సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168 కోట్లు వ్యయమవుతుందని కేంద్ర జల్‌శక్తి శాఖ తేల్చింది. భూసేకరణ, పునరావాసానికి ఇప్పటిదాకా మంజూరు చేసిన రూ.6,583 కోట్లను మినహాయిస్తే ఇంకా రూ.26,585 కోట్లను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లకు సవరిస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా మండలి (టీఏసీ) 20 19, ఫిబ్రవరి 11న ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది.
ఈ అంచనా వ్యయాన్ని పరిశీలించేందుకు 2019, ఏప్రిల్ 2న ఏర్పాటు చేసిన సవరించిన అంచనా కమిటీ (ఆర్‌సీసీ) దాన్ని రూ.47,725.87 కోట్లకు కుదించిందని ఎత్తిచూపింది. 2013–14 ధరల ప్రకారం చూస్తే ఆ వ్యయం రూ.29,027 కో ట్లుగా ఆర్‌సీసీ తేల్చిందని పేర్కొంది. విభజన చ ట్టంలో సెక్షన్–90 ప్రకారం.. ఏప్రిల్ 1, 2014 నాటి కి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన వంద శాతం నిధులను కేంద్రమే భరించాలని గుర్తుచేసింది. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన నిధులను అం దించాలని 2020–21 వార్షిక నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి జల్‌శక్తి శాఖ వివరించింది. అంతేకాక.. పోలవరం అంచనా వ్యయం విషయంలో సీఎం వైఎస్ జగన్ వాదనను బలపరుస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ నివేదిక ఇవ్వడం గమనార్హం.
బాధ్యతంతా కేంద్రానిదే..
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముం దు ఆ ప్రాజెక్టుకు రూ.5,185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇందులో రూ.562.47 కోట్లను సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ–యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్టు) కింద కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2014 తర్వాత నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అ య్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని విభజన చ ట్టంలో సెక్షన్–90 స్పష్టం చేస్తోంది. ప్రాజెక్టును పూ ర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. పనులుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేస్తూ వస్తోంది.
భూసేకరణ, పునరావాసమే కీలకం..
కేంద్రం చేసిన 2013–భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే వ్యయం రూ.33,168 కోట్లకు చేరుకుంది. అలాగే, 2017–18 ధరల ప్రకారం జలాశయం, కుడి, ఎడమ కాలువలు, విద్యుత్కేంద్రం వంటి పనుల వ్యయం రూ.22,380.87 కోట్లకు చేరుకుంది. దాంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసింది. మరోవైపు.. ఏ జాతీయ ప్రాజెక్టుకులేని రీతిలో సీడబ్ల్యూసీ ఆమోదించిన సవరించిన వ్యయాన్ని మదింపు చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఆర్‌సీసీ పోలవరం వ్యయాన్ని రూ.47,725.87 కోట్లకు కుదించింది.
తాజా ధరల మేరకు నిధులిస్తేనే..
భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయం పెరిగిన నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీలు ఆమోదించిన మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీకి, ఇతర కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. 2020–21 వార్షిక నివేదికలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనలను బలపరుస్తూ.. 2017–18 ధరల ప్రకారం నిధులివ్వాలని కేంద్రానికి కేంద్ర జల్‌శక్తి వివరించింది.
సేకరించాల్సింది 56,154 ఎకరాలు..
పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే, కుడి, ఎడమ కా లువల పనులు చేపట్టడానికి మొత్తం 1,67,339 ఎకరాలను సేకరించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నివేదికలో పేర్కొంది. ఇందులో 1,11,185 ఎకరాలకు రూ.5,642 కోట్ల పరిహారం చెల్లించి సేకరించారని తెలిపింది. మిగతా 56,154 ఎకరాల భూసేకరణకు రూ.7,425 కోట్లను ఖర్చుచేయాల్సి ఉందని పేర్కొంది. అలాగే, 1,05,601 నిర్వాసిత కుటుంబాల్లో రూ.941 కోట్లతో 3,110 కుటుంబాల కు పునరావాసం కల్పించా రని.. మిగతా 1,02,491 కు టుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ. 19,150 కోట్లు అవసరమని పేర్కొంది. ఇలా మొత్తమ్మీద 2020–21 వరకు ప్రాజెక్టు కోసం రూ.16,899.38 కోట్లను ఖర్చు చేశారని.. ఏప్రిల్ 1, 2014 తర్వాత కేంద్రం రూ.10,848.36 కోట్లను విడుదల చేసిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment