సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానమని చట్టంలో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ ఒకసారి ఉత్తర్వులు జారీ చేశాక పునఃపంపిణీ కుదరదంటూ 1956 చట్టానికి 20 02లో సవరణ చేయడాన్ని ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ 2 కేటా యించిన జలాలను విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంత ర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రా ల మధ్య పంపిణీ చేయాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వ్యక్తిగతంగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గురువారం లేఖ రాశారు.
లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
► ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఆర్‌డీ 1956 సెక్షన్ 3 ప్రకారం 1969లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ – 1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 1976 మే 31న అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో అప్పటికే పూర్తయిన వాటికి ప్రాజెక్టుల వారీగా 749.16 టీఎంసీలను కేటాయించింది. జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలు కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.
► కృష్ణా జలాల పునఃపంపిణీకి సెక్షన్ 3 ప్రకారం 2004లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ–2.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదు. కేడబ్ల్యూడీటీ–1 తీర్పును పునఃసమీక్షించటం చట్టవిరుద్ధం కావ డం వల్లే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న మిగులు జలాలనే కేడబ్ల్యూడీటీ–2 పంపిణీ చే సింది. మిగులు జలాలను పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచ్చిన నివేదికను సవా ల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కేడబ్ల్యూడీటీ–2 నివేదికను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
► గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్న ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తెలంగాణ గత నెల 9న ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాసింది.
► 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన జలాలను కేడబ్ల్యూడీటీ–2 కొనసాగించింది. ఎందుకంటే వాటిని పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధం.
కృష్ణా జలాల పునఃపంపిణీ చట్టవిరుద్ధం
Published Fri, Jul 9 2021 4:19 AM | Last Updated on Fri, Jul 9 2021 4:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment