపరుస్తూ.. 2017–18 ధరల ప్రకారం నిధులివ్వాలని కేంద్రానికి కేంద్ర జల్‌శక్తి వివరించింది. సేకరించాల్సింది 56,154 ఎకరాలు.. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే, కుడి, ఎడమ కా లువల పనులు చేపట్టడానికి మొత్తం 1,67,339 ఎకరాలను సేకరించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నివేదికలో పేర్కొంది. ఇందులో 1,11,185 ఎకరాలకు రూ.5,642 కోట్ల పరిహారం చెల్లించి సేకరించారని తెలిపింది. మిగతా 56,154 ఎకరాల భూసేకరణకు రూ.7,425 కోట్లను ఖర్చుచేయాల్సి ఉందని పేర్కొంది. అలాగే, 1,05,601 నిర్వాసిత కుటుంబాల్లో రూ.941 కోట్లతో 3,110 కుటుంబాల కు పునరావాసం కల్పించా రని.. మిగతా 1,02,491 కు టుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ. 19,150 కోట్లు అవసరమని పేర్కొంది. ఇలా మొత్తమ్మీద 2020–21 వరకు ప్రాజెక్టు కోసం రూ.16,899.38 కోట్లను ఖర్చు చేశారని.. ఏప్రిల్ 1, 2014 తర్వాత కేంద్రం రూ.10,848.36 కోట్లను విడుదల చేసిందని పేర్కొంది. -
గెజిట్ అమలుపై గజిబిజి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. కేంద్రం నిర్దేశించిన తుది గడువు ముగిసిపోయి మూడు నెలలు పూర్తయినా నోటిఫికేషన్ అమల్లోకి రాకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితమే ఏపీ ఉత్తర్వులు.. కృష్ణా బోర్డు ఆమోదించిన తీర్మానం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ గత అక్టోబర్ 14నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే బోర్డు పరిధిని నిర్ణయించాలంటూ పాత పాట అందుకుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు గోదావరి బోర్డుతో అవసరమేముందని, రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జల వివాదాలు సమసిపోవడం లేదు. సమీక్షలతో సరి.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఇరు బోర్డులు వేర్వేరుగా సబ్ కమిటీలను నియమించాయి. బోర్డుల సభ్య కార్యదర్శుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు, జెన్కో సీఈలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు పలుదఫాలు సమావేశమై నివేదికలు ఇచ్చాయి. వీటి ఆధారంగా బోర్డు పరిధిని ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని 15 అవుట్ లెట్లను తొలుత పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తామని, ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రతిపాదించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించడంతో ఆ మేరకు బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును పరిధిలోకి తీసుకుని నోటిఫికేషన్ అమలు ప్రారంభిస్తామని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రతిపాదించగా.. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తేనే దిగువ రాష్ట్రమైన ఏపీకి ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు చైర్మన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఒక తాటిపైకి తేలేకపోయారు. నోరుమెదపని జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ అమలుపై తొలుత కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత నెల 28న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు పరిధికి ఏపీ సర్కార్ అంగీకరించగా.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది. గోదావరి బోర్డు అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొనగా.. దిగువ రాష్ట్రమైన తమ హక్కుల పరిరక్షణకు బోర్డు అత్యంత ఆవశ్యకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. -
Polavaram Project: పోలవరం పనులు భేష్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై కేంద్ర జల్ శక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. జల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్, సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్‌కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఈ కమిటీ మంగళవారం పోలవరం ఎడమ కాలువను పరిశీలించింది. బుధవారం ప్రాజెక్టు స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అనుసంధానాల పనులు, జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు, గ్యాప్–1లను, పునరావాస కాలనీలను తనిఖీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. వివరాలను ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్‌బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ, సహాయ పునరావాస విభాగం అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగవంతం చేయాలని కమిటీ ఆదేశించింది. పనుల వివరాలను మ్యాప్ ద్వారా తెలుసుకుంటున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ జాయింట్ కమిషనర్ అనూప్‌కుమార్ శ్రీవాత్సవ 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఈ వ్యయాన్ని సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 2019లోనే ఆమోదించిందని వివరించారు. ఆ తర్వాత రివైజ్ట్ కాస్ట్ కమిటీ రూ.47,727.87 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించిందన్నారు. సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని చెప్పారు. దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి కూడా నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఒకటిగానే లెక్కించి, నిధులివ్వాలని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై గోయల్ సానుకూలంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నివేదికను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి మరోమారు తీసుకెళ్తామని అన్నారు. పెట్టుబడి అనుమతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు. డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను మే నాటికి, ఎగువ కాఫర్ డ్యామ్‌ను జూన్ మొదటి వారానికే పూర్తి చేసి.. జూన్ 11న అప్రోచ్ చానల్ మీదుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. 2018లో పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మించే ప్రదేశంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం, ఇసుక పొరలను పటిష్టం చేసే డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనుల ప్రారంభం ఆలస్యమవుతోందన్నారు. ఈనెల 7న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య వస్తున్నారని, అప్పుడు ఈ డిజైన్‌ను కొలిక్కి తెస్తామని, దాన్ని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వెంటనే ఆమోదించేలా చూడాలని కోరారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను వేగంగా ఆమోదించాలని సీడబ్ల్యూసీకి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. డిజైన్ ఆమోదం అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీల సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) రూపకల్పన తుదిదశలో ఉందని, అవి పూర్తికాగానే టెండర్లు పిలిచి.. వాటి పనులను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. కమిటీ సభ్యులు గురువారం ఉదయం పోలవరం కుడి కాలువ పనులను తనిఖీ చేస్తారు. శుక్రవారం విజయవాడలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
అప్పర్ భద్రకు అనుమతులు సరికాదు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ అనుమతులను పునఃసమీక్షించి.. ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అప్పర్ భద్రపై ఏపీ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో ఆర్కే సిన్హా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. కేటాయించిన నీటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి ఎన్.లక్ష్మణ్‌రావు పీష్వా పేర్కొనడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1.. అప్పర్ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్నారు. ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఎక్కడా తగ్గలేదని కేడబ్ల్యూడీటీ–2 తేల్చిచెప్పినా.. దానికి భిన్నంగా మిగులు ఉందంటూ.. వాటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో కృష్ణా బేసిన్ ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ అధికారులు వివరించారు. నీటిని తరలించే క్రమంలో కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) మధ్య వేదవతిపై రిజర్వాయర్‌ను నిర్మిస్తోందన్నారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ కింద ఏపీ, ఆర్డీఎస్ కింద ఏపీ, తెలంగాణల్లోని ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. ఇది ఆ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. దీనిపై ఆర్కే సిన్హా స్పందిస్తూ.. ప్రాజెక్టుపై అభ్యంతరాలను కర్ణాటక సర్కార్‌కు పంపాలని సూచించారు. వాటిపై కర్ణాటక సర్కార్ వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమై.. అప్పర్ భద్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా.. అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను.. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా సరే.. అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకుని 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్ణాటక చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 24న సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపారు. దీనికి ఈ ఏడాది మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చిందన్నారు. కేడబ్ల్యూడీటీ–1, కేడబ్ల్యూడీటీ–2లు అప్పర్ భద్రకు 10 టీఎంసీలు కేటాయించనే లేదన్నారు. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాల రూపంలో 6 టీఎంసీల లభ్యత ఉందని.. ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని కర్ణాటక పేర్కొందన్నారు. కానీ.. వాటి ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని.. అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 ఎత్తిచూపిన అంశాన్ని గుర్తు చేశారు. -
ఇరిగేషన్ పనులకు మాత్రమే..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సమావేశంలో ఆమోదించినా రివైజ్డ్ కాస్ట్ కమిటీ కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు రూ.35,950 కోట్లకు ఆమోదం తెలుపుతూ 2020 మార్చిన నివేదికను సమర్పించిందని చెప్పారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం పోలవరం పనులకు సంబంధించి రూ.11,600 కోట్లను రీయింబర్స్ చేసిందని, మరో రూ.711 కోట్ల రీయింబర్స్‌పై ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. పురోగతిపై నెలవారీగా వివరాలు.. పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిస్తోందని పేర్కొంటూ 2019 జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. హెడ్‌వర్క్స్‌లో భాగంగా 245.62 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, కట్ట పని, 12.83 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగిందన్నారు. కుడి ప్రధాన కాలువకు సంబంధించి 3.86 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.37 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్, 0.42 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ఎడమ ప్రధాన కాలువలో 13.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 0.48 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్, 1.97 లక్షల క్యూబిక్ మీటర్ల నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రాజెక్టు కోసం 995.77 హెక్టార్ల భూ సేకరణ జరగగా 2,429 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు వివరించారు. కాలింగ్ అటెన్షన్ నోటీసిచ్చిన మిధున్‌రెడ్డి పోలవరంపై చర్చకు లోక్‌సభలో వైఎస్సార్ సీపీ లోక్‌సభా పక్షనేత మిధున్‌రెడ్డి కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,657 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆలస్యం వల్ల పునరావాసం పనులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖర్చు చేసిన రూ.1,920 కోట్లను వెంటనే రీయింబర్స్ చేసి వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. కీలక నిర్మాణాలు పూర్తి పోలవరంలో స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ (గ్యాప్ 3), డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్ లాంటి కీలక భాగాల నిర్మాణం ఇప్పటికే పూర్తైనట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందని బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. స్పిల్‌వే రేడియల్ గేట్లు 88%, స్పిల్ ఛానెల్ 88%, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ 73%, పైలట్ ఛానెల్ పని 34%, పవర్ హౌస్ పునాది తవ్వకంలో 97% పురోగతి సాధించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నా పనుల ప్రస్తుత స్థితి ప్రతిపాదిత షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. కోవిడ్ మహమ్మారి, ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులు, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఆలస్యం తదితర కారణాల వల్ల ఆటంకం కలిగినట్లు చెప్పారు. -
పోలవరంపై హైపవర్ కమిటీ భేటీ రద్దు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ రద్దయింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత హైపవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరంతో సహా 16 జాతీయ ప్రా జెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో హైపవర్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భేటీ వర్చువల్ విధానంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ శుక్రవారం ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కావడం.. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర జల్ శక్తి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పంకజ్‌కుమార్ వాటిలో నిమగ్నమయ్యారు. దాంతో హైపవర్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. -
ఏమిటీ డ్రామాలు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా జరిగిన ఆలస్యానికి కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు. దీనిపై 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిన తర్వాతే ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని షెకావత్ స్పష్టత ఇచ్చారు. ఈ జాప్యానికి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మీడియాతో మాట్లాడారు. 2 రోజులని చెప్పి 8 నెలలకు.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత చొరవ తీసుకుని గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు షెకావత్ తెలిపారు. ఆ సందర్భంగా కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకురాగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయడంతో 2 రోజుల్లో పిటిషన్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే 7–8 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిన తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు. చర్చించాకే బోర్డుల పరిధిపై నిర్ణయం... విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడినప్పటికీ పరిధి నోటిఫై చేయని కారణంగా ఇన్నాళ్లూ అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ పేర్కొన్నారు. గతేడాది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు బోర్డుల పరిధి నోటిఫై ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘ చర్చల తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బోర్డులను నోటిఫై చేసినప్పటికీ ఇదంతా ఒక డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని చెప్పారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? లేక ఉన్న ట్రిబ్యునల్‌కే బాధ్యత అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏవో కొన్ని కాగితాలు పంపుతున్నారు.. బోర్డులు సమర్థంగా పనిచేసేలా రెండు రాష్ట్రాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని షెకావత్ కోరారు. విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని, మూలనిధి డిపాజిట్ చేయాలని, మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించి ఏవో కొన్ని కాగితాలను పంపడం సరికాదని, నిర్దిష్ట ఫార్మాట్లో ఇవ్వాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పుని సవరించాలంటే ప్రక్రియ పార్లమెంట్లో జరగాలని, ఇది ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని షెకావత్ పేర్కొన్నారు. -
గ్రామ సచివాలయాలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: పాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్న సత్ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల పనితీరును కేంద్ర జలశక్తి శాఖ కీర్తించింది. వీటి సేవలు ప్రశంసిస్తూ జలజీవన్ సంవాద్ అక్టోబరు సంచిక ఈ–బుక్‌లో కథనాన్ని ప్రచురించింది. జల్‌జీవన్ మిషన్ లక్ష్యాలు చేరుకునేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్‌లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది. ప్రధానాంశాలు ఏమిటంటే.. 2 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటుచేయాలని 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సచివాలయం ముఖ్యోద్దేశం ఏమిటంటే.. గ్రామ పంచాయితీ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అన్ని ప్రభుత్వ సేవలను గ్రామస్తులకు వారి ఇంటి వద్దే అందుబాటులో ఉండేలా చూడటం. వారికి 318 సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది. పరిపాలన మీ ఇంటి వద్దే అనే 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని అనుసరించి ఏపీ ప్రభుత్వం ఇలా ప్రత్యేకమైన ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా.. ప్రజలకు మెరుగైన సేవలను వారి ఇంటి వద్దే అందించడానికి గ్రామ సచివాలయం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ అసిస్టె¯Œంట్, విలేజ్ టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లను నియమించింది. ఈ ఉద్యోగుల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ పోర్టల్ కూడా రూపొందించింది. ఇది గ్రామస్థాయిలో భారీ ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రతీ 50 కుటుంబాలకు ఓ వలంటీర్ ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున భారీస్థాయిలో వలంటీర్లను చేర్చుకుంది. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందేలా సహకరిస్తారు. ఏపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద గ్రామస్తులకు ఏటా రూ.50వేల నుంచి రూ.60వేల వరకూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకాల ఫలితాలు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని దీర్ఘకాలం పాటు అందించడం అనే ‘జల్‌జీవన్ మిషన్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి. -
ఉమ్మడి ప్రాజెక్టులతో మొదలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలు ముడిపడిన సాగు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈనెల 14 నుంచి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు జలవిద్యుత్ కేంద్రాలు, వాటిలో పనిచేసే సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు సహా అన్నీ కృష్ణా బోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే ప్రస్తుతానికి గోదావరి బోర్డు అధీనంలోకి తీసుకోనుంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్రాజెక్టులను బోర్డులు తమ పరిధిలోకి తీసుకోనున్నాయి. ఈనెల 10, 11 తేదీల్లో కృష్ణా, గోదావరి బోర్డుల సబ్ కమిటీల సమావేశాలు నిర్వహించి, 12న రెండు బోర్డుల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి.. రెండు రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వాలని బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సూచించారు. ఈనెల 14 నుంచి బోర్డుల పరి«ధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసిన కేంద్రం.. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. నోటిఫికేషన్ అమలు చేయాల్సిందే బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, రాష్ట్రాలు అందించిన సమాచారం, సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు, సీఐఎస్ఎఫ్ భద్రత, రాష్ట్రాల అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తిచేసిన చర్యలు తదితర వివరాల గురించి రెండు బోర్డుల చైర్మన్లను దేవశ్రీ ముఖర్జీ ఆరా తీశారు. ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవడానికి రెండు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని బోర్డుల చైర్మన్లు వివరించారు. కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ సర్కారు కోరుతోందన్నారు. దీనిపై దేవశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు వాటిపై ఆధారపడిన జలవిద్యుత్ కేంద్రాలను బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి బేసిన్లో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టు కింద మాత్రమే రెండు రాష్ట్రాల ఆయకట్టు ఉందని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పగా.. ఆ ప్రాజెక్టును తొలుత అధీనంలోకి తీసుకుని తర్వాత మిగతా ప్రాజెక్టులపై దృష్టిసారించాలని దేవశ్రీ ముఖర్జీ చెప్పారు. బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని, ఆ మేరకు ప్రభుత్వాలకు లేఖలు రాసి నిధులు డిపాజిట్ చేయించుకోవాలని బోర్డుల చైర్మన్లకు సూచించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు బోర్డుల చైర్మన్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఈనెల 12న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, జలవిద్యుత్ కేంద్రాలు, సిబ్బంది, కార్యాలయాలు తదితర వివరాలపై మరింత స్పష్టత వస్తుందని బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. -
కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచనల మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్ కోరారు. కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చాంబర్లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. రిట్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్‌లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్‌ఫజ్ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. తమ అభ్యర్థన పిటిషన్లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలను సీనియర్ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీకి
సాక్షి, అమరావతి: పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టువల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతిలేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదని పేర్కొంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదంలేకుండా చేపట్టిన ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డులను కోరినా ఫలితం లేకపోయిందని ఎన్జీటీకి వివరించింది. ఈ రిట్ పిటిషన్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చింది. తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయించి.. ఏపీ హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రజల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ.. ► ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా)–2006 నోటిఫికేషన్ ప్రకారం పది వేల ఎకరాల కంటే ఎక్కువగా కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు ముందస్తుగా పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం.. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ► కానీ.. తెలంగాణ సర్కార్ అవేమీ లేకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి.. 3,60,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిండి పనులను 2015, జూన్ 11న చేపట్టింది. ► దీనిపై పలుమార్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాం. ఈ పనులవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పాం. డిండి ఎత్తిపోతల పనులు చేసే ప్రదేశం పులుల అభయారణ్యంలో ఉండటంవల్ల.. వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, ఎలాంటి స్పందన కన్పించలేదు. ► ఈ ఎత్తిపోతలవల్ల ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. వాటిపైనా ఎలాంటి స్పందనలేదు. ► ఈ పథకం పూర్తయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగు, సాగునీటి కొరతకు.. వాతావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తుంది. -
‘సీతారామ’ డీపీఆర్‌ను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై అంచనా వేసి, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా ట్రిబ్యునల్ పంపిణీ చేసేవరకు తెలంగాణ సర్కార్ సమర్పించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని కేంద్రం, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లకు గురువారం రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చినప్పుడు నీటిలభ్యతను అధికంగా చూపించారని, దానిపై తమ అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం, గోదావరి డెల్టాకు నీటిలభ్యత తగ్గుతుందని, ఆ ప్రాజెక్టును ఆమోదిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందని స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిన గోదావరి బోర్డు.. అక్టోబర్ 6లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై అభిప్రాయాలను చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో కొన్ని ప్రధానాంశాలు.. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిలో 991.19 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో వ్యాప్కోస్ లెక్కగట్టింది. పోలవరం వద్ద 460.36 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వద్ద 315.54 టీఎంసీలే మిగులు ఉంటుంది. ► పోలవరం వద్దకు సగటున 561 టీఎంసీల ప్రవాహం వస్తుందని లెక్కకట్టిన సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు 2006 సెప్టెంబర్ 12న హైడ్రాలాజి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ పోలవరం వద్ద నీటిలభ్యత 460.36 టీఎంసీలే ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో ఉండటంపై 2018లోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. 2018లో 32 టీఎంసీల సామర్థ్యంతో డీపీఆర్ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పోలవరం, గోదావరి డెల్టాలకు తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది. ► పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా అవసరాలు 554.81 టీఎంఎసీలు. పోలవరం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిన సమయంలో పోలవరం ప్రాజెక్టులో 34.92 టీఎంసీల ఆవిరి నష్టాలు ఉంటాయని తేల్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువల అదనపు అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, ముసురుమిల్లి, వెంకటనగరం, భూపతిపాలెం, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, మాచ్‌ఖండ్ తదితర ప్రాజెక్టుల అవసరాలు లెక్కిస్తే.. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత కింద రాష్ట్ర వాటా 775 టీఎంసీలు. ► ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరి 15న కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అంచనా వేయించాలి. ఎగువ రాష్ట్రాలు పూర్తిచేసిన, నిర్మాణంలో ఉన్న, చేపట్టనున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులు చేయాలి. ఆ తర్వాతే డీపీఆర్‌లను ఆమోదించాలి. -
Andhra Pradesh: గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ మరో అడుగు ముందుకేసింది. నోటిఫికేషన్ అమలును అక్టోబరు 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరిన సంగతి తెలిసిందే. అయితే గెజిట్ అమలు సాఫీగా సాగేలా జల్‌శక్తి శాఖ ఆయా బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల స్థాయి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధి విస్తృతమైన నేపథ్యంలో మానవ వనరులు బలోపేతంతో పాటు బోర్డులు మెరుగైన రీతిలో పనిచేసేలా సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రూప్ ‘ఏ’ సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులు నలుగురిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయం చీఫ్ ఇంజనీర్ డాక్టర్ ఎం.కె.సిన్హా, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ జి.కె.అగర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు) చీఫ్ ఇంజనీర్ టి.కె.శివరాజన్, సీడబ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్ (లక్నో) చీఫ్ ఇంజనీర్ అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచించింది. రెండు బోర్డులకు అత్యంత ప్రాధాన్యం గల అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. గెజిట్ అమలుపై బోర్డుల చైర్మన్లతో చర్చ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొనసాగింపుగా అదనపు కార్యదర్శి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బోర్డుల పరిపాలనా సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఇబ్బందులు, మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ ౖచైర్మన్ ఎస్.కె.హల్దర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో చర్చిద్దాం రండి..
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు సూచిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపారు. బోర్డు పరిధిపైనే ప్రధానంగా చర్చ కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా.. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత జూలై 15న వాటి పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల లోగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలని, లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేస్తామని పేర్కొంది. షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డులే అధీనంలోకి తీసుకుని.. సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) బలగాల పహారాలో వాటిని నిర్వహిస్తాయని స్పష్టం చేసింది. బోర్డులు సమర్థవంతంగా పని చేయడానికి వీలుగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు జమ చేయాలని దిశానిర్దేశం చేసింది. అక్టోబర్ 14 నుంచే అమలుకు కేంద్రం దిశా నిర్దేశం కేంద్రం ఆదేశాల మేరకు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గత నెల 3, 9న బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ సర్కార్ గైర్హాజరైంది. ఈ క్రమంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రెండు బోర్డుల చైర్మన్లు తమ అభిప్రాయాలను వివరించారు. బోర్డు పరిధి, గెజిట్ నోటిఫికేషన్ అమలు ఖరారుపై సోమవారం నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తూనే.. మరో వైపు అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగానే చర్యలు చేపట్టాలని రెండు బోర్డులకు ఇప్పటికే కేంద్రం దిశా నిర్దేశం చేసింది. సవరణలు చేయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ► కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నాం. ► కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించి.. మిగతా ప్రాజెక్టుల్లో రోజు వారీ నీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుంది. దీని వల్ల కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుంది. ► ఉమ్మడి ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలి. మాచ్‌ఖండ్, సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలి. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలి. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు గుర్తించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలి. వాయిదా వేయాలి : తెలంగాణ సర్కార్ ► నీటి కేటాయింపులు తేలే వరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులుగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం వల్ల వాటికి రుణాలు తెచ్చుకోవడం సమస్యగా మారుతుంది. ► అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనలను సడలించాలి. -
నీటికోసం ఏనుగు.. ‘మనమూ నేర్చుకుందాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతూ మంచినీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోవైపు మానవ సమాజం అంతులేని నిర్లక్ష్యం. వెరసి అడవి జంతువులకు ప్రాణసంకటంగా మారుతోంది. చుక్క మంచినీరు దొరకడం కష్టంగా మారింది. అయినా మనుషులు నీటి వృధాపై దృష్టిపెట్టడంలేదు. ఈ విషయంలో నోరులేని జీవులు చాలా నయం అనిపిస్తోంది. ఈ విషయాన్ని జల సంరక్షణ మంత్రిత్వ శాఖ తాజా వీడియో ద్వారా తెలియజేసింది. చదవండి: World Elephant Day 2021: ఏనుగమ్మ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉన్న ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అందరినీ ఆలోపించేజేసేదిలా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాప్‌ను సరిగ్గా తిప్పకుండా వదిలేసే కొంతమందితో పోలిస్తే ఈ గజరాజు చాలా మేలంటున్నారు. ఒక ఏనుగు చేతి పంపుతో స్వయంగా నీటిని పంపింగ్ చేసి తాగుతోంది. దాహం వేసినప్పుడు సమీపంలోని సరస్సు లేదా చెరువు వంటి సహజ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఎంతో విచారకరం. అయితే ప్రతి నీటి బొట్టును ప్రాముఖ్యతను గుర్తించిన ఆ ఏనుగు తన దాహం తీర్చడానికి సరిపోయేంత నీటిని మాత్రమే పంప్ చేస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించిన తీరు విశేషంగా నిలిచింది. "ఏనుగు కూడా ప్రతీ నీటి చుక్క ప్రాముఖ్యతను ఆకళింపు చేసుకుంది. కానీ మనుషులుగా మనం ఈ అమూల్యమైన వనరును ఎందుకు వృధా చేస్తున్నాం, ”అంటూ జల సంరక్షణ మంత్రిత్వ శాఖ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఇకనైనా మనం పాఠాలు నేర్చుకుని నీటిని కాపాడుకుందాం అని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. एक हाथी भी #जल की एक-एक #बूंद का महत्व समझता है। फिर हम इंसान क्यों इस अनमोल रत्न को व्यर्थ करते हैं? आइए, आज इस जानवर से सीख लें और #जल_संरक्षण करें। pic.twitter.com/EhmSLyhtOI — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) September 3, 2021 -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంపూర్ణ సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నోటిఫికేషన్లో సవరణల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా ముందుకెళ్తామని తెలిపాయి. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు సమావేశం ముగిశాక... కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అమలే అజెండాగా కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–1, 2, 3 లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాలను తక్షణమే అందజేయాలని రెండు రాష్ట్రాలను కోరాయి. గతనెల 3న జరిగిన సమన్వయ కమిటీ సమావే శానికి, 9న జరిగిన బోర్డుల ఉమ్మడి సమావేశా నికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ఉమ్మడి భేటీకి హాజరయ్యారు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు లను బోర్డులు అధీనంలోకి తీసుకుని, నిర్వహిం చాలని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామ లరావు సూచించారు. ఇతర ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను రోజువారీ సేకరించి.. వాటా కింద లెక్కించాలని ప్రతిపాదించారు. దీనివల్ల బోర్డులపై భారం తగ్గుతుందన్నారు. తెలంగాణ అధికారులు కూడా ఇదేరీతిలో స్పందించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం అన్ని ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని, అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డుల చైర్మన్లు సూచించారు. నోటిఫికేషన్లో సవరణలు చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు రెండు రాష్ట్రాల అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి కేంద్రాలపై చర్చించాలని ఏపీ అధికారులు పట్టుబట్టగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. కృష్ణాజలాల తరహా లోనే ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతాన్ని ఏపీకి కేటాయించాలని అధికారులు కోరారు. సాగర్ కుడికాలువ, టెయిల్‌పాండ్, పులిచింతల విద్యు త్ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఏపీకే కేటా యించాలని, సాగర్ ఎడమకాలువ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను దామాషా పద్ధతిలో పంపిణీ చేయాలని ఏపీ అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనలపై తెలంగాణ అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో వాటిపై మరో సమావేశంలో చర్చిద్దామని కృష్ణా బోర్డు చైర్మన్ సూచించారు. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలతో సంబంధంలేని ప్రకాశం బ్యారేజీ కాలువల వ్యవస్థను కృష్ణా బోర్డు, ధవళేశ్వరం బ్యారేజీ కాలువల వ్యవస్థను గోదావరి బోర్డు పరిధి నుంచి మినహాయించాలని ఏపీ అధికా రులు కోరారు. రెండురాష్ట్రాల అధికారుల సూచనల మేరకు బోర్డుల పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి, నిపుణుడు, సభ్యుడు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగాల సీఈలు, జెన్కో సీఈల నేతృత్వంలో సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. -
నేడు కృష్ణా బోర్డు 14వ సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం, విద్యుదుత్పత్తి, బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు తదితర పది అంశాలు అజెండాగా బుధవారం కృష్ణాబోర్డు సమావేశమవుతోంది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా బలమైన వాదనలు విన్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరిని బోర్డు సమావేశం వేదికగా మరోసారి ఎండగట్టాలని నిర్ణయించింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం 14వ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి.. తెలంగాణ సర్కార్ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. పరిధిలోలేని అంశంపై చర్చకు కళ్లెం? ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015, జూన్ 18–19 తేదీల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ రెండు రాష్ట్రాలు ఇదే పద్ధతిలో కృష్ణా జలాలను వినియోగించుకోవాలని 2020, అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టంచేసింది. కానీ, ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. నదీ జలాల పంపిణీ అధికారం కేవలం ట్రిబ్యునళ్లకు మాత్రమే ఉందని.. పరిధిలోకి రాని ఈ అంశంపై చర్చించేందుకు ఆస్కారం ఇవ్వకూడదని బోర్డుకు ఇప్పటికే తేల్చిచెప్పింది. చిన్న నీటివనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే.. 175 టీఎంసీలు వాడుకుంటున్న నేపథ్యంలో ఏపీ వాటాను 79.88 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని బోర్డు సమావేశంలో తెగేసి చెప్పాలని నిర్ణయించింది. విద్యుదుత్పత్తితో రెండు రాష్ట్రాలకూ నష్టమే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుదుత్పత్తి చేస్తూ తమ హక్కులను కాలరాస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయాలని కోరింది. అంతేకాక.. ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖల దృష్టికీ ఈ అంశాన్ని తీసుకెళ్లి.. రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. అయినా.. తెలంగాణ సర్కార్ తీరు మారకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 185.78 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీని ఫలితంగా శ్రీశైలంలో నీటినిల్వ 158.63 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ వైఖరితో రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతుందనే అంశాన్ని బోర్డు సమావేశంలో మరోసారి ఎలుగెత్తాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. సీడబ్ల్యూసీ ప్రతిపాదన మేరకే.. ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని వాటా నీళ్లను మరుసటి ఏడాది వాడుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. వాటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ ఏకీభవించింది. క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని.. వాటిని ఏకాభిప్రాయంతో పంచుకోవడం లేదంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఆ మేరకే క్యారీ ఓవర్ జలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేయనుంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఆ నీటిని వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని మరోసారి ఏపీ ప్రతిపాదించనుంది. తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే.. కృషాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను వాడుకోవడానికి ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. వాటిని తమకే కేటాయించాలంటున్న తెలంగాణ వాదనను ఏపీ తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ జలాలు రెండు రాష్ట్రాలకు దక్కుతాయని.. ఈ అంశాన్ని తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలేగానీ బోర్డుకాదని తెగేసి చెప్పనుంది. ఇక కృష్ణా బేసిన్‌కు తెలంగాణ సర్కార్ మళ్లిస్తున్న 211 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని నిర్ణయించింది. నేడు గోదావరి బోర్డు భేటీ గోదావరి బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే ప్రధాన అజెండాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌లు పాల్గొననున్నారు. గత నెల 3న జరిగిన సమన్వయ కమిటీ, 9న జరిగిన ఉమ్మడి బోర్డుల సమావేశాలకు తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. -
కృష్ణా బోర్డు పరిధిలోకి ‘వెలిగొండ’ను తేవాలి
సాక్షి, అమరావతి : ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ ప్రాజెక్టును చేర్చాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం లేఖ రాశారు. లేఖలోని ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లా్లల్లో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా వెలిగొండ ప్రాజెక్టును 2004లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ► రాష్ట్ర విభజన నేపథ్యంలో.. నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు విభజన చట్టంలో 11వ షెడ్యూలులో ఈ ప్రాజెక్టును చేర్చింది. ► కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చలేదు. ► విభజన చట్టం ఆమోదించిన ఈ ప్రాజెక్టును తక్షణమే గెజిట్ నోటిఫికేషన్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి. -
కడగండ్లు తీర్చే జలాలు.. కాలయాపనతో కడలి పాలు
సాక్షి, అమరావతి: సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్న కృష్ణా వరద నీటిని నికర జలాల వాటా కింద లెక్కించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తుండటాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తివేసి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద జలాలను మళ్లించినా వాటిని లెక్కలోకి తీసుకోరాదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఇది దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం పరిష్కారంలో కృష్ణా బోర్డు కాలయాపన చేస్తుండటాన్ని ఆక్షేపిస్తున్నారు. 2019–20లో కృష్ణా నదికి భారీ వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ ద్వారా పెద్ద ఎత్తున వరద జలాలు సముద్రం పాలయ్యాయి. ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో వరద జలాలను ఎవరు మళ్లించినా లెక్కలోకి తీసుకోరాదని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను కృష్ణా బోర్డు కోరింది. మూడు నెలల్లో తేల్చుతామని.. కృష్ణా వరద జలాల మళ్లింపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2019 డిసెంబర్లో కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించడంతో పీపీవో సీఈ శరణ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొనగా కేవలం ఒక్క సమావేశాన్ని మాత్రమే నిర్వహించిన కమిటీ ఇంతవరకూ కనీసం ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఫలితంగా గతేడాది, ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ ఈ వివాదం అపరిష్కృతంగా ఉంది. దీనివల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవిరైన నీళ్లలో సగమైనా సీమకు దక్కలేదు.. రాయలసీమ ప్రజల త్యాగాల పునాదులపై శ్రీశైలం ప్రాజెక్టు ఆవిష్కృతమైంది. 1984–85 నుంచి 2003–04 మధ్య అంటే రెండు దశాబ్దాల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరైన జలాల్లో (349.61 టీఎంసీలు) కేవలం 45.93 శాతం (160.61 టీఎంసీలు) నీళ్లు మాత్రమే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం. అదీ ప్రాజెక్టులో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే ఆ మాత్రం జలాలైనా కాలువలకు చేరేవి. కడలి పాలైన నీళ్లతో పోలిస్తే సీమకు 22.55 శాతమే.. రాయలసీమ దయనీయ స్థితిని చూసి చలించి వరద నీటిని ఒడిసి పట్టి కరువు సీమను సుభిక్షం చేసేందుకే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2004లో చేపట్టారని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఫలితంగా 2004–05 నుంచి ఇప్పటివరకూ అంటే గత 16 ఏళ్లలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 1,402.48 టీఎంసీలు చేరాయి. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 6,220.301 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. అంటే కడలిలో కలిసిన జలాలతో పోలిస్తే కేవలం 22.55 శాతం మాత్రమే సీమ, నెల్లూరు జిల్లాలకు దక్కినట్లు స్పష్టమవుతోంది. వరద జలాలను మళ్లిస్తే తప్పేమిటి? ‘వృథాగా సముద్రంలో కలిసే కృష్ణా వరద జలాలను వినియోగించుకుంటే తప్పేమిటి? వరద నీటిని ఏ రాష్ట్రం వినియోగించుకున్నా నికర జలాల కోటా కింద లెక్కించకూడదు. వృథా అయ్యే నీటిని లెక్కించడంలో అర్థం లేదు. తెలంగాణ సర్కార్‌ది వితండ వాదన. వరద జలాలను రెండు రాష్ట్రాలూ మళ్లించుకుంటే దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు. ఈ వివాదం పరిష్కారంలో సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు కాలయాపన చేస్తుండటం దురదృష్టకరం’ – ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఈఎన్సీ -
AP: నదుల అనుసంధానానికి ‘నిరా’
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ(ఎన్‌ఐఆర్‌ఏ – నిరా) పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. కడలిపాలవుతోన్న నదీ జలాలను మళ్లించి.. దేశాన్ని సుభిక్షం చేసేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో నదుల అనుసంధానంపై అధ్యయనం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ హిమాలయ నదులను అనుసంధానం చేసేందుకు 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు నదుల అనుసంధానం చేపట్టాలని 2012 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 90ః10 నిష్పత్తిలో నిధులు నదుల అనుసంధానంపై అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి, రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్‌డబ్ల్యూడీఏ కేంద్రానికి తెలిపింది. ఈ సమస్యను అధిగమించడానికి ‘నిరా’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి 90 శాతం నిధులను కేంద్రం సమకూర్చాలని పేర్కొంది. మిగతా 10 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని సూచించింది. కేంద్రం, రాష్ట్రాలు నిధులను ‘నిరా’కు అందజేస్తే.. పనులు చేపడుతుందని పేర్కొంది. కెన్–బెట్వా నదుల అనుసంధానం నుంచే ‘నిరా’కు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నదుల అనుసంధానం పనులకు మార్గం సుగమమవుతుంది. ఏకాభిప్రాయానికి కసరత్తు ఏకాభిప్రాయంతో నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి ప్రత్యేక కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయం సాధించడానికి చర్యలు చేపట్టింది. కెన్–బెట్వా నదుల అనుసంధానానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో కెన్–బెట్వా నదుల అనుసంధానం ఒప్పందంపై ఆ రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహన్లు గతేడాది మార్చి 22న సంతకం చేశారు. 2017–18 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.35,111.24 కోట్ల వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానం కోసం ఈ నాలుగు నదుల పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ పనులకు 2018–19 ధరల ప్రకారం రూ.60,361 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇదే రీతిలో మిగిలిన నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. -
అసంపూర్తిగా 'బోర్డుల' ఉమ్మడి భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం నిర్వహించిన రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం తరఫున రెండు బోర్డుల్లో సభ్యులైన జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ తరఫున సభ్యులైన ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరయ్యారు. దాంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన రెండు బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ఇరు రాష్ట్రాలతో చర్చించి.. బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసుకోవాలని కేంద్రం దిశానిర్దేశం చేసిందని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేయాలని కోరగా.. ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. నోటిఫికేషన్లో కొన్ని అంశాలను సవరించాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలోకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని నెలలోగా అందజేస్తామని చెప్పారు. ఒకేసారి రూ.200 కోట్లు ఎందుకు.. బోర్డులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా సీడ్ మనీ కింద ఒక్కో బోర్డు ఖాతాలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. రెండు బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని.. ఆయా బోర్డులు పంపిన బిల్లులను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని గెజిట్ నోటిఫికేషన్లో ఉందని ఏపీ అధికారులు ఎత్తి చూపారు. దీనివల్ల బోర్డుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ దృష్ట్యా ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున రెండు బోర్డులకు రూ.400 కోట్లను డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ఏపీ అధికారులు ప్రశ్నించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు 60 రోజుల్లోగా సీడ్ మనీ జమ చేయాల్సిందేనని చైర్మన్లు చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రాజెక్టులకు రక్షణ.. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులు.. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేంద్రం రక్షణ కల్పించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. కానీ.. గెజిట్ నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరు తప్పుగా పడిందని.. ఆ ప్రాజెక్టుకు రక్షణ కల్పించాలని ఏపీ అధికారులు కోరారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్ శక్తి శాఖ చర్చలు జరుపుతోందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను మాత్రమే బోర్డుల అధీనంలోకి తీసుకుని.. వాటికే సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే వ్యయం తగ్గుతుందని, లేదంటే భద్రత వ్యయం భారీగా పెరుగుతుందని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచే అమల్లోకి వస్తుందని.. సమయం తక్కువగా ఉండటంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయడానికి ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహిస్తామని.. సహకరించాలని చేసిన సూచనకు ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో మళ్లీ బోర్డుల ఉమ్మడి భేటీని నిర్వహించాలని నిర్ణయించారు. -
ప్రాజెక్టుల స్వాధీన ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కృష్ణా బోర్డు సిద్ధమయ్యింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావులకు బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీలతో పాటు.. వాటిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా లై¯Œన్ల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా ఉప నది అయిన తుంగభద్రకు సంబంధించి హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ వాటిపై ఉన్న ఎత్తిపోతలు, బ్యారేజీల వివరాలు కూడా అందజేయాలని ఆదేశించారు. అలాగే ఇరు రాష్ట్రాల్లోనూ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి (బేసిన్‌కు) గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గతనెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ అన్నీ బోర్డే.. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2 కింద చేర్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు తదితరాలన్నిటినీ అక్టోబర్ 14 నుంచి బోర్డు తన అధీనంలోకి తీసుకోనుంది. రోజువారీగా వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనుంది. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తుంది. త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు జారీ చేస్తుంది. కోటా ముగియగానే విడుదలను ఆపేస్తుంది. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ, ఏపీలను ఆదేశించింది నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 589.20 అడుగులుగా ఉంది. 312.0450 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 309.6546 టీఎంసీల నీరుంది. రెండు క్రస్ట్ గేట్ల నుంచి 50,177 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,11,384 క్యూసెక్కులతో పాటు కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. – నాగార్జునసాగర్ షెడ్యూల్–2 కింద ఉన్నవివే.. జూరాల ప్రాజెక్టు, కాలువలు, విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్సెల్బీసీ, హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (వెలిగోడు ప్రాజెక్టుతో పాటు అవుకు రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువలు), వెలిగొండ, నాగార్జునసాగర్, విద్యుత్ కేంద్రం, సాగర్ టెయిల్ పాండ్, కుడి, ఎడమ కాలువలు, పులిచింతల ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం, ప్రకాశం బ్యారేజీ, కాలువలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలు, కాళేశ్వరం, ఎస్సారెస్పీ ద్వారా కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించే ఎత్తిపోతలు, తుంగభద్రకు సంబంధించి ఏపీ సరిహద్దు నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ (సుంకేశుల బ్యారేజీ), తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆర్డీఎస్. చిన్న నీటి వనరులపై వివరణివ్వండి.. ఇలావుండగా చిన్న నీటి వనరుల కింద తెలంగాణ చేస్తున్న నీటి వినియోగంపై కృష్ణా బోర్డు మరోమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. తెలంగాణకు చిన్న నీటి వనరుల కింద 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నప్పటికీ 174 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బోర్డు స్పందించింది. మరోవైపు బోర్డు పరిధిపై తమ అభ్యంతరాలకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం..వాటిని లేఖ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలియజేసేందుకు సిద్ధమవుతోంది. -
పార్లమెంటు ముగిశాక ‘పోలవరం’ వస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులు పరిశీలించనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన దళితులు, ఆదివాసీలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీలో ప్రత్యేకంగా కేటాయిస్తున్న అదనపు ప్యాకేజీ ఏదైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారి పునరావాస ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా? అంటూ కనకమేడల ప్రశ్నించారు. దీనికి షెకావత్ సమాధానమిస్తూ.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. దళితులు, ఆదివాసీలకు అదనపు ప్యాకేజీ అందిస్తోందని వివరించారు. అదనంగా రూ.50 వేల చొప్పున గ్రాంటు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షల సాయం అన్ని నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియ పరిశీలనకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైందన్నారు. పునరావాస ప్రక్రియలో దళితులకు, ఆదివాసీలకు తగినంత ఉపశమనం ఇవ్వలేదని కనకమేడల అనుబంధ ప్రశ్న వేస్తూ ఈ ప్రక్రియ కోసం కేంద్రం ఎంత సాయం చేసిందని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. పునరావాస ప్రక్రియలో సమకూర్చే వసతుల విషయంలో పెద్ద జాబితా ఉందని, వాటన్నింటినీ ప్రస్తావించారు. ఈ సమయంలో.. ఒడిశా నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారా? అని ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంలో ఈ అంశం విచారణలో ఉన్నందున దీనిపై ప్రకటన చేయడం సముచితం కాదన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇదే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొన్ని నివేదనలు ఉన్నాయి.. కేంద్రమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలి. దీనివల్ల నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని సంప్రదించేందుకు వీలవుతుంది..’ అని ప్రస్తావించారు. మంత్రి బదులిస్తూ.. ‘కార్యాలయ తరలింపు పరిశీలనలో ఉంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులను పరిశీలిస్తాం..’ అని సమాధానమిచ్చారు. -
పోలవరానికి రూ.47,725 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకారం తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖకు, కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేస్తామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు బుధవారం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో గంటపాటు సమావేశమయ్యారు. ఎంపీలంతా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘జలశక్తి మంత్రితో సమావేశమై 5 అంశాలను ప్రధానంగా చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం గురించి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 2017–18 ధరల సూచీని అనుసరించి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తిశాఖకు సిఫారసు చేశాయి. దీన్ని సీడబ్ల్యూసీ పరిధిలోని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) పరిశీలించి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఆమోదించి జలశక్తిశాఖకు సిఫారసు చేసింది. సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసి ఆమోదించాలని కోరాం. కానీ మంత్రి ఆర్సీసీ సిఫారసు చేసిన మేరకు రూ.47,725 కోట్లను ఆమోదిస్తామన్నారు. ఇక రెండో అంశం.. ఒక ఎస్క్రో ఖాతా పెట్టి అందులో డబ్బు జమచేయాలని కోరగా.. అది సాధ్యం కాదని, ఎప్పుడైనా వారం, 15 రోజుల్లో రీయింబర్స్ చేసేలా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు చేయాల్సిన రూ.1,907 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను చేస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి వివరించారు. పద్దుల వారీగా చూడొద్దని కోరాం.. ‘అంచనా వ్యయాన్ని విభిన్న పద్దుల కింద టీఏసీ ఆమోదించింది. కాంపొనెంట్ వారీగా పద్దును పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తరువాత ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోఅంశం.. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరాం. తప్పకుండా వర్తింపజేస్తామని, దాని ప్రకారమే అంచనా వ్యయాన్ని ఆమోదిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించడానికి మంత్రి అంగీకరించారు.’ అని తెలిపారు. టీఏసీ ఆమోదించిన ప్రతిపాదనలకు, జలశక్తి ఆమోదిస్తున్న ప్రతిపాదనలకు అంతరం ఉందని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ‘ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 51 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా పరిగణించారు. కానీ సర్వే, భూరికార్డుల పరిశీలనల్లో అవి ప్రయివేటు, అసైన్డ్ భూములుగా తేలింది. తొలుత ప్రభుత్వ భూములని చెప్పినందువల్ల కేంద్రం ఇప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. తరువాత పరిశీలిస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం సానుకూలంగా ముగిసింది సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లేవనెత్తిన అనేక అంశాలపై సమగ్రంగా చర్చించాం. సమావేశం చాలాచాలా సానుకూలంగా ముగిసింది..’ అని పేర్కొన్నారు. -
Telangana: భారీ వర్షాలు.. ప్రాజెక్టులన్నీ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్ సహా గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద అంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. గోదావరిలో ఫుల్ ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మరోవైపు నదులకు వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు కృష్ణాలో జోష్: కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. నారాయణపూర్ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి జూరాలకు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిం డాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నా యి. గురువారం నాటికి 4,698 చెరువులు నిండిపో గా మరో 7,574 చెరువులు నిండిపోయే దశకు చేరా యి. మరో 9 వేలకుపైగా చెరువులు సగానికిపైగా నిండినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
'కృష్ణా జలాల పునఃపంపిణీ' అసాధ్యం!
(రామగోపాలరెడ్డి ఆలమూరు–సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన కృష్ణా నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ)–1956 సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పునఃపంపణీ చేయడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలకు కానే కాదని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్–4(2), సెక్షన్–6(2) ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పే అంతిమం అని, అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ముట్టుకోక పోవడానికి అదే కారణమని ఎత్తిచూపుతున్నారు. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 వెరసి 448 టీఎంసీలను మాత్రమే అదనంగా మూడు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనపై న్యాయ శాఖ వెల్లడించే అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ అవస్థి శుక్రవారం స్పష్టం చేయడమే అందుకు తార్కాణమని చెబుతున్నారు. పునఃపంపిణీ చేయాలంటున్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాదనలు విన్పించలేదని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయాలని 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ 2015 మే 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని నాటి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి తేల్చి చెబుతూ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 20న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్–5(2) కింద ముసాయిదా, 5(3) కింద కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని.. ప్రతిపాదన పంపితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జూన్ 9న తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని కోరుతూ జూన్ 14న కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ.. న్యాయ శాఖ అభిప్రాయం కోరింది. ఇప్పటికే తేల్చి చెప్పిన కేంద్రం విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కాకుండా.. నాలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాలను పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏపీ, తెలంగాణ సర్కార్లు కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కోరింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికే ట్రిబ్యునల్ గడువును పొడిగించామే తప్ప.. నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాదని స్పష్టం చేస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని 2016 అక్టోబర్ 19న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ మేరకు గత ఐదేళ్లుగా విచారణ చేస్తోంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కష్టమే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను సెక్షన్–3 రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే.. బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న ఇచ్చిన తుది నివేదికను సెక్షన్–6(2) ప్రకారం నోటిఫై చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదు. ఇక రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించే ప్రశ్నే లేదు. కాదూ కూడదని కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మిగతా మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాలకూ 2,578 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2020 డిసెంబర్ 30న సెక్షన్–5(2) కింద ముసాయిదా, 2013 నవంబర్ 29న సెక్షన్–5(3) కింద తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ నివేదికలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా వాటికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటిదాకా కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఆ ట్రిబ్యునల్ గడువును పొడిగించింది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేనాటి కంటే ముందు అంటే 2014 జూన్ 2కు ముందు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తూ తీర్పు ఇస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని విభజన చట్టంలో సెక్షన్–89 స్పష్టం చేసింది. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7)(ఈ)/4 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు అలానే కొనసాగించాలి. ఈ దృష్ట్యా 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని రాసిన లేఖను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ కేంద్రం చేసిన సర్దుబాటు ఒప్పందాన్ని అంగీకరిస్తూ తెలంగాణ సర్కార్ సంతకం చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని విస్మరించి.. సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ పాత పల్లవిని కొత్తగా అందుకుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది బహిరంగ రహస్యమేనని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష చట్టవిరుద్ధం కృష్ణా నదీ జలాలను బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969 ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో 2,060.. పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసింది. వాటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976 మే 31న తుది తీర్పు ఇచ్చింది. ఇందులో 749.16 టీఎంసీలతో 1971 మే 7న కుదిరిన అంతర్రాష్ట ఒప్పందం మేరకు చేపట్టిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించింది. వీటికి అదనంగా 50.84 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84, శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జలాల్లో రాయలసీమకు 144.70, కోస్తాకు 387.34, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించడంతో కోస్తాకు నీటి వాటా 367.34 టీఎంసీలకు తగ్గి.. తెలంగాణ వాటా 298.96 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టానికి 2002 ఆగస్టు 6న కేంద్రం చేసిన సవరణ ప్రకారం.. ఈ సవరణకు ముందు జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఈ సవరణ కంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ముందు వెలువడింది కాబట్టి.. అదే అంతిమమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్–3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం సాధ్యం కానే కాదని స్పష్టం చేస్తున్నారు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానమని చట్టంలో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ ఒకసారి ఉత్తర్వులు జారీ చేశాక పునఃపంపిణీ కుదరదంటూ 1956 చట్టానికి 20 02లో సవరణ చేయడాన్ని ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ 2 కేటా యించిన జలాలను విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంత ర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రా ల మధ్య పంపిణీ చేయాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వ్యక్తిగతంగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గురువారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఐఎస్ఆర్డబ్ల్యూఆర్డీ 1956 సెక్షన్ 3 ప్రకారం 1969లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ – 1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 1976 మే 31న అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో అప్పటికే పూర్తయిన వాటికి ప్రాజెక్టుల వారీగా 749.16 టీఎంసీలను కేటాయించింది. జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలు కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. ► కృష్ణా జలాల పునఃపంపిణీకి సెక్షన్ 3 ప్రకారం 2004లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ–2.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదు. కేడబ్ల్యూడీటీ–1 తీర్పును పునఃసమీక్షించటం చట్టవిరుద్ధం కావ డం వల్లే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న మిగులు జలాలనే కేడబ్ల్యూడీటీ–2 పంపిణీ చే సింది. మిగులు జలాలను పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచ్చిన నివేదికను సవా ల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కేడబ్ల్యూడీటీ–2 నివేదికను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ► గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్న ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తెలంగాణ గత నెల 9న ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. ► 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన జలాలను కేడబ్ల్యూడీటీ–2 కొనసాగించింది. ఎందుకంటే వాటిని పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధం. -
అక్రమాన్ని అడ్డుకోండి
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 26 టీఎంసీలు వస్తే.. తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19 టీఎంసీలను వాడుకుని, దిగువకు వదిలేసింది. అందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదు. దీంతో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తోంది. విభజన చట్టంలో నిబంధనల మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయాలి. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తేవాలి. వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలి. ఆ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి. సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటా దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. సాగునీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సర్కార్ దుందుడుకు చర్యల వల్ల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా వివాదం పరిష్కారం కాలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి.. సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, ఎస్సెల్బీసీ పూర్తయితే శ్రీశైలంలో చుక్క నీరు కూడా ఏపీకి మిగలదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి బుధవారం సీఎం వైఎస్ జగన్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న తెలంగాణ ► విభజన చట్టం ద్వారా ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు.. రెండు రాష్ట్రాలకు నీటి వాటాల పంపిణీ, నీటి విడుదలపై రూపొందించిన తాత్కాలిక సర్దుబాట్లు, ఒప్పందాలను తెలంగాణ సర్కార్ తుంగలో తొక్కుతూ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటాన్ని ఈనెల 1న రాసిన లేఖలో మీ దృష్టికి తెచ్చాం. ► శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ చేసిన మేరకు 44 వేల క్యూసెక్కులు కాలువల ద్వారా తరలించవచ్చు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితే అత్యవసరాల కోసం కేవలం 6వేల క్యూసెక్కులనే తరలించొచ్చు. తద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవకాశముంటుంది. చెన్నైకీ తాగునీరు సరఫరా చేయవచ్చు. ► ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటి రోజే.. అంటే జూన్ 1న శ్రీశైలంలో కనీస నీటి మట్టం(విద్యుదుత్పత్తికి) 834 అడుగుల దిగువన నీటి నిల్వ ఉన్నా.. కృష్ణా బోర్డుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో ఎలాంటి సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ క్రమంలో పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరాయంగా జల విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్ జూన్ 28న ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తోంది. ఆ నీళ్లన్నీ తెలంగాణ కోటా కింద లెక్కించాలి ► నాగార్జునసాగర్‌లోనూ అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తోంది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టులోనూ.. అధీకృత అధికారి, విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా.. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ► ఆ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఏపీకి వాటాగా దక్కిన జలాలను దక్కనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ అక్రమంగా తోడేస్తున్న నీటిని.. ఆ రాష్ట్ర వాటా అయిన 299 టీఎంసీల కోటా కింద లెక్కించాలి. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు విఫలం ► ఏపీకి వాటాగా దక్కాల్సిన జలాలను దక్కనివ్వకుండా చేసి, తెలంగాణ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తుండటాన్ని పలుమార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టిందని కూడా వివరించాం. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు సమర్థంగా వ్యవహరించడం లేదు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీ చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి, రోజుకు 0.4 టీఎంసీల చొప్పున తరలించేలా కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, 825 అడుగుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున తరలించేలా ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచే పనులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. ఇదికాక 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉంది. రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం ► తెలంగాణ సర్కార్ దుందుడుకు చర్యలకు తోడు అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి చక్క మిగలదు. కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులున్నాయి. తెలంగాణ చర్యలతో ఈ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీపై నీళ్లందించలేని దుస్థితి. ► ఈ దుస్థితిని అధిగమించి.. సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చాలంటే.. శ్రీశైలంలో 800అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఒక్కటే శరణ్యం. అదనంగా చుక్క నీటినీ వాడుకోం ► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించడం లేదు. కొత్తగా కాలువలు తవ్వడం లేదు. నీటి నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికే ఈ ఎత్తిపోతల చేపట్టాం. రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీల కోటాలోనే నీటిని వాడుకుంటాం. అదనంగా ఒక్క చుక్క వాడుకోం. -
అక్రమాన్ని ఆపండి: సీఎం జగన్
‘‘జల విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకోవద్దని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్), ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా, అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇది అంతరాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తోంది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కల్పిస్తోంది. తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగక తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది’’ – ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సర్కార్ అక్రమంగా వినియోగించిన నీటిని ఆ రాష్ట్ర కోటా కింద పరిగణించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి సీఎం వైఎస్ జగన్ గురువారం లేఖ రాశారు. ఇవే అంశాలను వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కూడా లేఖ రాశారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. తాత్కాలిక ఏర్పాట్లు.. కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్–85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటిదాకా బోర్డు పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను ఆంధ్రప్రదేశ్.. జూరాల, నాగార్జునసాగర్‌లను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించేలా ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలను ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా.. నీటి వాటాల పంపిణీపై 2015 జూలై 18, 19న కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ తాత్కాలిక సర్దుబాటు చేసింది. తాత్కాలిక సర్దుబాటు మేరకు జలాలను పంపిణీ చేయడానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. నీటి లభ్యత, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని త్రిసభ్య కమిటీ సిఫార్సుల ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు ఉత్వర్వులు జారీ చేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రాజెక్టుల అధికారులు వీటిని అమలు చేయాలి. ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాలు, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లభ్యతగా ఉన్న నీటిని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమంగా నీటిని వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కనీస మట్టం లేకున్నా విద్యుదుత్పత్తి.. శ్రీశైలం ప్రాజెక్టు తొలుత హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టే. కానీ కాలక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే తాగు, పారిశ్రామిక, సాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు. విద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా సాగునీటి విడుదలకు కనీస మట్టం 854 అడుగులు ఉండాలి. జూన్ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల్లో 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. కానీ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే తెలంగాణ సర్కార్ అదే రోజు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్‌లో 173.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ ఆయకట్టుకు నీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసింది. పెరగని నీటిమట్టం.. జూన్ 30 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 17.36 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి కోసం 6.9 టీఎంసీలు (40 శాతం) నీటిని తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకుంది. రోజూ రెండు టీఎంసీలను వాడుకుంటూ తెలంగాణ సర్కార్ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తాగు, సాగునీటి కోసం నీటిని తీసుకోవచ్చు. ఈ రెగ్యులేటర్ ద్వారానే తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తాం. చెన్నైకి తాగునీటిని సరఫరా చేస్తాం. బోర్డు ఆదేశించినా... తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తుండటంపై జూన్ 10న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని జూన్ 17న తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ లేఖ రాసింది. గ్రిడ్ అత్యవసర పరిస్థితి ఉంటే మినహా మిగిలిన సందర్భాల్లో కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ అమలు చేయాలి. కానీ.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లి జూన్ 23, 29న లేఖలు రాశాం. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు. కనీస నీటి మట్టం 510 అడుగులు. జూన్ 30 నాటికి 534.2 అడుగుల్లో సాగర్‌లో 176.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండా, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్ నుంచి 30,400 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఈ రోజు వరకూ దిగువన సాగునీటి అవసరాలు లేకున్నా సాగర్ నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తోంది. అనుమతి తీసుకోకుండా.. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడానికే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే జూన్ 29న ఉదయం 8 గంటలకు తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తూ పులిచింతలలో తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని జూన్ 30న కృష్ణా బోర్డుకు లేఖ రాశాం. బ్యారేజీ నుంచి వృథాగా బంగాళాఖాతంలోకి.. ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల బ్యారేజీ నుంచి వాటిని వృథాగా బంగాళాఖాతంలోకి వదిలేయాల్సి వస్తోంది. దిగువ రాష్ట్రం హక్కులను కాపాడండి.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ స్థాపిత సామర్థ్యం మేరకు వంద శాతం జలవిద్యుదుత్పత్తి చేసేలా తెలంగాణ సర్కార్ జూన్ 28న జీవో 34 జారీ చేసింది. అంటే దీని అర్ధం తెలంగాణ సర్కార్ రోజూ శ్రీశైలం నుంచి నాలుగు, సాగర్ నుంచి మూడు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలను జల విద్యుత్తు కోసం విడుదల చేస్తున్నట్లే. విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని కృష్ణా బోర్డు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడానికి తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయండి. -
సవరించిన అంచనాకు ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సోమవారం సానుకూలంగా స్పందించింది. సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇచ్చాక.. వాటిని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటిపారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని, ఆ రెండూ ఒకటేనన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని విభాగాల (కాంపొనెంట్) వారీగా చూడకుండా.. రీయింబర్స్ చేయడంపైనా సానుకూలంగా స్పందించింది. గురువారం తమ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని మంత్రి షెకావత్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్ హెచ్‌కే హల్దార్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సలహాదారు వెదిరె శ్రీరాం, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నిధులు ఇస్తే గడువు నాటికే పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) ఆమోదించిందని.. ఈ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేస్తే నిర్దేశించుకున్న గడువు 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఆదిత్యనాథ్ దాస్ కోరారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈ వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పీపీఏ స్పష్టత కోరామని, ఆ వివరణ వచ్చాక మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టత కోరిన అంశాలపై వివరణ తక్షణమే పంపుతామని చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పీపీఏ నుంచి వివరణ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకుంటామని ముఖర్జీ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపర్చిన సీడబ్ల్యూసీ జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటిపారుదల వ్యయం, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని.. రెండూ ఒకటేనని.. ఆ మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ బలపర్చారు. దాంతో.. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల, సరఫరా విభాగాన్ని ఒకటిగానే పరిగణించి నిధులు విడుదల చేస్తామని దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. విభాగాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వేగంగా రీయింబర్స్ చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చేసిన సూచనపై ఆమె సానుకూలంగా స్పందించారు. మిగులు జలాలే లేనప్పుడు తరలింపు ఎలా సాధ్యం? గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని.. తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పంపామని.. దాన్ని ఆమోదిస్తే కెన్–బెట్వా అనుసంధానం తరహాలో పనులు చేపడతామని ఎన్‌బ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ.. గోదావరిలో మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు 247 టీఎంసీలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ వాదనతో హెచ్‌కే హల్దార్ కూడా ఏకీభవించారు. గోదావరిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సలహాదారు వెదిరె శ్రీరాం స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 176 టీఎంసీలు (5 వేల మిలియన్ క్యూబిక్ మీటర్లు), ఇచ్చంపల్లి వద్ద 71 టీఎంసీల మిగులు జలాలు (రెండు వేల మిలియన్ క్యూబిక్ మీటర్లు)ను కలిపి ఈ అనుసంధానానికి తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిందన్నారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి రాష్ట్ర అవసరాలు తీర్చాక గోదావరి మిగులు జలాలను కావేరీకి తరలిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. పోలవరం నుంచి నీటిని తరలించాలంటే ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలని.. ఇచ్చంపల్లి నుంచి తక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయవచ్చని, దీనికి తక్కువ వ్యయం అవుతుందని.. వీటిపై అధ్యయనం చేసి అభిప్రాయం చెబుతామని భోపాల్‌సింగ్ తెలిపారు. -
పోలవరం మరింత వేగం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనతో కేంద్రంలో కదలిక వచ్చింది. తమ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఆ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు ఢిల్లీలో సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన అధికారుల బృందం ఆదివారం ఢిల్లీకి వెళ్తోంది. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై గురు, శుక్రవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవ్దేకర్.. రైల్వే, పరిశ్రమలు, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. సీఎం ప్రస్తావించిన అంశాల పరిష్కారంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. సత్వరమే పోలవరం పూర్తి దిశగా.. ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసే దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో చర్చించారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందనే అంశాన్ని గుర్తు చేశారు. ఆ వ్యయానికి సంబంధించి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీ చేసి, నిధులు విడుదల చేస్తే సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ► ఇరిగేషన్ (నీటి పారుదల) విభాగం.. నీటి సరఫరా (వాటర్ సప్లయ్) విభాగం వేర్వేరు కాదని, ఆ రెండు ఒకటేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేసిందనే అంశాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యయం చేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని ప్రతిపాదించారు. ► వీటన్నింటికీ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ తదితర ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎస్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని పుంపుతామని కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండా ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు పోలవరంతోపాటు రాష్ట్రానికి చెందిన నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా సోమవారం ఢిల్లీలో ఆ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లగా సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసిన సీడబ్ల్యూసీ, టీఏసీ.. ఆ మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేసిన అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ► ఆ వ్యయానికి సంబంధించి తక్షణమే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేయనున్నారు. హెడ్ వర్క్స్(జలాశయం), కుడి కాలువ, ఎడమ కాలువ, భూ సేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వంటి విభాగాలతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. ► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం నీటి పారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని రెండు ఒకటేనని.. ఇదే అంశంపై సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ ఇచ్చిన నివేదికను సమావేశంలో ప్రస్తావించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని, దీన్ని నివారించాలని సూచించనున్నారు. ప్రాజెక్టు పనులకు సమీపంలోనే పీపీఏ కార్యాలయం ఉంటే.. ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని, తక్షణమే ఈ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరనున్నారు. ► ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లను యుద్ధ ప్రాతిపదికన ఆమోదించాలని సూచించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతోపాటు రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా సమావేశంలో చర్చిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
పోలవరం పనులపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ప్రకారమే పూర్తిచేసిందని కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రశంసించారు. గోదావరికి వరద వచ్చేలోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను సురక్షిత స్థాయికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూలైలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే సీజన్లో పనులను పూర్తిచేయడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీచేస్తామని చెప్పారు. తాజా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ప్రకారం పోలవరానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపుతామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వర్చువల్ విధానంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ హెచ్.కె.హల్దార్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. 41.10 శాతం పూర్తి పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) పనులు 73.65 శాతం, కుడి కాలువ పనులు 91.69, ఎడమ కాలువ పనులు 70.10 శాతం.. వెరసి ప్రాజెక్టు పనులు 76.29 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు వివరించారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులు 20.19 శాతం పూర్తయ్యాయని.. మొత్తం కలిపితే 41.10 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. దీనిపై కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. స్పిల్ వే పనులను సకాలం లో పూర్తిచేశారని ప్రశంసించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తిచేస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పా రు. వీలైనంత తొందరగా సమగ్ర ప్రాజెక్టు నివేదక (డీపీఆర్) రూపొందించి టెండర్లు పిలుస్తామని వివరించారు. పునరావాస పనులు వేగవంతం వరద వచ్చేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని కుటుంబాలకు పునరావాసం కల్పిం చే పనులను వేగవంతం చేశామని సహాయ, పునరావాస విభాగం కమిషనర్ ఒ.ఆనంద్ తెలిపారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ జూలైలోగా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈ సీజన్లో చేయగా మిగిలిన పనులను వచ్చే సీజన్లో పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో 2017– 18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) సవరించిందని, రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) రూ.47,725.74 కోట్లకు ఆమోదించిందని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులిస్తే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉం టుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు.కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి ఇస్తామని చెప్పారు. 2010–11 ధరల ప్రకారం పోలవరానికి కేంద్ర కేబినెట్ నిధులు మంజూరు చేసిందన్నారు. 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతామని, ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. -
AP: పోలవరం ప్రగతిపై నేడు సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తామని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ లేఖ రాశారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులతోపాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొననున్నారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం విదితమే. ఈ సీజన్లో చేయాల్సిన పనుల ప్రగతిపై సమావేశంలో సమగ్రంగా సమీక్షిస్తారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, వరదను దిగువకు మళ్లించే స్పిల్‌వే పనులు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై చర్చిస్తారు. గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించడంపై సమీక్షించి, వరద సమయంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ముందుగా ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడటం, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైన సహకారం అందించడంపై కూడా సమావేశం అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ బుధవారం కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. పనుల పరిశీలన పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సీడీవో కె.శ్రీనివాస్, సీఈ హైడ్రాలజీ టీఎన్వీ కుమార్, ఆంధ్రా రీజియన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ రేవు సతీష్‌కుమార్, అడ్వయిజర్ గిరిధర్‌రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్‌బాబు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, పైలెట్ చానల్, కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించి ఎస్ఈ కె.నరసింహమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 15వ తేదీలోపు స్పిల్‌వే మీదుగా గోదావరి నీటిని దిగువకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్పిల్‌వే మీదుగా నీరు దిగువకు విడుదల చేస్తే నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై చర్చించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఇప్పటికే నీరు ఎగపోటు పెరుగుతోందనే అంశాన్ని పరిశీలించారు. స్పిల్‌వే, రివర్స్ స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు స్పిల్ చానల్ మీదుగా తిరిగి గోదావరి ప్రవాహం యథావిధిగా నదిలో కలిసేలా పనులు చేపట్టారు. అనంతరం పోలవరం గ్రామంలో వరద రక్షణగా నిర్మించిన నెక్లెస్‌బండ్ పనులను అధికారుల బృందం పరిశీలించింది. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
నేడు పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొంటారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో, వచ్చే సీజన్లో చేపట్టాల్సిన పనులు, గడవులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సమీక్షలో కోరనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో బకాయిపడిన రూ.1,600 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. నిర్వాసితులకు పురావాసం కల్పించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించనున్నారు. -
ఏపీకి 512.04.. తెలంగాణకు 298.96 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు అమల్లోకి(నోటిఫై) వచ్చేవరకూ ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున కేటాయించి, పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమాచారమిచ్చారు. సర్వ సభ్య సమావేశంలో కేంద్రం ప్రతిపాదనను ప్రవేశపెట్టి.. ఇరు రాష్ట్రాల నుంచి లాంఛనంగా ఆమోదం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 కృష్ణా నదీజలాల్లో 75 % లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాలు చేస్తూ ఏపీ, తెలంగాణలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషిన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు పునఃపంపిణీ చేయాలని ఆ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఆదేశించడంతో కేడబ్ల్యూడీటీ–2 గడువును పొడిగించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 ఇరు రాష్ట్రాల వాదనలను వింటోంది. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015, జూన్ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఆ మేరకు 2015–16 నుంచి ఇప్పటివరకూ కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేయడానికి ఏటా ప్రతిపాదనలు చేయడం.. వాటిని ఏపీ, తెలంగాణలు ఆమోదించడం.. ఆ మేరకు నీటిని పంపిణీ చేయడం జరుగుతూ వస్తోంది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రానందున ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం మరోసారి కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది. ఆ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ జూన్ 19, 2015న ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు 2 రాష్ట్రాలకు నీటిని కేటాయించి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. -
‘అప్పర్ భద్ర’కు జాతీయ హోదా?
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు ‘అప్పర్’ గండం ముంచుకొస్తోంది..! అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా కర్ణాటక సర్కారు చేపట్టిన ‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీ 2018 – 19 ధరల ప్రకారం అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో అనుమతి ఇచ్చింది. తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.21,450 కోట్లుగా ఉంది. అప్పర్ భద్రకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన మరుక్షణమే అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుంది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రమే అందజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండానే అప్పర్ భద్రకు ఇప్పటికే సాంకేతిక అనుమతి ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి జాతీయ హోదా కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుంగభద్ర సబ్ బేసిన్(కే–8)లో కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేటాయించిన 295 టీఎంసీల కంటే కర్ణాటక ఇప్పటికే అధికంగా వాడుకుంటోంది. కర్ణాటకకు టీబీ డ్యామ్ (తుంగభద్ర జలాశయం)కు ఎగువన 151.74 టీఎంసీలు కేటాయిస్తే 176.96 టీఎంసీలను వాడుకుంటున్నట్లు కేడబ్ల్యూడీటీ – 2 సైతం తేల్చి చెప్పింది. అప్పర్ భద్ర ద్వారా 29.40 టీఎంసీలను ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కర్ణాటక చెబుతున్నా ఆ స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించాలంటే కనీసం 55 టీఎంసీలు అవసరమని, అదే స్థాయిలో నీటిని తరలించేలా కర్ణాటక ప్రాజెక్టును చేపట్టిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్లో భద్ర డ్యామ్‌లో నిల్వ చేసిన నీటితో కలుపుకొంటే కర్ణాటక వంద టీఎంసీలకు పైగా వినియోగించుకుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కర్ణాటక జలదోపిడీ వల్ల ఇప్పటికే టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిందని, ఇక అప్పర్ భద్ర పూర్తయితే ఏపీలో దుర్భిక్ష రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువతోపాటు తెలంగాణలో ఆర్డీఎస్ కింద వెరసి 6.52 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నుంచి వరద తగ్గడం శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఆగమేఘాలపై అప్పర్ భద్ర.. అప్పర్ భద్ర ప్రాజెక్టును 2014లో చేపట్టిన కర్ణాటక జాతీయ హోదాకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను 2015లోనే సాధించింది. ఈ అనుమతులతో సంబంధం లేకుండానే పనులు చేపట్టి 2019 మే నాటికే రూ.4,830 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. 2020 ఆగస్టు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఆమోదముద్ర వేసింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన అప్పర్ భద్ర స్వరూపం ఇదీ.. ► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 11.263 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా భద్ర జలాశయంలోకి తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి 47.50 కి.మీ. (అజాంపుర వద్ద 6.9 కి.మీ. సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ. వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోసి చిక్మగళూర్, చిక్బళాç్ల³Nర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్ల (5,57,247 ఎకరాలకు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి ఆయకట్టును స్థిరీకరిస్తారు. లెక్కలు.... కాకి లెక్కలే! ‘కేడబ్ల్యూడీటీ – 1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల 6.25 వెరసి 23 టీఎంసీలు మిగిలాయి. ఇక కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటా 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీలు కాగా ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటాం’ అని కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీకి అందచేసిన డీపీఆర్‌లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తుంగ, భద్ర, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 కూడా పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక చెప్పేవన్నీ కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. -
భద్రంగా కట్టుకోండి!
కర్ణాటక జలదోపిడీకి సంపూర్ణ సహకారం ఇచ్చేలా కేంద్రం నిర్ణయాలు చేస్తోంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, అభ్యంతరాలను పట్టించుకోకుండా... ఏకపక్షంగా కొమ్ముకాస్తోంది. కేటాయింపులకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో కర్ణాటక ఎడాపెడా నీటిని తోడేస్తే... దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలున్నాయి. సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల గరిష్ట నీటి వినియోగమే లక్ష్యంగా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ చేసిన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్– 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వడ మే తప్పుగా పరిగణిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా జా తీయ హోదాకు సిఫారసు చేయడం తెలుగు రా ష్ట్రాలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్ర ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది ఆమోదంతో జాతీయ హోదా దక్క నుంది. ఈ లాంఛనం పూర్తయితే ప్రాజెక్టు వ్యయా న్ని కేంద్రమే భరిస్తుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, దీన్ని కేం ద్రం విస్మరించడం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయడంపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాయనుంది. ఎగువనే నీటిని అడ్డుకునేలా... కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, ఆ నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. తుంగభద్ర కు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని వరద కాల్వ ద్వారా కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల ని ల్వ సామర్థ్యాలను పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో దిగువకు వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయ ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కర్ణాటక విన డం లేదు. దీనిపై రాష్ట్రం.. కేంద్రానికి సైతం ఫిర్యా దు చేసింది. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ జాతీయ హోదాను ఇవ్వడం తెలంగాణకు మరింత మింగుడుపడని అంశంగా మారింది. ఎడాపెడా ఎత్తిపోతలు... నిజానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చు ట్టింది. తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఆపై భద్ర నుంచి 29.90 టీఎంసీలను ఎత్తిపోస్తూ.. చిక్మగళూర్, చిత్రదుర్గ, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల (బిందు సేద్యం) విధానంలో 2,25,515 హెక్టార్లకు నీళ్లందిస్తారు. ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో, భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్ల తో పూ ర్తిచేసింది. మొత్తంగా రూ.4,800 కోట్ల మేర వ్య యం చేశాక 2018లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అను మతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. అయి తే దీనిపై తెలంగాణ అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2లో అప్పర్ తుంగకు 11 టీఎంసీ, అప్పర్‌భద్ర కు 9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయి తే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదు. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను చేపట్టింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే సీడబ్ల్యూసీ అనుమతించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు... 87,500 ఎకరాలు ప్రమాదంలో పడుతుంది. ఏపీలోని హెచ్చెల్సీ, కేసీ కెనాల్ల కింది ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడుతుం గభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండ దు. అదే జరిగితే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌కు వచ్చే వరద కూడా తగ్గనుంది. కాగా కాళేశ్వరం ప్రా జెక్టుకు జాతీయ హోదా అడిగినప్పుడల్లా ఆ విధానాన్నే పక్కనబెట్టామని చెబుతూ వస్తున్న కేంద్రం అప్పర్ భద్రకు హోదా ఇవ్వడంపై రాష్ట్ర నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
క్యారీ ఓవర్ జలాలపై హక్కు ఉమ్మడి రాష్ట్రానిదే
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ‘క్యారీ ఓవర్’ కింద 150 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిందని, విభజన నేపథ్యంలో ఆ జలాలపై అటు తెలంగాణకు.. ఇటు ఏపీకి ప్రత్యేకమైన హక్కులు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), కృష్ణా బోర్డు ఇదే అంశాన్ని ఎత్తి చూపాయని గుర్తు చేస్తున్నారు. క్యారీ ఓవర్ జలాల్లో వాటాపై రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2లో తేల్చుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు కూడా శుక్రవారం ఇదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. గత నీటి సంవత్సరం(2019–20)లో వాటా కింద వాడుకోని 50 టీఎంసీలను ప్రస్తుత నీటి సంవత్సరం (2020–21)లో కేటాయించాలని జూన్ 3న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో ఉపయోగించుకోని నీటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారాన్ని ఆగస్టు 14న కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆగస్టు 20న కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. ట్రిబ్యునల్ తేల్చేదాకా ఏకాభిప్రాయమే శరణ్యం ఇరు రాష్ట్రాల వాదనలపై అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ నీటి యాజమాన్య విభాగం (ఐఎంవో) సీఈ విమల్ కుమార్.. క్యారీ ఓవర్ జలాలను ఉమ్మడి ఏపీకే కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిందని తేల్చి చెప్పారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఎగువ నుంచి దిగువకు వరద రావడంలో జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో క్లాజ్–8(ఏ) కింద తాగు, సాగు నీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీఓవర్ కింద 150 టీఎంసీలను నిల్వ చేసుకోవడానికి ఉమ్మడి ఏపీకి అవకాశం కల్పించిందని ఎత్తిచూపారు. విభజన నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ప్రకారం క్యారీ ఓవర్ జలాలపై ఇరు రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులు లేవని, ఈ అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2లో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు నేతృత్వంలో క్యారీ ఓవర్ జలాలను ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించాలని సూచిస్తూ అక్టోబర్ 13న కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఆ మేరకు కృష్ణా బోర్డుకు దిశా నిర్దేశం చేస్తూ అక్టోబర్ 20న కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాలిచ్చింది. ఇరు రాష్ట్రాలకూ నష్టమే ఒక నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న నీటిలో వాటాగా దక్కిన జలాలను అదే నీటి సంవత్సరంలో వాడుకుంటేనే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరమని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటా జలాలను ఉపయోగించుకోకపోతే శ్రీశైలం, సాగర్‌లలో ఆ నీరు నిల్వ ఉంటుందని.. దీని వల్ల ఆ తర్వాత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టే అవకాశం కోల్పోతామని ఎత్తిచూపుతున్నారు. ఫలితంగా వరద జలాలు సముద్రం పాలవుతాయని.. ఇది రెండు రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒక నీటి సంవత్సరంలో వాడుకోని వాటా జలాలను తర్వాత నీటి సంవత్సరంలో ఉపయోగించుకోవడానికి ఒక రాష్ట్రానికి అవకాశం ఇస్తే.. మరొక రాష్ట్ర హక్కులను హరించడమేనని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ క్యారీ ఓవర్ జలాలను ఏపీ, తెలంగాణలు 512 : 200 టీఎంసీల నిష్పత్తిలో పంపిణీ చేసుకోవడం మినహా మరొక మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు. -
పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు!
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ లోగా పూర్తి చేసి, 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేస్తుంటే ఓ వర్గం మీడియా అబద్ధపు రాతలతో ప్రజలను గందరగోళంలో పడేస్తోంది. విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా చేశారు. ఈ క్రమంలో 2014 ఏప్రిల్ 1 తర్వాత నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు చంద్రబాబు తలొగ్గారు. డిజైన్ మారినా, ధరలు పెరిగినా, అంచనా వ్యయం పెరిగినా.. భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తేల్చిచెప్పినా చంద్రబాబు నోరు మెదపలేదు. ఈ పాపం ఫలితంగానే కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబర్ 12న కొర్రీ వేసింది. దాని నుంచి పోలవరాన్ని సీఎం వైఎస్ జగన్ బయటపడేలా చేసి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ వర్గం మీడియా మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను కప్పిపుచ్చేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. 2013–14 ధరల ప్రకారమే నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని పీపీఏ తేల్చి చెప్పినట్లు ఈ నెల 3వ తేదీన అబద్ధపు రాతలతో విషం చిమ్మింది. ఇప్పుడు పీపీఏ మినిట్స్ రూపంలో వాస్తవాలను బహిర్గతం చేయడంతో ఆ వర్గం మీడియా తప్పని పరిస్థితిలో అసలు విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. అప్పుడే ఈ విషయం చెప్పిన ‘సాక్షి’ జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటి పారుదల విభాగం వ్యయమంటే భూసేకరణ, ఆర్ఆర్ (రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్) ప్యాకేజీ, హెడ్ వర్క్స్ (జలాశయం), ప్రధాన కాలువలు, పిల్ల కాలువలకు చేసే ఖర్చు అని రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ స్పష్టం చేస్తోంది. ఈ అంశాలను ఈ నెల 3నే ‘సాక్షి’ వెల్లడించింది. ఇప్పుడు ఇదే విషయంతో సీడబ్ల్యూసీ, పీపీఏ ఏకీభవించింది. -
పోలవరం అనుమతి లాంఛనమే
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) తేల్చి చెప్పింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రాజెక్టు నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించాలని 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తి చూపింది. 2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కానే కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో ఏకీభవించింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2020 మార్చి 17న రివైజ్ట్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) సిఫార్సు చేసిన మేరకు.. 2017–18 ధరల ప్రకారం నిధులను విడుదల చేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు తేల్చి చెప్పింది. ఈ నెల 2న నిర్వహించిన అత్యవసర భేటీలో ఆ మేరకు చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై నిర్ణయాధికారం పీపీఏదే కావడంతో రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇవ్వడం లాంఛనమేనని జల వనరుల శాఖ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఆమోదించాలని కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపనుంది. విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇందులో నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.43,164.83 కోట్లు, పోలవరం పనులకు 2014 ఏప్రిల్ 1 దాకా రూ.4730.71 కోట్లను ఖర్చు చేశారు. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.8,507.26 కోట్లను ఇప్పటి వరకు రీయింబర్స్ రూపంలో కేంద్రం విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 2017–18 ధరల మేరకు పోలవరానికి ఇంకా రూ.29,926.86 కోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది. నాటి నుంచి నేటి వరకూ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం – 2009 జనవరి 20 : 2005–06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) ఆమోదం – 2011 జనవరి 4 : 2010–11 ధరల ప్రకారం రూ.16010.45 కోట్లుగా మొదటి సారి సవరించి ఆమోదించిన సీడబ్ల్యూసీ టీఏసీ – 2014 ఫిబ్రవరి 11 : 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా రెండో సారి సవరించిన సీడబ్ల్యూసీ టీఏసీ – 2020 మార్చి 17 : 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి.. కేంద్ర జల్ శక్తి శాఖ, ఆర్థిక శాఖలకు పంపిన ఆర్సీసీ – 2020 నవంబర్ 2 : 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆమోదించాలని తేల్చి చెప్పిన పీపీఏ -
వైఎస్సార్ జిల్లాకు ఉత్తమ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించిన 2వ జాతీయ జల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులు దక్కించుకుంది. బుధవారం ఆన్లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ యేడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కాగా, ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం–జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నీటిని తక్కువగా ఉపయోగించడంపై విస్తృతంగా అవగాహన కల్పించడం, చెక్‌డ్యాములు, చెరువులు, కుంటలు ఆధునికీకరణ, కోనేరుల అభివృద్ది, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ తదితర పనులను పెద్ద ఎత్తున చేపట్టడం. మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టినందుకు ఈ పురస్కారం లభించింది. అలాగే ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జల సంరక్షణ–నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించినందుకు, ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించినందుకు ఈ అవార్డులు అందిస్తున్నారు. మొత్తం 1,112 దరఖాస్తుల్లో మొత్తం 98మంది విజేతలను 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు. ఉపరాష్ట్రపతి అభినందనలు.. అవార్డులు గెలిచిన ఆయా రాష్ట్రాల అధికారులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆన్లైన్ వేదికగా 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. అవసరం మేరకే నీటి వినియోగం వల్ల నీటి కొరత తగ్గుతుందని సూచించారు. జల సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో జల్‌శక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయమంత్రి రతన్ లాల్ కటారియా, పర్యావరణవేత్త డాక్టర్ అనిల్ జోషి, స్వచ్ఛగంగ జాతీయ మిషన్ డీజీ రాజీవ్ రంజన్ మిశ్రా, అవార్డులు అందుకున్న రాష్ట్రాల ప్రతినిధులు ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తే తాజా ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు కోసం సమీకరించే భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని, అలాంటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన మేరకు 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి నివేదించాలని సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. పీపీఏ ఈ విధంగా ప్రతిపాదనలు పంపితే.. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), టీఏసీ (సాంకేతిక సలహా మండలి), ఆర్సీసీ (సవరించిన అంచనా కమిటీ) ఆమోదించిన మేరకు రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇస్తుందని, తర్వాత ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు జల్ శక్తి శాఖ కేంద్ర కేబినెట్లో తాజా తీర్మానాన్ని ప్రతిపాదిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదిస్తే 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి. అప్పుడే అభ్యంతరం తెలిపి ఉంటే.. 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటన చేసినప్పుడు, ఆ ప్రకటనను అమలు చేస్తూ 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, వాటికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు, 2017 మే 8న పోలవరం మొదటిసారి సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు షరతు విధించినప్పుడు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం కనుక అభ్యంతరం తెలిపిఉంటే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై గందరగోళం నెలకొని ఉండేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కార్ చేసిన పాపాలే పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు శాపాలై వెన్నాడుతున్నాయని సాగునీటిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా ధరల మేరకు నిధులు సాధించి 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. రూ.2,234.288 కోట్లను బేషరతుగా విడుదల చేసేందుకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపడానికే మూడేళ్లు జాప్యం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాజా ధరల ప్రకారం ఎంత అంచనా వ్యయం అవుతుందో ప్రతిపాదనలు సమర్పిస్తే కేంద్రానికి పంపి ఆమోదం తీసుకుంటామని 2015 మార్చి 12న జరిగిన తొలి సర్వసభ్య సమావేశంలో పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాత వరుసగా మూడు నెలలకు ఒకసారి చొప్పున నిర్వహించిన ఐదు సమావేశాల్లోనూ ఆ విధంగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇలా దాదాపు మూడేళ్ల పాటు జాప్యం చేసి చివరకు 2018 జనవరి 2న 2017–18 ధరల ప్రకారం రూ.57,297.42 కోట్ల అంచనా వ్యయంతో పీపీఏకు ప్రతిపాదనలు ఇచ్చింది. నాలుగు కీలక సందర్భాల్లో చంద్రబాబు మౌనం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా అప్పటి సీఎం చంద్రబాబు కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పోలవరం నిర్మాణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజు ప్రత్యేక సహాయంపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. ప్రత్యేక సహాయాన్ని అమలు చేస్తూ 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక సహాయంపై ఆమోదముద్ర వేస్తూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి అంగీకరించింది. డిజైన్ మారినా, ధరలు పెరిగినా, అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ షరతుతో కూడిన పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఆ షరతు ఏమిటంటే.. 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ.. ఆ రోజు నాటి ధరల ప్రకారం మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామన్నది. ఈ విధంగా ముఖ్యమైన నాలుగు సందర్భాల్లోనూ టీడీపీ ప్రభుత్వం, అప్పటి సీఎం చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా మౌనం వహించారని, అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించి తాజా ధరల ప్రకారం పోలవరానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసి ఉంటే ఈ రోజు ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇంత గందరగోళం నెలకొని ఉండేది కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు రెండవసారి సవరించిన అంచనా వ్యయానికే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీ చేసేలా కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే 2021 డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేయనుంది. జాప్యం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని, దీనివల్ల అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తేల్చిచెప్పాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే.. రూ.2,234.77 కోట్లు రీయింబర్స్ చేస్తామనే షరతు విధిస్తూ అక్టోబర్ 12న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి ఎల్కే త్రివేది.. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. దీనిపై పీపీఏ అభిప్రాయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కోరింది. పీపీఏ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. షరతుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితునిగా సలహాదారు ఎం.వెంకటేశ్వరావు పాల్గొననున్నారు. రూ.20,398.61 కోట్లతో పూర్తి సాధ్యమేనా? కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్న మేరకు రూ.20,398.61 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అని పీపీఏను ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ), ఆర్సీసీ (సవరించిన అంచనా వ్యయ కమిటీ) ఆమోదించిన.. రెండవసారి సవరించిన అంచనా వ్యయంలో భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని తేల్చిన అంశాన్ని గుర్తు చేయనుంది. ఒక్కో జాతీయ ప్రాజెక్టుకు ఒక్కో రకంగానా? కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం జలాశయం పనులు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన, నీటి సరఫరా (కాలువలు, పిల్ల కాలువలు, ఆయకట్టు అభివృద్ధి) మొత్తాన్ని కలిపి నీటిపారుదల విభాగం వ్యయంగా పరిగణించాలి. దేశంలో 16 ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించింది. అన్ని ప్రాజెక్టులకు నీటిపారుదల విభాగం వ్యయాన్ని ఇదే తరహాలో అందిస్తోంది. కానీ పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి నీటిపారుదల విభాగం వ్యయం నుంచి నీటి సరఫరా వ్యయాన్ని తొలగించడం ఎంతవరకు న్యాయమని పీపీఏను నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.. విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేననే అంశాన్ని మరో సారి గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తరఫున, పీపీఏ పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినా, తగ్గినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే అంశాన్ని గుర్తు చేయనుంది. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చే.. 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయానికి పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీ, ఆర్సీసీ ఆమోదం తెలిపాయనే అంశాన్ని ఎత్తిచూపనుంది. ఆర్సీసీ చైర్మన్ జగ్మోహన్ గుప్తా పీపీఏలో సభ్యులని, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పీపీఏ పాలక మండలి చైర్మన్ అని, టీఏసీకీ ఆయనే నేతృత్వం వహించారని.. వారే 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి.. ఇప్పుడు 2013–14 ధరలను తెరపైకి తేవడం భావ్యం కాదని తేల్చిచెప్పనుంది. -
పోలవరానికి రూ.3,319.89 కోట్లు రీయింబర్స్ చేయండి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. - పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. - దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. - రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు పంపారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఫోన్లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. - సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. అభివృద్ధి ఆగదు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అసలు జరగడం లేదు అనేది తప్పుడు ప్రచారమేనని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ అభివృద్ధి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్‌చంద్ర (వ్యవసాయం), డాక్టర్ రఘునాథ్ మిశ్రాతో(సాగునీటి శాఖ) సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న అనవసరమైన నిర్ణయాలను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమీక్షిస్తోందని, అప్పట్లో జరిగిన అవినీతిని వెలికితీస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన - ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు తీర్పు దరిమిలా నిర్వహిస్తున్నామని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న రూ.5,000 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాం. - కేంద్రం గ్రాంట్ ఇవ్వకపోయినా ఇప్పటివరకూ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కనీస సదుపాయాలకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందనే విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశాం. - ఉత్తరాంధ్రలోని ఉద్ధానం, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, వైఎస్సార్ జిల్లాలోని పులివెందులకు మంచి నీటి సదుపాయం కల్పించడం కోసం వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించామని, దానికి నిధులివ్వాలని గజేంద్రసింగ్ షెఖావత్‌కు విజ్ఞప్తి చేశాం. - గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రూ.60 వేల కోట్ల మేరకు చెల్లింపు బకాయిలు పెట్టి పోయింది. వీటిలో ఇప్పటికి అన్నీ కలిపి సుమారు రూ.23 వేల కోట్లు చెల్లించాం. - వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడం సరికాదు. పిల్లల చదువులపై వ్యయం చేయడం తప్పా? రైతు భరోసా అమలు చేసి అన్నదాతలను ఆదుకోవడం తప్పా? కేంద్రం ఇస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జత చేసి రైతులకు సాయం అందిస్తోంది. బీమా పథకాన్ని రైతులకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పంటలకు బీమా కట్టడం తప్పవుతుందా? -
జల వివాదాలపై కదిలిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని జల వివాదాలపై కేంద్రం దృష్టి పెట్టింది. జల సమస్యలపై ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చక్కబెట్టడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడం, వాటి పరిష్కారాలు, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 11న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై గురువారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి, కావేరి నదులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమావేశం జరిగింది. గతేడాది ఫిబ్రవరి 20న జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగానే కృష్ణా బేసిన్లో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో గోదావరి నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరాన్ని తెలంగాణ నొక్కి చెప్పింది.గోదావరిలో నీరు ఎంత ఉందనే విషయంపై హైడ్రాలజీ సర్వే నిర్వహించాలని, తర్వాత మిగులు నీరు ఉంటేనే నదుల అనుసంధానంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది.