సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావంపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల సందేహాలను నివృత్తి చేయడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌గుప్తా వర్చువల్‌గా సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను ఈనెల 6న సుప్రీంకోర్టు విచారించింది. ముంపు ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment