సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతూ మంచినీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోవైపు మానవ సమాజం అంతులేని నిర్లక్ష్యం. వెరసి అడవి జంతువులకు ప్రాణసంకటంగా మారుతోంది. చుక్క మంచినీరు దొరకడం కష్టంగా మారింది. అయినా మనుషులు నీటి వృధాపై దృష్టిపెట్టడంలేదు. ఈ విషయంలో నోరులేని జీవులు చాలా నయం అనిపిస్తోంది. ఈ విషయాన్ని జల సంరక్షణ మంత్రిత్వ శాఖ తాజా వీడియో ద్వారా తెలియజేసింది.
చదవండి: World Elephant Day 2021: ఏనుగమ్మ
నీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉన్న ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అందరినీ ఆలోపించేజేసేదిలా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాప్‌ను సరిగ్గా తిప్పకుండా వదిలేసే కొంతమందితో పోలిస్తే ఈ గజరాజు చాలా మేలంటున్నారు. ఒక ఏనుగు చేతి పంపుతో స్వయంగా నీటిని పంపింగ్ చేసి తాగుతోంది. దాహం వేసినప్పుడు సమీపంలోని సరస్సు లేదా చెరువు వంటి సహజ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఎంతో విచారకరం. అయితే ప్రతి నీటి బొట్టును ప్రాముఖ్యతను గుర్తించిన ఆ ఏనుగు తన దాహం తీర్చడానికి సరిపోయేంత నీటిని మాత్రమే పంప్ చేస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించిన తీరు విశేషంగా నిలిచింది.
"ఏనుగు కూడా ప్రతీ నీటి చుక్క ప్రాముఖ్యతను ఆకళింపు చేసుకుంది. కానీ మనుషులుగా మనం ఈ అమూల్యమైన వనరును ఎందుకు వృధా చేస్తున్నాం, ”అంటూ జల సంరక్షణ మంత్రిత్వ శాఖ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఇకనైనా మనం పాఠాలు నేర్చుకుని నీటిని కాపాడుకుందాం అని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
एक हाथी भी #जल की एक-एक #बूंद का महत्व समझता है। फिर हम इंसान क्यों इस अनमोल रत्न को व्यर्थ करते हैं?
— Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) September 3, 2021
आइए, आज इस जानवर से सीख लें और #जल_संरक्षण करें। pic.twitter.com/EhmSLyhtOI
Comments
Please login to add a commentAdd a comment